చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో రీపోలింగ్ కు ఈసీ ప్రకటన చేయడం తెలిసిందే. ఈ ఐదు ప్రాంతాలు టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో అక్కడ వైసీపీ నేతల ప్రవేశానికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రీపోలింగ్ జరిగే వెంకటరామాపురం గ్రామానికి వెళ్లి ప్రచారం చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఊళ్లోకి అడుగుపెట్టేందుకు వీల్లేదని గ్రామస్థులు తెగేసి చెప్పడంతో చెవిరెడ్డి ఎంతో అవమానంగా ఫీలవడమే కాదు, తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు.

chevireddy 17052019

తిరుపతికి వస్తారుగా, అక్కడ చూసుకుంటా మీ సంగతి అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఓ దశలో మహిళలు సైతం చెవిరెడ్డి ప్రచారానికి అడ్డుతగిలారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించడంతో చెవిరెడ్డిపై భౌతికదాడులు జరగలేదు. గతరాత్రి, ఈ ఉదయం ఎన్ఆర్ కమ్మపల్లెలోనూ చెవిరెడ్డికి ఇదే తరహా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ప్రశాంతంగా పోలింగ్ జరిగిన తమ గ్రామాల్లో రీపోలింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ సదరు గ్రామాల ప్రజలు నిలదీస్తున్నారు. చెవిరెడ్డి ఫిర్యాదు మేరకే ఈసీ రీపోలింగ్ కు ప్రకటన చేసిందన్న వార్తల నేపథ్యంలో వారు ఆయనపై కారాలుమిరియాలు నూరుతున్నారు.

chevireddy 17052019

ఇక, రామచంద్ర పురం మండలం ఎన్ ఆర్ కమ్మపల్లిలో ఉద్రిక్తత పరిస్తితి తలెత్తింది. గ్రామంలోకి వెళ్ళిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రానీయబోమంటూ.. చీపుర్లు, చాటలు పట్టుకుని చెవిరెడ్డి కుమారునిపై గ్రామ మహిళలు దాడికి ప్రయత్నించారు. దీంతో కమ్మపల్లి గ్రామంలోకి వెళ్లకుండా అక్కడే బైఠాయించారు భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి. వైసీపీ నాయకులతో కలసి రోడ్డుపైనే బైఠాయించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వెంటనే కమ్మపల్లికి చేరుకున్నారు. అసలే, రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎస్పీ అన్బురాజన్ అక్కడకు చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు.

చిత్తూరు జిల్లాలోనే అది అత్యంత సున్నితమైన నియోజకవర్గం.. రాష్ట్రంలో రీపోలింగ్‌ పూర్తయినా 5 బూత్‌లలో మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రాంతం... అదే చంద్రగిరి నియోజకవర్గం. ఇక్కడ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన అనుచరుల కోసం ఓ యాత్ర చేపట్టారు. తన నియోజకవర్గ కేంద్రం చంద్రగిరి నుంచి షిర్డీకి ప్రత్యేక రైలును బుక్‌ చేయించారు. అందులో మందు, విందులాంటి సకల సౌకర్యాలూ కల్పించారు. దీంతో ఆ రైలులో ఆయన అనుచరులు చేసిన హంగామా, విచ్చలవిడిగా మద్యం సేవించి, పేకాట ఆడుతూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 23 బోగీలతో ఉన్న ప్రత్యేక రైలు గురువారం ఉదయం 10.30కు తిరుపతి, రేణిగుంట మీదుగా షిర్డీకి బయలుదేరింది.

game 27032019

చెవిరెడ్డి ఆ రైలులో సకల సౌకర్యాలు కల్పించారు. దిగగానే వసతికి అన్నీ ఏర్పాట్లు చేశారు. మద్యం, ఇతర సదుపాయాలన్నీ రైలులోనే అందేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బోగీ ఏర్పాటు చేశారు. రైలు ఎక్కిన దగ్గర్నుంచి, మళ్లీ తిరిగి వచ్చే వరకు ఖర్చులన్నీ చెవిరెడ్డివే. చంద్రగిరి రైల్వేస్టేషన్లో రైలు ఎక్కిన వారికి గురువారం ఉదయం స్టేషన్‌ బయటే అల్పాహారం, నీరు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన రైలు రేణిగుంటలో సుమారు అరగంటసేపు ఆగింది. వైకాపా నాయకులు, కార్యకర్తలు పరుగున స్టేషన్‌ బయటకు వెళ్లి మద్యం తెచ్చుకున్నారు. ఒకేసారి పదుల సంఖ్యలో కార్యకర్తలు స్టేషన్‌ బయటకు, లోపలికి పరుగులు పెట్టడంతో చుట్టుపక్కలవారు ఆందోళన చెందారు.

