కేంద్ర విధానాల పై దేశ వ్యాప్తంగా పోరాడుతూ, ముఖ్యంగా ఈవీఎంల పై, మహిళా రిజర్వేషన్ పై, చంద్రబాబుకి మద్దతు తెలుపుతూ, దేశ రాజకీయాల్లో కూడా మద్దతు ప్రకటిస్తూ, ఒరిస్సా సియం నవీన్ పట్నాయిక్ నిన్న తన ప్రతినిధిని అమరావతి పంపించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును, ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ కలిసి మద్దతు ప్రకటించారు. దీని పై చంద్రబాబు ట్వీట్ చేసారు. "ఒడిషా, ఆంధ్రప్రదేశ్ మధ్య స్నేహపూరిత సంబంధాలకు ముందడుగు వేశాం. ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్‌ ద్వారా జాతీయ స్థాయిలో మేము చేస్తోన్న పోరాటానికి మద్దతిచ్చిన ఒడిషా ముఖ్యమంత్రి @Naveen_Odishaకు అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకుంటాం." అంటూ ట్వీట్ చేసారు.

manikyalarao 25122018

మంగళవారం అమరావతికి వచ్చిన బీజేడీ ఎంపీ, సీఎం చంద్రబాబును కలిసి తమ నేత అభిమతాన్ని వివరించారు. ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తోన్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల స్థానంలో పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతోన్న ఏపీ చంద్రబాబు డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా ఉంటామని ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. తాను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని తన లేఖలో నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

manikyalarao 25122018

అలాగే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపైనా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోసారి బీజేపీ రాకూడదన్నది తమ సీఎం అభిప్రాయమని, ఈవీఎంలకన్నా, బ్యాలెట్ పేపర్లపైనే తమకు ఎక్కువ విశ్వాసముందని సౌమ్యా రంజన్ పట్నాయక్ అన్నారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అంశాన్ని కంప్యూటర్ చిప్‌లను తయారు చేసే మేనేజర్ల చేతిలో పెట్టడం ప్రమాదకరమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సౌమ్యా రంజన్ కూడా అంగీకరించారు. వీరిద్దరి భేటీలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా పాల్గొన్నారు.

రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై గత మూడు రోజులుగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బుధవారం మరో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రైతు సంక్షేమంపై విడుదల చేసిన ఈ శ్వేతపత్రంలో రాష్ట్రంలో రైతులు, వ్యవసాయం అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులను రుణవిముక్తి చేయాలని సంకల్పించామని.. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామని చంద్రబాబు చెప్పారు. ధనిక రాష్ట్రాలు కూడా చేయని విధంగా రూ.1.50లక్షల వరకు రుణాలను మాఫీ చేశామన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక 62 ప్రాజెక్టులు చేపట్టగా వాటిలో 17 పూర్తి చేశామని, మరో 6 ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగతా ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పట్టిసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలమైందని, పట్టిసీమ నీళ్లు శ్రీశైలానికి మళ్లించి అక్కడి నుంచి రాయలసీమకు తీసుకెళ్లామని.. వర్షాలు పడకపోయినా ఇబ్బందిలేని విధంగా చేశామని చెప్పారు.

cbn protest 26122018

రాష్ట్రంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని చంద్రబాబు తెలిపారు. ప్రచారంలో రైతు రుణమాఫీపై హామీ ఇవ్వాలని మోదీని అప్పుడు కోరానని, దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందని ఆయన పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. కాని ఇప్పుడు మాత్రం, రైతులని పట్టించోకుండా, కార్పొరేట్ వ్యక్తులకు రుణాలు మాఫీలు చేస్తున్నారని అన్నారు. 2014లో ఏపీలో ఆత్మహత్యలు, కరెంట్ కోతలతో రైతులు అల్లాడేవారనీ, చివరికి కోనసీమ వాసులు కూడా ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. గత 20 ఏళ్లలో 16 సంవత్సరాలు అనంతపురం జిల్లాలో కరవు విలయతాండవం చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇవన్నీ ఆ రోజు మోడీకి చెప్పి, మేం రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పాం. మీరూ ఓ మాట చెప్పండి’ అని తాను కోరాననీ, ఇందుకు ప్రతిగా ‘నేను చెప్పను. ఒకవేళ ఇక్కడ చెబితే దేశమంతా అమలు చేయాల్సి ఉంటుంది’ అని మొహం మీదే చెప్పారని, ఇప్పుడు కార్పొరేట్ లకు మాఫీలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

