జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో తప్పులు చేసారు, చేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వానికి అయినా సహజం. తమ తప్పులు తాము తెలుసుకోరు, ఎదుటి వాళ్ళు చెప్తే వినరు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకీ శ్రుతి మించుతుంది. ముఖ్యంగా కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వాడే భాష, చాలా జుబుక్సా కరంగా, సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉంటుంది. మంత్రి కొడాలి నాని భాష, నాగరికత ఉన్న ఎవరూ మాట్లాడరు. ఈ కొడాలి నానికి తోడుగా, రోజా, అంబటి, మరో మంత్రి అనిల్, ద్వారంపూడి, వంశీ, పేర్ని నాని, ఇలా చాలా మంది లైన్ లో ఉన్నారు. ఒక్కరికి కూడా భాష సరిగ్గా ఉండదు. కేవలం బూతులతో పడిపోతూ ఉంటారు. చివరకు ఈ భాగోతం అసెంబ్లీ వరకు వెళ్ళింది. టిడిపి సభ్యులు మాట్లాడుతూ ఉంటే, కొడాలి నాని చెప్పలేని భాషలో తిడుతూ ఉంటారు. మొన్న చంద్రబాబు మొఖం చూడాలని జగన్ మోహన్ రెడ్డి అనటం, దానికి చంద్రబాబు దీటుగా సమాధానం చెప్తూ, అసెంబ్లీకి రావటంతో, వైసీపీ వెర్రెత్తి పోయింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పైన బజారు మాటలు మాట్లాడారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, జగన్ మోహన్ రెడ్డి, ఎక్కడా ఈ బూతులు మంత్రులను, ఎమ్మెల్యేలను కట్టడి చేయటం లేదు. ఆయన సంతోషిస్తూ ఉంటారు.

sad 05122021 2

దీంతో జగన్ మోహన్ రెడ్డిని సంతోష పెట్టటానికి, మరింతగా రెచ్చిపోతూ ఉంటారు. అయితే భువనేశ్వరి ఘటన మాత్రం, అతి పెద్ద తప్పుగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆవిడ ఎప్పుడూ బయట కనిపించే వ్యక్తి కాదు. అలాగే చంద్రబాబు కూడా అలా బాధ పడటం, అందరినీ కలిచి వేసింది. ఈ విషయంలో తాము చాలా పెద్ద పొరపాటు చేసాం అని వైసీపీ గ్రహించింది. మొన్నటి వరకు అసలు తాము ఆ మాటలే అనలేదు, చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు అంటున్న వైసీపీ, ఇప్పుడు సమస్య తీవ్రత గ్రహించింది. ముందుగా వంశీ చేత క్షమాపణ చెప్పించింది. అది కూడా దాదాపుగా 20 రోజులు తరువాత. ఆ తరువాత నిన్న మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ, భువనేశ్వరి బాధ పడి ఉంటే, మా 151 మంది ఎమ్మెల్యేలు ఆమె కాళ్ళని, మా కన్నీళ్ళతో కడుగుతాం అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక్కడే అర్ధం అవుతుంది వైసీపీ ఎంత డిఫెన్స్ లో పడింది అనేది. అందుకే చేసిన అతి పెద్ద తప్పుని దిద్దుకునే పనిలో వైసిపీ పడింది. ఇలాంటి వ్యాఖ్యలు చాలా వింటాం. అయితే ఈ వ్యాఖ్యలు ప్రజలు స్వీకరిస్తారా ? ప్రజలు నమ్ముతారా ? చూడాలి మరి.

ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, తీవ్ర అసహనంతో ఉన్న ఉద్యోగులు, ఇక ఓర్పు నశించి, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి పైనే, బహిరంగంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే జీతాలు ఫస్ట్ తారీఖుకి ఇవ్వక, అలాగే పీఆర్సి ఇవ్వక, డీఏలు పెండింగ్ లో పెట్టి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక, ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. ఏడో తేదీ నుంచి, వాళ్ళు అనేక ఆందోళనలకు పిలుపు ఇచ్చారు. ఈ నేపధ్యంలో, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు మాటలు ఇప్పుడు పెను సంచలనం రేపాయి. ఏపీ ఎన్జీవోల అంతర్గత సమావేశంలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు చేసిన ఘాటైన వ్యాఖ్యలు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఉద్యోగ వర్గాల్లో కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసాయి. ఆ అంతర్గత సమావేశంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు , నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జగన్ మాయ మాటలు విని, నమ్మి, మాయలో పడి, 151 సీట్లు గెలిపించాం అని అన్నారు. అదే విధంగా ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పార్టీ, గెలిచిన మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‍ల గురించి ప్రస్తావిస్తూ, ఆరిపోయే దీపం ముందుగా, వెలుగు ఎలా ఇస్తుందో, అలాగే ఇక్కడ గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేసారు.

