25 ఏళ్ల క్రితం డ్వాక్రా, ఇతర సంఘాలు నెలకొల్పానని.. వృద్ధులు, మహిళల బాధలు చూశాక రూ. వెయ్యి పెన్షన్‌ ప్రకటించానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు పెన్సన్‌ను రెట్టింపు చేశామని చెప్పారు. ఆదివారం టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పసుపు- కుంకుమ పథకం ఉంటుందన్నారు. పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని భగ్నం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్వించారు. డ్వాక్రా మహిళలే వైసీపీకి బుద్ధిచెబుతారని సీఎం తెలిపారు. పెన్షన్ల పెంపు అనుత్పాదక వ్యయం కాదని స్పష్టం చేశారు. పెన్షన్లతో మెరుగైన వృద్ధుల ఆరోగ్యం... బతుకుపై ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. పసుపు కుంకుమ డబ్బులను మహిళలు దుర్వినియోగం చేయరని సీఎం పేర్కొన్నారు. రూ.20 వేల చొప్పున మహిళలకు అందజేస్తున్నామన్నారు. అయితే చెక్కులు చెల్లవనే దుష్ప్రచారాన్ని మహిళలు నమ్మవద్దని ఆయన చెప్పారు. రేపటి నుంచే డబ్బులు తీసుకోవచ్చని..బ్యాంకుల్లో రూ.2400 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

cbn 03022019

అంతే కాదు శనివారం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో పసుపు-కుంకుమ, పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి, అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. డ్వాక్రా మహిళల కళ్లలో ఆనందం చూడాలని 94 లక్షల డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద మొదటి విడతలో రూ. 10 వేలు ఇచ్చానన్నారు. అలాగే రెండో విడతలో రూ. 10 వేలను ఈరోజున రూ. 2,500 చెక్కును అందజేయడం జరుగుతుందని చెప్పారు. రెండో చెక్కును మార్చి 8న రూ. 3,500కు, మూడో చెక్కును ఏప్రిల్‌ 5న 4 వేలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆడపడచుల పెద్దన్నగా తాను వారి ఆర్థిక ప్రగతికి తోడ్పాటు నిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాము ఈ సందర్భంగా పేర్కొన్నారు. 53 లక్షల మంది వృద్ధాప్య, వితంతు, ట్రాన్‌జెండర్స్‌కు పింఛన్లు నాలుగున్నర సంవత్సరాల్లో పది రెట్లు పెంచి భరోసా కల్పించి ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.

cbn 03022019

మొదటిసారి పింఛన్లకు రూ. 9,600 కోట్లను, రెండో విడత రూ. 13,440 కోట్లను సంవత్సరానికి అయ్యే వ్యయాన్ని భరించి ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్లను అందిస్తున్నట్లు తెలిపారు. పసుపు-కుంకుమ కింద మహిళలకు అన్ని విధాల న్యాయం చేయడానికి రూ. 10 వేలు ఉచితంగా ఇస్తున్నామన్నారు. వైకాపా కావాలనే అప్పుగా ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని, ఇవి మీకు ఉచితంగా ఇస్తున్నానని, మీకు తోచిన విధంగా, మీరు లాభపడేలాగా ఆ డబ్బు వాడుకోండి అంటూ మహిళలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. అలాంటి తప్పుడు పేపర్లలో వచ్చే, తప్పుడు వార్తలు నమ్మవద్దని చెప్పారు. 26,769 మందికి చంద్రన్న పెళ్లి కానుక కింద రూ. 170 కోట్లు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పింఛన్ల పంపిణీలో పలు అవకతవకలు జరిగాయని, ఇప్పుడు తమ ప్రభుత్వం నేరుగా అర్హుల ఖాతాలలో పింఛన్లు వేస్తున్నామన్నారు. ఈనెల 9న నాలుగు లక్షల ఇళ్లకు ఒకేసారి గృహప్రవేశం చేయడంతో ప్రపంచంలో చరిత్ర సృష్టించబోతున్నామన్నారు.

ఏపీ రాజధాని అమరావతిలో ఈరోజు హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం జరగనుంది. హైకోర్టు భవనాన్ని సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరుకానున్నారు. సిటీ కోర్టు కాంప్లెక్స్‌ హైకోర్టుగా సేవలు అందించనుంది. సంప్రదాయ, ఆధునిక ఆకృతుల మేళవింపుతో సిటీ కోర్టు భవన నిర్మాణం జరిగింది. నేలపాడులో 14.2 ఎకరాల్లో రూ.173 కోట్లతో హైకోర్టు భవనాన్ని నిర్మించారు. 23 కోర్టు హాళ్లలో ఆధునిక వసతులతో సిటీ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణం జరిగింది. టీమ్‌ వన్‌ సంస్థ బౌద్ధ దేవాలయం ఆకృతి ఉట్టిపడేలా డిజైన్లు రూపొందించగా, ఎల్‌ అండ్‌ టి సంస్థ భవన సముదాయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించింది. ప్రధాన న్యాయ మూర్తి కోర్టు హాలును 2480 చదరపు అడుగు విస్తీర్ణంలో సువిశాలంగా తీర్చిదిద్దారు.

