టాలెంట్ ను ప్రోత్సహించటంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. గతంలో క్రీడాకారులును ఎంకరేజ్ చెయ్యటం మనం చూసాం, అలాగే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారిని స్వయంగా ఫోన్లు చేసి మరి అభినందించే వారు. అలాగే వివిధ ప్రతిభ చూపించిన అనేక మందికి, స్వయంగా కలుస్తూ, వారిని అభినందిస్తూ ప్రోత్సహించే వారు. ఇప్పుడు ఇదే కోవలో, తెలుగులో పాపులర్ గాయనిగా పేరు ఉన్న, విజయవాడ వాస్తవ్యులు గాయని స్మితకు చంద్రబాబు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇదే విషయాన్ని స్మిత స్వయానా ఆమె తన ట్విట్టర్ లో ఎకౌంటులో పెట్టారు. స్మిత గాయనిగా కెరీర్ ప్రారంభించి 20 ఏళ్ళు అయ్యింది. మన తెలుగు అమ్మాయి, పాప్ సాంగ్స్ పాడటం చాలా అరుదు. అలాంటిది, స్మిత ఏకంగా 20 ఏళ్ళు అదే ఫీల్డ్ లో ఉన్నారు. ఈ నేపధ్యంలో, 20 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా, ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

smita 21072019 2

ఇదే కోవలో చంద్రబాబు కూడా ఆమెను అభినందించారు. దీనికి సంబంధించి ఒక లేఖను స్మితకు చంద్రబాబు పంపారు. ‘నటి, గాయని స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు ఆహ్లాదం కల్గిస్తున్నందుకు అభినందనలు. శ్రోతలను అలరించడానికి వివిధ రూపాల్లో పాటలను వేదికగా చేసుకుని స్మిత సాగిస్తున్న ప్రయాణం అనిర్వచనీయం. కాలానికి అనుగుణంగా పాటల పందిరి నిర్మాణం మరింత జనరంజకం అవుతుందని విశ్వసిస్తున్నాను. ఒక్క తెలుగులోనే కాకుండా సంగీతానికి ఎల్లలు లేవరని తెలుపుతూ 9 భాషల్లో పాటలు పాడిన ఘనత సాధించడం ప్రశంసనీయం. భవిష్యత్తులోనూ స్మిత తన మధుర కంఠంతో ఇలానే అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

smita 21072019 3

గాయనిగా స్మిత, తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిన్నటితో ఇరవై సంవత్సరాలు పూర్తయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో స్మిత ఒకే ఒక్క ‘ఇండిపాప్‌’ కావడం విశేషం. 1996లో ఈటీవీలో వచ్చే పాడుతా తీయగా కోసం తొలిసారి మైక్‌ పట్టుకుని, ఇప్పటి వరకు అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్మిత తన కెరీర్ ను మలుచుకున్నారు. 1999లో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్మిత, నిన్నతో తన కెరీర్ లో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదీ ఇలా ఉంటె, తన కెరీర్ 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా, హైదరాబాద్‌లో ఈ నెల 22న ‘ఎ జర్నీ 1999–2019’ పేరుతో ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ చూసిన స్మిత, అది ట్విట్టర్ లో పెడుతూ, ఇది నిజంగా నాకు సర్‌ప్రైజ్‌... ధన్యవాదాలు చంద్రబాబు గారు అని పెట్టి, లెటర్ కూడా పోస్ట్ చేసారు.

వైసీపీ ప్రభుత్వానికి తొందరగానే హనీమూన్ పీరియడ్ అయిపోయినట్టు ఉంది. 50 రోజులకే ఎమ్మెల్యే పై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రతి రోజు జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి దగ్గర ఆందోళనలు చేస్తున్నా, అవి పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. అయితే ఈ రోజు నెల్లూరులో ప్రజల తిరుగుబాటు చేసి, అధికార పార్టీ ఎమ్మెల్యే, అధికారులు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో, కోట మండలం కొత్తపట్టణంలో లెథర్ ఫ్యాక్టరీ పై, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఇక్కడ మీటింగ్ కు గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్‌, గూడూరు సబ్‌ కలెక్టర్‌ ఆనంద్‌ లు హాజరయ్యారు. అధికార పక్షానికి సంభందించి, పేర్నాటి శ్యాం ప్రసాద్‌ రెడ్డి, ఈ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చాలా ఏళ్ళగా పోరాటాలు చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడకు వచ్చారు.

