ఏపికి లక్షల లక్షల కోట్లు ఇచ్చాం, మీరు బ్రతుకుతుందే, మా బిక్షతో అని ఫేక్ ప్రాపగాండా చెయ్యటం కోసం, ప్రధాని మోడీ వచ్చే నెలలో గుంటూరుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే నరేంద్ర మోదీ జవనరి నెల 6వ తేదీ గుంటూరు పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షడ్యుల్ లో నిర్ణయించిన ప్రకారం మోడీ, జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటన ఉంది. అయితే మోడీ కేరళ పర్యటన పై సందిగ్ధం ఉండటంతో, గుంటూరు పర్యటనా కూడా వాయిదా పడే అవకాసం ఉంది. ఈ విషయం పై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం, కేరళ బీజేపీ వర్గాలు నిర్ణయించిన ప్రకారం తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గుని, మధ్యాహ్నం నుంచి గుంటూరు పర్యటనకు మోడీ బయలుదేరాల్సి ఉంది. దీనికి తగ్గట్టుగా, గుంటూరు నగరంలో బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ నేతలు, ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు.

modi 28122018 2

అయితే ఇప్పుడు కేరళ బీజేపీ నేతలు, సభా వేదికను తిరువనంతపురంలో కాకుండా శబరిమలై సమీపంలోని పట్టణంతిట్టకు మార్చాలని, కేరళ బీజేపీ వర్గాలు బీజేపీ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రధాని సభ తిరువనంతపురంలో కాకుండా పట్టణంతిట్టలో జరిగితే మోదీ సకాలంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోలేరని, జనవరి 6న గుంటూరులో జరగాల్సిన సభ వాయిదా పడక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేరళ సభ నిర్వహణ ప్రాంతం పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్రధాని పర్యటన పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

modi 28122018 3

మరోవైపు పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 12, 13 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించాలని బీజేపీ అధిష్టానం తొలుత నిర్ణయించింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఈ సమావేశాలను ముందుకు జరపాలనే తర్జనభర్జనలు పార్టీలో సాగుతున్నాయి. ఈ ప్రభావం కూడా సభ వాయిదాకు దారి తీయవచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి. కేరళలో మోదీ సభను శబరిమలై సమీపంలోని పట్టణంతిట్టకు మార్చాలని ఆ రాష్ట్ర కమలనాథులు కోరుకుంటున్నారు. ఎందుకంటే శబరిమలై ఆలయానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ ప్రాంతంలో నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. వీటితో తమకు ఆ ప్రాంతంలో సానుకూల వాతావరణం ఉందని కేరళ బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సందర్భంగా అక్కడ మోదీ సభ జరిగితే తమకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు.

అమరావతి నిర్మాణంలో మరొక కిలక ఘట్టం ఆవిష్కృతమైంది. సచివాలయం ఐదు టవర్ల నిర్మాణంలో భాగంగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం ప్రారంభించారు. శాంతి హోమం నిర్వహించిన తర్వాత సరిగ్గా ముహూర్త సమయం 8-50 గంటలకు ర్యాప్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే శ్రవణ్‌, స్థానిక నేతలు తదితరులు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారి అమరావతిలో ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పనులను చంద్రబాబు ప్రారంభించారు.

amaravati 271222018 2

11వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌తో సచివాలయ టవర్లకు ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వేస్తున్నారు. 13 అడుగుల లోతులో 4 మీటర్ల ఎత్తున ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ నిర్మాణం జరుగుతోంది. 72 గంటలపాటు ఏకధాటిగా ఈ పనులు జరగనున్నాయి. ఐదు టవర్లలో సచివాలయం, హెచ్‌వోడీల భవనాలు, డయాగ్రిడ్‌ నమూనాలో ఫ్రేమ్‌ ఆధారంగా టవర్ల నిర్మాణం జరగనుంది. 41 ఎకరాల్లో 69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ నిర్మాణం జరుగుతుంది. 50 అంతస్థులతో ఐకానిక్‌గా జీఏడీ టవర్‌ నిర్మాణం జరుగుతుంది. 225 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన సచివాలయ భవనం నిర్మించనున్నారు. భూకంపాలు, పెనుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా డిజైన్‌ రూపొందించారు.

amaravati 271222018 3

ఇది ఇలా ఉండగా, ఈ పనులు 72 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనున్నాయి. ఈ రోజు రాత్రి పూట కూడా పనులు వేగంగా సాగుతున్నాయి. అమరావతిలో ఒక్క ఇటుక కుడా పేర్చకుండా గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారని అడ్డమైనా వాగుడు వాగుతున్న వాళ్ళంతా అటువైపు పోయి ఒకసారి చూసిరండి. అక్కడ ఒక అద్భుతమైన మహనగరం రూపుదిద్దుకుంటుంది! 10గుజరాత్ లు కలిపిన ఈ మహనగరాన్ని తలదన్నలేవ్! అంతలా పనులు జరుగుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా అనేక బిల్డింగ్ ల పని జరుగుతుంది. ఒక పక్క హైకోర్ట్ పనులు చివరిలో ఉండగా, ఐఏఎస్, ఐపీఎస్, ఉద్యోగస్తులు హౌసింగ్, పేదల హౌసింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో పక్క రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయి. ఇలా ఎదో ఒక పనితో, 24/7 అమరావతి బిజీగా ఉంటే, కొంత మంది ఇంకా గ్రాఫిక్స్ అంటూ ఎందుకు అంటున్నారో వాళ్ళకే తెలియాలి.

