వైఎస్ వి-వే-క కుమార్తె డాక్టర్ సునీత, రెండు రోజుల క్రితం హైకోర్ట్ లో వేసిన పిటీషన్ సంచలంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే, ఆవిడ డీజీపీ సవంగ్ కు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబరు 21న ఆమె డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాసారు. నా తండ్రి హ-త్య కేసు విచారణ, గత కొంత కాలంగా కొనసాగుతూనే ఉంది కాని, ఇప్పటి వరకు ఎవరు చంపారో తేల్చలేకపోయారు అని ఆమె లేఖలో రాసారు. తను, తన భర్త, విచారణలో భాగంగా, పోలీసులకు పూర్తీ సహకారం అందిస్తున్నామని అన్నారు. అయితే ఇంత వరకు ఎవరు చంపారో తెలియకపోవటంతో, తనకు, తన భర్తకు ప్రాణ హాని ఉందని భావిస్తున్నామని అన్నారు. తన తండ్రినే హ-త్య చేసిన వారికి, తమను టార్గెట్ చెయ్యటం పెద్ద విషయం కాదని ఆమె అన్నారు. తనకు, తన భర్తకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమయంలో, సాయుధ రక్షణ కల్పించే విషయం పరిశీలించాలని కోరారు. ఇప్పటికే, ఈ కేసులో శ్రీనివాసరెడ్డి మరణించిన నేపధ్యంలో, పరమేశ్వరరెడ్డి, ఎర్రగంగిరెడ్డి, వాచ్మన్ రంగయ్యల ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ఆమె అన్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ ఈ విషయం పై, జగన్ ను టార్గెట్ చేసింది. హైకోర్టులో ఎందుకు రిట్పిటిషన్వేశానా... ముఖ్యమంత్రితో ఎందుకు పెట్టుకున్నా నా...అని దివంగత వై.ఎస్.వి-కే-కా కుమార్తె సునీత భయపడేలా ఆమె అన్నయిన జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నాడని టీడీపీ సీనియర్నేత, ఆపార్టీ పొలిట్బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వి-వే-కా-హ-త్య కేసు విచారణపై, చెల్లి పిటిషన్వేసినా సీబీఐ విచారణపై జగన్మోహన్రెడ్డి ఎందుకు స్పందించడంలేదని, ఈ అంశంపై ఆయనెందుకు తాత్సారం చేస్తున్నాడని వర్ల ప్రశ్నించారు. తన అన్నపై నమ్మకంలేకనే ఆమె కోర్టుని ఆశ్రయించిందని, జగన్ ఎవరిని కాపాడటానికి సీబీఐ ప్రకటనపై వెనకడుగువేస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. జగన్ స్పష్టత ఇవ్వకుంటే , హ-త్య కేసు ముద్దాయిలను జగన్ కాపాడాలని చూస్తున్నాడని భావించాల్సి వస్తుందని, రాష్ట్రప్రజలంతా ముఖ్యమంత్రి నిర్ణయంపై చాలా ఉత్సుకతతో ఉన్నారన్నారు.
తనను ఇంప్లీడ్చేస్తూ చెల్లికోర్టుకి వెళ్లడంతో జగన్ ఆమె పై కక్షపెంచుకున్నాడేమోననే అనుమానం లుగుతోందని వర్ల సందేహం వెలిబుచ్చారు. అర్థంతరంగా హైదరాబాద్ లోని సునీత ఇంటిచుట్టూ భారీసంఖ్యలో పోలీసుల్ని ఎందుకు మోహరించాల్సి వచ్చిం దన్నారు. తనపేరుని ఆమె బదనాం చేసిందని, తనను అవమానించిందనే జగన పోలీసుల్ని పంపాడా అని రామయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో ఎందుకు పెట్టుకున్నానా అని, ఆమెకై ఆమే భయపడి, తన పిటిషన్ను ఉపసంహరించుకునేలా చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లున్నాడన్నారు. అక్కడున్న పోలీసులు తెలంగాణ వారా... లేక ఆంధ్రావారా అని రామయ్య ప్రశ్నించారు. తనకు ఎదురొస్తే, చెల్లి అయినా, మరొకరైనా వదలననే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నట్లు గా ఉందన్నారు. ఇప్పటికైనా జగన్ వి-వే-కా-హ-త్య కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు తక్షణమే ప్రకటన చేయాలన్నారు.