leather 20072019 2

అయితే ఇక్కడ తోళ్ళ పరిశ్రమ ఏర్పాటుకు మేము సిద్ధంగా లేవని, అక్కడకు వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో సభ అంతా రసాభాస అయ్యింది. ఎమ్మెల్యే, సబ్‌ కలెక్టర్‌ ఎంత సర్ది చెప్పటానికి ప్రయత్నించినా, వాళ్ళు వినలేదు. ఈ తోళ్ళ పరిశ్రమ ఏర్పాటు వెనుక గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్‌ హస్తం ఉందని, ఆయనకు 30 కోట్లు లంచాలు అందాయని నినాదాలు చేసారు. సొంత పార్టీ నేత అయిన పేర్నాటి శ్యాం ప్రసాద్‌ రెడ్డి, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించటంతో, ఎమ్మెల్యే కూడా షాక్ అయ్యారు. ప్రజలు తిరగబడి, స్టేజి పైన ఉన్న కుర్చీలు, టేబుల్స్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు అతి కష్టం మీద ఎమ్మెల్యే, సబ్‌ కలెక్టర్‌ ను అక్కడ నుంచి, సురక్షితంగా బయటకు తరలించారు. తోళ్ళ పరిశ్రమ వద్దు అంటూ ఇక్కడ 10 ఏళ్ళుగా పోరాటం జరుగుతుంది.

leather 20072019 3

2010 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కోట మండలం, కొత్తపట్నం పంచాయతీ పరిధిలో కెపిఐఎల్ కృష్ణపట్నం పోర్ట్‌ ఇంటర్నేషనల్‌ లెదర్‌ కాంప్లెక్స్‌, ఇండిస్టీ ఏర్పాటుకు సిద్ధం అయ్యింది. అప్పటి నుంచి ఈ పరిశ్రమ మాకు వద్దు అంటూ ఆందోళనలు చేస్తున్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రజల సెంటిమెంట్ గ్రహించి, పరిశ్రమ వర్గాలు ఎంత ఒత్తిడి చేసినా, ఇక్కడ పరిశ్రమను మాత్రం ఏర్పాటు చెయ్యలేదు. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటంతో, పరిశ్రమను పెట్టాలని మళ్ళీ డిసైడ్ అయ్యారు. దీనికి వైసిపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండటంతో, పరిశ్రమను పెట్టటానికి రెడీ అయ్యారు. దీంతో ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించటంతో, అక్కడ ప్రజలు అందరూ, ఈ ఫ్యాక్టరీ మా దగ్గర వద్దు అంటూ తీవ్ర ఆందోళన చేసారు, ఎమ్మెల్యేను కొట్టే దాకా వెళ్లారు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

వైసిపీ పార్టీలో నెంబర్ టు అయిన విజయసాయి రెడ్డి కృషి అంతా ఇంతా కాదు. ఢిల్లీ లెవెల్ లో జగన్ కు సంబంధించిన విషయాలు అన్నీ చక్కబెట్టటంలో ఆరితేరిపోయారు విజయసాయి రెడ్డి. అందుకే ఆయానకు ఎన్ని విమర్శలు వచ్చినా, రాజ్యసభ సీటు కట్టబెట్టారు జగన్. అంతటితో ఆగలేదు, అధికారం రాగానే, నిబంధనలు సడలించి మరీ, ఆయనకు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యెక ప్రతినిధిగా నియమించారు. ఇంత ప్రాధాన్యత జగన్ ఇస్తున్నారు అంటే, విజయసాయి రెడ్డి చేస్తున్న సేవలు అంత ముఖ్యవైనవి. తక్కువ కాలంలోనే, ప్రధాని మోడీ చేత, విజయ్ గారు అని పిలిపించుకున్నారు అంటే, విజయసాయి రెడ్డికి ఢిల్లీలో ఉన్న పలుకుబడి ఏంటో ఇట్టే అర్ధమై పోతుంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఎవరినీ నమ్మకపోయినా, విజయసాయి రెడ్డిని మాత్రం అందలం ఎక్కించారు.

vsreddy 20072019 2

ఇంతకీ విజయసాయి రెడ్డి సక్సెస్ ఫార్ములా ఏంటో ఆలోచిస్తే మనకు ఇట్టే అర్ధమై పోతుంది. అయిన సక్సెస్ ఫార్ములా, ఒక బోకే, ఒక శాలువా, ఒక వెంకటేశ్వర స్వామీ విగ్రహం. వీటితోనే ముందు ఢిల్లీ పెద్దలతో పరిచయాలు పెంచుకుని, వారికి దగ్గర అయిపోతున్నారు. మొన్నా మధ్య రాష్ట్రపతి ఎన్నికల సమయంలో విజయసాయి రెడ్డి తీరు చూసి అందరూ ఆశ్చర్య పోయారు. రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో బీజేపీ పెద్దలు చెప్పకుండానే, ఎవరి పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయో, వారిని ముందే కలిసి వారికి బోకే ఇచ్చి, ఫోటో దిగేవారు. అప్పట్లో ఆయన తీరుతో అందరూ అవాక్కయ్యారు కూడా. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారో, ఢిల్లీ లీడర్స్ కు అర్ధం కాలేదు. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి అనుకోండి. రాష్ట్రపతిగా రాంనాద్ కోవిండ్ డిసైడ్ అవ్వగానే, ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం కూడా తీసుకున్న సీన్లు మనం చూసాం.

