నివాస యోగ్యం కాని స్థలాల్లో ఇళ్ల పట్టాలు అంటూ జగన్ రెడ్డి రూ.6500కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు విమర్శించారు. ఆవ భూములు, స్మశానాలు, మురికి గుంటల్లో ఇళ్ల పట్టాలంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఇళ్ల పట్టాల్లో 40 నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, మునిగిపోయిన స్థలాలు, కొండలు, గుట్టలు, దూర ప్రాంతాలు వంటి 100 వంద రకాలు ఫోటోలను ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇళ్ల పట్టా పేరుతో పంచాయతీ, ఉపాధి నిధలను మళ్లించారని పేర్కొన్నారు. పట్టాల పేరుతో రూ.4 వేల కోట్లు, చదును పేరుతో రూ.2 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వివరించారు. 40 మంది ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములుగా ఉన్నారు. క్విడ్ ప్రోకో విధానంతో అవినీతి జరుగుతోంది. ఒక్కో లబ్ధిదారుని నుండి రూ.25 వేల నుండి లక్షల వరకు వసూలు చేసి ఐదు వందల కోట్లు దోచుకున్నారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో జె.ట్యాక్స్ వసూళ్లు తాడేపల్లి రాజ ప్రసాదానికి అందుతున్నాయని వివరించారు. ఇళ్ల స్థలాలను టీడీపీ అడ్డుకుందని వైసీపీ అసత్యప్రచారం చేస్తోందని, వాళ్ల పార్టీ వారే కోర్టుకు వెల్లారని తెలిపారు. సీఎం జగన్ రెడ్డి దమ్ముంటే ఇళ్ల పట్టాల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా వైసీపీ అవినీతిని టీడీపీ బయటపెట్టిందని వివరించారు. దోచుకున్న డబ్బంతా టీడీపీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు. మాజీమంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే అవినీతికి వైసీపీ అన్ని దారులను చూసుకుందన్నారు. రూ.10 లక్షలు విలువ చేసే భూమికి రూ.30 లక్షలు కేటాయించి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. పనికిరాని పొలాల్లో ప్లాట్లు వేసి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టా పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని అన్నారు. టీడీపీ పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలకు పేదల నుండి డబ్బులు వసూలు చేశారన్నారు.

వివాదంలో ఉన్న భూములను వదిలేసి మిగతా పట్టాలను ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ రెండు సెంట్ల భూమిని ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల హామీల్లో ఒకటి చెప్తూ ఆచరణలో మరొకటి చేస్తున్నారని మండిపడ్డారు. 10 లక్షల ఇళ్లు చంద్రబాబు కట్టించారని వివరించారన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ శుక్రవారం జరిగేది ఇళ్ల పట్టాభిశేకం కాదని జగన్ కు కనకాభిషేకం జరుగుతోందని ఎద్దేవవా చేశారు. జగన్ రెడ్డి పత్రికలో చెప్పుకుంటున్న రూ.21,345 కోట్ల విలువైన 2.62 లక్షల టిడ్కో ఇళ్ల అగ్రిమెంట్ల ద్వారా ఇచ్చే సంపద కూడా చంద్రబాబు సృష్టించేదనని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.6500కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఉద్ఘాటించారు. ముంపు, పీకల్లోతు మునిగే నీటిలో పేదలు ఇల్లు ఎలా కడతారని ప్రశ్నించారు. మీకు ఊరికో ప్యాలెస్, ఎకరాల పరిధిలో కట్టుకోవచ్చని కానీ పేదవాడు సెంటు స్థలంలో ఎలా కట్టుకోవాలని నిలదీశారు. జగన్ ప్యాలెస్ ఉన్న బాత్రూంత అంత స్థలం కూడా పేదవారికి ఇచ్చే స్థలం ఉండదన్నారు. చెరువు, కొండలు, అడవుల్లో ఇస్తున్నారు. మీరు ఇచ్చే స్థలంలో పేదవారు ఎలా కట్టుకుంటారు. మురికి వాడనలు సృష్టిస్తున్నారు. నివాసయోగ్యం కాని వాటిని ఇళ్ల స్థలాలుగా ఇస్తున్న విషయం రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కోరారు. వైసీపీ చేసిన అవినీతితో 13 లక్షల మందికి అదనంగా ఇళ్ల పట్టాలు ఇవ్వ వచ్చని పేర్కొన్నారు.

