నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో బాల‌కృష్ణ‌ సినిమా పాటలు వేసిన వారిని తొలగించాలని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆదేశించ‌డం విదిత‌మే. దీనిపై బాల‌య్య ఘాటుగా స్పందించారు. రాజకీయాలకు, సినిమాలకు ముడిపెట్టొద్ద‌ని, రాజకీయాలను రాజకీయాలుగానే చూడాల‌ని బాల‌య్య పేర్కొన్నారు. త‌న పాట‌లు వేయొద్ద‌ని వార్నింగ్ ఇచ్చిన గోపిరెడ్డి పేరు పెట్ట‌కుండానే, మరోసారి ఇటువంటి ఘటన జరిగితే చూస్తూ ఊరుకోన‌ని నందమూరి బాలకృష్ణ హెచ్చ‌రించారు. డాక్ట‌ర్ అయి వుండి కూడా అరాచ‌కాలు, ఫ్యాక్ష‌న్ చ‌ర్య‌ల‌లో నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అందరికంటే రెండాకుల ఎక్కువేన‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల టిడిపి నేత‌ల వ‌ర‌స హ‌త్య‌లు అన్నీ ఎమ్మెల్యే చేయించిన‌వేన‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్యేకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు  బాలకృష్ణ. పొలిటీషియ‌న్‌ పొలిటీషియ‌న్‌గానే ఉండాలని.. నీచానికి దిగజారకంటూ శ్రీనివాస్‌రెడ్డిని హెచ్చరించారు. బాలకృష్ణ పాట పెట్టిన వైసీపీ కార్యకర్త భాస్కర్‌ రెడ్డిని వేధించినట్లు ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ స్పందించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని.. అన్ని పార్టీల వాళ్లు తన సినిమాలు చూస్తారన్నారు బాలకృష్ణ. ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటూ హెచ్చరించారు. తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంలో బాలయ్య గోపిరెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక క‌న్ను ఇంకో క‌న్నుని ఎందుకు పొడుస్తుంది అధ్య‌క్షా అనే జ‌గ‌న్ నాట‌కానికి ముగింపు ప‌లికేశారు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి. త‌న బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో సూత్ర‌ధారి వైఎస్ అవినాష్ రెడ్డేన‌ని సీబీఐ అనుమానిస్తున్న నేప‌థ్యంలో నాలుగ‌వ వ‌ర్థంతికి క‌నీసం నివాళులు అర్పించ‌ని అబ్బాయిలపై ఇంకా అనుమానాలు పెరిగిపోయాయి. బాబాయ్ వివేకాని చంపేసిన‌ప్పుడు ఎన్నిక‌లు ఉండ‌డంతో సానుభూతి కోస‌మే మొస‌లి క‌న్నీరు కార్చి విగ్ర‌హాలు ఏర్పాటు చేశార‌ని...మ‌ర్డ‌ర్ స్కెచ్ అంతా సామాన్యుల‌కు తెలిసిపోవ‌డంతో..చంపేసి దండ వేస్తే మ‌రింత చుల‌క‌న అవుతామ‌ని వివేకా 4వ వ‌ర్ధంతికి జ‌గ‌న్, అవినాష్ దూరంగా ఉన్నారు. మ‌రోవైపు సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం, త‌న అడ్డా అయిన పులివెందులలో వైసీపీ వేసిన వివేకా వ‌ర్థంతి ఫ్లెక్సీలు ఏ ఒక్క‌దానిలోనూ జ‌గ‌న్, అవినాష్ ఫోటోలు లేవు. అంటే స్థానిక ప్ర‌జ‌లే కాదు, పులివెందుల వైసీపీ నేత‌లు కూడా చంపింది ఆ బ్ర‌ద‌ర్సే అని న‌మ్ముతున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.  పులివెందులలో నిర్వ‌హించిన‌ వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన  ఫ్లెక్సీల‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫొటోలు లేవు. ఇవే ఫ్లెక్సీల‌లో జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మరో చెల్లి సునీత ఫొటోలు ఉన్నాయి. జ‌గ‌న్ తాత‌ రాజారెడ్డి, తండ్రి రాజశేఖర్ రెడ్డి ఫొటోలు కూడా వేసి జ‌గ‌న్ రెడ్డివి వేయ‌లేదంటే బాబాయ్‌ని హ‌త్య‌చేసింది అబ్బాయేన‌ని పులివెందుల‌వాసులు ఫిక్స‌య్యార‌ని ప్ర‌చారం సాగుతోంది.

