కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అంటూ, ఎన్నికలు ముందు చెప్పిన జగన్, ఇప్పుడు ఇస్తున్న నియామకాలు అన్నీ, కులం చూసే ఇస్తున్నట్టు ఉన్నారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. తాజాగా జరిగిన ఒక నియామకం చూస్తే ఇదే అర్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఛైర్మన్‌గా న్యూరోసర్జన్ డాక్టర్ బూచిపూడి సాంబశివారెడ్డి ఎన్నికయ్యారు. ఈయన ఎవరో కాదు. జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చికిత్స చేసిన డాక్టర్ గారు. అందుకే ఆ కృతజ్ఞత జగన్ ఇలా చూపించారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో, శుక్రవారం కోర్ట్ వాయిదాకు వెళ్తూ ఉండగా, ఎయిర్ పోర్ట్ లో ఆయన పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆయన పై శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తి తో గుచ్చిన సంగతి తెలిసిందే.
కోళ్లకు కట్టే కత్తిని వినియోగించి దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన జగన్, విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే, ఇక్కడ జగన్‌కు చికిత్స చేసిన డాక్టర్ బూచిపూడి సాంబశివారెడ్డి అప్పట్లోనే రాజకీయాల్లోకి వస్తారనే టాక్ నడిచింది. ఈయన వైఎస్ ఫ్యామిలీకి ఆత్మీయుడు కావడంతో, వైసీపీలోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. సత్తెనపల్లి నుంచి కోడెల పై పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే సాంబశివారెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్య సేవలు అందించారు. అయితే అప్పట్లో అంతా ప్రశాంత్ కిషోర్ చూసుకుంటూ ఉండటంతో, ఈయనకు టికెట్ వద్దు అని చెప్పారు. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత, జగన్ ఆయన్ను వేరే విధంగా చూసుకున్నారు.
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం, చల్లగుండ్ల గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి చిన్న వయసులోనే వైద్య వృత్తిలోకి ప్రవేశించారు. ఇక, సాంబశివారెడ్డి ఫ్యామిలీకి రాజకీయాలు కొత్తకాదు. ఆయన తాత బూచిపూడి సుబ్బారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా వ్యవహరించారు. 1983లో నరసరావుపేట నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కోడెల శివప్రసాద్‌పై ఓడిపోయారు. అయితే ఆయన కూడా వైద్య వృత్తిని పక్కన పెట్టి, వైసీపీలో టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే అప్పట్లో టికెట్ ఇవ్వటం కుదరని జగన్, ఇప్పుడు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఛైర్మన్‌గా నియమించారు. కోడి కత్తి గాయం నుంచి రక్షించినందుకు, జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ తో, సాంబశివారెడ్డి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.