వైసీపీ నుంచి, సీఎం నుంచి ఏ ప్రకటన చేయాలన్నా సకలశాఖా మంత్రిగా టిడిపి పిలుచుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే బయటకొస్తారు. కుండబద్దలు కొట్టాలన్నా, కవరింగ్ చేయాలన్నా అంతా సజ్జల బాధ్యతే. మూడు పట్టభద్రుల స్థానాలలో వైసీపీ మద్దతు అభ్యర్థుల దారుణ ఓటమి, టిడిపి అద్వితీయ గెలుపుపై సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రకాల వెర్షన్లు వినిపించడం వైసీపీ వాళ్లే దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికల ఫలితం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు..చాలా డేరింగ్‌గా కొట్టారు, కొట్టించుకున్నామంటూ..తన టైము వచ్చినప్పుడు అంతకంటే గట్టిగా కొడతామంటూ జవాబిచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి తమ ముఖ్యమంత్రి ధైర్యంలో ఒక్క శాతమూ కూడా కనపరచకుండా కప్పదాటు ధోరణి, గుడ్డకాల్చి ఎదుట వారిపై వేసే పద్ధతితో వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
మూడు పట్టభద్రుల స్థానాలు ఓడిపోవడంపై..ఓట్లేసిన వాళ్లు మా ఓటర్లు కాదంటూ కొత్త లాజిక్ చెప్పడం మొదటిది. రెండోది తెలుగుదేశం పార్టీ ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేస్తుందని, ఎమ్మెల్సీ ఎన్నికలని మేనేజ్ చేసిందని చెప్పడం. ఇది మరీ కామెడీ వెర్షన్. రాజ్యాంగ వ్యవస్థలని బెదిరించి భయపెట్టి అధికారంలో ఉన్న వైసీపీ వాళ్లు టిడిపి వ్యవస్థలని మేనేజ్ చేస్తుందనడం సజ్జల దివాలాకోరు వాదనకి నిదర్శనం అంటున్నారు. ఇక మూడోది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ, పీడీఎఫ్‌తోనూ రహస్య ఒప్పందం చేసుకుందని సజ్జల చెప్పుకొచ్చారు. బీజేపీతో బహిరంగ ఒప్పందం వైసీపీది అని బీజేపీ నేతలే చెబుతున్నారు. ఇక సీపీఎం మధు అయితే వైసీపీ కోసం తానున్నాను అన్నట్టు వ్యవహరిస్తారు. అటు కమ్యూనిస్టులతోనూ-ఇటు బీజేపీతోనూ బహిరంగ స్నేహాలు కొనసాగిస్తూ టిడిపిపై సజ్జల చేసిన ఈ ఆరోపణా ఓటమిని ఒప్పుకోలేక వెతుక్కున్న మరో సాకు అని విమర్శలు వినిపిస్తున్నాయి.
news
ఛీ ఛీ... నాగార్జున వర్సిటీ వైస్ చాన్సలర్, వైకాపా నేతల్లాగే బరితెగించారు...
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ బరితెగింపుపై విద్యావేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాలన్నీ వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారనే ఆరోపణలున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి అయితే ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల అనధికార ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. తాజాగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం, కాలేజీ యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేయడంపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. అంత పేరు ప్రఖ్యాతులున్న ఆంధ్రా యూనివర్సిటీ వీసీ బరితెగించినప్పుడు, తానేమీ తక్కువ తినలేదని నాగార్జున యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ఏకంగా వైసీపీ నేత అవతారం ఎత్తేశారు. వైకాపా 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇటీవల జరుపుకుంది. ఆ రోజున వైసీపీ అధినేత జగన్ రెడ్డి ట్వీటేసి ఊరుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజశేఖర్ మాత్రం వర్సిటీలో వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివారం సెలవు కావడంతో వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జరపగా రెక్టార్, రిజిస్ట్రార్ కూడా హాజరయ్యారు. రాజశేఖర్ తాను యూనివర్సిటీకి వీసీ కాదని, వైకాపా వీసీనని అనుకుంటున్నట్టున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే వైసీపీ కోసం కిరాయి తీసుకుని పనిచేసే రాం గోపాల్ వర్మని తీసుకొచ్చి విశ్వవిద్యాలయాన్ని గబ్బు పట్టించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అకడమిక్ ఎగ్జ్జిబిషన్ కి రాంగోపాల్ వర్మని అతిథిగా తీసుకొచ్చారు వీసీ. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఆర్జీవీ మాట్లాడుతూ ఏదైనా వైరస్ వచ్చి తాను తప్ప, మగజాతి అంతా అంతమైపోవాలని, అప్పుడు నేనొక్కడినే స్త్రీజాతికి దిక్కవుతానంటూ చెప్పుకొచ్చాడు. కష్టపడి చదివేవారు ఎప్పుడూ పైకి రారని, చదవకుండా, హార్డ్‌వర్క్ చేయకుండా, ఉపాధ్యాయుల మాటలు పట్టించుకోకుండా ఇష్టానుసారం తాగుతూ తిరుగుతూ జీవించాలి’’ అని సూచించారు. ఇదే సందర్భంగా ఏఎన్ యూ వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ రాంగోపాల్‌వర్మ ప్రొఫెసర్, ఫిలాసఫర్ కంటే ఎక్కువని, ఆయనకు పీహెచ్‌డీ, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయని ప్రశంసించారు. నాగార్జున వర్సిటీలో ఆర్జీవీ వ్యాఖ్యలు, సమర్థించిన వీసీ తీరుపై యూజీసీ చైర్ పర్సన్, నేషనల్ ఉమెన్ కమిషన్ కు టిడిపి నేత వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని, వైసీపీకి మూడు రోజుల ముందే తెలుసా ? అందుకే ఇలాంటి పని చేసారా ?
