కొద్ది రోజుల క్రిందట పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి టిటిడికి సంబందించిన బంగారం తరలింపు వ్యవహారం రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే. ప్రతి సందర్భంలో తిరుమలను రాజకీయాల్లోకి లాగే వైసీపీ, బీజేపీ, ఈ విషయం పై కూడా రాజకీయం చేసారు. అయితే, ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన ఎన్నికల సంఘమే, ఎంక్వైరీ చేసి, దీంట్లో వివాదం ఏమి లేదు, అంతా సక్రమమే అని సర్టిఫికేట్ ఇచ్చింది. బంగారం తరలింపు వ్యవహారంలో టీటీడీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి ఎన్నికల కమిషన్ క్లీన్‌చిట్ ఇచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యానే బంగారాన్ని సీజ్ చేశామని తిరువళ్లూరు కలెక్టర్ స్పష్టం చేశారు. తమిళనాడులో ఎన్నికల ముందు రోజు కావడంతో అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సరే బంగారాన్ని సీజ్ చేశామని తెలిపారు.

ttd 28042019

సుమారు 400 కోట్ల విలువైన బంగారం కావడంతో కస్టమ్స్, ఐటీ విభాగాలతో పరిశీలన జరిపించామని కలెక్టర్ ప్రకటించారు. అన్ని పత్రాలు సరిచూసుకొని బంగారాన్ని విడుదల చేయడంలో కొంత ఆలస్యమైందని తిరువళ్లూరు కలెక్టర్ ప్రకటించారు. మరో పక్క ఇప్పటికే ఈ విషయం పై టిటిడి కూడా క్లారిటీ ఇచ్చిన సంగాతి తెలిసిందే. బంగారం తరలింపు విషయంలో పూర్తి బాధ్యత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌దేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. బంగారం ఎలా తరలిస్తారు? ఏ వాహనంలో తీసుకొస్తారు? వంటి వివరాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. బంగారం తరలింపు వివాదంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తితిదే బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇస్తున్నట్లు చెప్పారు. ‘‘గోల్డ్‌ డిపాజిట్‌ స్కీం 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది. ఎస్‌బీఐలో 5,387 కిలోల బంగారం ఉంది. పీపీఎన్‌బీలో 1381 కిలోల బంగారం ఉంది. తితిదేకు సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉంది. 2016 ఏప్రిల్‌లో పీఎన్‌బీలో 1381 కిలోల బంగారం వేశాం."

ttd 28042019

"అది 2019 ఏప్రిల్‌ 18కి మెచ్యురిటీ అయ్యింది. మెచ్యురిటీ అంశంపై మార్చి 27నే పీఎన్‌బీకి లేఖ రాశాం. బంగారం తరలింపు అంశం పూర్తి బాధ్యత పీఎన్‌బీదే. పీఎన్‌బీ వచ్చి ట్రెజరీలో ఇస్తే అది తితిదే బంగారం అవుతుంది. ఈసీ సీజ్‌ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్‌బీ మాతో చెప్పింది. ఈసీ అధికారులకు డాక్యుమెంట్లు చూపామని ఫోన్‌లో చెప్పారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో మాకు తెలియదు. మేం మార్చి 27న లేఖ రాసేటప్పుడు ఏప్రిల్‌ 18న రావాలని చెప్పాం. ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌ 20న బంగారం అందజేశారు. బంగారం ఎలా తరలిస్తారో.. ఏ వాహనంలో తీసుకొస్తారో మనకెలా తెలుస్తుంది. బంగారం మాకు వచ్చేంత వరకు మిగిలిన విషయాలు అవసరం లేదు. బంగారం ఎలా వస్తే మాకేంటి? మాకు బంగారం అందిందా లేదా అనేది ముఖ్యం. వడ్డీరేట్లు గోల్డ్‌ డిపాజిట్‌ స్కీ్మ్‌లో బాగా వస్తాయా లేదా అనేది బోర్డు నిర్ణయం. కేజీ బంగారం డిపాజిట్‌ చేయాలన్నా బోర్డు నిర్ణయం తీసుకుంటాం. తితిదేకు ఏవిధంగా ఆదాయం ఎక్కువగా వస్తుందో వంటి నిర్ణయాలు బోర్డు పని. బంగారం విషయంలో తితిదే బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తామంటే ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని సింఘాల్‌ వివరించారు

