రాష్ట్ర రాజకీయ పరిణామాలపై బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. నిన్న మొన్నటి దాకా తెలుగుదేశంతో సమానంగా ప్రభుత్వంపై కాలుదువ్విన రాష్ట్ర సాయి నేతలు ఇప్పుడు మౌనరాగం ఆలపి స్తున్నారు. ఏదైనా మాట్లాడాల్సివచ్చినా అరకొరగా మాట్లాడి సరిపెడుతున్నారు. పార్టీ అధిష్టానం పంపించిన సంకేతాలకు అనుగుణంగానే మౌనం పాటిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం, నిర్ణయానుసారంగా అనివార్యంగా చోటుచేసుకునే పరిణామాల పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరించటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. బిజెపి జాతీయ స్థాయి విధానం శాసనమండలి వ్యవసకు అనుకూలంగా లేదు. మూడు రాజధా నులపై చంద్రబాబుతో సమానంగా వ్యతిరేకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలు కూడా స్వరం తగ్గించారు. ఫిబ్రవరి 2న 'అమరావతి'కి మద్దతుగా జనసేనతో కలిసి విజయవాడలో తలపెట్టిన 'కవాతు' రద్దు కావటం కూడా పార్టీలో చర్చనీ యాంశంగా మారింది.
కవాతును వాయిదా వేస్తున్నట్టు బిజెపి అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అనుగుణంగా అక్కడి నేతలు స్పందించినా 'మూడు రాజధానుల' విషయంలో తటస్త వైఖరి అవలంబించాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టు పార్టీ వర్గాలు భావిస్తున న్నాయి. దీనికి ప్రధాన కారణం..రాయలసీమ, ఉత్తరాంధ్ర బిజెపి నేతల నుంచి అధిష్టానానికి అందిన ఫిర్యాదులు, వినతులే కారణమని సమాచారం. అందు వల్లనే విశాఖపట్టణం కేంద్రంగా బిజెపి వ్యవహారాలు చూస్తున్న నేతలెవరూ 'అమరావతి' గురించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. బిజెపి గతంలో ప్రకటించిన 'రాయలసీమ డిక్లరేషన్'కు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతా మని కొందరు ప్రశ్నించినట్టు సమాచారం.
అమరావతిలోనే ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంచాలని బిజెపి ఉద్యమం చేస్తే రాయలసీమ డిక్లరేషన్ గురించి భవిష్యత్ లో కూడా మాట్లాడే అవకాశం బీజేపీకి ఉండదని కొందరు అభిప్రాయపడినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఒక వైపు టీడీపీకీ, మరో వైపు వైసీపీకీ సమాన దూరం పాటించటం ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బలోపే తమయ్యేందుకు కార్యా చరణ రూపొందిం చాలనుకుంటున్న బిజెపి ఢిల్లీ ఎన్నికల తరువాత రాష్ట్రం లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావటం బిజెపికి అందివచ్చిన మంచి అవకాశమని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు ఉమ్మడి కార్యాచరణ అత్యంత పకడ్బందీగా ఉండేలా వ్యూహ రచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.