ఆధిపత్య పోరో.. లేక అనుమానపు పోరో కానీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల వ్యవధిలో చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్లీనంగా అగాథాలు పెరుగుతున్నాయి. శుక్రవారం చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడినట్లుగా ఉన్న ఒక వాయిస్ మెసేజ్ నగరిలోని వైసీపీ ముఖ్యనాయకులకు రావడం కలకలం సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డికి అన్ని నియోజకవర్గాల్లోనూ అనుచరులు, అభిమానులు, బంధువులు ఉన్న విషయం తెలిసిందే. గడచిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో గెలవడం వెనుక పెద్దిరెడ్డి కృషి ఉందన్నది వైసీపీ అభిప్రాయం. అదే సమయంలో నగరి ఎమ్మెల్యే రోజాకు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో విభేదాలు ఉన్నట్లు కనిపిస్తోంది. నగరిలో వైసీపీ సీనియర్ నేత కేజే కుమార్, ఎమ్మెల్యే రోజా అనుసరిస్తున్న వైఖరిపట్ల తొలినుంచి విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేజే కుమార్ జన్మదిన, షష్టిపూర్తి వేడుకలను నగరిలో చేయడానికి ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తదితరులకు ఆహ్వానాలు అందాయి. అయితే నగరి ఎమ్మెల్యే రోజాకు కేజే కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిసినప్పటికీ ఆమెకు ప్రత్యేక ఆహ్వానం అందలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే రోజా అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే రోజా శుక్రవారం హైదరాబాద్ కు బయలుదేరివె ళ్లారు. ఆమె వెళ్లిన కొంత సమయానికి కొంతమందికి రోజా మాట్లాడినట్లుగా వాయిస్ మెసేజ్ లు చేరాయి. అందులో ఉన్న సారాంశం ఏమంటే.. 'అందరికీ నమస్కారం.. నాకు అత్యవసర పని ఉంది. హైదరాబాద్ వెళుతున్నాను. రేపటి వరకు రాలేను. అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటే. మీరు గెలిపించిన ఎమ్మె ల్యేగా మీకోసం నగరి నియోజకవర్గం అభివృద్ధికి ఎంత దూరమైనా పనిచేస్తాను కానీ, పార్టీకి ద్రోహం చేసి నాకు వెన్నుపోటు పొడిచి, నన్ను పది మందిలో అవమానపరచిన వ్యక్తుల కార్యక్రమాలకు వెళ్లాలనుకుంటే ఈ రోజు నుంచి పార్టీతో సంబంధం లేనట్లు అందరూ గుర్తుంచుకోవాలి.

ఎందుకంటే మంచితనంగా ఉంటే, దానిని చేతగానితనంగా చూడరాదని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఎన్నో వత్తిడులు ఉన్నా నగరి అభివృద్ధికి తాను శ్రమిస్తుంటే, ఆ నియోజకర్గ అభివృద్ధిని దెబ్బతీసే విధంగా, ఎమ్మెల్యేను అవమాన పరిచే విధంగా, పార్టీకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాల్లో పాల్గొనేవారిని పార్టీకి దూరంగా పెడతామని చెబుతున్నా' అంటూ మెసేజ్ లు వచ్చాయి. అయితే ఆమె ఎక్కడా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుగానీ, ఇతరుల పేర్లు గానీ ప్రస్తావించలేదు. ఎమ్మెల్యే రోజాకు, కేజే కుమార్‌కు ఉన్న అభిప్రాయభేదాలతోనే మంత్రి పెద్దిరెడ్డితో విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలావుండగా ఇటీవల ఒక చానల్ లో పెద్ది రెడ్డికి, చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మధ్య కూడా విభేదాలు ఉన్నట్లు వార్తాకథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైన మండలి చైర్మన్ నిర్ణయంలో అనూహ్యమైన భారీ ట్విస్ట్ నెలకొంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టం బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ మండలి చైర్మన్ తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం ప్రకటించారు. దీనిపై మండిపడ్డ ప్రభుత్వం ఏకంగా మండలినే రద్దు చేసింది. మండలి రదైనా, సెలెక్ట్ కమిటీ కొనసాగుతుందని ఇందుకోసం కమిటీ ఏర్పాటులో భాగంగా పార్టీల నుంచి పేర్లను కోరుతూ లేఖలు రాసామని చైర్మన్ ప్రకటించారు. ఇంతలో కొత్త ట్విస్ చోటు చేసుకొంది. చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని మండలి అధికారులు ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో అధికారపార్టీ నేతల నుంచి మండలి కార్యదర్శికి లేఖలు అందాయి. టిడిపి మరోవైపు ఒత్తిడి కొనసాగిస్తోంది. చైర్మని నిర్ణయం తుదిదని ఖచ్చితంగా అమలు చేయాలంటూ టిడిపి వాదిస్తోంది. చైర్మన్ తీసుకున్న నిర్ణయం అమల్లో ట్విస్ట్ మీద ట్విస్టు చోటు చేసుకొంటున్నాయి. చైర్మన్ నిర్ణయంతో ఏకంగా మండలినే రద్దు చేసిన ప్ర భుత్వం ఇప్పుడు బిల్లుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

