రాష్ట్రానికి నయవంచన చేసిన మోడీ మీద ప్రతి ఆంధ్రుడు రగిలిపోతుంటే, హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం, మోడీని ఒక్క మాట పడనివ్వటం లేదు. మొన్నటికి మొన్న తిత్లీ తుఫాను సాయం అంటూ 229 కోట్లు, మనకు కేటాయించిన విపత్తు నిధులు విడుదల చేసి, అదే మీకు మేమిచ్చే సహయం అని కేంద్రం నిస్సిగ్గుగా చెప్తే, అది నా చొరవే అంటూ తన ఖాతాలో వేసుకున్నాడు పవన్.. కాని, ఆ డబ్బులు మనకు ప్రతి ఏటా ఇచ్చే విపత్తు నిధులే. ఈ విషయం పై కనీస అవగాహన కూడా పవన్ కు లేదు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, ధర్మపోరాట దీక్షలు పెట్టి, మోడీని ఏకి పడేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ చేసిన మోసాన్ని, రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నారు.
18 విభజన హామేల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన మోడీ పై, ప్రతి జిల్లాల్లో సభులు పెట్టి మోడీని నిలదీస్తున్నారు. అయితే, ఈ విషయంలో పాపం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకో కాని, చాలా బాధపడుతున్నారు. నిన్న ట్రైన్ లో జరిగిన షూటింగ్ గ్యాప్ లో, మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు పెట్టి, మోడీని ఓ తిడుతున్నారని, అలా తిట్టకుండా, మోడీతో, ఎంతో సౌమ్యంగా మాట్లాడుకుని, మనకు రావాల్సినవి సాధించుకోవాలని పవన్ అన్నారు. ఇక మరో పక్క, జగన్ కోడి కత్తి ఎపిసోడ్ పై కూడా పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారు. ఒక పక్క జగన్ ని కోడి కత్తితో గుచ్చినది ఆయన అభిమానే అని అందరికీ తెలిసినా, అది జగన్, మోడీ, అమిత్ షా ప్లాన్ లోని, ఆపరేషన్ గరుడలోని భాగం అని ప్రజలందరికీ తెలిసినా, పవన్ మాత్రం, చంద్రబాబు పై విమర్శలు చేసారు.
"జగన్పై దాడి జరగడం దురదుష్టకరం. ఈ విషయంలో ప్రభుత్వం వెకిలిగా మాట్లాడ్డం సరికాదు. దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలి. దాడి కావాలని చేశాడా..? ఎవరైనా చేయించారా? కుట్ర ఉన్నదా అనేది పోలీసులు విచారణలో తేలాలి. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలి. అంతే కాని, కోడి కత్తి అంటూ హేళన చేస్తారెందుకు" అంటూ పవన్ కళ్యాణ్, పాపం చాలా బాధపడ్డారు. మొత్తానికి, తన బాస్ అయిన మోడీ పై చంద్రబాబు చేస్తున్న దేశ వ్యాప్త ఉద్యమంతో, పవన్ కళ్యాణ్ బాగా హార్ట్ అయ్యారు. అందుకే, చంద్రబాబు, మోడీ పై దేశ వ్యాప్త పోరాటం చేస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి తన పార్టనర్ కాబట్టి, రేపు అమిత్ షా ఆదేశాల ప్రకారం చచ్చే చెడు, ఇద్దరూ కలిసి పోటీ చెయ్యాలి కాబట్టి, జగన్ పై హేళనలను కూడా పవన్ తిప్పి కొట్టారు.