పంచాయితీ ఎన్నికలను సత్వరం నిర్వహించడానికి రిజర్వేషన్లకు సంబంధించిన సాంకేతిక అడ్డంకులు ఎదురవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపోలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. దీనితో ఫిబ్రవరి నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ముందు చేయాల్సిన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు సంబం ధిత విభాగాలన్నీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్ని కల సన్నాహకాల్లో ఉండగానే, కేంద్రం కొత్తగా విధించిన నియమావళి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాష్ట్ర విభజన తరువాత రెండోసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్యను, మున్సిపాలిటీలలో వార్డుల సంఖ్యను పెంచడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా డివిజన్లు, వార్డులు పెంపుకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఏలూరు, కాకినాడ వంటి రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లల్లో డివిజన్లను పెంచుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తాజా మార్గదర్శకాలతో... డివిజన్లు, వార్డుల పెంపుతో ఒక వైపు రాజకీయ ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ఔత్సాహిక పోటీదారుల ముందుకాళ్లకు బంధం వేస్తున్నాయి. తాజాగా జరిగే ఎన్నికలను పాత హద్దుల ప్రకారమే నిర్వహించాలని, కొత్తగా వార్డులు, డివిజన్లు ఏర్పాటు చేయడానికి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసినట్లు కొందరు అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పడిన వార్డులు, డివిజన్లతో స్థానికంగా కొందరికి రాజకీయ పునరావాసం కల్పించొచ్చనుకున్న రాజకీయ పార్టీలకు కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ఇబ్బందిగా మారాయి.
అయితే కొత్త మార్గదర్శకాలకుల సంఖ్య పెంపుపై అధికారికంగా ఆదేశాలు అందలేదని కొందరు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. తమకు స్పష్టమైన కేంద్ర మార్గదర్శకాలు అందిన తరువాత ఎలా ముందుకెళ్లాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని వారు పేర్కొంటున్నారు. ఎన్నికల సంఘం సమావేశం.. మున్సిపోల్ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమ సన్నద్ధతను ఎన్నికల సంఘానికి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. దీనితో ఈ నెల 7వ తేది అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లతో కాకుండా పాత పద్ధతిలోనే బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది