నిన్న జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అధికారంలో కి వచ్చిన తరువాత, జగన్, ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవటం, ఇది నాలుగవ సారి. అయితే గతంలో జరిగిన మూడు సార్లు కంటే, ఈ సారి పర్యటన భిన్నంగా సాగింది. గతంలో జగన్ ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, ప్రధానితో పాటుగా, హోం మంత్రి అమిత్ షాని కలవటం, మరి కొంత మంది కేంద్ర మంత్రులను కలవటం జరుగుతూ వస్తుంది. తరువాత, ఆయన కాని, విజయసాయి రెడ్డి కాని, మీడియాతో మాట్లాడి, ప్రధానితో భేటీలో జరిగిన అంశాల పై మీడియాకు చెప్పే వారు. అయితే ఈ సారి మాత్రం, అందుకు భిన్నంగా జరిగింది. జగన్ మోహన్ రెడ్డి, కేవలం ప్రధానిని కలిసి, విజయవాడ వచ్చేసారు. ఒక పక్క విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే, బొగ్గు ఇవ్వమని కేంద్ర విద్యుత్ మంత్రికి వెళ్తారని అందరూ అనుకున్నారు. కాని అది జరగలేదు. అలాగే కేంద్ర జల శక్తి మంత్రి వద్దకు కూడా వెళ్ళలేదు. ఇక హోం మంత్రి అమిత్ షా వద్దకు కూడా జగన్ వెళ్ళలేదు.

jaganmodi 06102019 2

ఇది ఇలా ఉంటే, ప్రధాని మోడీతో భేటీ కూడా, అనుకున్నంత సాఫీగా జరగలేదని సంకేతాలు వచ్చాయి. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం అయ్యే, రైతు భరోసా కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోడీని కోరగా, తనకు బిజీ షెడ్యూల్ ఉందని, రావటం కుదరదని ప్రధాని చెప్పినట్టు తెలుస్తుంది. సహజంగా, ఇలాంటి సందర్భంలో, ప్రధానిని ముందే అప్పాయింట్మెంట్ అడగటం, లేకపోతే ఆయనకు వీలు ఉన్న సమయం కనుకున్ని, పధకం ప్రారంభించటం జరుగుతుంది. కాని, ప్రధాని వద్ద నుంచి సానుకూల స్పందన లేకపోవటంతో, ఆయన రారు అనే విషయం అర్ధమైంది. అయితే, ప్రధానిని, జగన్ కలిసే, రెండు రోజుల ముందే, రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలో వాలిపోయి, ప్రధానిని ఈ కార్యక్రమానికి, రావద్దు అని చెప్పినాట్టు సమాచారం. రైతు భరోసా పధకంలో, ఇచ్చే రూ.12,500లో, కేంద్ర వాటా 6 వేల కోట్లు ఉందని, కాని జగన్ మాత్రం ఈ పధకం పేరు వైఎస్ఆర్ భరోసా అని పెట్టారని, అధిష్టానికి ఫిర్యాదు చేసారు.

jaganmodi 06102019 3

ఒక పక్క కేంద్ర నిధులు పధకానికి వాడుతూ, ప్రధాని పేరు ఎక్కడ లేకుండా, బీజేపీకి ఎక్కడా క్రెడిట్ ఇవ్వకుండా, తన రాజకీయ ఎదుగుదల కోసం, వైఎస్ఆర్ పేరు వచ్చేలా ఈ పధకం పెట్టారని, అందుకనే ప్రధాని, రాకుండా చూడాలని, రాష్ట్ర బీజేపీ నేతలు, అధిష్టానానికి ఫిర్యాదు చెయ్యటంతో, ప్రధానిని ఇటు రాకుండా ఒప్పించారనే టాక్ నడుస్తాంది. ఇక ప్రధానిని కలిసిన వెంటనే, జగన్ మోహన్ రెడ్డి, అక్కడ వేచి ఉన్న మీడియాతో మాట్లాడకుండా, అక్కడ నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోయారు. రెండు గంటలు అక్కడ నిరీక్షించిన మీడియాతో కనీసం మాట్లాడలేదు. అంతకు ముందు, 1-జన్‌పథ్‌ లో దిగిన జగన్ నివాసం దగ్గర ఉన్న మీడియాను కూడా, అక్కడ నుంచి పంపించే వేసారు. మీడియాతో నిత్యం సమన్వయం చేసుకునే రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులను కూడా, జగన్ నివాసంలోకి రానివ్వలేదు.

