రాష్ట్రంలో మార్చ్ 10వ తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అమాల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, వైసీపీ, వివధ సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేస్తూ వచ్చాయి. వైసీపీ ఫిర్యాదు చేస్తే మాత్రం, గంటల్లోనే ఈసీ స్పందించిన తీరు, ఏకంగా చీఫ్ సెక్రటరీని మార్చేసిన తీరు చూసాం. అయితే తెలుగుదేశం ఫిర్యాదుల పై మాత్రం, ఒక్కటంటే ఒక్కటి కూడా ఈసీ పరిగణలోకి తీసుకులేదు. చరిత్రలో లేని విధంగా, ఒక ముఖ్యమంత్రి ఈసీ దగ్గరకు వెళ్లి చెప్పినా, స్వయానా లెటర్ లు రాసినా, ప్రజలకు ఇబ్బంది అవుతుంది కోడ్ సడలించమని చెప్పినా, ఎలక్షన్ కమిషన్ కనీసం పట్టించులేదు. అయితే, తెలుగుదేశం ఎన్ని ఫిర్యాదులు, ఎలక్షన్ కమిషన్ కు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబు చెప్పిన సంగతి.

game 27032019

నిన్న చంద్రబాబు మాట్లాడుతూ, తాము 110 ఫిర్యాదులు చేస్తే ఒక్కదానిపైనా స్పందించలేదని విమర్శించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు చేస్తున్నారని... ఏపీలో మాత్రం చేయడానికి వీల్లేదంటున్నారని తెలిపారు. తాను ప్రధాని రేసులో లేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని పదవికి రాహుల్‌కంటే చంద్రబాబము బెటర్‌ అని ఇటీవల శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించినప్పుడు ఆయన ఈ మాట అన్నారు. ఈ విషయంలో తాను మొదటి నుంచి ఒకటే వైఖరితో ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల తర్వాత అందరం కలిసి కూర్చుని ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల కోసం పని చేసేందుకు కూడా ముఖ్యమంత్రులు ఎన్నికల కమిషన్‌ను అడుక్కోవాలా అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో సమీక్షలకు అవకాశమివ్వాలని ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఢిల్లీకి వెళ్లి, ఈసీని కోరాల్సి వచ్చిందని తెలిపారు.

game 27032019

మోదీ దేశాన్ని బాగు చేయడంకంటే... చెడగొట్టిందే ఎక్కువని చంద్రబాబు విమర్శించారు. ‘యూపీ ఎన్నికల కోసం పెద్ద నోట్లను రద్దు చేశారు. రూ.వెయ్యి నోటు రద్దు చేసి కొత్తగా రూ. రెండు వేల నోటు తెచ్చారు. వద్దన్నా వినలేదు. దీనివల్ల ఎన్నికల్లో విపరీతమైన వ్యయం పెరిగింది’’ అని తెలిపారు. ఈ దేశంలో మోదీకి ఒక రాజ్యాంగం... ఇతరులకు మరో రాజ్యాంగం అమలవుతున్నట్లుగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీయేతర రాష్ట్రాలకు మాత్రం అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ప్రధాని ఏం మాట్లాడినా దానికి ఎన్నికల కోడ్‌ వర్తించదు. మేం మాట్లాడటానికి మాత్రం కోడ్‌ అడ్డం వస్తుంది. తుఫాన్లు వస్తే అధికారులకు ఆయన ఆదేశాలు ఇస్తారు. మేం మాత్రం కనీసం సమీక్షలు కూడా చేయకూడదు. ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా ఈసీ పట్టించుకోదు. బెంగాల్‌లో నలభై మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపుల్లో ఉన్నామని బహిరంగంగా చెప్పినా ఈసీ స్పందించలేదు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి తనకు ప్రాణ హాని ఉందని, వెంటనే తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి వెళ్లారని పేర్కొన్న ఆయన అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఉందని తెలిపారు. తనకు ‘సన్మానం’ చేసేందుకు ఇంటికి వస్తానని వంశీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. వారం రోజులుగా ఆయన బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్న యార్లగడ్డ తనకు వెంటనే గన్‌మెన్‌ను కేటాయించాలని కోరారు. కావాలంటే సీసీ టీవీఫుటేజ్‌ చూడాలని కోరారు. తనకు గన్‌మెన్లు కేటాయించాలని యార్లగడ్డ వెంకట్రావు సీపీని కోరారు.

