టిడిపి జాతీయ అధ్యక్ష్యుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసిపీ సర్కార్ మరో కేసు నమోదు చేసింది. ఈ నెల 6న చంద్రబాబు విలేఖరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క-రో-నా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో భారీగా పాజిటివ్ కేసులతో పాటు, మరణాలు కూడా సంభవీస్తున్నాయి, క-రో-నా కట్టడి విషయంలో వైసీపీ సర్కార్ వైఫల్యం చెందిందని, దీంతో అక్కడ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా సిసిఎంబి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్ లో పుట్టిన, N440K అనే ఒక వైరస్ వేరియంట్, కర్నూల్ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు విస్తరించిందని, ఆ వేరియంట్ ప్రభావంతోనే, ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి, అనేక పత్రికల్లో ఈ వేరియంట్ పై వార్తలు వచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు అంటూ, చంద్రబాబు ఆగహ్రం వ్యక్తం చేసారు. అయితే ఈ అంశం పై కర్నూల్ కు సంబందించిన సుబ్బయ్య అనే ఒక న్యాయవాది, కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో, కేసు నమోదు చేసారు. N440K అనేది అంత ప్రభావం చూపించేది కాదని, మ్యుటేషన్ లో అంత సీరియస్ గా కానీ, ఎక్కువ మరణాలు సంభవించేదిగా లేదని, అయితే చంద్రబాబు మాత్రం, దాన్ని బూచిగా చూపించారని అన్నారు.

cbn 09052021 2

ప్రజల్లో భయం వచ్చేలా చేసారని, కర్నూల్ లో ఉన్న ప్రజలు అంతా, తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారని, కర్నూల్ లో ఏది జరిగిపోతుంది అంటూ, చంద్రబాబు విషం చిమ్మారు అంటూ, కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సుబ్బయ్య అనే అడ్వొకేట్ కేసు నమోదు చేసారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు, సెక్షన్ 105, అదే విధంగా 505 సెక్షన్ల కింద చంద్రబాబుకు నోటీసులు జారీ చేయటానికి, కర్నూల్ పోలీసులు , హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబు నివాసానికి పోలీసులు వచ్చి, నోటీసులు ఇవ్వనున్నారు. నిన్న ఎస్పీ పక్కీరప్ప మాట్లాడుతూ, ఏడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని చెప్తామని అన్నారు. అయితే ఈ విషయం పై తెలుగుదేశం శ్రేణులు మండి పడుతున్నాయి. ప్రభుత్వాన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పటం, ప్రభుత్వ అసమర్ధతను చెప్పి, ప్రభుత్వం పై ఒత్తిడి తేవటం, ప్రతిపక్షాలు చేసే పని అని, ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినా తప్పేనా అంటూ, తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, క-రో-నా విషయంలో ప్రధాని మోడీ వైఖరిని విమర్శిస్తూ ట్వీట్ చేయటం, ఆ వెంటనే బీజేపీ అధికార ప్రతినిధి లాగా, జగన్ మోహన్ రెడ్డికి కోపం వచ్చి, హేమంత్ సోరెన్ ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ, మోడీని వెనకేసుకుని వచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ పై, హేమంత్ సోరెన్ పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటర్ ఇచ్చింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ కు బదులు ఇస్తూ, మీ వ్యవహార శైలి అందరికీ తెలుసు, మీరు క్షేమంగా ఉండాలి అంటూ జార్ఖండ్ ముక్తి మోర్చా, వెటకారంగా జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ కు బదులు ఇవ్వటం జరిగింది. మీ నిస్సహయత గురించి అందరికీ తెలుసు జగన్ రెడ్డి అంటూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లోనే, ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ వాయిదా పడింది అంటూ వచ్చిన వార్త కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా జత పరిచింది. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై మే7 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరగా, జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాదులు తమకు ఇంకా సమయం కావాలి అని కోరటంతో, ఒక వార్తా ప్రచురితం అయ్యింది. ఆ వార్తని జత పరుస్తూ, జగన్ మోహన్ రెడ్డి మీ నిస్సహాయత అందరికీ తెలిసిందే, మీరు క్షేమంగా ఉండండి అంటూ ట్వీట్ చేసారు.