ప్రభుత్వాలు వివిధ బ్యాంకుల నుంచి, వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకోవటం ఆనవాయతీ. కేంద్ర ప్రభుత్వం కాని, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇలా రుణాలు తీసుకుని, వాటిని తీరుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ఇలా వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ వస్తుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, ప్రభుత్వ విధానాలు, భ్యవిషత్తు ప్రణాలికలు, చంద్రబాబు పరపతి, ఇలా వివిధ అంశాలు కలిపి, ప్రభుత్వం అడిగిన వెంటనే రుణాలు ఇవ్వటానికి ముందుకు వచ్చే వారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఆ నిధులు ఖర్చు పెట్టటం, వాటిని తీర్చటం జరుగుతూ వస్తుంది. తాజగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాని అప్పు అడిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మూడు వేల కోట్లు అప్పు ఇవ్వమని, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాకు, గత నెల 23న దరఖాస్తు చేసుకున్నారు.

sbi 06102019 2

అయితే స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ నెల 30న వచ్చిన లేఖ చూసి, అధికార వర్గాలు అవాక్కయ్యాయి. మీరు ఇంత పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వమని అడిగారు, కాని మీ ఆర్ధిక పరిస్థితి ఒకసారి చూడండి, ఇప్పటికే ఉన్న అప్పులు తీరే మార్గం కనిపించటం లేదు, మీరు కొత్త అప్పు అడుగుతున్నారు, ఇంత అప్పు ఎలా తీరుస్తారు అంటూ, ప్రశ్నలు మీద ప్రశ్నలు వెయ్యటంతో, అధికారులు అవాక్కయ్యారు. సహజంగా వివధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వం, వివిధ సంస్థల నుంచి అప్పు తీసుకుంటూ, ఆ అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం గారంటీ ఉంటుంది. దీంతో ప్రభుత్వమే గ్యారంటీ ఉంది కదా అని రుణాలు ఇవ్వటానికి ముందుకు వస్తారు. ఈ సారి కూడా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్పు అడిగింది. గ్యారంటీ ఉంటానని కూడా చెప్పింది. ప్రభుత్వం ఈ అప్పుకి పూచీకత్తు ఇవ్వడానికి అంగీకారం తెలిపినా, ప్రభుత్వమిచ్చే పూచీకత్తుపై తాజాగా ఎస్‌బిఐ సందేహాలు వ్యక్తం చెయ్యటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

sbi 06102019 3

ఇవి లేఖలోని మిగతా అంశాలు... "2017లో 9,665 కోట్ల రూపాయలుగా ఉన్న ప్రభుత్వ పూచీకత్తులు ఇప్పుడు రూ.35,964 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగిన తీరుకు ఇది నిదర్శనం. తాజాగా దరఖాస్తు చేసిన 3వేల కోట్ల రూపాయల మొత్తానికి నూరుశాతం భేషరతుగా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తున్నప్పటికీ, చెల్లించాల్సిన అప్పు భారీగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సామర్ద్యాన్ని పరిశీలించాలి. ప్రభుత్వ సొంత నిధులతో పోలిస్తే చెల్లించాల్సిన అప్పులు 714 రెట్లు అధికంగా ఉన్నాయి, ఇది అత్యంత అసాధారణం. అసహజం. నాలుగు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ బాండ్లకు క్రిసిల్‌ 'డి' గ్రేడ్‌ ఇచ్చింది. నిర్దిష్ట సమయంలో బాండ్లు సైతం చెల్లింపులకు నోచుకోవడం లేదనడానికి ఇది ఉదాహరణ. ఒక ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తును దాని స్థానంలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఆమోదించడం లేదు." వీటితో పాటు, అప్పును ఎలా తీరుస్తారన్న విషయం పేర్కొనలేదని, ఎస్‌బిఐకి లేఖలో పెర్కుంది. ప్రభుత్వం ఈ లేఖకు ఇచ్చే సమాధానం బట్టి, ఎస్బీఐ లోన్ ఇచ్చే విషయంలో, ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది.

