బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌స్ట్రైక్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు సహాయపడుతోందని యెడ్యూరప్ప వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ దేశంలోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన చేసిన దాడుల వల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా మారిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎయిర్‌స్ట్రైక్ వల్ల 22 లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుంటుందని యెడ్యూరప్ప జోస్యం చెప్పారు. పాకిస్థాన్ పై భారత వాయుసేన దాడితో యువత సంతోషంగా ఉన్నారని, వారంతా నరేంద్రమోదీవైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో 28 లోక్ సభ స్థానాలుండగా ప్రస్థుతం బీజేపీ సభ్యులు 16 మంది ఉన్నారు. కాంగ్రెస్ 10, జనతాదళ్ కు ఇద్దరు సభ్యులున్నారు. ఎయిర్‌స్ట్రైక్ వల్ల బీజేపీకి 22 సీట్లు వస్తాయని యెడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.

modi 28022019 1

మరో పక్క, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ దళాల నిర్బంధంలో ఉన్న పైలట్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని దేశమంతా ప్రార్థిస్తుంటే.. ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలతో ‘‘రికార్డ్ బ్రేకింగ్’’ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడంపై మండిపడ్డాయి. దేశ వ్యాప్తంగా 15 వేల ప్రదేశాల్లోని కోటి మంది బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్... ప్రపంచంలోని అతిపెద్దదని బీజేపీ చెబుతోంది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేపట్టిన ‘‘మేరా బూత్ సబ్ సే మజ్‌బూత్’’ కార్యక్రమంలో భాగంగా ఈ కాన్ఫరెన్స్ జరిగింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విటర్‌లో స్పందిస్తూ...

modi 28022019 1

‘‘తప్పుడు ప్రాధాన్యతలకు స్పష్టమైన నిదర్శనమిది..! భారత సాహస వింగ్ కమాండర్ అభినందన్ వెంటనే, క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ 132 కోట్ల మంది భారతీయులు ప్రార్ధనలు చేస్తుంటే... మోదీ ధ్యాసంతా కేవలం మళ్లీ అధికారంలోకి రావడంపైనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరగాల్సిన ముఖ్యమైన సీడబ్ల్యూసీ సమావేశాన్ని, ర్యాలీని రద్దు చేసుకుంది. ప్రధాన సేవకుడు మాత్రం ఓ వీడియో కాన్ఫరెన్స్‌ను సృష్టించే పనిలో మునిగిపోయారు. రికార్డే..!’’ అని ఎద్దేవా చేశారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమాద్మీ చీఫ్ కేజ్రీవాల్ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘ప్రధానమంత్రి తన ‘మేరా బూత్ సబ్ సే మజ్‌బూత్’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను. ఈ సమయంలో ఒక దేశంగా మనం ఐఏఎఫ్ పైలట్‌ను క్షేమంగా వెనక్కి తీసుకు రావడానికి, పాకిస్తాన్‌తో కఠినంగా వ్యవహరించడానికి మన శక్తినంతా ఉపయోగించాల్సిన అవసరం ఉంది...’’ అని పేర్కొన్నారు.

 

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, పర్చూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌లు బుధవారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన వైసీపీ కార్యాలయంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గం నుంచి అలాగే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల నుంచి ఆమంచి అభిమానులు తాడేపల్లికి తరలివెళ్లారు. ఇలా ఉండగా సీనియర్‌ నాయకులు, మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువాను వేసుకోలేదు. ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌కి మాత్రమే జగన్‌ కండువా వేశారు. ఇటు దగ్గుబాటి, అటు ఆమంచి, హితేష్‌ పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఒకేసారి నిర్వహించారు.

daggubati 28022019

తొలుత ఆమంచికి జగన్‌ కండువ వేయబోగా ఆయన వెంకటేశ్వరరావుని ముందుకు ఆహ్వానించారు. అయితే వెంకటేశ్వరరావు ముందుకు రాకుండా ఆయన కుమారుడిని పంపారు. వెంటనే జగన్‌ హితేష్‌ మెడలో వైసీపీ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఆ వెంటనే ఆమంచికి కూడా పార్టీ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటించారు. ఇంతకు హితేష్‌ ఒక్కరే పార్టీలో చేరటం, డా. దగ్గుబాటి వైసిపి కండువా వేసుకోకపోవటం, ఇప్పటికే డా. దగ్గుబాటి సతీమణి, హితేష్‌ తల్లి పురంధేశ్వరి బీజేపీలో కీలకపాత్ర పోషిస్తుండటంతో టీవీలలో ఈ దృశ్యాలు చూసిన వారిలో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. పార్టీలో చేరుతున్నా అని చెప్తూనే, జగన్ చేత ఎందుకు కండువా వేయించుకోలేదో ఎవరికీ అర్ధం కాలేదు.