సెలెక్ట్ కమిటీలో నియమించే ఎమ్మెల్సీల పేర్లు పంపాల్సిందిగా ఆయా పార్టీలకు లేఖలు రాయాలని మండలి ఇన్చార్జి, కార్యదర్శికి ఇప్పటికే లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో చైర్మన్ ఆదేశాల ప్రకారం ఆయన వెంటనే లేఖలు రాస్తారు. కానీ ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉండటంతో ఆయన ఇంతవరకూ ఈ లేఖలు వంపలేదు. ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే యోచనతో తెలుగుదేశం శాసనసభాపక్షం తమ తరపున 10 మంది ఎమ్మెల్సీల పేర్ల జాబితాను ఇప్పటికే కార్యదర్శికి అందజేసింది. ఒక్కో కమిటీలో టిడిపి కోటా కింద ఐదుగురు సభ్యులు వస్తారు. ఇది అందజేసినట్లు కార్యదర్శి నుంచి రశీదు కూడా తీసుకున్నారు. టిడిపి నేతల నిర్ణయంతో వైసీపీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. మండలిలో సభా నాయకుడిగా ఉన్న ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి గురువారం విడి విడిగా కార్యదర్శికి లేఖలు రాశారు. నియమాలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీల ఏర్పాటు జరుగుతున్నందున అందులో తాము భాగస్వామి కాబోమని తమపార్టీ నుంచి ఎవరూ ఈ కమిటీల్లో ఉండరని ఉమ్మారెడ్డి తనలేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. కమిటీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం నియమాలకు విరుద్ధమని అందువల్ల కమిటీలు ఏర్పాటు చేయవద్దని కోరుతూ బోస్ మరో లేఖ రాశారు.

ప్రభుత్వ అధికారి అయిన కార్యదర్శి అటు ప్రభుత్వ పక్షం మాట కాదనలేక, ఇటు చైర్మన్ ఆదేశాలను ధిక్కరించే పరిస్థితిలేక, ఏ నిర్ణయం తీసుకోకుండా రోజులు నెట్టుకొస్తున్నారని అసెంబ్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారులకు సంకటంగా, ఏకంగా మండలిలో సభానాయకుడే లేఖ రాయడంతో ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై అధికారులు మళ్లగుళ్లాలు పడుతున్నారు. అటు ప్రభుత్వం, ఇటు చైర్మన్ ఆదేశాలు కావడంతో ఏంచేయాలనే దానిపై తేల్చుకోలేకపోతున్నారు. దీంతో కమిటీల ఏర్పాటు ఆలస్య మవుతోంది. అయితే మండలిలో చైర్మన్ నిర్ణయమే ఫైనలనీ, మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మా నం చేసినా రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేవరకు మండలి కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతు న్నారు. అప్పటి వరకు చైర్మన్ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే అదికారులపై సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పరిగణించవలసి వస్తుందని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. చైర్మన్ ఆదేశాలను మండలి కార్యదర్శి అమలు చేయాల్సిందేనని టీడీపీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు బిల్లులను వారికి అప్ప గించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