game 27032019

ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన రోజు కూడా యార్లగడ్డ, వంశీ పై గొడవకు దిగారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ప్రసాదంపాడు బోర్డింగ్‌ పాఠశాలలోని 47వ నెంబరు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతరం పలు దఫాలుగా ఈవీఎం మొరాయిస్తుండటం, ఒక అభ్యర్థికి ఓటేస్తే వేరొకరికి ఓటు పడుతున్న విషయంపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవీఎంకు మరమ్మతులు చేపట్టిన అధికారులు సాయంత్రం 6 గంటల అనంతరం కూడా పోలింగ్‌ను కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమయానికి 350 మంది ఓటు వేసేందుకు వరుసలో ఉన్నారు. వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రం చిన్నది కావడంతో.. 100 మంది వరకూ మాత్రమే లోపల ఉన్నారు. మిగిలిన వారు కేంద్రం బయట వేచి ఉన్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పటమట సీఐ.. బయట ఉన్నవారంతా వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈవీఎం మొరాయించడంవల్ల తాము ఉన్నామని ఓటర్లు పోలీసుల వైఖరిపై ఎదురుతిరిగారు.

 

game 27032019

అదే సమయంలో అక్కడకు చేరుకున్న గన్నవరం వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నిర్ణీత సమయం ముగియడంతో ఓట్లు వేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. స్థానిక నాయకుల సమాచారంతో గన్నవరం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఈవీఎంలో లోపాల వల్ల నెలకొన్న జాప్యానికి అందరికీ అవకాశం ఇవ్వాలంటూ పట్టుపట్టారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత నేపథ్యంలో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత కొద్దిసేపటికి వంశీ వెళ్లిపోయారు. అనంతరం వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు, ఆ పార్టీ నాయకుడు యలమంచిలి రవి, వైకాపా కార్యకర్తలు మాత్రం ఆందోళనను విరమించలేదు. పోలీసులు సర్దిచెప్పడంతో వారు కూడా వెళ్లిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వంశీని రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

 

ఈసీ తీరుపై మరోసారి సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల కోడ్ సడలించాలని ఈసీకి లేఖ రాస్తే ఇంత వరకు స్పందన లేదన్నారు. విపత్తులు ఎదురైనప్పుడు అత్యవసర సందర్భాల్లోనైనా వారు స్పందించాలని కోరారు. వ్యవస్థల మధ్య ఘర్షణ వైఖరి రాకూడదన్న ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నానని తెలిపారు. ఈసీ ఇప్పటికే మితిమీరిన జోక్యం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. అధికారులు ఒక బృందంగా ఉంటూ సమర్ధంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. కానీ అధికారుల్లో చీలిక తేవాలని విపక్షం పన్నాగం పన్నుతోందని విమర్శించారు. దానికి తాను కారణం కాకూడదనే అన్నీ సహిస్తున్నానని చెప్పారు. అధికారులు ఎవరికి జవాబుదారీగా ఉండాలి.. ఎవరి పర్యవేక్షణలో ఉండాలి?, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికా? లేక ఎన్నికల సంఘానికా? అని అడిగారు.

cbnangry 02052019

తుఫాన్ సహాయక చర్యల కోసం కొత్తగా జీవోలు అక్కర్లేదన్నారు. మళ్లీ వాటికోసం ఈసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని పేర్కొన్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో జారీ చేసిన ఆదేశాలనే ఇప్పుడు అనుసరించవచ్చని స్పష్టంచేశారు. అవసరమైతే తానే క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వస్తానని వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో పసిపిల్లలకు పాలు అందుబాటులో ఉంచాలన్నారు. టెట్రా పాల ప్యాకెట్లను సరఫరా చేయాలని సూచించారు. తుఫాన్‌ ప్రాంతాలకు అవసరమైన మేర పశు దాణా తరలించాలన్నారు. క్రేన్లు, విద్యుత్‌, టెలిఫోన్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.