court 03022019 2

23 కోర్టు హాళ్లతో పాటు అనుబంధ కార్యాలయాలు, అడ్వకేట్‌ జనరల్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదుల అసోసియేషన్‌ హాల్‌, మహిళలకు ప్రత్యేక హాలు, అడ్వకేట్‌ ఛాంబర్‌, వివాద పరిష్కార కేంద్రాలు, లైబ్రరీతో పాటు కోర్టుకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చారు. హైకోర్టు భవన సముదాయాన్ని జ్యుడిషియల్‌ బంగ్లాలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ కాంప్లెక్స్‌, సెంట్రల్‌ పార్కుకు కూతవేటు దూరంలో నిర్మించారు. ఆహ్లాదకర వాతావరణంలో న్యాయ నిపుణులు, కోర్టు సిబ్బంది పని చేసే విధంగా తీర్చిదిద్దారు. న్యాయ మూర్తులు, సిబ్బంది, కక్షిదారుల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వీఐపీలు సహా ప్రతి ఒక్కరూ సులభంగా రాకపోకలు సాగించేందుకు రెండు మార్గాలను సిద్ధం చేయడంతో పాటు న్యాయమూర్తులకు ప్రత్యేక మార్గం సిద్ధం చేశారు.

court 03022019 3

దక్షిణ, పడమర మార్గాల ను సిబ్బంది, న్యాయవాదులకు ప్రత్యేకంగా కేటాయించారు. ఉత్తరం వైపు మార్గంలో సాధా రణ ప్రజలు, తూర్పు వైపు న్యాయ మూర్తుల రాకపోకలకు కేటాయిం చారు. కోర్టుకు వచ్చే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకు, ప్రాథమిక చికిత్సా కేంద్రం, పోస్టాఫీసును ఏర్పాటు చేశారు. మొదటి, రెండో అంతస్తుల్లో కోర్టు గదులు, అనుబంధంగా న్యాయమూర్తుల కార్యాలయాలు ఉంటాయి. ఆదివారం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని శనివారం హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పరిశీలించారు. భద్రత, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

అమరావతిలో ఒకే రోజు శాశ్వత హై కోర్టుకు శంకుస్థాపన, తాత్కాలిక హై కోర్టు ప్రారంభోత్సవం జరగనున్నాయి. రేపు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చేతుల మీదుగా 11 గంటలకు ప్రారంభోత్సవం జరగనుంది. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు,ఏపీ,తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఆర్డీఏ కమీషనర్ శ్రీధర్ హై కోర్ట్ ప్రారంభోత్సవం పనులు పరిశీలించారు. ఆరు నెలల్లో జ్యూడిషల్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 23 కోర్టు హాళ్లు ఏర్పాటు చేసినట్టు తెలియజేసారు. హై కోర్టు ప్రారంభానికి వచ్చే న్యాయమూర్తులు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అమరావతి చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.

highcourt 020202019 1

సీఆర్డీ యే అధికారులతో టెలీకారన్ఫరెన్స్‌ నిర్వహించారు చంద్రబాబు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ మహత్తర ఘట్టం రాష్ట్ర చరిత్రలో నిలచిపోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. న్యాయ వ్యవస్థ సమగ్ర కార్యకలాపాలకు అమరావతి విశిష్ట కేంద్రంగా మారనుందన్నారు. అందులో భాగంగానే ఐకానిక్‌ హైకోర్టు కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఐదు అత్యుత్తమ ప్రపంచ శ్రేణి రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చరిత్రను తిరగరాస్తున్నారని, అమరావతి తెలుగు ప్రజలకు గర్వకారణమని, అభివృద్ధికి చిహ్నమని సీఎం స్పష్టం చేశారు. దాదాపు 62 సంవత్సరాల తర్వాత విజయవాడ-గుంటూరు ప్రాంతంలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవడం ద్వారా నవశకం ప్రారంభమైందన్నారు.

highcourt 020202019 1

భారత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఒక బలమైన స్తంభంగా ఆయన పేర్కొన్నారు. కొత్త రాజధానిలో న్యాయ కార్యకలాపాలు ప్రారంభం కావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన గొగోయ్‌ రాష్ట్ర తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించనుండటం మనకు గర్వకారణమన్నారు. రాబోయే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దేశంలోనే ఉత్తమ న్యాయస్థానంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా అమరావతిలో న్యాయ నగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. న్యాయ నగరాన్ని 450 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మిస్తామని తెలిపారు. తొలి దశ 2022 నాటికి పూర్తవుతుందని, రెండో దశ 2036 నాటికి పూర్తవుతుందని వివరించారు.