‘ప్రధాని నరేంద్రమోడీ ఎవరేం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరు. ఏపీకి సాయం చేస్తే ఎక్కడ గుజరాత్‌ కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందో అన్న ఆందోళన ఉంది. కొందరు అవినీతి నాయకులు చెప్పిన మాటలు విని ఏపీ అభివృద్ధిని ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటున్నారు. విభజన హామలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా… విన్నవించుకున్నా… వినిపించుకోలేదు…” అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అవిశ్వాసం పెట్టి పోరాడకుండా కేసుల భయంతో పారిపోయారని, అయితే టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని గమనించిన దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పక్షాలు, దాదాపు 125 మంది ఎంపీలు మద్దతిచ్చారన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. బేషరతుగా కాంగ్రెస్‌ పార్టీ కూడా టీడీపీ పోరాటానికి మద్దతిచ్చిందన్నారు. ఇది ప్రాథమికంగా మనం సాధించిన విజయమన్నారు.

cbn modi 27122018 2

తెగతెంపులతోనే వేధింపులు… ‘రాష్ట్ర విభజన కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే బీజేపీతో 2014 ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి న్యాయం చేస్తామని నరేంద్రమోడీ ప్రతి ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు కాలయాపనతో మోసం చేశారు’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ నిధులు విడుదల చేయకుండా కేంద్రం వేధిస్తోందని మండిపడ్డారు. ఏకంగా రూ.3,400 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. ఇప్పటికే 63 శాతం పనులు పూర్తయ్యాయి. మొదటి గేటు ఏర్పాటు చేశాం. పోలవరం పనులు ఆపం. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ట్రంలోని ప్రతిపక్షపార్టీ కుట్రలు పన్నుతోందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వాటిని ఛేదిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

cbn modi 27122018 3

అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, రెవెన్యూలోటు, రైల్వే జోన్‌, కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, అనంతపురం జిల్లాలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌, యూనివర్శిటీలు ఇలా అన్నింటా మోసం చేశారని ధ్వజమెత్తారు. విద్యా సంస్థలకు రూ.11 వేల కోట్లు అవసరం. ఇంతవరకు కేంద్రం కేవలం రూ.600 కోట్లు ఇచ్చింది. ఇలాగైతే మూడు దశాబ్దాలు గడచినా వాటి నిర్మాణాలు పూర్తి కావు. అయినా భయపడం. రాష్ట్రమే సొంతంగా రూ.50 వేల కోట్ల పెట్టుబడితో రాజధాని పనులు చేస్తోంది. రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు భూములు ఇచ్చారు. అలా ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రానికి మనసు ఒప్పడం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వస్తోంది. గురువారం శంకుస్థాపన చేస్తాం. అలాగే అమరావతిలో ప్రపంచంలోనే సుందరమైన, ఎత్తైన సెక్రటేరియట్‌ను నిర్మించడానిక కూడా అప్పుడే శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మనకు న్యాయం జరగాలంటే కేంద్రం నుంచి నిధులురావాలంటే బీజేపీ ప్రభుత్వం పడిపోవాలి.

ప్రతి ఆరు నెలలకు ఎదో ఒకటి చేసి, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టటం, కేంద్రానికి అలవాటు అయిపొయింది. నోట్లు రద్దు, ఏటిఎం కష్టాలు, జీఎస్టీ, పెట్రోల్ రేట్లు, ధరల పెరుగుదల, ఇలా ప్రతి ఆరు నెలలకు, సామాన్యులను ఇబ్బంది పెడుతున్న కేంద్రం, ఇప్పుడు సామాన్య ప్రజలు వాడే కేబుల్ టీవీ పై పడింది. ట్రాయ్ కొత్త నిబంధనల పేరుతొ, బుల్లితెర వినోదం ఇకపై మరింత భారం కానుంది. సగటు టీవీ వినియోగదారులు ఈనెల భారీ మొత్తంలో కేబుల్‌ బిల్లు చెల్లిస్తే కాని టీవీ చూసే అవకాశం దక్కదనిపిస్తోంది. ట్రాయ్ న్యూ టారిఫ్‌ ఆర్డర్ వినియోగదారులకు పెను శాపంగా మారింది. అధిక చానల్స్‌ వాడకాన్ని అడ్డుకునే ఉద్దేశంతో ట్రాయ్ నూతన టారీఫ్‌ విధానాన్ని ఎంఎస్‌వోలపై తీసుకొచ్చింది. ప్రస్తుతం బుల్లితెర వినియోగదారులు, కేబుల్‌ అపరేటర్ల డీటిహెచ్‌ ప్రచారాల నిమిత్తం నెలకు కొంత మొత్తాన్ని చెల్లించి బల్క్‌గా వచ్చే ఛానల్స్‌ను చూస్తున్నారు. ప్రేక్షకులు చూడని ఛానల్స్‌కు ఎంఎస్‌వోలు డబ్బులు వసూలుచేస్తున్నారని దీనివల్ల వినియోగదారుడికి భారం పడుతుందని ట్రాయ్ భావించింది.

