ఈ రోజు శుక్రవారం కావటంతో, ప్రతి వారం లాగే, ఈ వారం కూడా, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు విచారణ జరిగింది. అయితే గత శుక్రవారం విచారణ సందర్భంగా, ఈ శుక్రవారం, జగన్ మోహన్ రెడ్డి, కచ్చితంగా సిబిఐ కోర్ట్ కు హాజరు అవ్వాలి అంటూ, సిబిఐ కోర్ట్ స్పష్టం చేసింది. అయితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, కోర్ట్ కు వెళ్లక పోవటంతో, ఏమి జరుగుతుందా, జగన్ కు కోర్ట్ నోటీసులు ఇస్తుందా, లేక పొతే, ఏదైనా అనూహ్య నిర్ణయం జరుగుతుందా అని అందరూ అనుకున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి, తరుపు న్యాయవాది ఈ రోజు కూడా అబ్సెంట్ పిటీషన్ వెయ్యటంతో, కోర్ట్ దానికి అంగీకరించింది. తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ మోహన్ రెడ్డి హైకోర్ట్ లో కేసు వెయ్యటంతో, ఈ విషయం కూడా, సిబిఐ కోర్ట్ ద్రుష్టికి తెచ్చారు. హైకోర్ట్ లో పిటీషన్ ఉండటంతో, జగన్ ఈ సారి విచారణకు రాకపోయినా, సిబిఐ కోర్ట్ ఏమి అనలేదు. అయితే, సిబిఐ కోర్ట్ లో, ఏమి జరుగుతుందా అని అనుకున్న ప్రజలకు, అనూహ్యంగా ఇంకో వార్త ఆశ్చర్యానికి గురి చేసింది.
అక్రమఆస్తుల కేసు విచారణలో, వారం వారం కోర్ట్ కు రాకుండా, తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలి అని కోరుతూ, జగన్ మోహన్ రెడ్డి హైకోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సిబిఐ కోర్ట్ తన పిటీషన్ ని తిరస్కరించటంతో, జగన్ హైకోర్ట్ లో ఈ పిటీషన్ వేసారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని అని, ఎన్నో పనులు ఉంటాయని, అందుకే తాను విచారణకు హాజరు కాలేనని, తన తరుపున సహ నిందితుడు వస్తారని, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ వేసి కూడా వారం దాటిపోయింది. అయితే, ఇప్పుడు ఏమైందో ఏమో కాని, ఈ రోజు అనూహ్యంగా ఆగమేఘాల పై, తాను హైకోర్ట్ లో వేసిన పిటీషన్ ను జగన్ మోహన్ రెడ్డి వెనక్కు తీసుకున్నారు. జగన్ తరుపు న్యాయవాది, హైకోర్ట్ లో వేసిన ఈ పిటీషన్ ను వెనక్కు తీసుకున్నారు.
అయితే బయటకు ఏమి జరిగిందో చెప్పలేదు కాని, పిటీషన్ లో ఏదో తప్పులు ఉన్నాయని, ఆ తప్పులు సరి దిద్ది త్వరలోనే మరో పిటీషన్ వేస్తామని, లీకులు ఇచ్చారు. దాదాపుగా వారం తరువాత, తప్పులను గుర్తించటం, అది కూడా ఒక వాయిదా పడిన తరువాత, ఇలా పిటీషన్ వెనక్కు తీసుకోవటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న, వ్యక్తీ పిటీషన్ లో తప్పులు ఉండటం ఏమిటా అని అనుకుంటున్నారు. అయితే, దీని వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈ రోజు విచారణ తప్పించుకోవటానికి, ఇలా చేసారా అని కొంత మంది వాపోతున్నారు. మరో పక్క, ఈ రోజు హైకోర్ట్ లో, ఈడీ విచారణకు కూడా తాను వారం వారం హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని, జగన్ హై కోర్ట్ లో పిటీషన్ వేసారు.