జగన్మోహన్‌రెడ్డి అందరి ముఖ్యమంత్రుల్లాంటివాడు కాదని, సీబీఐ 11, ఈడీ5 ఛార్జ్‌షీట్లు వేశాయని, వేలకోట్ల ఆస్తుల్ని ఈడీఇప్పటికే జప్తుచేసిందని, ఆర్థికంగా జగన్‌ చేసిన నేరంచాలాపెద్దదని, ఆయన క్రమంతప్పకుండా హాజరుకావాలని కోర్టు స్పష్టంచేసిం దని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. కోర్టులన్నీ ముఖ్యమంత్రి వ్యవహారశైలి గురించి చెబుతుంటే, ఆయనేమో సుప్రీకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జాస్తిచలమేశ్వర్‌ని కలవడాన్ని తప్పుపడుతున్నామన్నారు. సుప్రీం న్యాయమూర్తులకే నీతిప్రబోధాలు చేసి, దేశన్యాయవ్యవస్థలోనే గొప్పపేరుప్రతిష్ఠలున్న చలమేశ్వర్‌గారు, సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్లు మోపబడి, 11కేసుల్లో ముద్దాయిగా ఉన్నవ్యక్తిని కలవడం సభ్యసమాజానికి ఎలాంటిసంకేతాలు ఇస్తుందన్నారు. ముద్దాయిగా ఉన్న వ్యక్తిని, సుప్రీం మాజీన్యాయమూర్తి కలిస్తే, జగన్‌కేసులను విచారించే న్యాయమూర్తుల మెదళ్లలో ఎటువంటి ఆలోచనలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ఏ కారణంతో సుప్రీం మాజీన్యాయమూర్తి జగన్‌ని కలిసినా, వారికలయిక సభ్యసమాజానికి వేరే సందేశం ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

జగన్‌ సీబీఐకోర్టుకి, హైకోర్టుకి తిరుగుతున్నవేళ, జగన్‌, జాస్తిచలమేశ్వర్‌గార్ల కలయిక ఆయా న్యాయస్థానాల ను ప్రభావితం చేయదా అని వర్ల ప్రశ్నించారు. వారిమధ్యలో ఎంపీ, మాజీఎంపీకూడా ఉన్నారని, చలమేశ్వర్‌గారు జగన్‌ని కలిస్తే, ముద్దాయిగాఉన్న వ్యక్తి ఆకలయికను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు లేకపోలేదని వర్ల అభిప్రాయపడ్డారు. అసలు అటువంటి అవకాశం ఏ-1కు ఎందుకు కల్పించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. జాస్తిచలమేశ్వర్‌గారు జగన్‌ని కలవడంలోని ఔచిత్యం ఏమిటో బహిరంగపరచాలన్నారు. ఏసమస్యపై వారిమధ్య ఎటువంటి చర్చ జరిగిందో, చెప్పనిపక్షంలో పరోక్షంగా జగన్‌కు సాయంచేయడానికే వెళ్లారని భావించాల్సి వస్తుందన్నారు. నిన్నటి మీకలయిక, జగన్‌తో కలిసి మీరుచూపిన హావభావాలు చూసినవారెవరైనా పలువిధాలుగా ఆలోచిస్తారన్నారు. న్యాయమూర్తిగా పనిచేసి, రిటైర్డ్‌ అయ్యాక కొంతకాలం పాటువారు న్యాయవాదులుగా కూడా పనిచేయరని, అలాంటిది ఆర్థికనేరగాడిగా దేశవ్యాప్తంగా పేరుప్రతిష్ఠలు పొందిన వ్యక్తిని ఎలా కలుస్తారని వర్ల నిలదీశారు.