hemanth 08052021 12

అయితే ఈ విషయంలో మాత్రం హేమంత్ సోరెన్ సంస్కారాన్ని మెచ్చుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తనకు సంబంధం లేని విషయంలో తల దూర్చిన జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ కు, హేమంత్ సోరన్ ఘాటుగా బదులు ఇస్తారని, ఇది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తుందని అందరూ ఊహించారు. అయితే హేమంత్ సోరెన్ ఎక్కడా బదులు ఇవ్వకుండా, తన పార్టీ నేతల చేతే బదులు ఇప్పించి, ఇది రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు కాకుండా చూసుకున్నారు. హేమంత్ సోరెన్, తన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని ఆయన బాధలో ఆయన ఉంటే, ఇతర ఏ రాష్ట్రాల్లో, చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు కూడా లేని బాధ, జగన్ మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. ఒక పక్క జగన మోహన్ రెడ్డి వైఖరి పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అసలు జగన్ మోహన్ రెడ్డి, ఈ విషయంలో ఎందుకు స్పందించారో, ఎవరికీ అర్ధం కాలేదు.

క-రో-నా తాకిడికి, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. జీవితాలు తారుమారు అయిపోతున్నాయి. ఈ రోజు బాగా ఉన్న మనిషి, రేపటికి చనిపోతున్నారు. ఆక్సిజన్ బెడ్లు ఎక్కడా దొరకటం లేదు. ఎమర్జెన్సీ పరిస్థితిలో పేషెంట్ ఉంటే, బెడ్ దొరకటం అనేది దాదాపు అసంభవం అయిపొయింది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. బెడ్లు పెంచటం, కొత్త సెంటర్స్ ఏర్పాటు చేయటం, కళ్యాణమండపాలు, కాలేజీలు, కోవిడ్ సెంటర్స్ గా మార్చి, వైద్యులను అందుబాటులో పెట్టి, ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. పాక్షిక లాక్ డౌన్ పెట్టి, చేతులు దులుపు కున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, విమర్శ చేస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేక పోతుంది. జాగ్రత్తగా ఉండండి అని సమాచారం ఇస్తే, చంద్రబాబు లాంటి వారి పై కూడా కేసులు పెడుతున్నారు. ఇంత గందరగోళంలో ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్, టీకా. మిగతా రాష్ట్రాలు పెద్ద ఎత్తున సొంతగా టీకా ఆర్డర్ ఇచ్చాయి. కొన్ని చోట్ల 18 ఏళ్ళు దాటిన వారికి కూడా టీకా అందుబాటులో ఉంది. కేంద్రం కూడా, రాష్ట్రాలను సొంతగా టీకా కొనటానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, కేవలం 13 లక్షల టీకాలు ఆర్డర్ ఇచ్చింది. ఈ వార్త తెలిసి అందరూ ఆశ్చర్య పోయారు. వేస్టేజ్ అంతా లెక్కలో నుంచి తీసి వేస్తే, ఈ ఆర్డర్ కనీసం 5 లక్షల మంది వరుకే సరిపోతుంది. మరి, మిగతా వారికి ? ఇప్పటికే మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకుని, రెండో డోస్ పడక ప్రజలు అల్లాడుతున్నారు.