జగన్ ఓటమికి కౌంట్ డౌన్ మొదలైందని తెలిపారు. టీడీపీ ఇచ్చిన టిడ్కో ఇల్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దోచుకోవడం తప్ప ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని జాతీయ అధికార ప్రతినిధి మొహ్మద్ నసీర్ అన్నారు. నిజమైన పేదలకు వైసీపీ మేలు చేయడంలేదుని అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మాట్లాడుతూ జగన్ చేసే పెద్ద మాయను టీడీపీ బయటపెట్టిందన్నారు. ప్రజలు కూడా జగన్ ఇచ్చే ఇళ్లను అమ్ముకునే స్థితిలో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ఏంచేసినా జగన్ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో మురికి వాడలకు శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. పత్రిక ప్రకటనలతో డబ్బులు తగలబెతున్నారని రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి అన్నారు. ఆధునిక సాంకేతికతతో చంద్రబాబు ఇళ్లు నిర్మిస్తే జగన్ ఇవ్వడంలేదున్నారు. వర్షం వస్తే చెరువులుగా మారే వాటిని ఇళ్ల స్థలాలుకు కేటాయించడం దుర్మార్గమని విమర్శించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ జగన్ ఇచ్చే మురికి వాడ స్థలాల్లో కార్మికులే ఎక్కవగా ఉండే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఇంటి పై డ్రోన్లు ఎగరటం కలకలం రేపింది. అయితే ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కాదు, తెలంగాణాలో. డీజీపీ గౌతం సవాంగ్ కు హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. అయితే ఆయన ఇంటి పై కొంత మంది డ్రోన్ ఎగరువేసారు. నాలుగు అయుదు సార్లు ఆయన ఇంటి పై డ్రోన్ ఎగరటంతో, ఎందుకు ఎగిరింది, ఎవరు చేసారు, ఫోటోలు, వీడియోలు తీశారా అనే అనుమానంతో, డీజీపీ గౌతం సవాంగ్ వ్యక్తిగత కార్యదర్శి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే వెంటనే ఆ డ్రోన్ ఎగరేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రోన్ లో అసలు ఏమి ఫోటోలు తీసారు అని పరిశీలించి చూడగా, అందులో ఏమి రికార్డింగ్స్ లేవు. దీంతో, ఆ డ్రోన్ ని స్వాధీనం చేసుకుని, ఇంతకు ముందే డేటా ఏమైనా డెలీట్ అయిపోయిందా, ఏమైనా డేటా రికవరీ చేయవచ్చా అనే ఉద్దేశంతో, డ్రోన్ కెమెరాను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఆ డ్రోన్ ఎగరేసిన వ్యక్తీ పై కేసు పెట్టారో లేదో క్లారిటీ అయితే లేదు కానీ, డ్రోన్ స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న సమాచారం రికవరీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రశాసన్ నగర్‌లో ఉన్న డీజీపీ గౌతం సవాంగ్ ఇంటి పై ఈ డ్రోన్ ఎగిరింది. అయితే మరో తెలంగాణా పోలీస్ అధికారి ఇంటి పై కూడా ఇలాగే డ్రోన్ ఎగిరింది అనే వార్తలు వస్తున్నాయి.