జగన్‌ గతంలోకూడా చలమేశ్వర్‌గారిని కలిశాడని, అప్పుడు ఇంతలా హడావుడి చేయలేదని, ఇప్పుడెందుకు అలా జరిగిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన కేసుల్లోంచి బయటపడటానికి జాస్తిచలమేశ్వర్‌ని కలిశాడో..లేక ప్రభుత్వానికి కోర్టుల నుంచిపడుతున్న మొట్టికాయల నుంచి తప్పించుకోవడానికి కలిశాడో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు. వారిద్దరి కలయిక ప్రజలకు ఎటువంటి తప్పుడు సంకేతాలు ఇస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. చలమేశ్వర్‌ అమరావతి తరలింపువల్ల నష్టపోతున్న రాష్ట్రప్రజల కు సాయంచేయడానికి జగన్‌ని కలిశారా..లేక ముఖ్యమంత్రికి సాయంచేయడానికి వెళ్లారా అనేది చెప్పాలన్నారు. జగన్‌కి సాయపడటానికే చలమేశ్వర్‌గారు ఆయన్ని కలిశారని, నిన్నటివరకు సుప్రీంన్యాయమూర్తిగా ఆయన అనుభవించినహోదానే జగన్‌కు ఉపయోగపడుతుందన్నారు.

వారిరువురూ ఏ అంశాలపై చర్చించారో ఇప్పటికై నా స్పష్టంచేయాలని, లేకుంటే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని రామయ్య స్పష్టంచేశారు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఏఏ కేసులపై, ఏఏ కోర్టులకు హాజరవు తున్నారో, ఆయా కేసుల్ని విచారించేన్యాయమూర్తులందరూ తమమస్తిష్కాల్లో జగన్‌, చలమేశ్వర్‌ల కలయికను నిలుపుకోకుండా తక్షణమే తొలగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న ట్లు వర్ల తెలిపారు. నిన్నటివరకు ఉన్నతస్థానంలో కొనసాగిన చలమేశ్వర్‌గారిలాంటి వారు, జగన్‌ని కలవడంవల్ల ఆయన తాను పొందాలనుకున్నది పొందారని, ఒక ముద్దాయిగా ఆయన తాననుకున్నది సాధించారని రామయ్య స్పష్టంచేశారు. చలమేశ్వర్‌ గారు ఇప్పటికైనా జగన్‌ను కలవడంపై, సవివరమైన ప్రకటనచేయాలన్నారు.

చిత్రవిచిత్రాల కలబోతగా బోస్టన్‌కమిటీ, జీ.ఎన్‌.రావుకమిటీ నివేదికలున్నాయని, వాటిని ఆధారంగా చేసుకొని ప్రజారాజధాని అమరావతిని చంపేయడానికి జగన్‌ కంకణం కట్టుకున్నాడని టీడీపీనేత, ఆపార్టీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు అనుకూలంగా తప్పుడు నివేదికలు తయారుచేయడం కోసం, ఏవిధమైన జీవోలు లేకుండా రూ.6కోట్ల ప్రజలసొమ్ముని ఒకలేఖద్వారా బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌కి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం బదలాయించిందన్నారు. బోస్టన్‌కన్సల్టింగ్‌ గ్రూప్‌సాయంతో బోగస్‌నివేదికను తయారుచేయించిన జగన్మోహన్‌రెడ్డి, ముందుగానే తామనుకున్నదే నివేదికల్లో వచ్చేలా చేసి, రాజధానిని మూడుముక్కలు చేసేకుట్రకు తెరలేపాడన్నారు. బీసీజీ నివేదికలోని పేజీనెం-72, పేజీ.నెం-92, 8, 78, 84ల్లో చెప్పిన అంశాలను పరిశీలిస్తే, దానిలోని డొల్లతనంఏమిటో, ఎన్ని అబద్ధాలుచెప్పారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. పేజీ-72లో అమరావతిని ముంపుప్రాంతంగా చిత్రీకరిస్తూ, అందుకు ఆధారంగా చెన్నైఐఐటీ నివేదిక ఇచ్చినట్లుగా చూపడం జరిగిందన్నారు. ఒక రాష్ట్రముఖ్యమంత్రి, రాజధాని అమరావతిని చంపేయడంకోసం తప్పుడునివేదికల్ని నమ్ముకోవడం ఇక్కడే చూస్తున్నామన్నారు.