cbn protest 26122018

రాష్ట్రంలో ఆక్వా రంగానికి పెద్దపీట వేశామని, ఉద్యాన పంటలను ప్రోత్సహించామని చంద్రబాబు చెప్పారు. దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు నమోదవుతున్నాయని, ఏపీలో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గించగలిగామన్నారు. ఈ నాలుగుళ్ల కాలంలో వ్యవసాయానికి రూ.2.52 లక్షల కోట్లు కోట్లు ఖర్చుపెట్టామన్నారు. దేశంలో వ్యవసాయానికి అత్యధికంగా ఖర్చు చేసింది ఏపీ ప్రభుత్వమేనని చెప్పారు. నదుల అనుసంధానంతో గోదావరి నీళ్లు కృష్ణాకు తెచ్చామన్నారు. తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామని చంద్రబాబు వివరించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే మిగతా రంగాలూ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేదని విధంగా కౌలు రైతులకు రూ.9,411 కోట్లు ఇచ్చామన్నారు. దీంతో 25లక్షల మంది కౌలురైతులకు మేలు చేకూర్చామని సీఎం తెలిపారు.

 

ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధిలో కీలక దశలో ఉందని, అడ్డంకులు పెట్టేందుకు దుష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయని, అందరూ విజ్ఞతతో ఆలోచించాలని, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెదేపా నేతలతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తన ముందు ప్రధానంగా మూడు బాధ్యతలున్నాయని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం, పార్టీ బాధ్యతలను తాను చూసుకోవాల్సి ఉందన్నారు. ఎవరికీ చెడ్డపేరు రాకుండా అందరినీ కలుపుకొంటూ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 150 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లే లక్ష్యంగా నేతలంతా కృషి చేయాలన్నారు. శ్వేతపత్రాల్లో జరిగిన అభివృద్ధిని వివరించామని, కేంద్రం తోడ్పాటు లేదనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు తెలిపారు. 620 అవార్డులు సాధించడం దేశంలోనే రికార్డ్ అని అన్నారు. ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

cbn protest 26122018

విభజన గాయంపై కారం పూయడానికే ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని.. అందుకే చెప్పేందుకు ఏమీ ఉండదన్నారు. విభజన చట్టంలో ఉన్నవి చేయలేదని, ఇచ్చిన హామీలనూ నెరవేర్చలేదని విమర్శించారు. రాజధాని పనులనో, పోలవరం పనులనో చూసేందుకు వస్తే బాగుండేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పనుల పరిశీలనకు కాకుండా పార్టీ కార్యక్రమాలకు రావడమే మోదీ రాజకీయమని దుయ్యబట్టారు. ప్రధాని పర్యటనకు గైర్హాజరు కావడమే తీవ్ర నిరసన అని చెప్పారు. ఆయన పర్యటకు ఎవరూ హాజరుకాకుండా గుణపాఠం చెప్పాలని కోరారు. జనవరి 1న రాష్ట్ర వ్యాప్తంగా భాజపాకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనల్లో పాల్గొని శాంతియుతంగా నిరసన తెలపాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

cbn protest 26122018

ప్రధాని మోదీ గుంటూరు పర్యటనపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎందుకు మాట్లాడరని, ఆ రెండు పార్టీలు ఎందుకు నిరసనలు తెలపడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై తెదేపా 10 ధర్మపోరాట సభలు నిర్వహిస్తే వైకాపా, జనసేన ఏం చేస్తున్నాయని నిలదీశారు. రాయలసీమ ప్రజల చిరకాల కోరికగా ఉన్న కడప ఉక్కు పరిశ్రమకు రేపు శంకుస్థాపన చేస్తున్నామని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తోందని చంద్రబాబు వివరించారు. జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనాలని, శాంతియుతంగా నిరసనలు తెలపాలని సీఎం ఆదేశించారు. కేవలం పార్టీ కార్యక్రమానికి రావడమే మోదీ రాజకీయమని మండిపడ్డారు.