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహారం పై విజయవాడ పోలీసులు స్పందించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా విజయవాడలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ 144 అమలులో ఉన్నాయని, అందుకే బహిరంగ ప్రదేశాలో ఎలాంటి సమావేశాలు, సభలకు అనుమతి లేదని విజయవాడ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తలపెట్టిన ప్రెస్‌మీట్ కార్యక్రమానికి ఎంచుకున్న ప్రదేశం పైపుల రోడ్ నిత్యం హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుందని, అత్యవసర సర్వీసులకు ఆటంకం ఏర్పడే ప్రమాదముందని పోలీసులు తెలిపారు.

rgv 28042019

ఆయన ప్రెస్‌మీట్ వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ సైతం తలెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నిర్వహించాలని తలపెట్టిన కార్యక్రమం బహిరంగ ప్రదేశం కావున, ఎవరినైనా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశముందని అందుకే రాం గోపాల్ వర్మ ప్రెస్ మీట్‌కు అనుమతిని నిరాకరించినట్లు విజయవాడ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్యకాలంలో ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తెలంగాణలో విడుదల చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాయిదా వేశారు.

 

rgv 28042019

చివరకు లైన్ క్లియర్ కావడంతో మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదల చేయనున్నామని ప్రకటించారు వర్మ. ఈ మేరకు నేడు విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించారు. అయితే తీరా సమయానికి హోటల్ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో నడి రోడ్డుపైనే ప్రెస్‌మీట్ పెట్టబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో అలెర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే కారణంగా రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హైదరాబాద్ సినిమా బ్యాచ్ మొత్తానికి, ఇదే సరైన ట్రీట్మెంట్ అంటూ ఏపి ప్రజలు అంటున్నారు. అక్కడ ఉండి, మన ప్రాంతం పై విషం చిమ్మి, ఇప్పుడు ఇక్కడకు వచ్చి ప్రశాంత చెడగొట్టే ఇలాంటి వారిని తరిమేయ్యాలని ప్రజలు అంటున్నారు...

ఈసీ నియామకంతో సీఎస్ పోస్టులోకి వచ్చిని ఎల్వీ సుబ్రమణ్యం తీరు మరోసారి విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంతో ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తున్న ఎల్వీ తాజాగా, ఢిల్లీ ఆదేశాల మేరకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనపై పోస్టు మార్టం ప్రారంభించారు. ఈ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో ఏం జరిగింది..ఏయే టెండర్లు ఎవరికిచ్చారు? ఎందుకిచ్చారు? చెల్లింపుల వివరాలు ఎంటీ అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే భూకేటాయింపులపైనా దృష్టి సారించారు. ఏయే సంస్థలు, కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయి? ఎవరెవరికి ఏయే ప్రతిపాదికన భూములను కేటాయించారు.? అనే అంశాలపై పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకుంటున్నారు సీఎస్ ఎల్వీ. సీఎంతో సంబంధం లేకుండానే కొన్నాళ్లుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎస్ ఎల్వీ. దీనిపై విమర్శలు వస్తున్నా..ఆయన మాత్రం అదే ఒరవడి ప్రదర్శిస్తున్నారు.

cs 28042019

రేపు మరోసారి అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే..కొన్ని శాఖలకు మాత్రం గత ఐదేళ్ల వివరాలతో నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. ప్రాజెక్టులు, పథకాలు, పిలిచిన టెండర్లు, కాంట్రాక్టు వ్యవహారాలు..ఇలా అన్ని వివరాలతో సమావేశానికి రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదారు కీలక విభాగాల నుంచి ఐదేళ్ల చరిత్రకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. మరో 9 కీలక శాఖల రిపోర్టులు కూడా అధికారులు సిద్దం చేస్తున్నారు. ఈ నివేదకలపై రేపటి కీలక సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో వివిధ ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణపై ఫోకస్ చేసిన ఎల్వీ..ఓ నివేదికను తెప్పించుకున్నట్లు తెలస్తోంది.