kodalinani 08082021 1

కేవలం కేంద్రం పంపించే వ్యాక్సిన్ లతో, నెట్టుకుని వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సొంతగా వ్యాక్సిన్ లు కొనటం లేదు, అందరికీ వ్యాక్సిన్ లు ఇవ్వాలని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు కూడా ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా, కేంద్రం అనుమతి ఇవ్వలేదని, నిన్నటి దాకా వైసీపీ నేతలు బుకాయించారు. ఈ రోజు బయటకు వచ్చిన కొడాలి నాని, మేము మీకు 1600 కోట్లు ఇస్తాం, ఎవరి ఎకౌంటు లో వేయాలో చెప్పండి వేస్తాం, మీరు వ్యాక్సిన్ లు తెచ్చి పెట్టండి అంటూ, తెలుగుదేశం నేతలకు కౌంటర్ ఇచ్చారు. మిగతా రాష్ట్రాలు ఎలా తెచ్చుకుంటున్నాయి అనేది చూడకుండా, మీరు తీసుకురండి అని ప్రతిపక్షాలను, ఒక రాష్ట్ర ప్రభుత్వం కోరటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇవన్నీ చూస్తుంటే, మొన్న వైసీపీ ఎంపీలు చెప్పినట్టు, చేతులు ఎత్తేసారా ? ఈ రోజు కొడాలి నాని కూడా అదే చెప్తున్నారా ? ప్రతిపక్షాలు చేస్తే, ఇక ప్రభుత్వం ఎందుకు ? దిగి పోవచ్చు కదా ? ఇప్పటికినా ఇలాంటి ఎదురు దాడి కాకుండా, పక్క రాష్ట్రాలు ఎలా వ్యాక్సిన్ లు తెచ్చుకున్నాయి చూసి, మనం కూడా అదే పని చేస్తే, ప్రజలు హర్షిస్తారు.

ఒక పక్క ప్రజలు క-రో-నా అనే మహమ్మారితో యుద్ధం చేస్తూ, అనునిత్యం బెడ్లు దొరక్క, ట్రీట్మెంట్ సమయానికి అందక, ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట చావు వార్త వినిపిస్తుంటే, ఈ ప్రభుత్వం మాత్రం, కక్ష సాధింపు ధోరణిలో మాత్రం ముందు చూపుతో వెళ్తుంది. ఈ 15 రోజుల కాలంలో, క-రో-నా కోసం ఏమి చేసారో తెలియదు కానీ, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటంలో మాత్రం దూసుకు పోతున్నారు. దేవినేని ఉమా, ధూళిపాళ్ళ నరేంద్ర పై కేసులు పెట్టారు. నరేంద్రని అరెస్ట్ చేస్తే, ఆయన క-రో-నా బారిన పడ్డాడు. ఇక పల్లా శ్రీనివాస్ ఇల్లు కూల్చారు. సంగం డయిరీని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనేక సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటంలో ఉన్న శ్రద్ద, వైద్యం విషయంలో ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితిలో నిన్న చంద్రబాబు పై ఏకంగా క్రిమినల్ కేసు పెట్టారు. అది కూడా నాన్ బెయిలబుల్ కేసు. గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో కొత్త స్ట్రైన్ విస్తరిస్తుంది అంటూ, అనేక టీవీల్లో వార్తా చానల్స్ లో వార్తలు వచ్చాయి. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, ఆ విషయం పై ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసారు. దీని పై జాగ్రత్తగా ఉండాలని, తగు సూచనలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే చంద్రబాబు భయపెడుతున్నారు అంటూ క్రిమినల్ కేసు పెట్టారు.

lokesh 08052021 2

ఒక పక్క ఇలాంటి వాటి పై అరెస్ట్ లు చేయకూడదు అని సుప్రీం కోర్టు చెప్తుంటే, చంద్రబాబు లాంటి నేత పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంటే, ఏమి చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఒక రోజు తిరగక ముందే, ఇప్పుడు నారా లోకేష్ పై కూడా కేసు పెట్టారు. అనంతపురం జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్ లో నారా లోకేశ్‌పై కేసు నమోదు అయ్యింది. టీడీపీ కార్యకర్త మారుతిని గతంలో కొంత మంది వ్యక్తులు కొట్టారు. ఆయన బెంగుళూరు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కొట్టారు. అయితే ఆ అటాక్ అంతా రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి చేపించారని, ఆరోపణలు వచ్చాయి. అదే విషయం పై లోకేష్ లోకేశ్ ట్వీట్ చేసారు. అయితే తమ ఎమ్మెల్యే గౌరవానికి లోకేష్ భంగం కలిగించేలా ప్రవర్తించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్‌లో లోకేశ్‌పై 111/2021 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. సెక్షన్ ఐపీసీ 153(A), 505, 506 సెక్షన్ల కింద కేసు బుక్ అయ్యింది.

Advertisements

Latest Articles

Most Read