కోడిక‌త్తి జ‌గ‌న్ రెడ్డిని వెంటాడే ఓ ఎమోష‌న్‌. బాబాయ్‌ని వేసేసిన గొడ్డ‌లి వీడ‌ని నీడ‌లా వెంటాడుతోంది. కోడిక‌త్తిని తీసుకురావాల‌ని మొన్న‌నే ఆదేశాలిచ్చిన జ‌డ్జి, తాజాగా బాధితుడు సీఎం జ‌గ‌న్ రెడ్డి కూడా కోర్టు హాజ‌రు కావాల్సిందేన‌ని ముఖ్య ప‌ద‌వి ద‌క్కేసింది అనుకుని అన్నీ తొక్కేద్దాం అనుకున్నారు. చాప‌కింద నీరులా జ‌గ‌న్ రెడ్డిని చుట్టుముట్టేస్తున్నాయి. కోడిక‌త్తి దాడి త‌న‌పై జ‌రిగింద‌నే జ‌గ‌న్ రెడ్డి మ‌రిచిపోగా, జైలులోనే నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా జైలులో ఉండిపోయిన‌ కోడిక‌త్తి శ్రీను కుటుంబ‌స‌భ్యులు, న్యాయ‌వాదుల పోరాటం ఫ‌లితంగా ఎన్ఐఏ కోర్టు కేసు విచార‌ణ‌కి మొద‌లు పెట్టింది. కోడికత్తి కేసులో వచ్చే నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని ముఖ్యమంత్రిని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. సిఎంతో పాటు ఆయన పిఏ కే.నాగేశ్వరరెడ్డిని కూడా హాజరు కావాలని ఆదేశాల‌లో పేర్కొన్నారు. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో మంగళవారం కోడికత్తి కేసు విచారణ సంద‌ర్భంగా  ఎయిర్‌పోర్ట్ అథారిటీ కమాండర్ దినేష్‌ ను  న్యాయస్థానం విచారించింది. కేసుకు సంబంధించి కోడికత్తి, మరో చిన్నకత్తి, పర్సు, సెల్‌ఫోన్ న్యాయస్థానానికి పోలీసులు అప్ప‌గించారు. విచార‌ణ‌ని వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఓ వైపు కోడిక‌త్తి కేసు విచార‌ణ జోరుగా సాగుతుండ‌గా, బాబాయ్ పై గొడ్డ‌లి వేటు కేసు ద‌ర్యాప్తుని సీబీఐ స్పీడు చేసింది. ఇప్ప‌టికే క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచార‌ణ‌ని మూడుసార్లు పిలిపించిన సీబీఐ, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డిని కూడా పిలుస్తోంది. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కి గురైన రోజు తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ముఖ్య దంప‌తుల వ్య‌క్తిగ‌త సిబ్బందికి అవినాస్ రెడ్డి నుంచి చాలాసార్లు కాల్స్ వెళ్ల‌డం, గూగుల్ టేకౌట్ తో గొడ్డ‌లి వేటు కేసు కూడా తీగ లాగితే జ‌గ‌న్ రెడ్డి చుట్టూ ఉన్న డొంకే క‌దులుతోంది.

ఏపీలో వైసీపీ ధీమా స‌డ‌లుతోందా? వైనాట్ 175 మేకపోతు గాంభీర్య నినాద‌మేనా? ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానాల‌కి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డ‌టంతో వైసీపీ పెద్ద‌ల్లో ఆందోళన నెల‌కొంది. దింపుడు క‌ల్లం ఆశ‌లు దొంగ ఓట్ల‌పై పెట్టుకోవ‌డం వైసీపీ తిరోగ‌మ‌నానికి సంకేతం అని అంటున్నారు. ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల‌న్నీ కూడ‌బ‌లుక్కుని మ‌రీ వైసీపీని ఓడించాల‌ని త‌మ గ్రూపుల‌లో నేరుగానే సందేశాలు పంపేశాయి. ఉద్యోగాల భ‌ర్తీ లేక‌పోవ‌డంతో ప‌ట్ట‌భ‌ద్రుల‌లో తీవ్ర నిరాశానిస్పృహ‌లు అలుముకున్నాయి. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ స్థానాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోలింగ్ న‌మోదైంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాద్యాయులు ఇంత వ్య‌తిరేకంగా ఉన్న ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో గెలిచే అవ‌కాశంలేదు. కానీ వైసీపీ ఇటువంటి ప్ర‌జావ్య‌తిరేక‌త‌ని ఊహించే భారీగా దొంగ ఓట్లు చేర్పించింది. ఇప్పుడు గెలుపు ధీమా అంత ఆ దొంగ ఓట్ల‌పైనే పెట్టుకుంది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరగ్గా ఉపాధ్యాయ ఓటర్లు 91.40శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఉపాధ్యాయులు కానివారిని, ప్రైవేటు స్కూళ్ల‌లో ప‌నిచేసిన వారిని వైసీపీ త‌మ వాలంటీర్ల ద్వారా ఓట‌ర్లుగా చేర్చింద‌ని ఉపాధ్యాయ‌సంఘాలు ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకునే అధికారే లేడు. ఈ దొంగ ఓట్ల‌పైనే వైసీపీ గెలుపు ఆశ‌లు పెట్టుకుంది.  పట్టభద్రులు కూడా గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా 69.23 శాతం మంది, ఎండ‌లో గంట‌ల త‌ర‌బ‌డి నిలుచుని మ‌రీ త‌మ ఓటుహ‌క్కుని వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెర‌గ‌డం, అందులోనూ యువ‌త‌, ఉద్యోగులు పోటెత్త‌డంతో ప్ర‌భుత్వంపై కోపంతోనే ఓటింగ్‌కి వ‌చ్చార‌ని, ఇది క‌చ్చితంగా వైసీపీకి ఓట‌మి ఎదురు కావొచ్చ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే  తిరుప‌తి, రాయ‌ల‌సీమ‌లో దొంగ ఓట్ల‌ని, ఉత్త‌రాంధ్ర‌లో తాము పంచిన తాయిలాలు, డ‌బ్బుల‌నే న‌మ్ముకుని వైసీపీ గెలుపు అంచనాల్లో ఉంది.

Advertisements

Latest Articles

Most Read