కేబుల్‌ చార్జీల విధానంపై టెలికాం నింయత్రణ సంస్థ (ట్రాయ్‌) నిబంధనలు విధించింది. ఈ మేరకు కేబుల్‌ ఆపరేటర్లు కాస్త చార్జీలు సవరిస్తూ తుది నిర్ణయం ప్రకటించారు. కొత్త విధానంలో వీక్షకులు ఎంపిక చేసుకునే ప్యాకేజీల ఆధారంగా పడే చార్జీలు భార మా.. కాదా అనేది బిన్నాభిప్రాయమే. సుమారు రూ.70 వరకు కొత్త ప్యాకేజీలు చార్జీలు పెరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ 29 నుంచి అమలు చేయాల్సిన నూతన విధానాన్ని గత నెలాఖరుకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొత్త విధానం ప్రకారం కేబుల్‌ ఛార్జీలు పెరుగుతాయి. ఇప్పటికే ఆయా ఛానల్స్‌ తమ ప్రసారాలలో ప్యాకేజీల టారిఫ్‌ ప్రకటిస్తున్న సంగతి తెల్సిందే.

teluguchannels 02022019

ప్రస్తుతం 400 ఛానల్స్‌ వరకు ఒకే రకమైన ప్యాకేజీలో ఆయా ప్రాంతాలననుసరించి రూ.200 నుంచి 300 రూపాయిల వరకు నెలవారీ బిల్లు చెల్లిస్తున్నారు. కొత్త విధానంలో ఛానల్స్‌ తమ గ్రూప్‌ ద్వారా ప్రసారమయ్యే ఛానల్స్‌ను ఒకే గుత్తగా (బొకేగా పిలుస్తారు) ఎంపిక చేసి దానికి ధర నిర్ణయించారు. రెండు వేర్వేరు చానల్స్‌ హెచ్‌డీ ప్రసారాల ప్యాక్‌లు కూడా ఉన్నాయి. తెలుగు చానళ్ల ధరలు ఇలా.. ఈటీవీ ఫ్యామిలీ ప్యాక్‌ (7 తెలుగు చానళ్లు) రూ.24, జెమినీ (7 తెలుగు చానళ్లు) రూ.30, స్టార్‌ మా (7తెలుగు, 3 ఇతర భాషా చానళ్లు) రూ.39, జీ తెలుగు (2 తెలుగు, 7 ఇతర భాషా చానళ్లు) రూ.20, మొత్తం రూ.113+రూ.20.34 జీఎస్టీ ఉంది. ఇక ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ అంటే ఉచితంగా లభించే తెలుగు, ఆంగ్ల న్యూస్‌ ఛానల్స్‌, డీడీ, ఇతర ఉచిత ఛానల్స్‌ ఉన్నాయి. ఇవన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ప్రీమియం ప్యాకేజీ రూ.130లో లభిస్తాయి.

teluguchannels 02022019

దీనికి 18శాతం జీఎస్టీ ఉంటుంది. రూ.130 బేసిక్‌ ప్యాకేజీ ట్యాక్స్‌తో కలిపి రూ.155 అవుతుంది. ఇతర ఛానల్స్‌, బొకేలు కావలసినవి ఎంపిక చేసుకోవచ్చు. అలాకార్ట్‌ (రెండు వేర్వేరు చానల్స్‌ ఒకే ప్యాక్‌) విధానంలో మాటీవీ హెచ్‌డి ఒక్కటే 19 రూపాయలు. సాధారణమైతే ఎస్‌డి 10 చానల్స్‌ బొకే రూ.39 ధరకు లభిస్తాయి. మొత్తం మీద పేఛానల్స్‌, ప్రీమియం ఛానల్స్‌ కలిపి రూ.285-300 వరకు నెలవారీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. డిజిటల్‌ వ్యవస్థతో కేబుల్‌ ప్రసారాలు సాగుతున్నాయి. అత్యంత నాణ్యతతో కూడిన ప్రసారాలను ప్రేక్షకులు వీక్షించే అవకాశం దక్కింది. ప్రస్తుతం 400 ఛానల్స్‌ వరకు ప్రేక్షకులకు అందుతున్నాయి. ప్యాకేజీ మారితే ఇక సాధారణ ప్రేక్షకులు తక్కువ ఛానల్స్‌ ఎంపిక చేసుకుంటే 18శాతం జీఎస్టీతో కలిపి ప్రస్తుతం చెల్లిస్తున్న బిల్లు కొనసాగే అవకాశముంది. ఎక్కువ ఛానల్స్‌ తీసుకుంటే ఆ ప్రకారం నెలవారి బిల్లు పెరగక తప్పదంటున్నారు.

 

Advertisements

Latest Articles

Most Read