ఇటీవలే వైకాపా 13వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ ఎదురులేని మెజారిటీతో పొందిన అధికారం చేతిలో ఉన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కేడర్, లీడర్లకు ఉత్సాహంగా పాల్గొనలేదు. వైకాపా ఆవిర్భావ దినం చేశారా? అన్నట్టు ఉంది. 12 ఏళ్లలో ఎప్పుడూ లేనంత చప్పగా సాగింది. వైసీపీ అధిష్టానంపై సొంత పార్టీ శ్రేణులకు కూడా నమ్మకం పోయిందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 2009లో తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పావురాలగుట్టపై జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అయితే తన తండ్రి సీఎం పదవిని తనకే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేశారు. వారు దిగిరాకపోవడంతో వేరుకుంపటి పెట్టుకున్నారు. తెలంగాణకి చెందిన శివకుమార్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కొనుగోలు చేసి సొంతం చేసుకున్నారు జగన్ రెడ్డి. పార్టీ పెట్టిన ఇన్నేళ్లలో ఏ ఏడాది జరగనంత నిరాశగా వైకాపా ఆవిర్భావ దినోత్సవం జరగడం పార్టీలో నిస్తేజానికి నిదర్శనంగా నిలిచిందని విశ్లేషణలు వినవస్తున్నాయి. ఓ వైపు కేసుల్లో జగన్ రెడ్డి తమ్ముడు బాబాయ్ ఇరుక్కోవడం, జగన్ రెడ్డి దంపతులపై ఆరోపణలు రావడం..సీబీఐ నేడో రేపో తమ్ముడిని అరెస్ట్ చేయడం ఖాయమని తేలడంతో వైసీపీ పెద్దతలకాయలే ఆవిర్భావ దినోత్సవంపై ఆసక్తిగా లేరు. మరోవైపు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని దూరం పెట్టడంతో ఆయన కూడా పట్టించుకోవడంలేదు. మరోవైపు ప్రజావ్యతిరేకత తీవ్రం కావడం, సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడం, ఢిల్లీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ, వైసీపీ ఎంపీ అల్లుడు అన్న బుక్ కావడం వంటి పరిణామాలతో వైకాపా ఆవిర్భావ దినోత్సవం చప్పగా సాగిందని, కీలకనేతలు కూడా పాల్గొనకపోవడంతో కేడర్ దూరం అయ్యారని తెలుస్తోంది.
రామోజీ పవర్.. ఢిల్లీ పిలుపుతో జగన్ షివర్..
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రికి ఇవి ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే కదా. అయితే ఢిల్లీ నుంచి మోదీ షాల నుంచి పిలుపు. వెళ్లక తప్పలేదు. పరుగులు పెట్టాడు. ప్రతీసారీ ఢిల్లీ వెళ్లి ఏపీ ప్రయోజనాల కోసం కలరిచ్చే జగన్ రెడ్డి ఈ సారి ఈయన వెళ్లలేదు, వారే పిలిపించారని టాక్. మార్గదర్శి విషయంలో రామోజీరావుని ఎలాగైనా అరెస్టు చేయాలని జగన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నట్టు నటిస్తూనే ఉన్నతాధికారులు మొత్తం సమాచారం ఈనాడు అధిపతి రామోజీరావుకి అందజేశారని లీకులు వస్తున్నాయి. ఈనాడు రామోజీరావు ఎంత పవర్ ఫుల్లో తెలిసి కూడా పులిబోనులోకి తలపెట్టి చూశాడు జగన్ రెడ్డి. పులికి కితకితలు పెట్టనారంభించాడు. రామోజీ తన పవరేంటో చూపడం మొదలు పెట్టారని, ఈ దెబ్బకే మోదీ షాల నుంచి పిలుపు వచ్చిందని, అందుకే అసెంబ్లీ జరుగుతున్న ఢిల్లీకి పరుగులు పెట్టారనే ప్రచారం సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలుస్తారని సీఎంవో మీడియాకి లీకులిచ్చింది. అయితే పిలిచింది వారే కాబట్టి తలంటి పంపుతారని, ఇది సీఎం జగన్ రెడ్డి కోరిన అపాయింట్మెంట్ కాదని తాడేపల్లివర్గాల భోగట్టా. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు తన తమ్ముడు ఆయన తండ్రి సీబీఐ బొక్కలో వేసే పనిలో ఉందని తెలిసినా తప్పనిసరై ఢిల్లీ పెద్దల దగ్గరకెళ్లాల్సి వచ్చిందని అంటున్నారు. మరోవైపు టిడిపి కొత్త వాదన వినిపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని..నేడే రేపో అరెస్టు తప్పదని..అలాగే బాబాయ్ హత్యకేసులో అబ్బాయ్ జగన్ రెడ్డి పాత్ర ఉందని...అందుకే ఆగమేఘాల ఢిల్లీ టూరని చర్చించుకుంటున్నారు.