రోజుకి ఒక విధంగా చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్న జగన్ ప్రభుత్వం, ఈ రోజు కూడా మరో విషయంతో చంద్రబాబును ఇబ్బంది పెట్టింది. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, భద్రతా పరంగా ఎన్నో ఇబ్బందులు పెడుతూ వస్తున్న జగన్ ప్రభుత్వం, ఈ రోజు చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలోని ఆయన ఇంటికి ఇస్తున్న భద్రతను పూర్తిగా తగ్గించి సంచలన నిర్నయంట్ తీసుకుంది. ఇప్పుడు చంద్రబాబు ఇంటికి ఇచ్చే భద్రత బాధ్యతజు, కేవలం చంద్రగిరి పోలీస్ స్టేషన్ సిబ్బందికి పరిమితం చేశారు. మొన్నటికి మొన్న, చంద్రబాబు కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రత తొలగించిన ప్రభుత్వం ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భద్రతను పూర్తిగా తగ్గిస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారి చేసింది. ఈ రోజు నారావారి పల్లెలో చంద్రబాబు ఇంటి వద్ద భద్రత కుదించారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఇంటిని ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఓ ఆర్‌ఎస్ఐ, ఏఎస్ఐ, అయిదుగురు కానిస్టేబుళళ్ళు భద్రత ఇచ్చే వారు.
వారితో పాటుగా, చంద్రగిరి స్టేషన్‌కు చెందిన ఓ ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు కూడా ప్రతి రోజు భద్రత నిర్వహించేవారు. అయితే ప్రభుత్వం తాజగా ఇచ్చిన ఉత్తర్వులతో, పీఎస్పీ బెటాలియన్ పూర్తిగా భద్రత నుంచి తప్పుకుని, ఇక పై చంద్రగిరి పోలీసుస్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే అయన ఇంటి వద్ద భద్రత బాధ్యతలు చూస్తారు. అయితే దీని పై చంద్రబాబు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సియంగా ఉండగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఉక్కు పాదం మోపారని, వారు అంతా ఆయన పై కక్షతో ఉన్నారని, ఇలాంటి సమయంలో చిత్తూరు లాంటి చోట, చంద్రబాబు ఇంటికి సరైన భద్రత ఇవ్వకపోతే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.