వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిన్న సతీసమేతంగా తాడేపల్లిలో నూతన గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనలతో జగన్‌, భారతి దంపతులు కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. కార్యక్రమంలో జగన్‌ తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల, ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, తలశిల రఘురాం, ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని జగన్‌ అట్టహాసంగా ప్రారంభించారు. ప్రాంగణంలో వైసీపీ జెండాను ఆవిష్కరించారు.

dalit 28022019 2

అయితే ఈ సందర్భంలో, జరిగిన ఒక సంఘటన కలకలం రేపింది. కులం తక్కువ దానివి.. జగన్ గృహప్రవేశానికి రావాలా? అంటూ వెంకటరమణి అనే మహిళ తెలిపింది. ఈ అవమానం కారణంగానే తాను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశానని తెలిపింది. వైసీపీ అధినేత జగన్ గృహ ప్రవేశ కార్యక్రమం వద్ద గుంటూరు నగరానికి చెందిన మహిళా కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. తనను అసభ్య పదజాలం, కులంపేరుతో ధూషించారని వెంకట రమణి అనే మహిళ వాపోయింది. ప్రమీల అనే మహిళ తనపై దాడికి ప్రయత్నించిందని.. కులం తక్కువ దానివి జగన్ గృహప్రవేశానికి రావాలా? అంటూ అవమినించిందని వాపోయింది. తనను ప్రమీల జగన్ ఇంటి వద్ద దారుణంగా అవమానించిందని.. అందుకే తాను నిద్రమాత్రలు మింగానని తెలిపింది. అయితే ఈ విషయం పై, వైసీపీ నుంచి మాట్లాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక పక్క చింతమనేని పై ఫేక్ వీడియో ఒకటి వదిలి దళిత వ్యతిరేకి అనే ముద్ర వెయ్యటానికి ట్రై చేసి, ఇప్పుడు వాళ్ళే ఇలా బుక్ అవ్వటంతో, ఈ విషయం పై మాట్లాడటానికి ఎవరూ ముందుకు రావటం లేదు.

వచ్చే ఎన్నికల కోసం, ఇప్పటి నుంచే జగన్ బ్యాచ్ విచ్చలవిడిగా సిద్ధమవుతుంది. ఒక పక్క కేంద్రం సపోర్ట్, మరో పక్క, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సపోర్ట్ తో, దేనికైనా తెగించేందుకు రెడీ అవుతుంది. అయితే, దొంగే దొంగ దొంగ అన్నట్టు, ముందుగా ఫోకస్ అంతా చంద్రబాబు పై తేవటానికి, చంద్రబాబు అయుదు వేలు పంచుతాడు, చంద్రబాబు ఓట్లు తొలగిస్తున్నాడు, ఒక సామాజికవర్గం వారిని తప్పించాలి అంటూ, ఎదురుదాడి చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం తాను చెయ్యల్సింది, తాను చేస్తున్నాడు. మొన్నటికి మొన్న, కృష్ణా జిల్లాలో పోలీసులకు డబ్బులు కవర్లు పంపిస్తూ దొరికిపోయిన జగన్ బ్యాచ్, ఇప్పుడు ప్రజలను ప్రలోభాలు పెట్టే పనులు, ఇప్పటి నుంచే మొదలు పెట్టింది.

sweet 28022019 1

కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలోని ఓ ప్రముఖ స్వీట్ షాపులో వైసీపీస్టిక్కర్స్ తో ప్యాకింగ్ చేసిన స్వీట్ బాక్స్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు 'తొలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన' కింద కేసు నమోదు చేసారు. ఓటర్లను ప్రలోభానికి గురి చేసేందుకు పార్టీ సింబల్ తో పెద్ద ఎత్తున స్వీట్ ప్యాకెట్లు ప్యాక్ చేసి స్వీట్ బాక్స్లపై "వైసీపీకి ఓటేద్గాం.. రూ.3వేలు పెన్షన్ తీసుకుందాం" అన్న నినాదాలతో రేపు 1వ తేదీ 'పెన్షన్' ల పంపిణీ జరగనున్ననేపథ్యంలో వైసీపీ సానుభూతి వార్డుల్లో స్వీట్ బాక్స్లను పెన్షన్ దారులకు పంపిణీ చేసేందుకు స్వీట్ బాక్స్లను సిద్దం చేసారు. ఇది వీళ్ళ నీచరాజకీయాలకు ఒక కొలమానం

sweet 28022019 1

మార్చి 1 నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ సందర్భంగా పింఛన్ దారులకు ఇచ్చేందుకు తమ పార్టీ గుర్తులతో కూడిన స్వీట్ ప్యాకెట్లను వైసీపీ సిద్ధం చేసింది. అయితే ఈ సమాచారం అందుకున్న అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా స్వీట్ బాక్సుల పంపిణీ నిబంధనలకు విరుద్ధమని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నంలోని ఓ హోటల్‌లో తనిఖీ చేసిన అధికారులు 150 స్వీట్ ప్యాకెట్లతో కూడిన 27 కార్టూన్లతోపాటు మరికొన్ని ఖాళీ బాక్సులను అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్ బాధ్యులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఇలా ఉంటే, ఇక ఎన్నికలు దగ్గర పడే నాటికి, ఎన్ని ప్రలోభాలు చూడాలో...

