వైసీపీ అంటేనే ఐ ప్యాక్. ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ షార్ట్ క‌ట్‌లో ఐ ప్యాక్ వైసీపీ అధిష్టానం లెక్క‌. రోడ్ల‌న్నీ గుంత‌లు ప‌డి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే, ఐప్యాక్ సెలెక్ట్ చేసిన రోడ్లే వేయాలంటూ అధికారుల‌కు ఆదేశాలిచ్చారు జ‌గ‌న్ రెడ్డి. వైసీపీ స‌మీక్ష‌లు, స‌మావేశాలు, టికెట్ల ఎంపిక‌లు, త‌ప్పించ‌డాల‌న్నీ ఐప్యాక్ స‌ర్వేల ఆధారంగానే చేస్తుంటారు. ముఖ్య‌మంత్రికి క‌ళ్లూ, చెవుల్లా మారిన ఐ ప్యాక్ అంతా త‌మ గుప్పెట్లోకి తెచ్చుకుంది. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న త‌న‌ని ముఖ్యమంత్రిని చేసింది ఐప్యాక్ అనే న‌మ్ముతున్న జగన్మోహన్‌రెడ్డి, ఆ స‌ర్వే సంస్థ ఏమి చెబితే అదే వేదంగా భావిస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికీ ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఐప్యాక్ మూడు ర‌కాల స‌ర్వేలు చేస్తూ నివేదిక‌లు వైసీపీ పెద్ద‌ల‌కు అంద‌జేస్తూనే ఉంది. మంత్రుల చుట్టూ ఉండేది కూడా ఐప్యాక్ మ‌నుషులే. సీఎం కూడా పార్టీ నేత‌ల‌కంటే ఎక్కువ‌గా ఐప్యాక్ టీముని న‌మ్ముతుండ‌డంతో అంద‌రూ ఐ ప్యాక్ వారిని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఉన్నారు. దీన్ని ఆస‌రాగా తీసుకున్న ఐ ప్యాక్ టీము త‌మ‌కి చేయి త‌డిపిన వారికి అనుకూలంగా నివేదిక‌లు ఇస్తున్నార‌ని వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచే ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురితం అయ్యింది. బాగా ప‌నిచేస్తున్న ఎమ్మెల్యేలు ఐ ప్యాక్ వారికి తృణ‌మో, ప‌ణ‌మో ఇవ్వ‌క‌పోతే వారికి వ్య‌తిరేకంగా నివేదిక‌లు ఇస్తున్నార‌ని పార్టీలో ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. నేత‌లంతా ఐ ప్యాక్ బాధితులే. కానీ ఎవ్వ‌రూ సీఎం జ‌గ‌న్ రెడ్డికి ఈ విష‌యాన్ని చెప్ప‌లేరు. ఆయ‌న దృష్టికి వెళ్లాల‌నే వైసీపీలో కీల‌క నేత‌లు త‌మ చెప్పుచేత‌ల్లో ఆ ప‌త్రిక‌లో ఐ-ప్యాక్ ప్యాకేజీ పాలిటిక్స్‌పై ప్ర‌త్యేక క‌థ‌నం వేయించార‌ని స‌మాచారం బ‌య‌ట‌కి పొక్కింది.

టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా అన్ని బాధ్య‌త‌లు ఆయ‌నే చూసుకుంటారు. 2014 అధికారంలోకి వ‌చ్చాక న‌వ్యాంధ్ర అభివృద్ధి త‌ప్పించి, పార్టీని కూడా ప‌ట్టించుకునే తీరిక లేనంత‌గా బాబు గ‌డిపారు. త‌న‌యుడు లోకేష్ కూడా మంత్రిగా ఉండ‌డంతో ప్ర‌భుత్వం-ప్ర‌జ‌లు-అభివృద్ధి అన్న‌ట్టుగా సాగింది టిడిపి స‌ర్కారు తీరు. స‌మీక్ష అయినా, పార్టీ కార్య‌క్ర‌మం అయినా, ప్ర‌తిప‌క్ష బాధ్య‌త అయినా అంతా చంద్ర‌బాబు చుట్టూనే తిరిగేది. ఇది నిన్న మొన్నటి వరకు పార్టీలో అన్ని బాధ్యతలు బాబువే.. కానీ ఇప్పుడు లోకేష్ ప్రజల్లో ఉన్నాడు, పిచ్చ క్రేజ్ వచ్చింది, అర‌వై రోజులు దాటిపోయినా పాద‌యాత్ర‌కి మ‌రింత స్పంద‌న పెరుగుతుందే త‌ప్పించి త‌ర‌గ‌డంలేదు. యువ‌నేత‌గా నారా లోకేష్ జ‌నాక‌ర్ష‌ణ శ‌క్తిగా మారారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెంట ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్య తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. ఎప్పుడైతే ప్రజాక‌ర్ష‌క నేత‌గా లోకేష్ మారారో, చంద్ర‌బాబు రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెట్ట‌డం ఆరంభించారు. పార్టీ మీద ఫోకస్ పెట్టారు. రాజకీయం మొదలు పెట్టారు. దాని ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు. అంతేకాదు జిల్లాల వారీ సమీక్షలు, బలా బలాల బేరీజు, ఇతర పార్టీలతో సంప్రదింపులు, పార్టీ మంచి చెడు, ఇలా చంద్రబాబు చాణ‌క్యానికి చాలా స‌మ‌యాన్ని ఇచ్చాడు లోకేష్‌. దాదాపు ఏడాది పాటు లోకేష్ జ‌నాల మ‌ధ్య‌నే ఉంటారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు పార్టీ బ‌లోపేతం, పొత్తులు, అభ్య‌ర్థుల ఎంపిక వంటి కీల‌క కార్య‌క్ర‌మాల‌న్నీ అంతా తానై చ‌క్క‌బెట్టేస్తున్నారు. ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేసి అరాచ‌క వైసీపీ పోరాడేందుకు స‌మాయాత్తం చేసే బాధ్య‌త‌ని బాబు నుంచి లోకేష్ తీసుకోవ‌డంతో చంద్ర‌బాబుకి ఎంతో స‌మ‌యం చేత‌చిక్కింది. ఈ స‌మ‌యాన్నే ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చించేందుకు బాబు వినియోగిస్తున్నారు.

జ‌గ‌న్ రెడ్డి మాట త‌ప్ప‌డానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మడ‌మ తిప్ప‌డంలో ఆయ‌న‌కి స‌రిసాటి ఎవ‌రూ లేరు. అధికారంలోకి వ‌చ్చాక సీపీఎస్ వారం రోజుల్లో ర‌ద్దు చేస్తాన‌న్నాడు నాలుగేళ్ల త‌రువాత అవ‌గాహ‌న లేక జ‌గ‌న్ అలా హామీ ఇచ్చార‌ని స‌జ్జ‌ల‌తో చెప్పించేశారు. మ‌ద్య‌నిషేధం అని చెప్పిన జ‌గ‌న్ రెడ్డి, త‌న సొంత కంపెనీల మ‌ద్యం అమ్మ‌కాల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. అలాగే త‌న‌కి న‌చ్చ‌నిది ధ్వంసం అయిపోవాలి, త‌న‌కి ద‌క్క‌నిది ఎవ్వ‌రికీ ద‌క్క‌కూడ‌దనే క్రూర మ‌న‌స్త‌త్వం ఉన్నందుకే జగన్ ని సైకో అని చంద్రబాబు అంటూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని మర్చిపోయి, ఓటమిని అంగీకరించలేడు. స‌జావుగా  ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ప్ర‌య‌త్నించిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్నా అన్ని మార్గాల్లో ఆయ‌న‌పై ముప్పేట దాడులు చేసిన మూర్ఖ చ‌రిత్ర జ‌గ‌న్ రెడ్డిది. శాస‌న‌మండ‌లిలో మూడు రాజ‌ధానుల బిల్లుని సెలెక్ట్ క‌మిటీకి పంపించార‌నే అక్క‌సుతో ఏకంగా శాసనమండలి