జగన్ మోహన్ రెడ్డికి, బీజేపీ వైపు నుంచి కష్టాలు వస్తూనే ఉన్నాయి. సహజంగా, ఒక పార్టీ అధినేత, మరో పార్టీని లెక్క చేసే పని ఉండదు కాని, ఇక్కడ పరిస్థితి వేరు. తన పై ఉన్న కేసులు వల్ల, బీజేపీని, ముఖ్యంగా, మోడీ, అమిత్ షాలకు కోపం రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. కళ్ళ ముందే శశికళ ఎపిసోడ్ ఉంది. అలాగే బీజేపీతో పెట్టుకునే, చంద్రబాబు ఓడిపోయారనే వాదన ఉంది. అందుకే బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ జగన్ వస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం, మాటి మాటికి జగన్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ, బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తూ, జగన్ కు చిరాకు తెప్పిస్తున్నారు. తాజగా జరిగిన టిటిడి బోర్డు నియామకంలో జరిగిన పొరపాటుతో, ఇప్పుడు జగన్ పై, ఒక సీనియర్ బీజేపీ నేత, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లకు ఫిర్యాదు చేసారు. అంతే కాదు, త్వరలోనే సుప్రీం కోర్ట్ లో కూడా ఫిర్యాదు చేస్తానని చెప్తున్నారు.

ttd 06102019 2

మొన్న కొత్త టిటిడి బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులే బయట రాష్ట్రాల వారికి, ఎక్కవు ప్రాధన్యత ఇచ్చారు. ఈ తరుణంలోనే టీటీడీ పాలకమండలి పాలకవర్గంలో సభ్యునిగా ఎన్నికయ్యారని, జాతీయ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సలహా మండలి సభ్యుడు రాజేష్‌శర్మకు నియమిస్తున్నట్టు ఫోన్ ద్వారా మెస్సేజ్ పంపి, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది టిటిడి. అయితే పొరపాటున ముంబైలో ఉన్న రాజేష్ శర్మకు బదులు, ఢిల్లీలో ఉన్న రాజేష్ శర్మకు పంపించమని, సారీ చెప్పి, ఈయన్ను పంపించి వేసారు. అయితే, ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రాజీవ్ శర్మ, ఇది తనకు తీవ్రంగా జరిగిన అవమానంగా భావించారు. వెంకటేశ్వర స్వామి తనకు అవకాసం ఇస్తే, జగన్ దాన్ని అడ్డుకున్నారని, ఆరోపిస్తున్నారు.

ttd 06102019 3

శనివారం రాజేష్ శర్మ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఏపి ప్రభుత్వం నియమించిన టిటిడి పాలకమండలి సభ్యుల నియామకాల పై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు. తాను ఉన్నత చదువులు చదువుకుని, ఒక ప్రొఫెసర్‌గా ఉంటూ గత రెండు దశాబ్ధాలుగా బీజేపీలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పారు. తనను టీటీడీ పాలకమండలి సభ్యునిగా నియమించినట్టు టీటీడీ చైర్మెన్ నుంచి ఫోన్ ద్వారా మెస్సేజ్ అందినట్టు చెప్పారు. సెప్టెంబర్ 3న ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారన్నారు. అయితే అక్కడకు వెళ్లాక తనని కాదని, తన పేరుతోనే ఉన్న ముంబాయికి చెందిన మరో వ్యక్తికి పాలకమండలి సభ్యునిగా నియమించారని, తనని మానసిక క్షోభకు గురిచేశారన్నారు. ఇలా జరగటం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారయాని, ఈ అంశంపై ఇప్పటికే తాను ప్రధాని నరేం ద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలియజేసినట్టు తెలిపారు. తనకు కేటాయించిన పాలకమండలి సభ్యుడి హోదాను డబ్బులు కోసం వేరొకరికి అమ్ముకున్నారని ఆరోపించారు. దీని పై సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్తున్నట్టు చెప్పారు.

