ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 30లక్షల70వేలమంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాభిషేకం పేరుతో ప్రకటనలిస్తూ, తనకుతాను కనకాభిషేకం చేసుకుంటున్నాడని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రూ.23,535కోట్ల విలువగల 68,361ఎకరాలభూమిని, 30లక్షల 70వేలమందికి ఇళ్లపట్టాలరూపంలో పంచుతున్నట్లు, ప్రకటనల్లో చెప్పారని, గ్రామీణప్రాంతాల్లో సెంటున్నర, పట్టణప్రాంతాల్లోసెంటు భూమిప్లాట్లుగా ఇస్తున్నారని పట్టాభి తెలిపారు. సెంటుభూమికి 48గజాలని, సెంటున్నరకు 72గజాలను జగన్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైతే, దానికి రెండింతల విస్తీర్ణమున్న స్థలాలను టీడీపీప్రభుత్వంలో పేదలకు అందచేయడం జరిగిందన్నారు. టీడీపీ ఇచ్చిన విస్తీర్ణాన్ని సగానికిపైగా తగ్గించి, సెంటుపట్టాపేరుతో జగన్ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందన్నారు. వైసీపీలోని పెద్దతిమింగలాలు ఇళ్లపట్టాలపేరుతో ఏవిధంగా దోపిడీ చేశాయో చెప్పుకోవాలని, వారినిపెంచిపోషించి, వారిద్వారా అందిన కాడికి దోచేసిన జగనన్నను, ప్రజలంతా జలగన్న అని పిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇళ్లపట్టాలు కావాలన్న పేదలనుంచి కూడా వైసీపీ అవినీతి జలగలు సొమ్ము వసూలుచేశాయని పట్టాభి తెలిపారు. ఆ విధంగా పేదలనుంచి వసూలుచేసింది దాదాపు రూ.750కోట్లవరకు ఉంద న్నారు. అంతటితోఆగకుండా బ్యాంకుల్లో తనఖాలో ఉన్నభూమిని కూడా అమ్మేసి, దాన్నికూడా సొమ్ముచేసుకోవడం జరిగిందన్నారు.ప్లాట్లకు సేకరించిన భూమిలోని మట్టిని తవ్వేసి అమ్ముకోవడం ద్వారా మరోవిధంగా దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఒకవైపు భూముల్లోని మట్టిని అమ్ముకుంటూ, మరోవైపు అదేభూమిని చదునుచేసేనెపంతో తిరిగి మట్టితోలడంద్వారా దాదాపు రూ.2వేలకోట్ల వరకు వైసీపీ జలగలు కాజేశాయన్నారు.