apngo 05122021 1

ఉద్యోగులు పరిస్థితి ఏంటో గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబుకు కూడా బాగా తెలుసుని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన సంఘంలో 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగి ఇంట్లో అయుదు ఓట్లు వేసుకున్నా, మొత్తం 60 లక్షల మంది ఓట్లు ఉంటాయని, మనం తలుచుకుంటే, ప్రభుత్వాన్నే కూల్చి పడేయ వచ్చని అన్నారు. ఉద్యోగాల శక్తి ముందు ఎవరైనా సరే, తల వంచాల్సిందే అని బండి శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతుల ఉద్యమానికి ప్రధాన మంత్రి నమస్కారం పెట్టి, క్షమాపణ చెప్పారని, రేపటి నుంచి మన ఉద్యమం కూడా అలాగే కొనసాగాలని ఆయన కోరారు. జీతం అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అని, కనీసం జీతం కూడా ఇచ్చే పరిస్థితి లేదని. పాల వాళ్ళు, కిరాణా వాళ్ళు కూడా, ప్రభుత్వ ఉద్యోగి అంటే చీదరించుకునే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో, ఈ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/vgS-_Uppg4E

కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వచ్చిన వరదలు, అక్కడ ప్రజల జీవితాలను తారు మారు చేసాయి. మరీ ముఖ్యంగా కడపలో, అన్నమ్మయ్య డ్యాం కొట్టుకుని పోయి జరిగిన ప్రమాదం, అంతా ఇంతా కాదు. అయితే జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉంటూ, అక్కడకు వెళ్ళకుండా, పెళ్లిళ్లకు వెళ్ళటం పైన, విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు సమాధానం ఇస్తూ, తాను అక్కడకు వస్తే అధికారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, వెళ్లలేదని ఆయన అసెంబ్లీలో చెప్పారు. తరువాత వారం రోజులకు అక్కడకు వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి, ఒక మహిళతో మాట్లాడుతూ, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, తమ నిర్ల్యక్షంతోనే, ఇంత వరకు తెచ్చుకున్నాం అని చెప్పటం ఆశ్చర్య పరుస్తుంది. సహజంగా బాధితులు, ఎక్కువ పరిహారం అడుగుతారు, లేదా ఇంకా ఏమైనా సహాయం అడుగుతారు. ఇక్కడ మాత్రం, అసలు మాకు అంతా అద్భుతంగా ఉంది, తప్పు అంతా మాదే అని ఆమె చెప్పటం పై, సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తూ, రకరకాల పోస్టింగ్స్ పెడుతున్నారు. ఇంతకూ,ఆమె ఏమన్నారు అంటే, "మాకు ముందుగానే, వరదలు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది, సచివాలయం నుంచి. అలాగే ఎమ్మెల్యే గారి నుంచి కూడా ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అన్నా. మా నిర్ల్యక్షం వల్ల, ఈ నీరు రాదులే, వరద రాదులే అని, మేము కొంచెం నిర్ల్యక్షంగా ఉన్నాం అన్నా. "

video 05122021 2

"కానీ పెద్దోళ్ళు చెప్పిన దాని ప్రకరం ఏంటి అంటే, నీళ్ళు అయితే రావులే మనకి, ఇక్కడే ఉంటున్నాం కదా, కొన్నేళ్ళ పాటు ఇక్కడే ఉంటున్నాం కదా, రావులే రావులే అనుకుని, ఇక్కడే ఉండి పోయాం. కానీ కరెక్ట్ గా 12, ఒంటి గంట సమయానికి నీళ్ళు వచ్చేసాయి అన్నా. అప్పుడు మాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. పిల్లలను తీసుకుని, మెట్ట ఉన్న ఇన్నాళ్ళకు వెళ్ళిపోయాం. అక్కడ మూడు రోజులు ఉన్నాం. అక్కడ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఏ లోటు రాకుండా మాకు, బియ్యం, సరుకులు, నూనే, ఇవన్నీ అక్కడ మాకు ఇచ్చి, ఇంటికి పంపించి, ఇంటికి వచ్చే సరికి మాకు శుభ్రంగా వాటర్ తో కడిగి ఇచ్చారు. అలాగే రెండు వేల రూపాయాలు కూడా ఇచ్చారు. 25 కేజీల బియ్యం ఇచ్చారు. కందిపప్పు, ఉల్లిగడ్డలు అన్నీ ఇచ్చారు మాకు. మా అమ్మగారికి గొర్రెలు కొట్టుకు పొతే, గంటల్లోనే డబ్బులు ఇచ్చారు మాకు. అసలు ఎమ్మెల్యే గారికి, మీకు, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత జరిగినా, ఎమర్జెన్సీగా, ఫాస్ట్ గా, జరుగుతుందని మేము కలలో కూడా ఊహించలేదు. " అని ఆమె అన్నారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/ef_UBuux7Aw