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, నమస్కారములు. మీ విశాఖ పర్యటనకు సరిగ్గా ఒక్కరోజు ముందు మీ మంత్రిమండలి సహచరుడు, రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ప్రకటన మీరు ‘మసిపూసి చేసిన మారేడుకాయ’ మినహా దాని వల్ల మాకు ఒరిగే ప్రయోజనమే లేదు. రూ.6,500 కోట్ల కార్గో రాబడి గల కె.కె. లైనును రాయగఢ్‌లో చేర్చి ఆంధ్రప్రదేశ్‌కు మీరు మరో ద్రోహం చేస్తున్నారు. 1843 నుంచి ఉన్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయడం పుండు మీద కారం జల్లడం కాదా? స్థానిక డివిజన్‌ లేకుండా రైల్వే జోన్ ఏర్పాటుచేయడం భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు మాకు చేసిన అన్యాయాలపై మా ప్రజల నిరసన గళాన్ని మరోసారి వినిపిస్తున్నాను. మీ ప్రస్తుత పర్యటనలోనైనా ఈ క్రింది 18 అంశాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. 1) తేదీ.20.02.2014నాడు నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఎందుకు ప్రకటించరు? 2) పోలవరం ప్రాజెక్టు కోసం మేము ఖర్చు చేసిన రూ.4,063 కోట్ల బకాయిలను గత 8 నెలలుగా ఇవ్వకుండా నిలిపివేయడం, డీపీఆర్-2ను ఆమోదించకుండా తొక్కిపెట్టడం ఆంధ్రప్రదేశ్ పట్ల మీ కక్షసాధింపు ధోరణి కాదా? 3) ‘కాగ్’ నిర్దారించిన తొలి ఏడాది రెవిన్యూ లోటు రూ.16 వేల కోట్లను విడుదల చేయాల్సి ఉండగా, కేవలం రూ.3,979 కోట్లు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని నిరాకరించడం మీ నిరంకుశత్వం కాదా..? 4) ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించి ఇస్తామని చెప్పి కొత్త రాజధాని నిర్మాణానికి తొలిదశలో రూ.40 వేల కోట్లు కావాలని కోరితే నాలుగేళ్లలో కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టడం మీ బాధ్యతారాహిత్యం కాదా?

 5) కె.బి.కె. తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్యాకేజ్ ఇస్తామని చట్టంలో ఉన్నప్పటికీ, ఈ మూడేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు ఇచ్చి, నాలుగో ఏడాది మా ఖాతాలో జమ చేసిన రూ.350 కోట్ల నిధులను మా అనుమతి లేకుండా వెనక్కి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా? 6) కావాల్సినంత ఖనిజ వనరులు, భూమి, నీటి వసతి, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రం ముందుకు వచ్చినా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకపోవడం రాష్ట్రం పట్ల వివక్ష కాదా? 7) రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలకు మేము రూ.11,600 కోట్ల విలువ చేసే 2,909 ఎకరాల భూమిని ఇస్తే, మీరు ఇవ్వాల్సిన రూ.12,746 కోట్లకు గాను కేవలం రూ.746 కోట్లు ఇస్తే, ఆ సంస్థల నిర్మాణానికి ఎన్ని దశాబ్దాల కాలం పడుతుందో తెలుసా? 8) నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నం పోర్ట్‌ నిర్మాణం తొలిదశ 2018 కల్లా పూర్తిచేయాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా, మీరు కుంటిసాకులతో చేపట్టకపోవడం రాష్ట్రం పట్ల మీ నిర్లక్ష్యం కాదా? 9) ఢిల్లీ-ముంబై ఇండస్ర్టియల్ కారిడార్ అభివృద్ధికి రూ.17,500 కోట్లు ఇచ్చి పెద్దమనసు చాటుకున్న మీరు మా రాష్ట్ర పరిధిలోని విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (VCIC)కు కేవలం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోమనడం మా రాష్ట్రం పట్ల చిన్నచూపు కాదా? 10) అసలే రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు అయ్యే వయబులిటీ గ్యాప్ ఫండింగ్‌ను 15 ఏళ్ల పాటు భరించమనడం భావ్యమేనా? 12) లోపభూయిష్టమైన విభజన చట్టం వల్ల ఏపీకి రూ.3,820 కోట్ల నష్టం వాటిల్లితే, మీరు ఆ నష్టాన్ని పూరించేందుకు తీసుకున్న చర్యలేవి? 13) విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు డీపీఆర్‌లు 2016లోనే పంపిస్తే బెంగళూరు, భూపాల్, ఇండోర్ మెట్రో రైళ్లు, ముంబై సబర్బన్ రైళ్లకు వేల కోట్ల నిధులిచ్చిన మీరు మాకు మాత్రం మొండిచెయ్యి చూపించడం ధర్మమా? 14) కొత్త రాజధాని అమరావతికి ర్యాపిడ్ రైల్ నెట్‌వర్క్, రోడ్ కనెక్టివిటీకి కొర్రీల మీద కొర్రీలు వేస్తూ పెండింగ్‌లో పెట్టడం వేధింపులు కావా?