ఈ విధంగా భూములకొనుగోళ్లు మొదలు చదునుచేయడం, మట్టి అమ్ముకోవడం, పేదలనుంచి స్థలానికి ఇంతని చెప్పివసూలు చేయడం వంటిచర్యలతో అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇవ్వకుండానే జగనన్న ఆయనప్రభుత్వం రూ.6,500కోట్ల వరకు దిగమింగారని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భూములసేకరణ ముసుగులో రూ.4వేలకోట్లు, మెరకచేసే నెపంతో రూ.2వేలకోట్లు, ఇళ్లపట్టాలు ఇప్పిస్తున్నామంటూ రూ.500కోట్ల వరకు వైసీపీప్రభుత్వం నిస్సిగ్గుగా దిగమింగిందన్నారు. ప్రభుత్వం దోచేసిన రూ.6,500కోట్లను సక్రమంగా ఖర్చుచేసుంటే, ఎకరా రూ.30లక్షలచొప్పున కొనగలిగితే, అదనంగా 23,666 ఎకరాలు పేదలకు పంచడానికి వీలయ్యేదన్నారు. ఆ 23,666 ఎకరాల్లో ఎకరంలో రోడ్లు, కాలువలకింద కొంతభూమితీసేసినా, ఎకరాకు 60సెంట్ల చొప్పున లెక్కేసుకున్నా, దాదాపు 13లక్షలమందికి ఇస్తున్న సెంటుభూమికి అదనంగా మరోసెంటు భూమి అందించే అవకాశం ఉండేదని పట్టాభి స్పష్టంచేశారు. ప్రభుత్వ అవినీతివల్ల 13లక్షల పేదకుటుంబాలకు న్యాయంగాదక్కాల్సిన సెంటుభూమిని కోల్పోయారన్నారు. ప్రభుత్వం దోచేసిన రూ.6,500కోట్లతో 13లక్షల పేదకుటుంబాలకు న్యాయంజరిగే అవకాశం ఉండేదని పట్టాభి తేల్చిచెప్పారు. ఊళ్లు, పట్టణాలకు దూరంగా ప్లాట్లను ఇస్తున్నప్రభుత్వం, నిజంగా దోచుకున్న రూ.6,500కోట్లను సక్రమంగా వాడితే, నివాసాలకు దగ్గరగానే ఎకరా రూ.కోటిచొప్పున 6,500ఎకరాలభూమి అదనంగా పేదలకు లభించేదన్నారు. ఆవిధంగా 6,500ఎకరాలవరకు భూమిని పట్టణాల్లో నివసించే 4లక్షల పేదకుటుంబాలకు, పంచడానికి అవకాశముండేదన్నారు. ప్రభుత్వ అవినీతివల్ల4లక్షలపేదకుటుంబాలు తీవ్రంగా నష్టం జరిగింద న్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు 13లక్షలపేద కుటుంబాల పొట్టగొట్టి మరీతమజేబులు నింపుకున్నారనే నిజాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు.

నియోజకవర్గాలవారీగా ఇళ్లపట్టాలపేరుతో, వైసీపీ నేతలు సాగించిన దోపిడీ.. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని తణుకునియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు అవినీతి, అరాచకాలకు కేంద్రంగా మారాడని పట్టాభి తెలిపారు. ప్రతిఒక్కిరిపై నోరేసుకొని పడిపోయే నాగేశ్వరరావు, తణుకుపట్టణంలోని అజ్జారంరోడ్డులో 55ఎకరాలను ఎకరా రూ.కోటి5 లక్షలకు ప్రభుత్వానికి అంటగట్టి, రూ.57కోట్ల75 లక్షలవరకు దండుకోవడం జరిగిందన్నారు. నాగేశ్వరరావు దోపిడీపై వైసీపీకిచెందిన సీతారామ్ అనేవ్యక్తి ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాడన్నారు. సొంతపార్టీవారే వైసీపీఎమ్మెల్యే బాగోతంపై లేఖరాసినా, జగన్మోహన్ రెడ్డి ఎటువంటిచర్యలు తీసుకోలేదన్నారు పెందుర్తి నియోజకవర్గంలో మరీదారుణంగా స్థానికఎమ్మెల్యే అదీప్ రాజు చెరువునే ఆక్రమించేశారని, దానిపై టీడీపీసీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి పెద్దఎత్తున ఉద్యమం చేయడం జరిగిందన్నారు. 8.78ఎకరాల్లో ఉన్న వీర్రాజుచెరువుని అదీప్ రాజు స్వాహాచేశాడన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో సర్వేనంబర్ 167/1లో 3ఎకరాల 48 సెంట్ల భూమిఉంటే, వైసీపీఎమ్మెల్యే జ్యోతులచంటిబాబుకి అదే సర్వేనంబర్లో ఎకరం40సెంట్లుఉంటే, తనదికాని మిగిలిన 2ఎకరాలకు కూడా, ఎకరాకు రూ.24లక్షలచొప్పున, ఎమ్మెల్యేనే ప్రభుత్వం నుంచి పరిహారం పొందడం జరిగిందని పట్టాభి పేర్కొన్నా రు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి భూముల కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై అనేకఫిర్యాదులు కూడా అందాయన్నారు.


కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పార్థసారథి అత్యంత భారీ కుంభకోణానికి పాల్పడ్డాడని, 503ఎకరాలభూమికి సంబంధించి రూ.133కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఎకరా రూ.25, రూ.30లక్షలవిలువచేసే భూమికి రూ.75లక్షలవరకు చెల్లించి, ప్రభుత్వానికి అంటగట్టి, రూ.133కోట్లవరకు కొలుసు పార్థసారథి నొక్కేశాడన్నారు. అటువంటి వ్యక్తి మీడియాముందు మాత్రం తానేదోసచ్ఛీలుడైనట్లు కారుకూతలు కూస్తుంటాడని పట్టాభి మండిపడ్డారు. తెనాలి నియోజకవర్గంలో రూ.180కోట్ల వరకు కాజేశారని, ఈవిధంగా ఒకరితోఒకరు పోటీపడీ మరీ ప్రజలసొమ్ముని కాజేశారన్నారు. తెనాలిలో 1, 2 వార్డుల పరిధిలో 180ఎకరాలను రైతులనుంచి సేకరించి, ఎకరా రూ.35లక్షలవిలు వున్న భూమికి, ఎకరాకు రూ.90లక్షలవరకు చెల్లించారన్నారు. ఆ విధంగా రూ.180కోట్ల కుంభకోణానికి వైసీపీఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ పాల్పడ్డాడన్నారు. మైలవరం నియోజకవర్గంలో అందరూ ముద్దుగా పిలుచుకునే కొండపల్లి వీరప్పన్ అలియాస్ వసంత కృష్ణప్రసాద్ రూ.200కోట్లవరకు కాజేశారని, 130 ఎకరాల ను, ఎకరం రూ.45లక్షలకుకొని, రూ.200కోట్లవరకు ప్రభుత్వ సొమ్ముని అక్రమంగాకాజేశారన్నారు. అంతటితోఆగకుండా సదరు భూములను మెరకచేసేనెపంతో కొండపల్లి ఫారెస్ట్ భూముల్లోని గ్రావెల్ మొత్తాన్ని అక్రమంగా కృష్ణప్రసాద్ అమ్మేసుకున్నాడని పట్టాభి తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడు రూ.5,రూ.6లక్షల విలువకూడా చేయని తనసొంతభూమిని ఎకరా రూ.18లక్షలకుప్రభుత్వానికి అంటగట్టా డన్నారు. ఆ విధంగా తనవంతుగా రూ.18కోట్లను బ్రహ్మనాయు డు మింగేశాడన్నారు.

 

తూర్పుగోదావరి జిల్లాలో పీకల్లోతు నీటిలో నానే ఆవభూములకు ఎకరాకు రూ.60లక్షలవరకు చెల్లించి, దాదాపు రూ.150కోట్లవరకు దోపిడీచేయడం జరిగిందన్నారు. ఆ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులుగా రాజమహేంద్రవరం వైసీపీఎంపీ మార్గానిభరత్, టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి ఉన్నారన్నారు. నెల్లూరులో మరీఘోరంగా దోపిడీచేశారని, జిల్లాకలెక్టర్ శేషగిరిబాబుని కూడా వైసీపీనేతలు బెదిరించడం జరిగిందన్నారు. కావలిలో ఎకరా రూ.12లక్షల విలువచేసేభూమిని ఎకరాకు రూ.55లక్షలవెలకట్టి ప్రభుత్వానికి అంటగట్టాలని చూశారని, దాన్ని కలెక్టర్ అడ్డుకున్నందుకు, రాత్రికిరాత్రి ఆయన్ని బదిలీ చేయించారన్నారు. ఈ విధంగా అన్నిజిల్లాల్లో వైసీపీనేతల అవినీతి చిట్టా పుంఖానుపుంఖాలుగా ఉందన్నారు.