yogi 27122018 3

ఇక పై వినియోగదారడు చూసే ఛానళ్ళకే డబ్బులు చెల్లిస్తే సరిపోతుందనే ఉద్ధేశంతో ఈ న్యూ టారీఫ్‌ విధానాన్ని జనవరి 1 నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం నెలకు రూ.200 నుంచి 300 చెల్లిస్తున్న వినియోగదారుడు ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌తో పాటు మరో 250 వరకు పేయిడ్‌ ఛానల్స్‌ను చూడగలుతున్నారు. ట్రాయ్ తాజా నిర్ణయంతో ఇంత తక్కువ మొత్తానికే అన్ని ఛానల్స్‌ వచ్చే అవకాశం ఇకపై వుండదని ప్రేక్షకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ను రూ.350 కి అందిస్తుండగా వీటిలో రోజువారి చూసే ఛానల్స్‌ వుంటున్నాయి. వీటిలో భక్తి, వార్త ఛానల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ ఉన్నాయి. వీటిలో లేని ఛానల్స్‌ను ప్రేక్షకుడు చూడాలనుకుంటే రూ.19 పెట్టి రీఛార్జ్‌ చేయించుకోవాల్సి వుంటుంది. ఈ విధంగా ఎన్ని ఛానల్స్‌ చూడలనుకుంటే అన్ని 19 రూపాయాలు చొప్పున చెల్లించాల్సి వుంటుంది. బాదుడు ఇలా…. : ట్రాయ్ తాజా నిర్ణయంతో వినియోగదారుడు తాను చూసే ఛానళ్ళకే డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం కొనసాగుతున్న విధానం ఈనెల 29తో ముగిసిపోతుంది. కొత్త టారీఫ్‌ ప్రకారం టీవీ ప్రేక్షకుడు రూ.150 చెల్లించి ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ చూడాలి. ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ 250 వరకు ఉన్నప్పటికీ రోజువారి చూసే ఛానల్స్‌ 30 మాత్రమే లభిస్తాయి. ఇవి కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ చూడలనుకుంటే అదనపు చార్జీలు చెల్లించాల్సిందే.

yogi 27122018 4

దాదాపు 400 చెల్లిస్తే గాని మనం ప్రస్తుతం చూస్తున్న నిత్యం ఛానల్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.. ఈ నూతన టారీఫ్‌ విధానంతో టీవీ ప్రేక్షకులపై భారం మోపాలని ట్రారు భావిస్తుందని కేబుల్‌ అపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "సాంకేతిక విప్లవం మనిషికి ఆధారం కావాలి తప్ప భారం కాకూడదు. సామాన్య ప్రజలకు ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్‌గా టీవీ ప్రస్తుతం నిత్యావసర వస్తువుగా మారింది. కేంద్రం దీన్ని పేదవాడికి భారం మోపేలా చేస్తుంది." అంటూ కేబుల్‌ అపరేటర్ల సంఘం సీమాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పక్కి దివాకర్‌ అన్నారు. అయితే, ఈ భారం తట్టుకోలేక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది, ఏపి ఫైబర్ వైపు వస్తున్నారు. తక్కువ ధరకు టీవీ, ఫోన్‌, ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించే ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టీవీ, ల్యాండ్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌లకు నెలకు రూ.149 అవుతుంది. దీనిపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. వీటికి సెటప్‌ బాక్స్‌ అవసరం. దీని ధర రూ.4వేలు నిర్ణయించడంతో వినియోగదారుల పై ఫైబర్‌ దూకుడు పెంచింది. ఈ నాలుగు వేలు కూడా నెల నేలా చెల్లించవచ్చు. నెలకు 236 ప్లాన్‌ తీసుకుంటే టీవీలో ప్రస్తుతం వస్తున్న అన్ని రకాల ఛానల్స్‌ విక్షించవచ్చు. ఇందుకోసం అధికమంది కేబుల్‌ అపరేటర్లుకు ఫ్రైబర్‌ నెట్‌ కనక్షన్ల్‌కు డిమాండ్‌ పెరిగింది.

Advertisements

Latest Articles

Most Read