వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ట్విట్టర్ లో అందరి పై వ్యంగంగా ట్వీట్ లు వేస్తూ కవ్విస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని పై కూడా అలాగే వ్యంగ్యంగా ట్వీట్ చేసి, కేశినేని నాని చేత లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకునేలా చేసుకున్నారు. గత వారం రోజులుగా, కేశినేని నాని, జగన్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రజా వేదిక కూల్చివేయటం మంచిది కాదని సూచిస్తూ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. అలాగే తరువాత కేసీఆర్, జగన్ భేటీ పై కూడా కేశినేని స్పందించారు. జగన్, కేసీఆర్ భేటీ తెలంగాణాకు అనుకూలంగా ఉందని, దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం లాభంగా లేదని కేశినేని నాని అన్నారు. జగన్ వైఖరి హైదరాబాద్ ను అభివృద్ధి చేసే విధంగా ఉంది అని అన్నారు. దీనికి సూచికగా, ప్రజా వేదిక కూల్చివెత, సింగపూర్ - గన్నవరం ఫ్లైట్ రద్దు అయిన ఫోటోలు జత చేసారు.

ఈ నేపధ్యంలో, ప్రతి ఒక్కరినీ ట్విట్టర్ లో గిల్లే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కేశినేని నాని ట్వీట్ ల పై స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో మీలాగా కొట్టుకోవాలా అని ప్రశ్నించారు. ‘‘మా జగన్ మోహన్ రెడ్డికి సామరస్యంగా ఎప్పుడు ఉండాలో, ఘర్షణ వైఖరి ఎప్పుడు అవలంబించాలో తెలుసు, మీరు మారండి అంటూ కేశినేని నానికి విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి ట్వీట్ కు స్పందించిన కేశినేని నాని ధీటుగా స్పందించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో, ఛార్జ్ షీట్ ఉన్న మీలాంటి వాళ్ళు మారాలి అని హితవు పలికారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి, బెయిల్‌ పై బయట తిరుగుతున్న మీ లాంటి వాళ్ళు మారాలని సూచించారు. మీలాంటి వాళ్ళు మారాలి కాని, క్లీన్ చిట్ ఉన్న తనలాంటి వాళ్లు కాదని, విజయసాయి రెడ్డికి ధీటుగా జవాబు ఇచ్చారు కేశినేని నాని. దీని పై విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

మొన్న జరిగిన ఎన్నికల్లో, చంద్రబాబుని ఓడించి, జగన్ ను గెలిపించటంలో, బీజేపీ కృషి ఎనలేనిది. అందుకే మోడీ కనపడగానే, జగన్ ఆయన కాళ్ళ మీద పడటానికి ట్రై చేసారు. అయితే చంద్రబాబుని తప్పించటంలో, బీజేపీ వ్యూహాలు అన్నీ పని చేసాయి. అన్ని వ్యవస్థలు దగ్గర ఉండటం వారికి ఇంకా ఈజీ అయ్యింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, చంద్రబాబుని మరింత బలహీన పరిచే కుట్ర మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చెయ్యటానికి, అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వాళ్ళు చెప్పే ప్రతిది తల ఊపే జగన్ ఉండటం, కేంద్రంలో బీజేపీ నే అధికారం ఉండటంతో వారికి, ఇప్పుడు తెలుగుదేశం నేతలను లొంగ దీసుకోవటం పెద్ద కష్టం ఏమి కాదు. ఓడిపోయి ఉన్న టైములోనే చంద్రబాబుని దెబ్బ తియ్యాలని, కోలుకునే టైం ఇస్తే, చంద్రబాబుని ఆపలేము అని గ్రహించిన బీజేపీ, తెలుగుదేశం పార్టీని బలహీన పరిచి, రాష్ట్రంలో తను పాగా వేసే ప్లాన్ చేస్తుంది. జగన్ మోహన్ రెడ్డిని కావలి అనుకుంటే 24 గంటల్లోనే లోపల వేసి, పార్టీని ఆధీనంలోకి తీసుకోవచ్చు, కాని చంద్రబాబు అలా కాదు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులని తమ వైపు తిప్పుకునే ప్లాన్ వేసింది బీజేపీ..