cs 28042019

కొత్త సీఎస్ లు వివిధ శాఖలపై పట్టు సాధించేందుకు శాఖల వారీగా నివేదికలు తెప్పించుకోవటం సాధారణమే. అయితే..ఆయా శాఖల ముఖ్య కార్యదర్శుల నుంచి తమకు కావాల్సిన సమాచారం తెప్పించుకుంటారు. కానీ, ఎల్వీ మాత్రం ప్రిన్సిపల్ సెక్రటరీలను పక్కనపెట్టి ఆయా శాఖల డైరెక్టర్లు, కమిషనర్లు, ఇంజనీరింగ్ చీఫ్ ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. శాఖల వారీగా గత ఐదేళ్ల నివేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సాంప్రదాయానికి భిన్నంగా ప్రిన్సిపల్ సెక్రటరీలను కాదని వివరాలు సేకరిస్తుండటం అధికార వార్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్ మార్టం వెనక అంతర్యామేంటి అంటూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు టార్గెట్ గా సీఎస్ పావులు కదుపుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్, కేటీఆర్... వీరిద్దరూ ఏపి పై, ఏపి ముఖ్యమంత్రి పై చిమ్మిన విషం అంతా ఇంతా కాదు... జగన్ ని సామంతుడిగా చేసుకుకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలదాం అనే ప్లాన్ వేసారు. దాని కోసం అన్ని రకాలుగా సాయం చేసారు కూడా. ఇక కేసీఆర్ అయితే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, తొక్క తీస్తా, తోలు తీస్తా అని ఊగుడు మాటలు మాట్లడారు. కేటీఆర్ అయితే ట్విట్టర్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఎన్నో వ్యాఖ్యలు చేసారు. వందకు వంద శాతం, అక్కడ జగన్ వస్తున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు అంటూ ఎన్నికల ముందు వరకు హడావిడి చేసారు. అయితే, ఎన్నికల తరువాత క్లారిటీ వచ్చిందో ఏమో కాని, మొత్తానికి అందరూ సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ చంద్రబాబు పై ఒంటి కాలు మీద వెళ్ళే కేటీఆర్, ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ktr 28042019

ఇవాళ నెటిజన్లతో #askktr అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆన్ లైన్‌లో నెటిజన్లు అడిగే ప్రతీ ప్రశ్నకు ఆయన జవాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వత్ర హాట్ టాపిక్‌గా మారిన ఏపీ రాజకీయాలపై కూడా నెటిజన్లు స్పందించారు. కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగారు. ఓ వ్యక్తి ఏపీలో గెలుపు ఎవరిది? మే 23 తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏంటి ? అని ఓ ప్రశ్నను కేటీఆర్‌ను అడిగారు. దీనికి స్పందిస్తూ కేటీఆర్ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. తనకు ఏపీ రాజకీయాలపై ఆసక్తి లేదంటూ ట్వీట్ చేశారు. జగన్ ఏపీ సీఎం అవుతారా అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా కేటీఆర్ స్పందించారు. ఏపీ ప్రజలు ఎలాంటి నిర్ణయం ఇస్తారో వేచి చూద్దామని సమాధానమిచ్చారు.

ktr 28042019

దీంతో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు చంద్రబాబుపై విమర్శలు చేసిన కేటీఆర్... ఇప్పుడు ఇలా అనడం ఏంటా అని అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. జగన్‌కు మద్దతిస్తూ... కేటీఆర్, సీఎం కేసీఆర్ కూడా అనేక సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికలకు ముందు హైదరాబాద్‌‌లో లోటస్ పాండ్‌కు వెళ్లి జగన్‌తో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు కూడా జరిపారు కేటీఆర్. చంద్రబాబు కూడా తెలంగాణలో కేసీఆర్, జగన్ దోస్తీలపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో అంత బాహటంగా ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఇప్పుడు ఇంత సైలెంట్‌గా ఆసక్తి లేదని చెప్పడం వెనుక, చంద్రబాబు మళ్ళీ సియం అవుతున్నారు అనే సంకేతాలు రావటమే అని తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read