చెన్నైఐఐటీడీన్‌ డాక్టర్‌.రవీంద్ర.గెట్టు చాలా స్పష్టంగా అమరావతిపై తాము ఎలాంటి అధ్యయనంచేయలేదని, తమ సంస్థనుంచి తాము ఎలాంటి నివేదికలు ఎవరికీ ఇవ్వలేదని మెయిల్‌ద్వారా చెప్పడం జరిగిందన్నారు. వైసీపీప్రభుత్వం మాత్రం తమస్వార్థంకోసం ఐఐటీచెన్నైపేరుని కూడా మంటగలిపేందుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. విజయసాయిరెడ్డికి అత్యంతసన్నిహితుడు, సత్యవాణిప్రాజెక్ట్స్‌ , కన్సల్టెంట్స్‌కి చెందిన పీ.సూర్యప్రకాశ్‌ అనేవ్యక్తి ఐఐటీపేరుతో నకిలీనివేదికలు సృష్టించాడని, వాటిని అడ్డంపెట్టుకొని జగన్‌సర్కారు కుటిలయత్నాలకు తెరలేపిందని పట్టాభి మండిపడ్డారు. ఒకరాష్ట్రప్రభుత్వం ఐఐటీమద్రాస్‌ సంస్థనుకూడా భ్రష్టుపట్టించేలా వ్యవహరించిందన్నారు. ఏ1, ఏ2లకు నేరాలు చేయడం అలవాటుగా మారిందని, దానిలోభాగంగానే ఐఐటీచెన్నైపేరునికూడా దుర్వినియోగం చేశారన్నారు. ఏసంస్థ పేరుచెప్పి, అమరావతి ముంపునకు గురవుతుందని ప్రచారంచేశారో,అదేఐఐటీ చెన్నై సివిల్‌ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ ఏ.మెహెర్‌ప్రసాద్‌ సీఆర్డీఏలో జరిగే నిర్మాణాలన్నీ సురక్షితమని నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. (సదరు నివేదికను పట్టాభి విలేకరులకు చూపించారు.) మంత్రులు బొత్స, బుగ్గన, తదితరులు ఏ ఐఐటీచెన్నై నివేదిక గురించైతే మాట్లాడుతున్నారో, ఆ నివేదికను బయటపెట్టాలని, పట్టాభి డిమాండ్‌చేశారు. ఏపీప్రభుత్వతీరు సహించలేక ఐఐటీచెన్నైకి చెందిన పూర్వవిద్యార్థులు కొందరు, తమసంస్థను బదనాంచేయడంపై ఇప్పటికే కోర్టుని ఆ శ్రయించారని టీడీపీనేత తెలిపారు.