కొన్ని కొన్ని వ్యవస్థలు అంటే, ఈ దేశంలో పుట్టిన ఎవరైనా భయపడతారు, కొన్ని వ్యవస్థలను గౌరవిస్తారు. చివరకు ప్రధాని మంత్రి కూడా గౌరవించాల్సి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఈ దేశంలో ఎంతటి పదవిలో ఉన్న సరే, న్యాయ వ్యవస్థని రెండో ఆలోచన లేకుండా గౌరవించాల్సిందే. అలంటి న్యాయ వ్యవస్థను, కొంత మంది పని గట్టుకుని, ఒక ఆర్గనైజడ్ గా అటాక్ చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక తీర్పులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయని, దీని వెనుక చంద్రబాబు ఉన్నారని, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు అంటూ, ఉద్దేశాలు ఆపాదించి, ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టుతో పాటుగా, న్యాయమూర్తుల పైన కూడా అసభ్యకరంగా రాతలు రాసారు. అయితే ఈ కేసుని హైకోర్ట్ సుమోటోగా తీసుకుని. హైకోర్టు రిజిస్టర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, ముందుగా సిఐడి ఎంక్వయిరీకి ఆదేశించగా, సిఐడి సరిగ్గా దర్యాప్తు చేయక పోవటం, ఒక్కరిని కూడా పట్టుకోక పోవటంతో, సిబిఐకి అప్ప చెప్పింది. అయితే సిబిఐ కూడా ముందు పెద్దగా అరెస్ట్ లు చేయలేదు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో, సిబిఐ కూడా దూకుడు పెంచి, దాదాపుగా పది మంది పైగా అరెస్ట్ చేసింది. ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారని, దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని, సిబిఐ , ఇప్పటికే కోర్టుకు తెలిపింది.

hc 05122021 2

అయితే సిబిఐ అరెస్ట్ చేసిన కొంత మంది, హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసరు. తమను వదిలేయాలని కోరారు. దీని పైన హైకోర్టు సీరియస్ అయ్యింది, వారి పిటీషన్లు కొట్టేసింది. తీర్పులో అనేక కీలక విషయాలు ప్రాస్తావించింది. ఈ కేసులో నిందితులను సిఐడి పట్టుకోలేక పొతే, సిబిఐకి ఇచ్చాం అని, సిబిఐ కి కూడా వారిని పట్టుకుంటానికి ఏడాది పట్టిందని చెప్తూ, వారు వెనుక ఎంత పెద్ద శక్తులు ఉన్నాయో, ఈ ఘటనే చెప్తుందని కోర్టు తెలిపింది. ఏకంగా కోర్టులను , జడ్జిలను తిట్టే ఇలాంటి వారిని చూస్తూనే, న్యాయవస్థ పైన కుట్రలా ఉందని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 2020 నుంచి ఇప్పటికీ పోస్ట్ లు పెడుతూనే ఉన్నారంటే, ఇది జడ్జిలను పర్సనల్ గా టార్గెట్ చేయటం కాదని, ఇది న్యాయవస్థ పైనే కుట్ర అని కోర్టు పేర్కొంది. అరెస్ట్ చేసిన వారు చిన్న వారు అయి ఉండొచ్చు కానీ, వారి వెనుక పెద్ద తలకయాలు ఉండే అవకాసం ఉందని కోర్టు స్పష్టం చేస్తూ, ఇంకా విచారణ పూర్తి కాలేదు కాబట్టి, ఇంకా కొంత మందిని అరెస్ట్ చేయాలి కాబట్టి, బెయిల్ పిటీషన్ కొట్టేసింది.

Advertisements

Latest Articles

Most Read