రాయపాటి సాంబశివరావు ఇంట్లో జరిగిన సీబీఐ సోదాలపై చంద్రబాబునాయుడు స్పందించాలంటున్న వైసీపీనేత జోగిరమేశ్, కొన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు హితవుపలికారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "రాయపాటి సాంబశివరావుకి, ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీకి పోలవరం కాంట్రాక్ట్ ను అప్పగించింది చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రభుత్వం కాదని జోగి రమేశ్ తెలుసుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించింది. ఆ కాంట్రాక్ట్ రద్దుచేస్తే పోలవరం పనుల్లో జాప్యం జరుగుతుందని, రీటెండర్ పిలిస్తే, నిర్మాణ వ్యయం పెరుగుతుందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు చెప్పినందున, సదరు టెండర్ ను టీడీపీ ప్రభుత్వం రద్దుచేయలేదు. సబ్ కాంట్రాక్టు లను వివిధ కంపెనీలకుఇచ్చి, సదరు కంపెనీలవారికి ఇబ్బందులు లేకుండా పోలవరం పనులు వేగంగా జరిగేలా చేయడం జరిగింది. దానివల్లే పోలవరం పనులు టీడీపీ హాయాంలో 72శాతం వరకు జరిగాయని రమేశ్ గ్రహించాలి. ఆ ఘనత రాయపాటిదో, ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీదో కాదు...చంద్రబాబుది. జగన్మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి ల అవినీతిపనులు, అక్రమ సంపాదనలో వైసీపీనేతలకు, జోగిరమేశ్ కు వాటా ఉందనేది ఎంత నిజమో, రాయపాటికి, ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీకి అప్పగించిన పనుల్లో చంద్రబాబునాయుడికి వాటా ఉందనేది కూడా అంతేనిజం. తిరుమలస్వామివారి నగలు మాయమయ్యాయని, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడి ఇంట్లో ఉందని గతంలో ప్రచారం చేసిన వైసీపీనేతలు, తరువతా పింక్ డైమండ్ కి సంబంధించిన కేసుని కోర్టుల నుంచి ఎందుకు వెనక్కు తీసుకున్నారో చెప్పాలి. లోకేశ్ కు బినామీ శేఖర్ రెడ్డి అనిచెప్పినవారు నేడు, టీటీడీ బోర్డు మెంబర్ గా అతనికి ఎందుకు అవకాశమిచ్చారు.

రాయపాటి సాంబశివరావు బ్యాంకులనుంచి తీసుకున్న రుణాల్లో ఏవైనా అవకతవకలకు పాల్పడితే, బ్యాంకులే ఆయనపై చర్యలు తీసుకుంటాయి. గతంలో వాకాటి నారాయణరెడ్డిపై ఆరోపణలు వస్తే, వెంటనే ఆయన్ని టీడీపీనుంచి సస్పెండ్ చేశాము. ఇప్పుడు వైసీపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఏంచేసిందో జోగిరమేశ్ చెప్పాలి. వైసీపీఎంపీ హోదాలో రచ్చబండ పేరుతో ముఖ్యమంత్రిని, వైసీపీ వారిని తిడుతున్నది ఎవరో మీకుతెలియదా? టీడీపీనుంచి వైసీపీలో చేరినావారి జాతకాలు చెబితే మీరు తట్టుకోలేరు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. చంద్రబాబునాయుడి ఆస్తులపై ఆయనే సీబీఐ విచారణ కోరాలంటున్న వైసీపీనేతలు ఒక్కపనిచేయగలరా? నిజంగా వారికి దమ్ము, ధైర్యముంటే, జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న అవినీతికేసుల విచారణ 6నెలల్లో పూర్తిచేయమని కోరుతూ ఆయనే సుప్రీంకోర్టుకి లేఖరాసేలా, మీ ముఖ్యమంత్రి తనకు తానే బెయిల్ అవసరం లేదంటూ ఒక అఫిడవిట్ కోర్టులో వేసేలా ఆయనపై ఒత్తిడి తేగలరా? జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ వేయించేందుకు వైసీపీ వారు సిద్ధమైతే తాముకూడా సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమే. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడిపై 26 కేసులు వేస్తే, ఒక్కటంటే ఒక్కటే ఇప్పుడుపెండింగ్ లో ఉంది. 26 కేసులు వేసి, ఒక్కటంటే ఒక్కదానిలో కూడా ప్రాథమికఆధారాలను చూపించలేకపోయారు. మీ ఛాలెంజ్ కి మేముసిద్ధమే.. మా ఛాలెంజ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డితో సుప్రీంకోర్టులో అఫిడ విట్ వేయించగల ధైర్యం మీకుందా?

