కుప్పం నగర పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి వ్యక్తులను తీసుకుని వచ్చిందని, దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నం చేస్తుందని, దీనికి సంబంధించి, ఇప్పుడే కుప్పంలో ఉన్న అనేక వార్డుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చిన దొంగ ఓటర్ల వివరాలను, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు నిన్న రాత్రి లేఖ రాసారు. కుప్పంలో అనేక ప్రాంతాలలో ఉన్న దొంగ ఓటర్ల వివరాలు అన్నీ కూడా చంద్రబాబు ఆ లేఖలో వివరించారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమీషనర్, నిన్న అర్ధరాత్రి స్పందించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా ఎస్పీకి లేఖ రాసింది. చంద్రబాబు నాయుడు రాసిన ఫిర్యాదు పైన వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పోలింగ్ కు సంబంధించి కేవలం తక్కువ సమయం ఉన్నప్పుడు, కుప్పం నగర పంచాయతీ పరిధిలో కానీ, ఎన్నికలు జరిగే ప్రదేశంలో బయట వ్యక్తులు ఉండటానికి వీలు లేదని, వారి అందరినీ వెంటనే పంపించి వేయాలని చెప్పి, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు జారీ చేసారు. ఎవరు అయితే కుప్పం ఓటర్లు కాని వారు ఉన్నారో, వారు కుప్పంలో ఉండటానికి వీలు లేదని తెలిపారు.
వీరి అందరినీ కూడా వెంటనే అక్కడ నుంచి, పంపించి వేయాలని ఆదేశించారు. ఇప్పటికే కుప్పంలో ఒక్కో వార్డులో వంద నుంచి 150 మంది వరకు, ఆర్టీసి బస్సుల్లో దిగారని, వారు అందరూ కూడా రేపు కుప్పంలో దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉనంరని, వీరు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని, స్థానికంగా ఉండే కొంత మంది అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నారని, కుప్పంలో ఇప్పటికే దొంగ ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి చేరారని, కొన్ని ఆర్టీసి బస్సుల్లో, ప్రైవేటు బస్సుల్లో కొంత మందిని వేరే ప్రాంతాల వారిని తరలించి, అక్కడ దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారని, చంద్రబాబు తన లేఖలో స్పష్టమైన వివరాలతో పాటుగా, ఫోటోలు అదే విధంగా వాళ్ళని తీసుకుని వచ్చిని బస్సులు, వేరే వ్యక్తులు వస్తున్న కారులు, ఇలా దీనికి సంబందించిన వివరాలు అన్నీ కూడా ఆయన తన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు పై ఎలక్షన్ కమిషన్ స్పందించి, ఆక్షన్ తేసుకోమని ఆదేశాలు ఇచ్చింది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.