dgp 24122020 2

అయితే ఇది ఎవరు చేసారో, ఇప్పటికీ క్లారిటీ లేదు. తెలంగాణా పోలీసులు మొత్తం సమాచారం పై ఎంక్వయిరీ చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే, ఇలా డ్రోన్లు ఎగరటం ఈ మధ్య కాలంలో సర్వ సాధారణం అయిపొయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పై డ్రోన్ ఎగరటంతో, అప్పట్లో అది పెద్ద గోల అయ్యింది. అయితే అది వరద అంచనా కోసం మేమే పంపించాం అని డీజీపీ చెప్పారు. ఇక మరో పక్క హైదరాబాద్ లో కేటీఆర్ ఫాం హౌస్ పై, రేవంత్ రెడ్డి మనుషులు డ్రోన్ ఎగరువేసి, కేటీఆర్ ది అక్రమ నిర్మాణం అని మీడియా ముందు చెప్పారు. అలాగే పోయిన చంద్రబాబు ప్రభుత్వంలో డీజీపీ గా పని చేసిన ఠాకూర్ ఇంటి ఫోటోలు బయటకు వదిలి, ఆయన అక్రమంగా నిర్మాణం చేసారు అంటూ, కొంత భాగం కూల్చే ప్రయత్నం చేసారు. వీటి అన్నిటి నేపధ్యంలో ఇప్పుడు ఏపి డీజీపీ ఇంటి పై డ్రోన్ ఎగరటం, ఇప్పటికీ క్లారిటీ లేకపోవటంతో, ఆశలు ఎందుకు జరిగిందో అర్ధం కవటం లేదు. అయితే పోలీసులు మాత్రం, ప్రాధమిక విచారణలో ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చారు.

రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకోవటం కొత్తేమి కాదు. కానీ ఆదాయం ఎంత, మనం ఎంత అప్పు తెచ్చుకోగలం, ఎలా తీర్చగలం, దేనికి ఖర్చు చేస్తాం ? తెచ్చుకున్న అప్పులో నుంచి ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి అనే అంశాలు ముఖ్యం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు లక్షా 20 వేల కోట్ల అప్పు చేసారు. అంటే ఏడాదికి 25 వేల కోట్ల అప్పు. ఆ డబ్బులతో అమరావతి నిర్మాణం జరిగింది, పోలవరం నిర్మాణం జరిగింది, సిమెంట్ రోడ్డుల నిర్మాణం, అనేక మౌళిక సదుపాయాలు కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం,అప్పుని వినియోగించుకుంది. అయితే అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గోల గోల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పడేసారని, చంద్రబాబు విధానాలతో తీవ్ర నష్టం జరుగుతుందని, భావి తరాలు నష్ట పోతున్నాయని, చంద్రబాబుకి పరిపాలన చేయటం రాదు అంటూ, విపరీతమైన ప్రచారం చేసారు. ఇలా అప్పుల పై ప్రచారం చేసిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే అప్పులే అప్పులుగా నెట్టుకుని వస్తున్నారు. చంద్రబాబు హాయాంలో 5 ఏళ్ళలో కేవలం లక్షా 20 వేల కోట్లు అప్పు చేస్తే, జగన్ మోహన్ రెడ్డి కేవలం 16 నెలల్లోనే లక్షా 20 వేల కోట్ల అప్పు చేసారు. అంతే కాదు ఈ అప్పు సరిపోవటం లేదు. ఇంకా ఇంకా అప్పులు చేస్తున్నారు. భూములు అమ్మి మరీ, డబ్బులు కోసం ప్రయత్నం చేస్తున్నారు.

jagan 24122020 2

అయితే ఈ అప్పు కూడా సరిపోక పోవటంతో, రకరకాల కొత్త అప్పులు చేస్తున్నారు. అప్పు పుట్టటం కోసం, ప్రజల పై భారాలు వేయటానికి కూడా వెనుకాడటం లేదు. ఆశ్చర్యకరమైన విషయం అయినా, ఇది నిజం. నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం బట్టబయలు అయ్యింది. కేంద్రం నుంచి ఎక్కువ అప్పులు తెచ్చుకోవటం కోసం, రాష్ట్ర ప్రజల పై పన్నులు భారం మోపుతున్నారు. పట్టణ స్థానిక సంస్థల సంస్కరణల పేరుతో, ఆస్తి పన్ను పెంచటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని, గతంలో ఉన్న సర్కిల్ రేట్ కాకుండా, ఆస్తి రేటు ప్రకారం పన్ను వేయనున్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రజల పై అదనపు బారం పడుతుంది. ప్రతి ఏడు ఆస్తి పన్ను పెరుగుతూనే ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రజల పై భారం కంటే కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు పుడుతుంది. నిన్న కేంద్రం ఇచ్చిన ప్రకటన ప్రకారం రూ.2,525 కోట్ల అదనపు అప్పుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. ప్రజల పై ఎక్ష్త్రా పన్ను వేసినందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇస్తున్నారు అనమాట. ఇది ప్రజలకు మంచి చేసే నిర్ణయమో, నష్టం చేసే నిర్ణయమో ప్రజలే తేల్చుకోవాలి.

తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు, పరస్పరం రాళ్ళ దా-డి-కి దిగారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా ఇరు వర్గాలు, రాళ్ళ దా-డి చేసుకోవటంతో, పదులు సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు ప్రధాన కారణం, ఎమ్మెల్యే భార్యకు సంబంధించిన ఆడియో కాల్ గా తెలుస్తుంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో జేసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు పోస్ట్ చేసారని, ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి హాల్ చల్ చేసారు. ఏకంగా ఎమ్మెల్యేనే ఇంటికి వెళ్లి దా-డి చేయటం పై సంచలనంగా మారింది. తన ప్రత్యర్ధి ఇంటికి, తన అనుచరులతో వెళ్లి దా-డి చేయటం పై రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. పెద్దారెడ్డి భార్యకు ఇసుక తరలింపులో, ఆమెకు డబ్బులు ఇవ్వాలని ఆ ఆడియో సారాంశం. ఎద్దుల బండిలో ఇసుక 10 వేలకు ఎమ్మెల్యే భార్య అమ్ముకుంటున్నారని, ఆ ఆడియో సారంశం. అది పోస్ట్ చేసిన వ్యక్తి జేసి ఇంట్లో ఉన్నారు అంటూ, కేతిరెడ్డి ఏకంగా ఇంటికి వెళ్లి, అక్కడ ఎవరూ లేకపోవటం, అక్కడ ఉన్న దాసరి కిరణ్ అనే వ్యక్తిని కొ-ట్టా-రు. ప్రభాకర్ రెడ్డి విషయం తెలుసుకుని తాడిపత్రి బయలుదేరారు.

peddareddi 24122020 2

సమాచారం అందుకున్న జేసి అనుచరులు, ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దీంతో ఒకేసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇంటి పరిసరాల్లోనే ఉన్న కేతిరెడ్డి అనుచరులు, ప్రభాకర్ రెడ్డి అనుచరులు పై రా-ళ్ళ దా-డి చేసారు. అలాగే ఇటు వైపు నుంచి కూడా దా-డి జరిగింది. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి తాడిపత్రికి రావటంతో, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి ఇంటికి వెళ్తాం అని చెప్తూ ఉండటంతో, పోలీసుల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఎక్కువ ఫోర్సు ను పోలీసులు దించారు. జేసీ ఇంటిముందు మరో ఇంట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి, తనయుడు హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు ఉన్నారని తెలుసుకుని, ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆ ఇంటి పైకి వెళ్లారు. అయితే పోలీసులు వాళ్ళని ఆపుతున్నారు. ఏదైనా ఒక ఎమ్మెల్యే ఇలా ఇంటికి వెళ్లి ఇష్టం వచ్చినట్టు చేయటం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే అయిపోయే దానికి, ఇంత హడావిడి ఎందుకు చేసారో ఎవరికీ అర్ధం కావటం లేదు. జేసీ ప్రెస్ మీట్ పెడితేనే కేసులు పెట్టే ప్రభుత్వం, కేతిరెడ్డి చర్యల పై ఏమి చేస్తుందో చూడాలి. అయితే జేసీ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆయన కుర్చీలో కూర్చున్నారు. దీంతో ఆగ్రహంతో జేసీ వర్గీయులు కుర్చీని తగలబెట్టారు.

Advertisements

Latest Articles

Most Read