daggubati 28022019

టీడీపీలో ఉన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌,, చీరాల నుంచి భారీగా ర్యాలీగా వెళ్లేందుకు ఆమంచి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసు 30వ చట్టం అమలుకు శ్రీకారం పలకటంతో అక్కడి నుంచి ర్యాలీగా కాకుండా నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల నుండి ఆయన అనుచరులు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా కాపుసంఘం జిల్లా నాయకుడిగా ఉన్న ఆయన సోదరుడు ఆమంచి స్వాములు సూచనలు, ఆమంచితో సన్నిహిత సంబంధాలున్న కాపు సామాజికవర్గం, ఇతర మరికొందరు వాహనాలలో వెళ్లారు. మంగళగిరి దగ్గర జాతీయ రహదారిపై వీరి వాహనాలన్నింటినీ ఆపి అక్కడి నుండి ర్యాలీగా వెళ్లారు. మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పార్టీలో చేరాలని అనుకున్నప్పటికీ గంట ఆలస్యంగా ఆమంచి పార్టీలో చేరారు.

 

విభజన హామీల అమలుపై రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్ మసిపూసిన మారేడుకాయ అని విమర్శించారు. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోదీ మరో మోసమని.. భాజపా మోసాన్ని అందరూ ఖండించాలని నేతలకు సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్గో రాబడి ఒడిశాకిచ్చి.. ప్యాసింజర్ రాబడి మనకిచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రానికి 7వేల కోట్ల రూపాయల రాబడి పోగొట్టారని.. రిక్రూట్‌మెంట్లలో కూడా మనకన్నా ఒడిశాకే ఎక్కువని వ్యాఖ్యానించారు.

zone 28022019 2

ఎవరిని మోసం చేయాలని ఈ ప్రకటన చేశారని నిలదీశారు. రాష్ట్రంలో అన్ని స్టేషన్లు కూడా మన జోన్‌కు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా ఇవాళ సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు జరపాలని నేతలకు స్పష్టం చేశారు. రేపు నల్లజెండాలు, నల్ల బెలూన్లు, నల్లచొక్కాలతో ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదని పేర్కొన్నారు. హామీలన్నీ నెరవేర్చాకే మన గడ్డపై అడుగుపెట్టాలన్నారు. రైల్వే జోన్ ఇచ్చారని వైకాపా ఆనందపడుతోందని... చేసిన మోసాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. జోన్ ప్రకటనపై వైకాపా, భాజపా సంబరాలు హాస్యాస్పదమని మండిపడ్డారు.

zone 28022019 3

ఇన్నేళ్లు రాజధానిని తరలించాలని వైకాపా మనసులో కుట్ర పెట్టుకుందని.. ఇప్పుడు అభివృద్ధి చూసి ఏమీ చేయలేక రాజధాని తరలించబోమని చెప్తోందని విమర్శించారు. నిన్న అమరావతిలో జగన్ గృహ ప్రవేశం చేశారని.. మరుసటి రోజే హైదరాబాద్ పయనమయ్యారని.. నిలకడగా రాష్ట్రంలో నివాసం ఉండరని మండిపడ్డారు. జగన్‌కు నిలకడ, విశ్వసనీయత లేదని దుయ్యబట్టారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై వైసీపీ, బీజేపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని, రెండు పార్టీల లాలూచీకి ఇది రుజువు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వైసీపీ, బీజేపీవి తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలని, ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని, బీజేపీ, వైసీపీ నాటకాలను ప్రజలే ఎండగట్టాలన్నారు.