2018లో గుంటూరు అర్బన్ పరిధిలో వచ్చే పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై కొంత మంది దా-డి చేసారు. ఒక చిన్నారి పై అ-త్యా-చా-రం చేసిన ఘటనలో, ఒక సామాజికవర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అందరూ గుమిగూడి, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దా-డి చేయటం జరిగింది. అయితే అదే రోజు, సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్పీ పై కూడా చెప్పులు విసిరారు. అయితే అదే రోజు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జరిగిన పరిణామాన్ని చాలా తీవ్రంగా తీసుకుని, వారి పై కొంత మంది పై పదులు సంఖ్యలో కేసులు నమోదు చేసారు. కొంత మందిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. అయితే ఆ ఘటనలో వైసీపీ సానుభూతి పరులు కూడా ఉండటంతో, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వైసీపీ పేర్లు వరకే తప్పిస్తే చెడ్డ పేరు వస్తుందని, ఆ కేసు మొత్తాన్ని కూడా ఉపసంహరించుకుంటూ, ఏకంగా జీవోలో ఆ సామాజికవర్గం పేరు రాసి మరీ, వారి పై ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ, రాజకీయం చేసే ప్రయత్నం చేసారు. దీని పై కేసుని ఉపసంహరించుకుంటూ కూడా ప్రభుత్వం, ప్రసిక్యుషన్ నుంచి కూడా తప్పుకున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పై హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది.

hc 23122020 2

దీని పై గతంలో హైకోర్టులో పలు సార్లు విచారణ జరిగింది. విచారణ సందర్భంలో, హైకోర్టు, సిబిఐని, ఎన్ఐఏను కూడా పార్టీగా చేరుస్తూ విచారణ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ప్రకారం, సిబిఐ వేసిన కౌంటర్ అఫిడవిట్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ఎన్ఐఏను కూడా పార్టీగా చేయాలని చెప్పి, హైకోర్టు చెప్పింది. ఈ మొత్తం పై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. ఈ రోజు మొత్తం అన్నీ పరిశీలించిన హైకోర్టు ఈ కేసుకి సంబందించిన తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. అయితే ఈ కేసు పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేదాని పై ఆసక్తి నెలకొంది. ఒక వేళ ఈ కేసు రీఒపెన్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే దాని పైకూడా చర్చ జరుగుతుంది. సిబిఐ, ఎన్ఐఏ ని కూడా పార్టీలను చేసారు కాబట్టి, వారి పాత్ర ఎలా ఉంటుంది, ఒక వేళ కేసు రీఓపెన్ చేస్తే, వారికే ఈ కేసు దర్యాప్తు బాధ్యత అప్పగిస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. అలాగే ఇష్టం వచ్చినట్టు సగంలో ఉన్న కేసులను ప్రభుత్వం అర్ధాంతరంగా మూసేయటం పై కూడా కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