బీసీజీనివేదికలోని పేజీ-92లో జీఎన్‌.రావు కమిటీ మాదిరే విశాఖనగరానికి తుపాన్ల ముప్పుందని, అక్కడవిపత్తులు వచ్చే అవకాశం ఎక్కువని చెప్పడం జరిగిందన్నారు. విశాఖనగరాన్ని కించపరిచారంటూ టీడీపీ కార్యాలయం వద్దకువచ్చి, చిందులుతొక్కిన వైసీపీకార్యకర్తలంతా, తమప్రభుత్వం నియమించిన కమిటీల్లో ఉన్న వాస్తవాలను తెలుసుకుంటే మంచిదన్నారు. వైసీపీకార్యకర్తలకు నిజంగా విశాఖపై ప్రేముంటే, వారు తమప్రతాపాన్ని టీడీపీనేతలపై, వారిపార్టీ కార్యాలయాలపై చూపకుం డా జగన్మోహన్‌రెడ్డిపై చూపాలని పట్టాభి హితవుపలికారు. పేజీనెం-8లో ముంబై, షెంజెన్‌ నగరాలను ప్రస్తావించారని, అమరావతి నగరానికి విజయవాడ, గుంటూరు నగరాలు గేట్‌వేలుగా ఉన్నాయనే విషయాన్ని వారెందుకు మర్చిపోయారన్నారు. షెంజన్‌, నవీముంబైల మాదిరే అమరావతి కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధిస్తుందన డంలో ఎటువంటి సందేహం లేదన్నారు. పేజీనెం-74లో అమరావతికి సమీకరించిన భూములవిలువను ఎకరా రూ.కోటిగా పేర్కొన్నారని, బుర్రలేని, బుద్ధితక్కువ మంత్రులు అసెంబ్లీలో మాత్రం ఆర్బీఐవారు ఎకరం రూ.4కోట్లకు కొన్నారని, ఎస్బీఐవారు కొన్నారని ఎలా చెప్పారన్నారు. ఒకవైపు నివేదికలో మాత్రం ఎకరా రూ.కోటి అనిప్రచారంచేస్తూ, బయటమాత్రం ఇంకోలా మాట్లాడుతున్నారని పట్టాభి దుయ్యబట్టారు. మంత్రులుచెప్పిన ట్లుగా ఎకరం రూ.4కోట్లకు లెక్కేసినా, మిగులుభూముల విలువ రూ.40వేలకోట్లుంటు ందని, నగరం అభివృద్ధి చెందేకొద్దీ, ఆ భూములవిలువ మరింత పెరుగుతుందన్నారు.

కేబినెట్‌లో ఉన్న బ్యాంకాక్‌ మంత్రి బొత్స, అప్పుడప్పుడూ బ్యాంకాక్‌కు వెళ్తుంటారని, ఆనగరం కూడా నదిఒడ్డునే ఉందన్న విషయం ఆయనకు తెలీదా అన్నారు. పేజీనెం -78లో అమరావతిలోని 33వేల ఎకరాల భూములను అగ్రికల్చర్‌జోన్‌గా మారిస్తే, ప్రభుత్వానికి రూ. 200నుంచి రూ.300కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారని, లక్షకోట్ల సంపద (జీడీపీరూపంలో) సృష్టించే నగరాన్ని వందలకోట్లకే పరిమితం చేయాలన్న వైసీపీఆలోచన మరెవరికీ రాదన్నారు. పేజీనెం-84లో జర్మనీకి మూడురాజధానులున్నా యని చెప్పారని, ఈ విషయం జర్మనీప్రభుత్వానికి తెలిస్తే, జగన్‌ను అంతర్జాతీయకోర్టు ల్లో నుంచోబెడతారన్నారు. గతంలో ఈస్ట్‌జర్మనీ, వెస్ట్‌జర్మనీ ఉండేవని, అవిరెండూ కలిసిపోయి దశాబ్దాలవుతోందన్నారు. భారతరాజ్యాంగంలో రాజ్యాంగం అన్నపదమే లేదని చెప్పినప్పుడే జగన్‌ జ్ఞానం ఎలాంటిదో అందరికీ అర్థమైందన్నారు. అలానే విశాఖలో సామాజికవసతులున్నాయని, అమరావతిలో అటువంటివి కల్పించాలంటే, నిర్మాణానికి అయ్యేఖర్చులో 70శాతం అందుకే అవుతుందని చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి ,ప్రజలకు అవసరమైన సామాజికసదుపాయాలన్నీ ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం లేదనే విషయాన్ని గ్రహించకపోవడం విచారకరమన్నారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, షాపింగ్‌కాంప్లెక్సులు, హోటళ్లు వంటివాటిని ప్రైవేట్‌వ్యక్తులే ఏర్పాటుచేస్తారన్నారు. జీఎమ్‌ఆర్‌, జీవీకే వంటి కాంప్లెక్సులు ఎవరుకట్టారో జగన్‌కు తెలియదా అని, వాటిని అడ్డంపెట్టుకొని రూ.6కోట్లకు కక్కుర్తిపడి రాజధానిని ఎలా తరలిస్తారని పట్టాభి నిలదీశారు.

Advertisements

Latest Articles

Most Read