ప్రభుత్వాలు, మేము ఏమి చేసామో, ప్రజలకు చెప్పి, పాజిటివ్ వేవ్ లో ఎన్నికలకు వెళ్ళటం చాలా అరుదు. మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో చూసాం, కేవలం చంద్రబాబుని బూచిగా చూపించి ప్రచారం చేసేరే కాని, మేము ఇది చేసాం, ఇది చేసాం అని మాత్రం, ఎన్నికల ఎజెండాగా మార్చలేదు. చంద్రబాబు మాత్రం, తాను చేసిన పనులు, ఇప్పటికే నుంచే ప్రజల్లో చర్చకు పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు అయిదు నెలల ముందు చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్వేతపత్రాల విడుదలకి శ్రీకారం చుట్టారు. ఇలా మొత్తం పది శ్వేతపత్రాలను విడుదల చేయబోతున్నారు. పది రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిననాడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ఈ నాలుగున్నర ఏళ్ల తరవాత ఆయా శాఖల్లో సాధించిన అభివృద్ధి ఎంత? అనే అంశాలతోపాటు సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి అంశాలపై కూడా శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు.

manikyalarao 25122018

అధికారంలో ఉన్న వాళ్ళు, ఎవరూ చెయ్యని విధంగా, చంద్రబాబు మదిలో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే అంశంపైనే అటు టీడీపీ వర్గాల్లోనూ, ఇటు ప్రభుత్వ యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. పెథాయ్ తుపాన్ కారణంగా రాష్ట్రంలో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం నష్టపరిహారం పెంచింది. దానితోపాటు అప్పటికప్పుడే ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీని కూడా ప్రారంభించింది. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, రైతులను ఆదుకునేందుకు రాష్ట్రసర్కారు ఉదారంగా ముందుకు వచ్చిన వైనాన్ని వివరిస్తూ శ్వేతపత్రం ప్రకటిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. ఇదే ఆలోచనను ఆయన చంద్రబాబుతో కూడా పంచుకున్నారు. అప్పుడు అంతగా స్పందించని చంద్రబాబు ఆ తర్వాత ఈ అంశంపై సుదీర్ఘంగా ఆలోచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పడమే కాకుండా 2014నాటి పరిస్థితి ప్రస్తావిస్తూ 2019 వరకూ సాధించిన ప్రగతిని వివరిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేస్తే అవి ప్రజల్లోకి వెళతాయని ముఖ్యమంత్రి భావించారు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా రాత్రికి రాత్రే శ్వేతపత్రాలను విడుదల చేస్తామని ప్రకటించారు.

manikyalarao 25122018

జనవరి ఆరవ తేదీన ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు జిల్లాకు వచ్చి బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా గత నాలుగున్నర ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సాయం గురించి లక్షల లక్షల కోట్లు ఇచ్చామంటూ, ప్రజలని గందరగోళానికి గురి చేస్తారు. ఇదే మంచి తరుణమని భావించిన తెలుగుదేశం ఒక అడుగు ముందుకు వేసింది. శ్వేతపత్రాల రూపంలో ఈ నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వపరంగా సాధించిన అభివృద్ధిని వివరించబోతోంది. పనిలో పనిగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఏపీ పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి, ప్రత్యేకహోదా విషయంలో ప్లేటు ఫిరాయించడం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి అంశాలను కూడా ప్రజల ముందుకు తేవాలని నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన మొదలైన శ్వేతపత్రాల విడుదల జనవరి 1వ తేదీ వరకు కొనసాగుతుంది. వీటన్నింటిపై గ్రామస్థాయి వరకు చర్చ జరగాలనీ, వాటిలోని విషయాలు ప్రజల్లోకి వెళ్లాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. పత్రికల్లోనూ, ప్రసార సాధనాల్లో కూడా వీటికి ప్రాచుర్యం కల్పించాలని భావిస్తున్నారు. సోమిరెడ్డి మెదడులో పుట్టిన ఒక ఆలోచన చివరకు రాష్ట్రంలో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి అటు పొలిటికల్ కౌంటర్‌తో పాటు, ఇటు ప్రజలకు చేసింది చెప్పుకునేందుకు కూడా వీలు కల్పించింది.

 

Advertisements

Latest Articles

Most Read