vsreddy 20072019 3

అయితే ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారు విజయసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఒరిస్సాకు చెందిన, బిశ్వభూషన్ హరిచందన్‌ను రాష్ట్రపతి నియమించిన సంగతి తెలిసిందే. ఆయన 23 తారీఖున విజయవాడ వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, అంత కంటే ముందే, ఈ రోజు, బిశ్వభూషన్ హరిచందన్‌ను భువనేశ్వర్ లో కలిసారు విజయసాయి రెడ్డి. ఆయనకు బోకే, శాలువా, వెంకటేశ్వర స్వామి ఫోటో బహుకరించి, మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. అయితే, విజయసాయి రెడ్డి ఇంత హడావిడిగా, ఆయన విజయవాడ రాక ముందే, ఎందుకు వెళ్లి కలిసారో అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గవర్నర్ ను మచ్చిక చేసుకునే విషయంలో, ముందుగానే అక్కడి దాకా వెళ్ళారని, గవర్నర్ తో మంచి సంబంధాలకు ఇది దోహద పడుతుంది, వైసిపీ నేతలు అంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నంత వరకు, చంద్రబాబు పై లేని కుల పక్షపాతి ఇమేజ్ ను సృష్టించారు. నిజానికి చంద్రబాబు దగ్గరకు ఎవరైనా నా కులం, మీ కులం ఒక్కటే అంటే, నాకు ఈ పని చేసి పెట్టండి అని అంటే, వాళ్ళని ఆమడ దూరం కూర్చో పెడతారు. ఈ భయం వల్లే, ఎంతో మందికి సమర్ధత ఉన్నా వారిని పక్కన పడేసారు. అయినా సరే చంద్రబాబు కుల పక్షపాతి అని ప్రచారం చెయ్యటంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఒకానొక సందర్భంలో 38 డీఎస్పీలు తన సొంత కులం వారికే ఇచ్చారని జగన్ ప్రచారం చేసారు. ఇప్పటికీ ఆ పేర్లు ఏంటి అంటే మాత్రం చెప్పలేదు. కాని ప్రచారం చేసి, ప్రజలను నమ్మించటంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మాత్రం, నిజంగానే ఒకే కులానికి అధిక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

reddy 200072019 1

మొదట్లో అయుదుగురు డిప్యూటీ సియంలు అంటూ చెప్పి, వేరే వేరే కులాలకు ఇచ్చి, మంచి పని చేసారు అని అనిపించుకున్నారు. కాని తరువాత నుంచి అసలు సినిమా మొదలైంది. నిజానికి ఇది ఒక, డేంజర్ డ్యామేజింగ్ గేమ్. జగన్ మోహన్ రెడ్డి ఈ గేమ్ తెలిసి ఆడుతున్నారా లేక ఎవరూ గమనించటం లేదులే అనుకుంటున్నారా ఏమో కాని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఒకే కులానికి అధిక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ప్రజలలో అభిప్రాయం ఏర్పడితే మాత్రం, ఇక ఆ పార్టీ అవుట్ అయినట్టే లెక్క. చంద్రబాబుకి ఫేక్ ప్రచారం చేస్తేనే టిడిపి పరిస్థితి ఇలా ఉంది, అలాంటిది జగన్ మోహన్ రెడ్డి, అందరూ చూస్తూ ఉండగా, ఒకే కులానికి పదవులు ఇస్తుంటే, ఇది నిజంగా డేంజర్ డ్యామేజింగ్ గేమ్ అనే చెప్పాలి. ఇది ఎలా సమర్ధించాలో తెలియని స్థితిలో వైసిపీ శ్రేణులు ఉన్నాయి. ఏదైతే తప్పు అని ప్రచారం చేసామో, అదే ఇప్పుడు జగన్ చేస్తున్నారని అంటున్నారు.

