రాష్ట్రంలో మొదటి కరోనా మరణం నమోదైంది. కరోనా మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో సోమవారం మృతి చెందినట్లు ప్రకటించింది. మార్చి 30న ఉదయం 11.30 గం.కు వ్యక్తి చెకప్‌కు వచ్చారన్న ప్రభుత్వం.. గంట వ్యవధిలో మ. 12.30 గం.కు చనిపోయారని తెలిపింది. మృతి చెందిన వ్యక్తి కుమారుడు మార్చి 17న దిల్లీ నుంచి వచ్చారన్న ప్రభుత్వం, మార్చి 31వ తేదీన కుమారుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యిందని ప్రకటించింది. కుమారుడి నుంచి తండ్రికి వైరస్‌ సోకిందని ప్రభుత్వం భావిస్తుంది. వీరితో కాంటాక్ట్‌ అయిన 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 161కి చేరాయి. ఇవాళ కొత్తగా 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​ పేర్కొంది. నెల్లూరులో ఇవాళ కొత్తగా 8 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం కొవిడ్ 19 కేసులు 32కి చేరాయి.

కడపలో ఇవాళ కొత్తగా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. కడప జిల్లాలో ఇప్పటివరకు 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఇవాళ కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులతో..మొత్తం కేసుల సంఖ్య 14కి చేరింది. మరో పక్క, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్​ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో కరోనా నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స, మోపిదేవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్​ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక మరో పక్క, రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ తీసుకునే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ రేషన్‌తోపాటు నిత్యావసరాలు, కూరగాయలు అందుబాటులో ఉండేలన్నదే ముఖ్యమంత్రి నిర్ణయంగా చెప్పారు. లబ్ధిదారులందరికీ రూ. 1000 ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలో 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్న మంత్రి... ఇందులో 140 మంది దిల్లీ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. మిగిలిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారని వివరించారు. దిల్లీకి వెళ్లిన 1081 మందిలో 946 మంది రాష్ట్రంలో ఉన్నారని... మిగిలిన వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని స్పష్టం చేశారు. 881 మందిని గుర్తించి నమూనాలు పరీక్షకు పంపామని...108 మందికి కరోనా సోకినట్టుగా తేలిందని వివరించారు.

Source : https://epaper.prabhanews.com/c/50557839 కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ వనరులు పూర్తిగా పడిపోయింది అంటూ, ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్షన్లు రెండు విడతలుగా చెల్లింపు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏప్రిల్ 1న బ్యాంకులు సెలవు, రెండో తేదీన శ్రీరామనవమి సెలవు కావడంతో ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకానట్లు చెబుతున్నారు. అయితే కోత విధించిన జీతాల చెల్లింపుపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. మార్చి నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి అంటూ చెప్పిన నేపథ్యంలో అన్ని రకాల బిల్లులను మార్చి 21వ తేదీనే పొందుపరచడం, కేటాయించడం జరిగిపోయాయి. ఉద్యోగుల జీతాల చెల్లింపునకు సంబంధించి సీఎస్ఎంఎస్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి బ్యాంకులకు అనుసంధానం చేయడమే తరువాయి. అయితే మరో కొన్ని గంటల్లో జీతాల చెల్లింపు జరిగే చివరి సమయంలో ప్రభుత్వం, జీతాల్లో కోత పెడుతూ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.

ఇక్కడే అసలు సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన గతంలో లేకపోవడంతో, ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్ధిక శాఖాధికారులు సతమతమవుతున్నట్లు తెలియవస్తోంది.ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం జీతాలు చెల్లించాలంటే కోతకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి తిరిగి బిల్లులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో తిరిగి పొందు పరచాలంటే కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సవరించిన బిల్లులు పెట్టాలంటే జీతాలు చెల్లించడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి, కాగా మార్చి నెలకు సంబంధించి 21 వరకే బిల్లులు పొందుపరచడం జరిగింది. తిరిగి బిల్లులు పెట్టాలంటే నెలాఖరు వరకు బిల్లులు పెట్టే అవకాశం ఉంది.

ఈ తరుణంలో అన్ని శాఖలు పూర్తి స్థాయిలో బిల్లులు రూపొందించనున్నాయి. దీంతో బడ్జెట్ అనుకున్న దాని కన్నా కొంత పెరిగే అవకాశం ఉంది. అయితే నూతనంగా బిల్లులు పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించిన విధంగా జీతభత్యాలు చెల్లించే మార్గాలను ఆర్థిక శాఖ అన్వేషిస్తోంది. ఇదిలా ఉండగా మార్చి నెల జీతాలకు సంబంధించి 21కే ప్రక్రియను పూర్తి చేసినందున సాంకేతికతంగా పూర్తి జీతభత్యాలు వస్తాయని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వ ప్రకటన ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని చెబుతున్నారు. మార్చి నెలకు సంబంధించి ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ కలిపి సుమారు రూ.6400 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాయిదా పద్దతిలో చెల్లింపు కారణంగా సుమారు రూ. 2 వేల కోట్లు ప్రభుత్వం వద్ద నిల్వ ఉండనుంది. మొత్తం మీద ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయం ఉద్యోగులను కొంత ఆందోళనకు గురి చేసింది.