game 27032019

కొందరు రైలులో, మరికొందరు ప్లాట్‌ఫాంపైనే విచ్చలవిడిగా తాగడంతో ఇతర ప్రయాణికులు నివ్వెరపోయారు. జీఆర్పీ పోలీసులు సైతం వారిని కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. పేకాట కూడా జోరుగా సాగింది. ప్రతి బోగీలోనూ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు సాగాయి. బెట్టింగులు కూడా భారీ ఎత్తున సాగాయి. అందరితో పాటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సైతం షిర్డీకి వెళ్లాల్సి ఉంది. చివరి నిమిషంలో విరమించుకున్నారు. తిరుపతి అర్బన్‌, రూరల్‌, చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాలెం మండలాల్లో సర్పంచిలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, బూత్‌ కన్వీనర్‌, మండల కన్వీనర్లు యాత్రలో పాల్గొన్నారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటి వచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు మిత్ర పక్షాలను వెతుక్కునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సోనియా గాంధీ కూటమిలోకి చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఈ నెల 23న ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల నేతలను ఢిల్లీకి పిలిచారంటూ వస్తోన్న వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తమ అధినేత్రి ఏ నేతకూ లేఖ రాయలేదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు.

game 27032019

వైసీపీ, టీఆర్ఎస్ నేతలకు సోనియా లేఖలు రాశారంటూ వస్తున్నవన్నీ ఊహాగానాలే అని ఆయన కొట్టిపారేశారు. ఈ నెల 23న జరిగే కీలక సమావేశం తర్వాతే ఎవరెవరితో కలవాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నెల 23న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల అనంతరం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో ఎన్డీయేయేతర పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేలా కాంగ్రెస్ తన ప్రయత్నాలను ప్రారంభించిందన్న సంకేతాన్ని ఇచ్చేందుకే సోనియాగాంధీ 23న ఈ సమావేశం పెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు. ఫలితాల అనంతరం భావ సారూప్యతగల పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసేందుకు పార్టీ సీనియర్ నేతలు పీ చిదంబరం, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌తో కాంగ్రెస్ పార్టీ ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది.

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ప్ర‌జా ద‌ర్బార్ రెండు రోజుల పాటు నిర్వ‌హించారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డ‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్ర‌ధానార్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు అక్క‌డ‌కు వ‌చ్చారు. జ‌గ‌న్‌కు ఆశీస్సులు అందించారు. అయితే, ర‌మ‌ణ దీక్షితులు పులివెందుల వ‌చ్చి మ‌రీ జ‌గ‌న్‌ను క‌ల‌వటం..ఆయ‌న‌తో స‌మావేశం అవ్వటం వెనుక అస‌లు విష‌యం ఏంట‌నే ఆస‌క్తి మొద‌లైంది. పులివెందుల‌కు ర‌మ‌ణ దీక్షితులు.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు పులివెందుల వ‌చ్చారు. ఆయ‌న వైసీపీ అధినేత‌ను క‌ల‌వటం కోస‌మే అక్క‌డ‌కు చేరుకున్నారు. ప్ర‌జా ద‌ర్బార్‌లో పార్టీ నేత‌ల‌తో స‌మావేవ‌మైన స‌మ‌యంలో వ‌చ్చిన ఆయ‌న‌కు జ‌గ‌న్ స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న జ‌గ‌న్‌కు దీక్షితులు ఆశీస్సులు అందించారు. మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి.

game 27032019

జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో కొద్ది రోజులుగా టీడీపీ ప్ర‌భుత్వానికి..ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా అనేక కామెంట్లు చేసిన ర‌మ‌ణ దీక్షితులు పులివెందుల‌కు వ‌చ్చి మ‌రీ జ‌గ‌న్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ర‌మ‌ణ దీక్షితుల‌ను ఆయ‌న ప‌ద‌వి నుండి టీటీడీ త‌ప్పించింది. అప్ప‌టి నుండి టీటీడీలో అనేక అంశాలు..ప్ర‌భుత్వ నిర్ణ‌యాల పైనా ర‌మ‌ణ దీక్షితులు బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు చేసారు. ఇక‌, ఇప్పుడు ఫ‌లితాల ముందు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌టం మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Advertisements

Latest Articles

Most Read