ఇందుకోసం, వ్యూహం రచించటానికి, ఆంధ్రపదేశ్ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, గుంటూరు జిల్లా మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్‌లో శనివారం రహస్యంగా భేటీ అయ్యింది. సమావేశంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలను లాక్కోవటం పైనే విస్తృతంగా చర్చించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ డియోదర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, పురంధ్రీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మరి కొంత మంది నేతలు హాజరయ్యారు. తెలుగుదేశం నుంచి ఎవరిని లాక్కోవాలి, ఎలా లాక్కోవాలి అనే వ్యూహం రచించారు. అలాగే వైసీపీ పార్టీ నుంచి ప్రస్తుతానికి, ఎవరినీ లాక్కో కూడదని నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా 75 మంది నేతలను బీజేపీలో చేర్చుకునే ప్లాన్ వేసారు. అయితే అధికారం ఉంది కాబట్టి, వారికి భయపడి నాయకులు వస్తారు. వాళ్ళు వస్తే, ఎన్నికలప్పుడు బీజేపీకి ఓట్లు ఎవరు వేస్తారు ? కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏపిలో బీజేపీకి ఓటు వేయని పరిస్థితి ఉంది. మరి నేతలను చేర్చుకుని బీజేపీ ఎలా బలపడాలని అనుకుంటుందో ? దాని బదులు విభజన హామీలు నెరవేరిస్తే, అప్పుడు ప్రజలు దగ్గర అవుతారు కదా ?

పట్టిసీమ అంటే అది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన జగన్, ఇప్పుడు అధికారం రావటంతో ఎలా వ్యవహరిస్తారా అని అందరూ ఎదురు చూసారు. ప్రజా వేదికని కూల్చినట్టు, పట్టిసీమను కూడా కూల్చేస్తారా అనే సందేహాలు వచ్చాయి. అయితే నాలుగు రోజుల క్రితం, సైలెంట్ గా పట్టిసీమ పంపులు ఆన్ చేసి, నీళ్ళు వదిలారు. అంటే పట్టిసీమ వేస్ట్ కాదు, కృష్ణా డెల్టాను కాపాడే వరప్రదాయని అని జగన్ ఒప్పుకున్నట్టే కదా.. అయితే అంతా సవ్యంగా ఉంది, మరి కొద్ది రోజుల్లో పట్టిసీమ ద్వారా నీళ్ళు వస్తాయి అని రైతులు అనుకుంటున్న టైంలో, మరో పిడుగు లాంటి వార్త వారిని కలిచి వేస్తుంది. పట్టిసీమ ప్రాజెక్ట్ ఆపెయ్యాలని చాలా మంది కోరుతున్నారు. అందులో ఏకంగా డిప్యూటీ సియం కూడా ఉండటం, ఇప్పుడు కృష్ణా డెల్టా రైతులను కలిచివేస్తున్న అంశం. స్థానికంగా రైతుల అవసరాలే ప్రస్తుతం తీరటం లేదని, ఇలాంటి పరిస్థితిలో పట్టిసీమ నుంచి నీటిని కృష్ణా డెల్టాకు తరలించటం, ఏ మాత్రం కరెక్ట్ కాదని, వెంటనే పట్టిసీమను నిలిపివేయాలని కోరుతూ, జగన్‌ దృష్టికి, ఈ అంశం తీసుకెళతానని డిప్యూటీ సియం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు.