 

cbnangry 02052019

బంగాళాగాతంలో అతితీవ్ర తుపానుగా మారిన ‘ఫొనీ’ ప్రభావంపై ఆర్టీజీఎస్‌ ద్వారా అనుక్షణం సమీక్షిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళంలో గంట‌కు 130 నుంచి 150 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలని, సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలని సూచించారు. ప్ర‌స్తుతం విశాఖపట్నం నుంచి తూర్పు ఆగ్నేయం దిశ‌గా 200 కిలో మీటర్ల దూరంలో కేంద్రీ కృతమైన ‘ఫొనీ’ గంట‌కు 19 కి.మీ వేగంతో ప‌య‌నిస్తోందని, ఈరోజు, రేపు ఈ ‘రెడ్ అలర్ట్’ కొన‌సాగుతుందని అన్నారు. విజయనగరం తీర ప్రాంత మండలాల్లో గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ఒడిశాలోని పూరీ వ‌ద్ద ‘ఫొనీ’ తుపాను తీరం దాటనుందని, దీని వల్ల ఈ రోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని, దీనిపై ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని ఆర్టీజీఎస్ ద్వారా అప్రమత్తం చేసిన్టు తెలిపారు.

ఏపీలో ఈనెల 6వ తేదీన ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహిస్తామని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. గుంగూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని కేసనపల్లిలోని 94వ నెంబర్ పోలింగ్‌ బూత్, పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ పోలింగ్‌ బూత్, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్‌ బూత్, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ పోలింగ్‌ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధి కలనూతలలోని 247వ పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

dwivedi 02052019

రీపోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగానే పరిగణిస్తామని ద్వివేది స్పష్టం చేశారు. అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సిద్ధంగా ఉంచుతామన్నారు. బెల్‌ కంపెనీ ఇంజినీర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సీసీకెమెరాల ద్వారా పోలింగ్‌ సరళిని పర్యవేక్షిస్తామని ద్వివేది తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈవీఎంలు మొరాయించడం, పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడం, ఘర్షణలు తలెత్తడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బూత్ స్థాయిల్లో పరిస్థితులను పరిశీలించి అధికారుల నివేదిక మేరకు ఈ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ జరిపాలని ఈసీ నిర్ణయించింది.

 

dwivedi 02052019

ఈ నెల 6వ తేదీన ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ కు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో, ఇక్కడున్న ఓటర్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని, మెజారిటీ స్వల్పంగానే ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో, ఈ పోలింగ్ బూత్ లలో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లను సంపాదించుకోవాలని అటు తెలుగుదేశం, ఇటు వైసీపీలు వ్యూహాలను రచిస్తున్నాయి. నర్సరావుపేట నుంచి టీడీపీ తరఫున డాక్టర్‌ అరవిందబాబు, వైఎస్సార్సీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తుండగా, గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ తరపున మద్దాల గిరి, వైఎస్సార్సీపీ నుంచి చంద్రగిరి ఏసురత్నం బరిలో ఉన్నారు. కోవూరు నుంచి తెలుగుదేశం తరఫున పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వైసీపీ తరఫున నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, సూళ్లూరుపేటలో టీడీపీ తరఫున పరసా వెంకటరత్నం, వైసీపీ తరఫున కిలివేటి సంజీవయ్య, యర్రగొండపాలెం (ఎస్టీ) నుంచి టీడీపీ తరఫున బుదల అజితారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ బరిలోకి దిగారు.

Advertisements

Latest Articles

Most Read