రద్దుకి బరితెగించిన నియంత మ‌న‌స్త‌త్వం జ‌గ‌న్ రెడ్డిది. ఇటీవ‌ల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో కూడా జగన్ రగిలిపోతున్నాడు. త‌ననే ఓడిస్తారా అనే పగతో కుత‌కుత‌లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఓట‌మితో సొంత పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేశాడు. ప్ర‌జా వ్య‌తిరేక‌త తీవ్ర‌మై, మ‌రింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తార‌నే భ‌యంతో ముందస్తు ఆలోచన చేస్తున్నార‌ని రాజ‌కీయవేత్త‌లు విశ్లేషిస్తున్నారు. కానీ ముంద‌స్తుకి వెళ్ల‌డం అనేది జగన్ ఇష్టం కాదు, కేంద్రం ఇష్టం. మోడీ, షా ఏది చెప్తే జగన్ అదే చేయాలి. పీక‌ల్లోతు కేసుల్లో ఇరుక్కుపోయి త‌న జుట్టుని కేంద్రంలోని బీజేపీ పెద్దల చేతిలో పెట్టేస‌రికి, వారు కీలుబొమ్మ‌లా జ‌గ‌న్ రెడ్డిని ఆడిస్తున్నారు. మ‌ళ్లీ అధికారం నిలుపుకోవాలంటే ముంద‌స్తుకి వెళ్లాల‌నేది జగన్ ఆలోచ‌నే అయినా బీజేపీ పెద్ద‌లు ఒప్పుకుంటేనే అడుగు ముందుకు వేయ‌గ‌ల‌డు. జ‌గ‌న్ ఏమి చేసినా, కేంద్రం ఎంత ఆదుకున్నా ఈ సారి వైసీపీ గెలిచే అవకాశమే లేదు. అందుకే ముంద‌స్తుకి వెళ్ల‌కుండా ఐదేళ్ల‌పాటు దొరికినంత దోచుకునేందుకే మొగ్గు చూపుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ముంద‌స్తుకి వెళ్ల‌న‌ప్పుడు మ‌రింత మంది ఎమ్మెల్యేల‌తో వైరం ఎందుకు అనే ఆలోచ‌న‌తోనే నేటి స‌మావేశంలో ఆల్ ఈజ్ వెల్ అంటూ కొత్త రాగం అందుకున్నారు.

సీఎం జ‌గ‌న్ రెడ్డి ఒంట‌రిగా ఒంటి మిట్ట‌కి బ‌య‌లుదేరారు. అయితే జంట‌గా వెళ్లాలంటూ ఐ ప్యాక్ సూచించింది. దేవాల‌యాల‌కు హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం దంప‌తులే వెళ్లి పూజ‌లు చేసి, దేవుళ్ల‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌, ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రంగా ఉన్న స‌మ‌యంలో ఎవ్వ‌రికీ విమ‌ర్శించ‌డానికి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని సీఎంకి హెచ్చ‌రిక‌లాంటి సూచ‌న‌లు ఐప్యాక్ టీము చేసింది. ఒంటి మిట్ట రాములోరి క‌ళ్యాణానికి ఒంట‌రిగా వెళ్లొద్ద‌ని, సతీ స‌మేతంగా వెళ్లాల‌ని సూచించింది. అయితే జగన్ కు ఉన్న సమస్యలు కారణంగా అది కుదరని పని కాబట్టి, ఐప్యాక్ వాళ్ల సూచ‌న కాద‌న‌లేక ఏకంగా క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌నే వాయిదా వేసేశారనే ప్రచారం జరుగుతుంది. గ‌తంలోనూ వ్యాయామం చేస్తూ ఓ సారి కాలు జారిన సీఎం మ‌ణిపాల్ ఆస్ప‌త్రిలో వైద్య‌ప‌రీక్ష‌లు కూడా హుటాహుటిన చేయించుకున్నారు. మ‌ళ్లీ ఒంటి మిట్ట సీతారాముల క‌ళ్యాణోత్స‌వానికి హాజ‌రై ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉన్న వేళ‌ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కి మ‌ళ్లీ గ‌తంలోలాగే వ్యాయామం చేస్తున్న సమయంలో  కాలు బెణికింది. వైసీపీ అధికారిక సోష‌ల్ మీడియా స‌మాచారం ప్ర‌కారం సాయంత్రానికి నొప్పి తీవ్రం అయ్యింద‌ని, విశ్రాంతి తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు ఇచ్చిన స‌ల‌హా మేర‌కు క‌డ‌ప టూరుని అధికారులు ర‌ద్దు చేశారు. ముఖ్య‌మంత్రి ఎంతో భ‌క్తితో ఒంటిమిట్ట సీతారాముల క‌ళ్యాణానికి వెళ్లాల‌నుకున్న‌ప్పుడే ఇలా కాలు బెణ‌క‌డంతో వైసీపీ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read