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన వై.వి. సుబ్బారెడ్డి పార్టీ అధినేత జగన్‌కు అతి సమీప బంధువు. దివంగత సీఎం వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి సతీమణి, వైవీ సతీమణి సొంత అక్కాచెల్లెళ్లు. గత ఎ న్నికల సమయంలో ఆయన ఒంగోలు లోక్‌సభ నియోజక వర్గ టికెట్టు ఆశించగా మాజీమంత్రి, వైవీకి సొంత బావ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తొలుత వ్యతిరేకించారు. ఒకే ఇంటి వారం పోటీలో ఉంటే ఇబ్బంది వస్తుందన్న బాలినేని వాదనను చివరిలో పక్కకు నెట్టి వైవీకి అవకాశం ఇ చ్చారు. ఆ ఎన్నికల్లో వైవీ గెలుపొందగా బాలినేని ఓటమి చెందారు. ఆ తర్వాత క్రమేపీ బాలినేని, వైవీ మధ్య మ నస్పర్థలు పెరిగాయి. తిరిగి ఎన్నికల వ్యూహం ప్రారంభ మైన దశలోనే వైవీకి ఇతర జిల్లాల బాధ్యతలను జగన్‌ అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను పోటీకి దూరంగా ఉంచి పార్టీ సేవకు ఉపయోగించుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. తొలి నుంచి వైవీ మాత్రం తిరిగి తానే పోటీ చేస్తానని, వెనక్కి తగ్గేది లేదని చెప్తూ వచ్చారు. జిల్లాలో ఇతర పార్టీల నుంచి కొందరిని పార్టీలో చేర్చుకునే వ్యవహారంపై వైసీపీకి చెందిన రాజ్యసభ స భ్యుడు విజయసాయిరెడ్డి దృష్టిసారించారు.

స్థానికంగా ఉన్న బాలినేని, వైవీలను పక్కనపెట్టి జిల్లాలో కొందరు నాయకులను ఆకర్షించే కార్యక్రమానికి ఆయన్ను పార్టీ రంగంలోకి దించింది. దగ్గుబాటి కుమారుడు హితేష్‌, చీరాల ఎమ్మెల్యే ఆమంచి పార్టీలో చేరడంతోపాటు మా గుంట కూడా పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ విషయంలో ఢోకా లేదని విజయసాయిరెడ్డి పార్టీ ముఖ్య నాయకులకు తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇదేసమ యంలో మాగుంట టీడీపీ నుంచి తాను పోటీ చేయబో నని ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టం చేశారు. అయితే వైసీపీలో చేరతానని ఆయన ఎక్కడా చెప్పలేదు. పోటీ చేయకపోయినా టీడీపీలోనే కొనసాగుతానని చెప్తున్నారు. కానీ ఆయన పార్టీలోకి రావడం ఖాయమన్న ప్రచారం వైసీపీ శ్రేణుల్లో జరిగిపోయింది. అందుకు విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాచారమే కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం వై.వి. సుబ్బారెడ్డి హడా వుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన మనసు లోని మాటను బయటపెట్టేశారు. ఈ ఎన్నికల్లోనూ కాదు, వచ్చే ఎన్నికల్లోనూ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది తానేనని ప్రకటించారు. అంతటితో ఆగకుండా మాగుంటను హేళను చేస్తూ వ్యాఖ్యానాలు చేశారు. బాలినేని విషయంపై విలేఖరులు ప్రశ్నించినప్పు డు కూడా ఎవరికైనా టికెట్టు ఇచ్చేది జగనే అంటూ ఇక్కడ వేరేవారి పాత్ర ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. దీంతో వైసీపీ నాయకుల్లో కలకలం ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో ఉన్న లోటస్‌పాండ్‌లో వైవీ సుబ్బారెడ్డి తన కుటుంబసభ్యులతోపాటు జగన్‌ను కలిసినట్లు తెలిసింది. వారిలో వైవీ సతీమణితోపాటు, కుమారుడు, సోదరులు కూడా ఉన్నారని అంటున్నారు. వీరు కలిసిన వెంటనే జగన్‌ ‘అలాంటి ప్రకటన మీరెందుకు చేశారు. మనం ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎక్కడికక్కడ చేర్పులు, మార్పులు చేసుకుంటున్నాం. ఆవిషయం మీకూ తెలుసు. అవసరమైతే మనమే తగ్గి ముందుకు సాగాలి. అలాంటిది మీరే ఆ విధమైన ప్రకటన చేస్తే ఎలా?’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా ‘ఒంగోలు నుంచి మీరు పోటీ చే సేందుకు అవకాశం లేదు. అక్కడ మాగుంట పోటీ చేస్తారా, మరెవరైనా రంగంలో ఉంటారా అన్నది అప్రస్తు తం. మీరైతే రాష్ట్రస్థాయిలో పార్టీ అప్పగించిన బాధ్యతలను చూడండి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందాం’ అని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం జరిగిన జగన్‌ గృహప్రవేశం, వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైవీ హాజరుకాలేదు. ఇలాంటి సందర్భాలన్నింటిలో జగన్‌ తల్లి విజయలక్ష్మి పక్కనే ఉండే వైవీ సతీమణి కూడా కన్పించలేదు.

Advertisements

Latest Articles

Most Read