ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో బుధవారం పాల్గొ్న్న ఆయన.. పలువురు కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాపాడుకోవడంతో పాటు ఆధునికీకరించాల్సి ఉందన్నారు. కార్మికుల కష్ట ఫలితమే రాష్ట్ర సంపద అని అన్నారు. కార్మికులకు ఎల్లప్పుడూ తెదేపా అండగా ఉంటోందని చంద్రబాబు చెప్పారు. కార్మికులను దోపిడీ చేస్తే ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. చంద్రన్న బీమా ద్వారా కార్మికులకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నామని, త్వరలోనే ఈ మొత్తాన్ని రూ.10లక్షలకు పెంచుతామన్నారు.

mayday 01052019

డ్రైవర్ల సాధికార సంస్థను ఏర్పాటు చేసి ఆదుకుంటున్నామని గుర్తుచేశారు. అసంఘటిత కార్మికుల కోసం ఉచితంగా సొంతింటి నిర్మాణం చేపడతామని, ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. సంపద సృష్టించడంలోనూ, సంపదను పేదలకు వినియోగించడంలోనూ ముందుంటామని చెప్పారు. తాము తీసుకొచ్చిన చంద్రన్న బీమా పథకం విప్లవాత్మకమైనదని, రాష్ట్రంలో 2.57 కోట్లమందికి వర్తింపజేశామని చంద్రబాబు చెప్పారు. వీరిలో 7.77లక్షల మంది రైతుకూలీలేనన్నారు. ఈ ఏడాది 48,541దరఖాస్తులు అప్ లోడ్ చేయగా 45,416 సెటిల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దురదృష్ట వశాత్తు గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన కార్మిక, శ్రామిక కుటుంబాలవారికి చంద్రన్న బీమా పథకం వల్ల రూ.671 కోట్ల లబ్ది చేకూరిందని ముఖ్యమంత్రి తెలిపారు. గత నాలుగేళ్లలో 2.04 కోట్ల దరఖాస్తులు అప్ లోడ్ చేయగా,1.94 కోట్ల దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు. (95%). చంద్రన్న బీమా వల్ల నాలుగేళ్లలో రూ.2,348కోట్ల ప్రయోజనం కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

mayday 01052019

రూ. 10కోట్లతో డ్రైవర్ల సాధికార సంస్థ నెలకొల్పుతున్నామని, ట్రాక్టర్లపై జీవిత కాల పన్ను తొలగింపు-అంగన్ వాడి, ఆశా వర్కర్లు,హోంగార్డులు,చిరుద్యోగుల వేతనాల పెంపు లాంటి నిర్ణయాలు కార్మిక సంక్షేమానికి ఉద్దేశించినవేనన్నారు. యువత ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు రాబట్టిన అంశాన్ని వివరిస్తూ గత ఐదేళ్లలో 3 పారిశ్రామిక సదస్సులు నిర్వహించామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మన రాష్ట్రానికి వరుసగా అగ్రస్థానం లభించడం తమ ప్రభుత్వ కృషేనని, ఉద్యోగులు, అధికారులు అందరూ కష్టపడటంతో రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. కియా మోటార్స్, ఇసుజి, హీరో లాంటి ఆటోమొబైల్ పరిశ్రమలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ను దేశ పారిశ్రామికాభివృద్ధిలో ధీటుగా నిలబెట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములైన కార్మిక వర్గ సంక్షేమానికి తమప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

కేంద్రంతో విభేదించిన త‌రువాత, ఢిల్లీ నుంచి మోడీ కావాలని చేస్తున్న సిబిఐ దాడుల పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం దుర్వినియోగం చేస్తుంద‌ని ఆరోపించింది. దీంతో..ఏపిలో సీబీఐకి జ‌న‌ర‌ల్ క‌న్సెంట్‌ను ర‌ద్దు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పోలీసులు..సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ అనుమ‌తి తీసుకోకుండా సీబీఐ దాడి చేయ‌టానికి అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేస్తూ ఏపి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం కోర‌టం..లేదా కోర్టు ఆదేశాల మేర‌కు మాత్ర‌మే సీబీఐ ఏపిలో దాడులు..సోదాలు నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టంగా పేర్కొంది. దీని పైన రాజ‌కీయంగా అనేక విమ‌ర్శ‌లు వచ్చినా ఏపి ప్ర‌భుత్వం మాత్రం త‌మ వాద‌న‌కే క‌ట్టుబ‌డి ఉంది.