శనివారం కల్లెక్టరేట్ లో జరిగిన, పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో, ఈ సమావేశానికి హాజరైన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, సమావేశం తరువాత డియాతో మాట్లాడారు. పట్టిసీమ నుంచి నీటిని తరలించడం పై ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా అసంతృప్తి వ్యక్తం చేసారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతుల అవసరాలకే, ఇక్కడ నీరు సరిపోవటం లేదని, ఇలాంటి సమయంలో ఎలా నీళ్ళను తరలిస్తారని మంత్రి ప్రశ్నించారు. అందుకే పట్టిసీమను ఆపెయ్యాలని, జగన్ కు ఉత్తరం రాస్తానని డిప్యూటీ సియం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. ఇక రైతు కార్యాచరణ సమితి అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు అయితే ఒక అడుగు ముందుకు వేసి, పట్టిసీమ ఎత్తిపోతల పథకం అక్రమ కట్టడమని, దాన్ని కూడా కూల్చేయాలని ముఖ్యమంత్రిని కోరతామని అన్నారు. అయితే పట్టిసీమ పంపులు ఆన్ అయ్యేది, గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రమే, అంటే గోదావరి నీరు సముద్రంలో కలిసే సమయంలో మాత్రమే, పట్టిసీమని ఆన్ చేస్తారు. మరి ఎందుకు పట్టిసీమను ఆపమంటున్నారో, కూల్చమంటున్నారో, వారికే తెలియాలి.

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఓ పెద్ద కంపెనీ ఉండాలి అనే టార్గెట్ తో, గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన కృషితో కృష్ణా జిల్లాకు కూడా ఒక పెద్ద కంపెనీ వచ్చింది. ఐటి రంగంలో పెద్దగా పెట్టుబడి అవకాశాలు లేకపోవటంతో, చంద్రబాబు ఆటోమొబైల్, మ్యానుఫాక్చరింగ్ రంగం వైపు అడుగులు వేసి, రాష్ట్రమంతటా పెట్టుబడులు తెచ్చారు. అందులో ముఖ్యంగా కృష్ణా జిల్లాకు తెచ్చిన పెద్ద కంపెనీ, అశోక్‌ లేల్యాండ్‌. ప్రపంచ వ్యాప్తంగా, బస్సులు, లారీలు తయారు చేసే కంపనీల్లో టాప్ 10లో ఉన్న కంపెనీ. చంద్రబాబు చొరవతో, మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో, ఈ ప్లాంట్, బస్ బాడీ యూనిట్ ని నెలకోల్పింది. 75 ఎకరాల్లో, తొలి దశలో రూ.150 కోట్లతో, బస్‌బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసారు. రెండో దశలో 200 కోట్లు పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్లాంట్ లో, ఏడాదికి, 4.800 ఎలక్ర్టికల్‌ బస్సులను ఉత్పత్తి చేయాలన్నది అశోక్‌ లేల్యాండ్‌ లక్ష్యం. దానికి అనుగుణంగా, ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారు.

అయితే అనూహ్యంగా ప్రభుత్వం మారింది. ఈ కంపెనీ తీసుకువచ్చిన చంద్రబాబు ఓడిపోయారు. అయితే, ఇప్పుడు ఈ కంపెనీ నిర్మాణం పూర్తి చేసుకుని, మొదటి బస్ ఉత్పత్తికి రెడీ అవుతుంది. మరో 15 రోజుల్లో ఈ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వచ్చేస్తుంది. ఇప్పటికే మొదటి బస్ కు సంబధించి, కొద్దిరోజులుగా ఎలక్ర్టికల్‌ బస్సులకు బాడీ నిర్మాణం చేపడుతున్నారని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న వారికి ఉపాధి ఇవ్వాలనే ఒప్పందంలో భాగంగా, ఎక్కువ మంది స్థానిక మహిళలే అక్కడ ఉపాధి పొందుతున్నారు. వీరే ఇక్కడ బస్ నిర్మాణం చేస్తున్నారని. నిపుణల పర్యవేక్షణలో, ఈ పని జరుగుతుంది. మల్లవల్లి నుంచి తయారు అయ్యే తొలి ఎలక్ర్టిక్‌ బస్‌, మన దేశానికి కాకుండా, ప్రపంచ మార్కెట్ కు కూడా ఉపయోగ పడేలా ఉంటుంది. అందుకు అనుగుణంగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా బస్ నిర్మాణం జరుగుతుంది. ఈ పనులు పూర్తయిన వెంటనే, మొదటి బస్ ను విడుదల చెయ్యనున్నారు.

Advertisements

Latest Articles

Most Read