reddy 200072019 1

మచ్చుకు కొన్ని చూడండి , ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి గా కె. ధనుంజయ రెడ్డి ,ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి గా పి. కృష్ణ మోహన్ రెడ్డి ,ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి గా నాగేశ్వర రెడ్డి ,ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు గా అజేయకల్లం రెడ్డి ,తూడా ఛైర్మెన్ గా చెవిరెడ్డి. బాస్కర్ రెడ్డి ,టిటిడి ఎక్స్ ఆఫిసియో సభ్యులు గా చెవిరెడ్డి. బాస్కర్ రెడ్డి ,టిటిడి ఛైర్మెన్ గా వై. వి. సుబ్బారెడ్డి ,APIIC ఛైర్మెన్ గా రోజా రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సహాదారు గా సజ్జల రామక్రిష్ణా రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల సలహాదారు శైలజా. రామకృష్ణారెడ్డి , ఎపి భవన్ ప్రత్యేక ప్రతినిధి గా వి. విజయసాయి రెడ్డి , రాజ్యసభ పక్ష నేత గా వి. విజయసాయి రెడ్డి ,వైకాపా పార్లమెంటరి పార్టీ నేత గా వి. విజయసాయి రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గా వి. విజయసాయి రెడ్డి , ప్రభుత్వ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులు గా వి. విజయసాయి రెడ్డి , ఎయిమ్స్, మంగళగిరి డైరెక్టర్ గా వి. విజయసాయి రెడ్డి. , లోక్ సభ పక్ష నేత గా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి ,లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి , రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులు గా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గా గడికొట. శ్రీకాంత్ రెడ్డి , ప్రభుత్వ విప్ గా కాపు. రామచంద్రా రెడ్డి ,ప్రభుత్వ విప్ గా పిన్నేల్లి. రామక్రిష్ణా రెడ్డి ,ప్రభుత్వ విప్ గా గంగుల. ప్రభాకర్ రెడ్డి , రైతు సాధికార సంస్థ ఛైర్మెన్ గా వై. మదుసుదున్ రెడ్డి ,రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా చల్లా. మదుసుదున్ రెడ్డి , PKM అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటి ఛైర్మెన్ గా యం. సుబ్రమణ్యం రెడ్డి ,

రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పొన్నవొలు. సుధాకర్ రెడ్డి , రాష్ట్ర ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సలహాదారు గా వి. యన్. భరత్ రెడ్డి ,ఉన్నత విద్యా మండలి ఛైర్మెన్ గా కె. హేమచంద్రా రెడ్డి ,CRDA ఛైర్మెన్ గా అళ్ల రామకృష్ణా రెడ్డి , వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యం. వి. ఎన్. నాగిరెడ్డి ,వ్యవసాయ మిషన్ సభ్యులు గా పి. రాఘవ రెడ్డి ,వ్యవసాయ మిషన్ సభ్యులు గా చంద్రశేఖర రెడ్డి ,నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ కోటంరెడ్డి. శ్రీనివాసులు రెడ్డి ,రాష్ట్ర ఐటి సలహాదారు గా కె. రాజశేఖర రెడ్డి ,రాష్ట్ర ఐటి సలహాదారు గా శ్రీనాధ్ దేవి రెడ్డి ,ఆంధ్రా యూనివర్సిటీ విసి గా ప్రసాద్ రెడ్డి ,ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా బైరాగి రెడ్డి ,ఆంధ్రా యూనివర్సిటీ, సీటిసీ డీన్ గా పాండురంగా రెడ్డి ,రాజీవ్ గాంధీ యునివర్సిటి విసి గా కె. సి. రెడ్డి ,విండ్ & సోలార్ పవర్ సంప్రదింపుల కమిటీ సభ్యులు గా బి. రాజేంద్రనాధ్ రెడ్డి ,విండ్ & సోలార్ పవర్ సంప్రదింపుల కమిటీ సభ్యులు గా బి. శ్రీనివాసులు రెడ్డి ,విండ్ & సోలార్ పవన్ సంప్రదింపుల కమిటీ సభ్యులు గా డి. కృష్ణ గోపాల్ రెడ్డి , క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు గా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ,క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులు గా వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి ,క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు గా మేకపాటి. గౌతమ్ రెడ్డి ,రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సలహాదారు గా జె. విద్యాసాగర్ రెడ్డి. , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గా కాసా. జగన్ మోహన్ రెడ్డి. ,రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు భూమిరెడ్డి. చంద్రశేఖర రెడ్డి. ,రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు బి. సాంబశివా రెడ్డి. ,రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు కసిరెడ్డి. సతీష్ కుమార్ రెడ్డి. ,రాయలసీమ యూనివర్సిటీ విసి సివీ కృష్ణా రెడ్డి. ,శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మళ్లికార్జున రెడ్డి. ,శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీధర్ రెడ్డి. , SVBC ఛైర్మెన్ పృథ్వీరాజ్ బాలి రెడ్డి. , ఏవియేషన్ ఆడ్వజైర్ వి. యన్. భరత్ రెడ్డి.

Advertisements

Latest Articles

Most Read