game 27032019

అయితే తాజగా, సీబీఐ వ‌ర్సెస్ ఏపి ప్ర‌భుత్వం అన్న‌ట్లుగా మారిన వ్య‌వ‌హారం ఇప్పుడు రాజీ మార్గంలో స‌మిసిపోయింది. ఏపిలో సీబీఐ అధికారిని ట్రాప్ చేసి సీబీఐ ప‌ట్టుకుంది. అయితే, గ‌తంలో తాము తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు న‌డుచుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో..తాము న‌మోదు చేసిన కేసును ఏసీబీకి అప్ప‌గించింది. ఆదాయపన్ను మదింపు విషయంలో వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన గుంటూరు జిల్లా తెనాలి-1 ఐటీ అధికారి అవుతు చంద్రశేఖర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన్ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అరెస్టు సందర్భంగా తెనాలిలోని ఐటీ కార్యాలయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే. తొలుత సీబీఐ అధికారులు చంద్రశేఖరరెడ్డిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

game 27032019

అయితే ఏపీలో మారిన నిబంధనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఏసీబీకే దాడులు చేసే అధికారం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖరరెడ్డిని అరెస్టు చేస్తే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించిన సీబీఐ ఆయన్ని ఏసీబీకి అప్పగించారు. ఈ మేరకు గుంటూరులో ఏసీబీ అదనపు ఎస్పీ మంగళవారం కేసు నమోదు చేశారు. ఆపై ఏసీబీ డీఎస్పీ గంగాధరం నిందితుడిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ ఎల్‌ఐసీ కాలనీలోని ఐటీ అధికారి ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో చంద్రశేఖర్‌రెడ్డి సీబీఐ అధికారులపై తిరగబడి కత్తెరతో పొడుచుకున్నారు. ఆ త‌రువాత ఏపి అధికారులు సీబీఐ అధికారుల దృష్టికి గ‌తంలో తాము తీసుకున్న నిర్ణ‌యం.. జారీ చేసిన ఉత్త‌ర్వులు సంగ‌తి పైన చ‌ర్చించారు. దీని పైన కొంత ప్ర‌తిష్ఠంబ‌న ఏర్ప‌డింది. ఉన్న‌తాధికారుల జోక్యంతో సీబీఐ అధికారులు స్థానికంగా ఉన్న నిబంధ‌న‌ల మేర‌కు లోక‌స్ ఏసీబీ అధికారుల‌కు కేసును బ‌దిలీ చేసారు.

అప్రజాస్వామిక ప్రకటనలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ఎన్నికల సంఘానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ లేఖ రాసింది. సోమవారం పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపుర్‌లో జరిగిన ఎన్నికల ప్రసంగ సభలో ప్రసంగించిన మోదీ తృణమూల్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ చెప్పారు. ఇలా చెప్పడం ఎమ్మెల్యేల కొనుగోలు చేసే ప్రయత్నం కిందికే వస్తుందని; ఇది రెచ్చగొట్టే ప్రకటనే కాకుండా అప్రజాస్వామికమని పేర్కొంది. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఇలాంటి ప్రకటన చేశారని, ఇది చట్టవ్యతిరేకమని తెలిపింది. తృణమూల్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనడానికి ఆధారాలు చూపించాలంటూ ప్రధానిని అడగాలని, లేకుంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని ఈసీని కోరింది.

game 27032019

ప్రధాని స్థాయి వ్యక్తికి ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వడం తగదని తెలిపింది. అధికారంలో ఉన్న భాజపా మార్గదర్శకాలను పాటించడం లేదని ఆరోపించింది. తొలుత పుల్వామా అమరవీరులు, ఆ తరువాత మతం ఆధారంగా ఓట్లు అడిందని, ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని పేర్కొంది. హుగ్లీ జిల్లాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ నిస్సిగ్గుగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీకి ప్రధాని పదవిలో కొనసాగే హక్కు ఎంతమాత్రం లేదని అన్నారు. ఆయన నామినేషన్‌ను రద్దు చేసి, పోటీకి అనర్హునిగా ప్రకటించాలని డిమాండు చేశారు. జాతీయ నాయకులైన సుభాష్‌ చంద్రబోస్‌ వంటివారిని అందరూ ప్రేమిస్తారని, కానీ మోదీ, గబ్బర్‌సింగ్‌ వంటివారిని చూస్తే భయపడుతారని చెప్పారు. ఆయన ఎంతగా పగటికలలు కంటున్నా బెంగాల్‌లో విజయం సాధించలేరని అన్నారు.