 15) విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల విస్తరణకు వందల ఎకరాల భూములు మేమిచ్చినా పూర్తిస్థాయిలో విస్తరణ చేపట్టకుండా, అంతర్జాతీయ సర్వీసులు రాకుండా అడ్డుపడటం మా అభివృద్ధికి ఆటంకం కాదా? 16) 175 శాసనసభ స్థానాలను 225 స్థానాలకు పెంచాలని చట్టం సుస్షష్టంగా పేర్కొన్నా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవటం రాజకీయ కుట్ర కాదా? 17) గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికీ కేంద్ర హోం శాఖ ఏ చర్యలూ తీసుకోకపోవడం అన్యాయం కాదా? 18) షెడ్యూల్ 9, 10 కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంస్థల విభజనకు తెలంగాణా సహకరించనప్పుడు, మీరు చొరవ తీసుకోకపోగా, సుప్రీం కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా మీరు ఆస్తులు, అప్పుల పంపిణీలో అన్యాయం జరిగేలా ఆదేశాలు జారీచేయడం దుర్మార్గం కాదా? పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పార్లమెంటు చేసిన పునర్విభజన చట్టంలోని అంశాలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేసి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచి ఇప్పుడు మీరు రిక్తహస్తాలతో మా రాష్ట్రానికి రావడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా? పైన తెలిపిన అంశాలన్నింటి అమలుకు మీరు మీ విశాఖపట్నం సందర్శన సందర్భంగా ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాను. లేని పక్షంలో ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఈ గడ్డపై కాలుమోపడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తారు. ఇట్లు భవదీయుడు (నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)

రేపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాని పర్యటించనున్న విశాఖపట్నంల నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. . ప్రత్యేక హోదా సమితి ఆధ్వర్యంలో నగరంలో హోర్డింగ్‌లు వెలిశాయి. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్లరంగులో హోర్డింగ్‌లు పెట్టారు. మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ హోర్డింగుల్లో చెప్పారు. మోదీ పర్యటించే మార్గాల్లో హోర్డింగ్‌ వెలిశాయి.

vizag 28022019 1

ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీలో మోదీ ఎప్పుడు అడుగుపెట్టినా అది చీకటి రోజన్నారు.తమ హక్కులు కాలరాసి ఈ గడ్డ మీద అడుగు పెడితే ఉపేక్షించమని హెచ్చరించారు. చట్టాలు చేసిన వారే అమలు‌ చేయకుండా మోసం‌ చేశారని, దేశ భద్రత విషయంలో ఎప్పుడూ కేంద్రాన్ని సమర్ధిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని, నమ్మించి నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. ‘‘మోదీ ఆ హామీని తుంగలో తొక్కారు. బీజేపీతో పాటు వారికి సహకరించిన పార్టీలను చిత్తుగా ఓడించాలి. ఏపీలో వైసీపీ ఫ్యాన్‌ ఉంటే.. హైదరాబాద్‌లో స్విచ్‌, ఢిల్లీలో ఫ్యూజ్‌ ఉంది. మోదీ మోసాన్ని ప్రశ్నిస్తే సీబీఐ, ఐటీ దాడులు చేస్తున్నారు. మోదీ పర్యటన కారణంగా రైల్వేజోన్‌ పేరుతో మాయజోన్‌ ప్రకటించారు. వాల్తేరు డివిజన్‌ని పక్క రాష్ట్రానికి ఇచ్చి ఏపీకి అన్యాయం చేశారు. ఇప్పుడు వచ్చే ఆదాయం మొత్తం ఒడిశాకే వెళ్తుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ మనకు రానీయకుండా కుట్రలు చేస్తున్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు కూడా లేకుండా చేశారు . మోసపూరితమైన రైల్వే జోన్ మాకు వద్దు.. విశాఖ జోన్ కావాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

vizag 28022019 1

గతంలో మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 'మోదీ గో బ్యాక్‌' అంటూ విజయవాడ, గుంటూరు సహా పలుచోట్ల ఫెక్సీలు వెలిశాయి. ఖాళీకుండలు, మట్టీనీళ్లతో లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరుకు మోదీ వెళ్లే మార్గంలో ఆయనకు వ్యతిరేకంగా వందలకొద్దీ ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిపై ప్రధాని కార్టూన్లు ముద్రించారు. ఆంధ్ర ప్రజలను మోసం చేసి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నిస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో ఫ్లెక్సీలను పెట్టారు. లెనిన్‌ సెంటర్లో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అమరావతి భూమిపూజకు వచ్చినప్పుడు మోదీ ఇచ్చిన మట్టి, నీళ్లను గుర్తుచేస్తూ.. వాటిని కుండల్లో తీసుకొచ్చి లెనిన్‌ సెంటర్‌లో పగలగొట్టారు.

Advertisements

Latest Articles

Most Read