ప్రధాని మంత్రి కార్యాలయం అంటే ఆషామాషీ కాదు. ఆవలిస్తే, పేగులు లెక్క పెట్టే వారు ఉంటారు అక్కడ. అక్కడకు వచ్చే ప్రతి వినతి పత్రం విషయంలో, ఎంతో లోతుగా ఆలోచనలు జరుపుతారు. దాని వెనుక ఉన్న రాజకీయ, ఆర్ధిక కోణాలను విశ్లేషించి, అన్ని విషయాలు ప్రధానమంత్రికి చెప్తారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక వినతి కూడా, ప్రధాన మంత్రి కార్యాలయంలో చర్చకు దారి తీసింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే, తెలంగాణాలో పని చేస్తున్న స్టీఫెన్ రవీంద్రను, తెలంగాణా నుంచి డిప్యుటేషన్ పై, ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని జగన్ భావించారు. స్టీఫెన్ రవీంద్రకు , కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ బాధ్యతలు ఇవ్వాలని, జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేసిఆర్ కూడా సరే అనటంతో, స్టీఫెన్ రవీంద్ర తెలంగాణాలో సెలవు పెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికారికంగా, విధులు నిర్వహించారు.

srilakshmi 060102019 2

అయితే ఇది కేవలం కేసీఆర్, జగన్ వ్యక్తిగత వ్యవహారం కాదు. ఇందులో రూల్స్ ఉంటాయి, కేంద్రం నిర్ణయం ఉంటుంది. ఎందుకు డిప్యుటేషన్ పై ఆ అధికారి రావాలి అనేది, స్పష్టంగా చెప్పాలి. సరైన కారణం లేకుండా, నాకు కావలి అంటే కేంద్రం పట్టించుకోదు. సరిగ్గా స్టీఫెన్ రవీంద్ర వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. కేంద్ర హోం శాఖ, స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్ కు నో చెప్పింది. దీంతో జగన్ నిరాస చెందారు. ఇక మరో తెలంగాణా అధికారి శ్రీలక్ష్మి ని కూడా జగన్ డిప్యుటేషన్ పై తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు. ఇప్పటికే అనేక సార్లు, కేంద్రంతో చర్చలు జరిపారు. విజయసాయి రెడ్డి, ఆమెను వెంట బెట్టుకు వెళ్లి మరీ, ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాని కలిసారు. జగన్ ఇది వరకు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా ఆమెను వెంట తీసుకు వెళ్లారు.

srilakshmi 060102019 3

మళ్ళీ నిన్న ఢిల్లీ వెళ్ళిన సమయంలో కూడా, శ్రీలక్ష్మిని వెంట తీసుకుని వెళ్లారు. జగన్ వెంట, విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పి.మిథున్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), రఘురామకృష్ణంరాజు (నరసాపురం) వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి (కడప), రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, తెలంగాణ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు, మాటి మాటికీ తెలంగాణా ఐఏఎస్ అధికారి అని శ్రీలక్ష్మి రావటం పై, ప్రధాని కార్యాలయంలో చర్చ జరుగుతుంది. శ్రీలక్మ్షి కూడా జగన్ కేసులో ఉన్నారు. సహజంగా, ఒకే కేసులో సహా నిందితులుగా ఉన్న వారిని దూరం పెడతారు. కాని ఇక్కడ జగన్ మాత్రం, ఆ అధికారిని ఎలా అయినా డిప్యుటేషన్ పై, ఆంధ్రపదేశ్ తీసుకురావాలి అనుకోవటం పై, ప్రధాని కార్యాలయం ఆరా తీస్తుంది. జగన్ ఎందుకు ఇంత పట్టు పడుతున్నారు అనే విషయం పై, చర్చ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కేంద్రం మాత్రం, శ్రీలక్ష్మి డిప్యుటేషన్ కు, ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. స్టీఫెన్ రవీంద్ర విషయంలో వర్తించిన రూల్స్ , ఇక్కడ కూడా వర్తిస్తాయి కాబట్టి, ఆమె వచ్చే అవకాసం ఉండదు.

Advertisements

Latest Articles

Most Read