జగన్ పాలనంతా అ-త్యా-చా-రా-లు, హ-త్య-లు, అ-రా-చ-కా-లు, వి-ధ్వం-సా-ల-తో నిందిపోయిందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ-వా-ల-తో శ-వ రాజకీయాలు చేసేలా జగన్ పాలన ఉందని మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 18 నెలల కాలంలో ఒక్కసారైనా మహిళల మీద అ-త్యా-చా-రా-లు జరగలేదన్న వార్త విందామన్న అవకాశం లేదన్నారు. ఇన్ని జరుగుతున్నా నోరు మెదపని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ పేరే చెప్పుకోవాలని తెలిపారు. పులివెందులలో జరిగిన దళిత మహిళ హ-త్య ఘటన మరవకముందే అనంతపురం జిల్లా ధర్మవరంలో దళిత వర్గానికి చెందిన స్నేహలత అనే కాంట్రాక్టు బ్యాంకు ఉద్యోగినిని దారుణంగా చం-పి కా-ల్చేం-దు-కు ప్రయత్నిం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కి-రా-తకు-ల పట్ల ముఖ్యమంత్రి ఎందుకు స్సందించలేదని నిలదీశారు. పశువులను కో-సి-నం-త సులభంగా ఆడబిడ్డల గొం-తు కో-సి కాల్చడం ఈ ప్రభుత్వంలో జరుగుతోందన్నారు. ఎంత మంది తల్లిదంద్రుడుల గర్భ శోకాన్ని చూస్తారని ప్రశ్నించారు. ఆడకూతుర్ల శోక శాపం తగలకముందే జగన్ స్పందించాలన్నారు. సై-కో ముఖ్యమంత్రికి భజన మంత్రులు ఉన్నారని, 151 మంది ఎమ్యెల్యేల ఇంట్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఇలాగే స్పందిస్తారా? అని ప్రశ్నించారు.

anitha 23122020 2

దళితుల మీద ఇంత అక్కసు ఎందుకని, తెలంగాణలో జరిగిన ఘటనపై స్పీడుగా స్పందించి రాష్ట్రంలో జరిగిన వాటికి ఎందుకు స్పందించడంలేదన్నారు. దిశ చట్టం ఏమైంది, చరిత్రలో ఈ విధంగా ఆడపిల్లల మా-న ప్రా-ణా-లు పోవడం ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద ముగ్గురికి ఉరి శి-క్ష హోమంత్రి వేశారా? లేక కోర్టు వేసిందా? అని ప్రశ్నించారు. వాళ్ల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఏం చేస్తోందని, ప్రభుత్వం కూలిపోయే రోజుకోసం ఈనాటి నుండే పోరాడుతామని హెచ్చరించారు.
విశాఖలో దోచుకున్న భూములపై డమ్మీ సీఎం విజయసాయిరెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. విశాఖలో జరిగే కబ్జాలు, అవినీతి, అక్రమాల గురించి వైసీపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘సిట్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు. విశాఖ రాజధాని వంకతో ఖాళీ భూములను ఏరంగా మింగారో అందరికీ తెలుసు. వాళ్తేరు క్లబ్బును, క్రిస్టియానిటీ భూములను దోచుకున్నారు. విశాఖ వైసీపీ ఎమ్మెల్యేలే చెరువులను కూడా వదలడం లేదు. దళితుల భూములను లాక్కుని ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారు. ఎవరెంత భూములు దోచకుని, అవినీతి చేశారో స్థలం, తేదీ చెప్తే చర్చిద్దాం. విజయసాయిరెడ్డి దీనిపై సిద్ధమా? టీడీపీలో అవినీతి చేసే వారు ఎవరూ లేరు. కేసులు కోసం కాళ్లు పట్టుకునే సంస్కృతి మాది కాదు. వైసీపీ బ్యాచ్ వచ్చాక స్థలాలకు బోర్డులు పెట్టుకునే దుస్థితిని వచ్చింది’’ అని అనిత విమర్శల వర్షం కురిపించారు.

Advertisements

Latest Articles

Most Read