మాజీమంత్రి హరిరామజోగయ్య వైసీపీ కోసం పనిచేస్తున్నాడా? ముద్రగడ పద్మనాభం మాదిరిగానే కాపు కార్డుతో పవన్ కళ్యాణ్‌కి హాని చేస్తూ..వైసీపీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నాడా? ఈ అనుమానాలు ఆయన మాటలని బట్టి వస్తున్నాయి. జనసేనానిని ముంచేయడానికి జోగయ్య కంకణం కట్టుకున్నారని, పవన్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటాడా, లేక జోగయ్య బుట్టలో పడతాడా ? అనేది ఇప్పుడు రాజకీయ సమీకరణాలని మలుపు తిప్పే అంశం కానుంది. జగన్ రెడ్డిని సాగనంపాలంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు బాబు ఒప్పుకోక తప్పదని మాజీ మంత్రి హరిరామజోగయ్య ప్రకటించి కలకలం రేపారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించిన జోగయ్య చేసిన వ్యాఖ్యలన్నీ పవన్ కళ్యాన్‌కి మంచి చేసే కంటే, వైసీపీకి మేలు చేసేలా ఉన్నాయని విశ్లేషకుల మాట. జనసేనను బలహీనం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్ లను జనసేనలో చేరకుండా టిడిపి అడ్డుకుందని ఆరోపించారు. సోషల్ మీడియాలోనూ జనసేన లక్ష్యంగా చేసుకుని టిడిపి ప్రచారం చేస్తోందనడం ఆయనకి టిడిపిపై అక్కసే తప్పించి వాస్తవాలు తెలియవని తేలిపోయింది. క్షేత్రస్థాయిలో కనీస అవగాహన లేకుండా వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని బేస్ చేసుకుని చేగొండి మాట్లాడుతున్న మాటలని పవన్ పరిగణనలోకి తీసుకుంటాడా? అనేది అనుమానమే.
news
జగన్ ఢిల్లీ పర్యటనలో ఏమి జరిగింది ? అవినాష్ రెడ్డి అంత పని చేసాడా ?
తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ అవినాశ్ రెడ్డి వేసిన పిటిషన్‌ని తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో అరెస్టు తప్పకపోవచ్చని అని తేలిపోయింది. దీంతో సీబీఐ తనని అరెస్టు చేయకుండా చూడాలని అన్న సీఎం జగన్ రెడ్డి పీక మీద కూర్చున్నాడు అవినాష్ రెడ్డి. తన అరెస్టు ఆపకపోతే అన్నావదినలని కూడా చూడకుండా సీబీఐ ఎదుట మీ హస్తం కూడా బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో బెంబేలెత్తిన జగన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరాడని ప్రచారం బయటకొచ్చింది. జగన్‌తోపాటు తమ్ముడు అవినాష్ రెడ్డి కూడా తన ఇంట్లోనే ఉన్నాడు. మోదీ కాళ్లు పట్టుకుని అయినా అరెస్టు ఆపుతానని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించాడు. సీఎం మోదీ, షాల చుట్టూ తిరుగుతుంటే.. జగన్ నివాసంలో అవినాష్ రెడ్డి బస చేశాడు. పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్న అవినాష్ రెడ్డి ఎవ్వరితోనూ మాట్లాడటంలేదు. ఢిల్లీలోని జగన్ నివాసంలో ఎంపీలు, పార్టీ నేతలని కూడా అవినాష్ రెడ్డి పలకరించడంలేదు. ఇది ఇలా ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని వేడుకుని ఎలాగైనా అరెస్టు ఆపిస్తానని తమ్ముడికి మాటిచ్చాడట జగన్. తాను అరెస్టు అయితే మిమ్మల్ని వదలనంటూ గట్టిగానే వార్నింగ్ ఇవ్వడంతో అవినాష్ రెడ్డి కంటే జగన్ రెడ్డి తీవ్ర ఆందోళనలో ఉన్నారని తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుసగుసలు బయటకొచ్చాయి. మరోవైపు సీబీఐ ఎంపీ అవినాష్‍రెడ్డికి 41A నోటీసులు ఇవ్వనుందని సమాచారం. విచారణ తర్వాత అవినాష్‍రెడ్డిని, ఆయన తండ్రికి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అవినాష్‍రెడ్డి అరెస్ట్ ను ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పేయడంతో అవినాష్‍రెడ్డి, భాస్కర్‍రెడ్డిని కస్టడీలోకి తీసుకోవడం ఇక లాంఛనమే అంటున్నారు న్యాయనిపుణులు.