game 27032019

మంచిరోజులు వచ్చాయంటూ ప్రచారమే తప్ప గత అయిదేళ్లుగా చేసిందేమీ లేదని విమర్శించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లోని 50వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. 'దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా తీసుకెళ్లండి' అండి మోదికి సవాల్ విసిరారు. 'మీలాగా ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే సంస్కృతి మాకు లేదు' అని ఎద్దేవా చేశారు. 'బేరసారాలకు' పాల్పడుతున్న మోదీ లోక్‌సభ నామినేషన్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను తమ పార్టీ ఫిర్యాదు చేసిందన్నారు. మోదీ వ్యాఖ్యలు రాజ్యాంగవిరుద్ధమని, అక్రమమని విమర్శించారు. 'మీకు సిగ్గుగా లేదా? మిమ్మల్ని మీరు రాజ్యాంగ పరిరక్షకుడిగా అభివర్ణించుకుంటున్నారు. గౌరవప్రదమైన రాజ్యాంగ పదవిలో ఉండి కూడా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. మీరు ప్రధానిగా, మాజీ ప్రధానిగా ఉండే హక్కు కోల్పోయారు' అంటూ మమతా బెనర్జీ ప్రధానిపై విరుచుకుపడ్డారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) జారీ చేసిన ఉత్తర్వులు ఇంకా అమలులోనే ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో ద్వివేది చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదల విషయంలో సీఈసీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని హోంశాఖ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. ఆ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు అనుమతులు మంజూరు చేయవద్దని స్పష్టం చేశామన్నారు. రాజకీయంగా ప్రభావం చూపే బయోపిక్‌లపై దేశ వ్యాప్తంగా నిషేధం విధిస్తూ ఏప్రిల్‌ 10వ తేదీన సీఈసీ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. మే 1న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలకు అనుమతి ఇవ్వాలని ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏప్రిల్‌ 25వ తేదీన తనకు లేఖ రాశారన్నారు.

game 27032019

అయితే, దేశవ్యాప్తంగా బయోపిక్‌లపై నిషేధం విధిస్తూ సీఈసీ జారీ చేసిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని రాంగోపాల్‌ వర్మకు లేఖ ద్వారా సమాధానం ఇచ్చామని ద్వివేది తెలిపారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తోపాటు మరో రెండు సినిమాలపై కూడా ఈసీ నిషేధ ఉత్తర్వులు జారీ చేసిందనారు. ఈ సినిమాపై సీఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏప్రిల్‌ 10న జారీ చేసిన ఉత్తర్వులే అమలులో ఉంటాయన్నారు. ఆ సినిమా విడుదలపై సీఈసీ నుంచి తనకు తదుపరి ఉత్తర్వులు ఏమీ అందలేదన్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎలాంటి తాజా ఉత్తర్వులు తమకు అందలేదని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్ప‌ష్టం చేసారు.

 

game 27032019

గతంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపించామని తెలిపారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలను ఆపుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మే 27 వ తేది వరకు ఉంటాయన్నారు ద్వివేదీ. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ రిలీజ్ లేనట్టే. ఇదే స‌మ‌యంలో సినిమా నిర్మాత‌..ద‌ర్శ‌కులు మాత్రం సీఈవో లేఖ పైన ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కొద్ది రోజులుగా వివాదాస్ప‌దంగా మారిన ఈ వ్య‌వ‌హారం పైన ఆర్జీవి విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌టం..పోలీసులు అడ్డుకోవ‌టం..జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేయ‌టం తో దీనికి పొలిటిక‌ల్ క‌ల‌ర్ అంటుకుంది. తాజాగా, టిడిపి మ‌హిళా నేత‌లు దివ్య‌వాణి, యామినీ శ‌ర్మ ఇద్ద‌రూ ఆర్జీవీని లక్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేసారు.

Advertisements

Latest Articles

Most Read