కేంద్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు మెగా బ్యాంకుల విలీనం ఆచరణలోకి వచ్చింది. 10 ప్రభుత్వరంగ బ్యాంకులు 4 పెద్ద బ్యాంకులుగా అవత రించాయి. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలను ప్రారంభించాయి. విలీనమైన చిన్న బ్యాంకుల ఖాతాదారులను పెద్ద బ్యాంకుల ఖాతాదారులుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచులుగా కార్యకలాపాలను ప్రారంభించాయని బుధవారం ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం ఏప్రిల్ 1 నుంచి ఆచరణలోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంక్ గా అవతరించిందని వివరించింది. ఈ విలీనంతో అంతర్జాతీయంగా పోటీ ఇవ్వగల తర్వాతి తరం బ్యాంక్ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. డిపాజిటర్లతో సహా ఖాతాదారులందరూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు గానే పరిగణింపబడతారని స్పష్టం చేసింది.

విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచులు 11 వేలు కాగా ఏటీఏంలు 13 వేలకుపైగానే ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య 1 లక్ష, బిజినెస్ మిక్స్ రూ.18 లక్షల కోట్లని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివరించింది. ఆ విలీనంతో ఎక్కువమంది ఖాతాదారులకు, సమర్థవంతమైన సేవలు అందించవచ్చునని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవో ఎస్ఎస్ మల్లికార్జున రావు పేర్కొన్నారు. ఇదిలావుండగా బ్యాంకుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.68,855 కోట్లను ఆయా బ్యాంకులకు మూలధనంగా అందజేసింది. ఈ విలీనంతో 2017లో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 కాగా 2020లో 12కి తగాయి. ఈ 12లో 6 విలీనమైన బ్యాంకులు కాగా మరో 6 స్వతంత్ర బ్యాంకులుగా పనిచేస్తున్నాయి.

ఆంధ్రాబ్యాంక్ కనుమరుగు... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమవ్వడంతో ఆంధ్రాబ్యాంక్ కనుమరుగైంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి విలీనం ఆచరణలోకి రావడంతో ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు వినియోగదారులను కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదా రులుగా వ్యవహరించనున్నారు. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. బ్యాంక్ వ్యాపారం ర.11.59 లక్షల కోట్లకు పెరిగింది. బ్రాంచుల సంఖ్య 9,609కి పెరిగింది. అయితే ఈ పరిణామంతో, ఆంధ్రా ప్రేమికులు, ఒకింత అసహనంగా ఉన్నారు. ఆంధ్రా అనే పదం లేకుండా చెయ్యటం పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923లో ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. భారతీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతికతను పరిచయం చేసింది ఆంధ్ర బ్యాంక్. తొలి సారి, క్రెడిట్ కార్డులు జరీ చేసిన బ్యాంక్ కూడా ఆంధ్రా బ్యాంకే.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 39 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 149 కు చేరింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల మొత్తం కేసుల సంఖ్య 149కు చేరింది. అనంతపురంలో 2 పోజిటివ్ వచ్చాయి. అలాగే, చిత్తూరులో 9 పోజిటివ్ వచ్చాయి. తూర్పు గోదావరిలో 9 పోజిటివ్ వచ్చాయి. గుంటూరులో 20 పోజిటివ్ వచ్చాయి. కడపలో 18 పోజిటివ్ వచ్చాయి. కృష్ణాలో 23 పోజిటివ్ వచ్చాయి. కర్నూల్ లో 1 పోజిటివ్ వచ్చాయి. నెల్లూరులో 24 పోజిటివ్ వచ్చాయి. ప్రకాశంలో 17 పోజిటివ్ వచ్చాయి. విశాఖలో 11 పోజిటివ్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరిలో 15 పోజిటివ్ వచ్చాయి. విజయనగరం, శ్రీకాకుళంలో, ఎలాంటి పోజిటివ్ కేసులు ఇప్పటి వరకు రాలేదు. మరో పక్క, ఆరు గంటలకు రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం, 409 కేసులకు సంబంధించి, ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఇందులో, అత్యధికంగా, 211 టెస్ట్ లు, నెల్లూరు జిల్లాకు సంబంధించినవిగా ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా తీవ్రత, నిర్థరణ పరీక్షలు పెంచడం, పాజిటివ్ కేసులు గుర్తించటం, కరోనా చికిత్స చర్యలు, అన్న క్యాంటీన్ల తెరవటం వంటి ఐదు అంశాలపై తెదేపా అధినేత చంద్రబాబు... సీఎం జగన్​కు లేఖ రాశారు. కరోనా వైరస్ మహమ్మారి.. ప్రపంచాన్ని అతలాకుతం చేస్తోందన్న చంద్రబాబు... రాష్ట్రంలో కొవిడ్ 19 కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విస్తరిస్తోన్న వేళ నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేయాలని సీఎం జగన్​ను కోరారు. సమస్యను అంత తేలిగ్గా తీసుకోరాదని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం కన్నా కరోనా పెనుసంక్షోభమని ఐరాస పేర్కొందని చంద్రబాబు అన్నారు. కరోనా కట్టడికి ఇతర రాష్ట్రాలు, దేశాలు చేపట్టిన చర్యలను నిశితంగా అధ్యయనం చేయాలన్నారు.

రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్​లు పెంచాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు 1,307 పరీక్షలు మాత్రమే చేశారన్నారు. ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే అంతగా కరోనాను కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. పేదలు పస్తులుండకుండా 'అన్న క్యాంటీన్లు' తెరిచి ఆదుకోవాలని సూచించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు అందజేయాలన్న చంద్రబాబు... ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది జీతాల్లో కోత పెట్టవద్దని కోరారు. పింఛన్లలో కోత పెట్టడం సరికాదని చెప్పారు. కరోనా వ్యాప్తిపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. అనేక రాష్ట్రాలు, దేశాలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటే.. రాష్ట్రంలో వేతనాల్లో కోత పెట్టడం బాధాకరమన్నారు.

Advertisements

Latest Articles

Most Read