మంత్రి అప్పలరాజుకి ఘోర పరాభవం... ఇంతకంటే దారుణం ఉండదేమో..
ఉత్తరాంధ్ర ఓటర్లు వైసీపీపై ఉవ్వెత్తున తమ వ్యతిరేకతని వ్యక్తం చేశారు. ఓట్ల ద్వారా వైసీపీ అభ్యర్థికి దారుణ పరాజయం చవిచూపించారు. మరోవైపు తమ కోపాన్ని అణుచుకోలేక బ్యాలెట్ బాక్సుల్లో వైసీపీ మంత్రిపై స్లిప్పులు జారవిడిచారు. ఉన్నత చదువు చదివి, రౌడీల కంటే ఘోరమైన భాషలో మాట్లాడే మంత్రి చీదిరి అప్పలరాజుని చీదరించుకుంటూ లేఖలు బ్యాలెట్ బాక్సుల్లో పోస్టు చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అధికారులు సీదిరి అప్పలరాజు చీదర పనులు స్లిప్పుల్లో చూసి అవాక్కయ్యారు. బ్యాలెట్ బాక్స్ లో మంత్రి అవినీతిపై పలాస పట్టభద్రులు స్లిప్పులు వేశారు. మంత్రి భూకబ్జాలు, అనుచరుల అరాచకాలపై లెటర్లు రాసిన ఓటర్లు, తమ ఓట్లతోపాటు బ్యాలెట్ బాక్సులో వేశారు. అవినీతి మంత్రి తమకు వద్దంటూ ఆ లేఖల్లో డిమాండ్ చేశారు. నిత్యమూ వార్తల్లో వ్యక్తిగా ఉండే మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతి నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయికి చేరింది.
ఉత్తరాంధ్ర కొట్టిన దెబ్బకు, జగన్ నెక్స్ట్ చేసేది ఇదేనా ?
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో వైసీపీ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ని దారుణంగా ఓడించి మాకు వైసీపీ వద్దని నినదించారు. విశాఖ రాజధాని పేరుతో వస్తానంటోన్న సీఎం జగన్ రెడ్డిని కూడా మా వూరు రావొద్దు సారూ అంటూ వేడుకుంటున్నారు. గో బ్యాక్ సీఎం సార్ పేరుతో విశాఖ అంతటా ఫ్లెక్సీలు వెలిశాయి. జన జాగరణ సమితి పేరుతో విశాఖ నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో అంటించిన ఈ పోస్టర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోయిన రోజే ప్రత్యక్షం కావడం వైసీపీలో కలకలం రేపుతోంది. ఈ పోస్టర్లలో అమరావతి రాజధాని నిర్మించాలనే డిమాండ్ కూడా ఉంది. జగదాంబ జంక్షన్, సిరిపురం, ఏయూ ప్రధాన గేటు, మద్దిలపాలెం, ఇసుకతోట, సీతమ్మ ధార, హెచ్ బీ కాలనీ, శాంతిపురంలో కనిపించిన ఈ పోస్టర్లు అధికార పార్టీలో వణుకు పుట్టించాయి. వైసీపీ నేతలు ఈ పోస్టర్లు తొలగించుకుంటూ వెళ్లారు. మరోవైపు జనజాగరణ సమితి ఎవరిదో తెలుసుకోవాలంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల్లోనూ, మాములుగానూ విశాఖ వైసీపీని-జగన్ రెడ్డిని వద్దు పొమ్మంటోందని తేటతెల్లం అవుతోంది.