ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, తమ్మినేని సీతారంకు, ఢిల్లీలోని ఏపి భవన్ లో అవమానం జరిగింది అంటూ, పత్రికల్లో కధనాలు వచ్చాయి. ఆ కధనాలు ప్రకారం, ఏపి భవన్ కు వచ్చిన తమ్మినేని సీతారం, రాష్ట్ర అతిధిగా వచ్చినా, ఆయన గౌరవ మర్యాదలకు, ప్రోటోకాల్ నిబంధనలు తుంగలోకి తొక్కారని, ఏపి భవన్ అధికారుల పై ఆయన మనస్తాపం చెందారు. డెహ్రాడూన్‌ పర్యటన తరువాత, తమ్మినేని సీతారం, సతీసమేతంగా, ఢిల్లీలోని ఏపి భవన్ కు చేరుకున్నారు. తమ్మినేని సీతారంకు, ఏపి భవన్ లోని స్వర్ణముఖి బ్లాకులోని 320 గెస్ట్‌ రూమ్‌ను కేటాయించారు. అయితే, ఈ సందర్భంలో, తమ్మినేని ఆదివారం సాయంత్రం, రాష్ట్రానికి తిరుగు ప్రయాణం అయ్యే హడావిడిలో ఉండగా, ఏపి భవన్ అధికారులు వచ్చి, ఆయనకు షాక్ ఇచ్చారు. ఏపి భవన్ ఉద్యోగి ఒకరు, వచ్చి, ఆయనకు ఒక కవర్ ఇచ్చారు, ఆ కవర్ ఇస్తూ, సార్‌, మీ భోజన, వసతి బిల్లు కట్టమన్నారు, ఈ పుస్తకం పై, మీ సంతకం చెయ్యండి అంటూ, ఆ ఉద్యోగి తమ్మినేనిని కోరారు.

spekaer 23122019 2

అయితే ఈ పరిణామం పై, తమ్మినేని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఒక స్పీకర్ గా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అతిథి హోదాలో ఉన్న తనకు, ఇలా బిల్లు అడగటం ఏమిటి అంటూ, తమ్మినేని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అయితే దీనికి సమాధానం ఇస్తూ, ఆ ఉద్యోగి, సార్‌, మీకు కేటగిరీ-1 కింద విడిది ఇచ్చారు. అమరావతిలో ఉండే సాధారణ పరిపాలనా విభాగంనుంచి స్టేట్‌ గెస్ట్‌గా కాకుండా కేటగిరీ-1లో మీకు వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. దాని వల్ల, ఈ పొరపాటు జరిగిందని వారు తెలిపారు. అనుకోకుండా పొరపాటు జరిగిందని, ఈ ఇబ్బందికి చింతిస్తున్నామని, కాని బిల్ జేనేరేట్ అవ్వటంతో, బిల్ కట్టాల్సి ఉంటుంది అంటూ, ఆ ఉద్యోగి, తమ్మినేనికి విషయం చెప్పారు.

spekaer 23122019 3

అయితే అంతా విన్న తమ్మినేని, అనవసరంగా ఇష్యూ ఎందుకు, ముందు బిల్లు ఎంత వచ్చిందో,అంతా కట్టేయండి, తరువాత జరిగిన సంగతి నేను చూసుకుంటూ అంటూ, తమ్మినేనని తన సిబ్బందిని ఆదేశించారు. అయితే, ఇదే సమయంలో, అక్కడ జరిగిన విషయం పై, తమ్మినేని సతీమణి వాణి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. డబ్బు గురించి, బిల్లు గురించి కాదని, ఎంతైనా ఇచ్చేస్తాం అని, కాని రాష్ట్ర అతిధి హోదాలో వచ్చిన తమకు, అదీ కాక ఒక స్పీకర్ కు ఇలా అవమానం చేస్తారా ? స్పీకర్‌ను కూడా ఈ అధికారులు గౌరవించలేదు అని అసహనం వ్యక్తంచేశారు. అయితే జరిగిన విషయం పై ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా విచారం వ్యక్తం చేస్తూ, స్పీకర్ కు జరిగిణ అవమానానికి చింతిస్తున్నామన్నారు.

రాజకీయంగా చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న, మూడు రాజధానుల విషయం పై, ఈ రోజు చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేసారు. ఈ రోజు చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అమరావతిలో రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు పడుతున్న ఆవేదన చూసి చలించిన చంద్రబాబు, ఈ రోజు వారి దీక్షకు మద్దతు తెలిపారు. తుళ్లూరు మహాధర్నా లో చంద్రబాబు ,మాట్లాడుతూ, జై అమరావతి అంటూ నినాదాలు చేసి ప్రారంభించారు. "అమరావతి రైతుల్ని ఈ పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు. సమాజ హితం కోసం ముందుకొచ్చిన త్యాగధనులు మీరు. రాష్ట్రం నిలదొక్కుకోవాలనే ఉద్దేశం తో మీరు భూముల ఇచ్చేందుకు నాడు ముందుకొచ్చారు. మీకందరికీ ఆమోదయోగ్యమైన ప్యాకేజి నాడు ప్రకటించా. ఇది ఓ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని మీరంతా భూములిచ్చారు. రైతులకు న్యాయం కోసమే రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు. రైతు దినోత్సవం రోజే రోడ్డు పై ఉండటం బాధ కలిగిస్తోంది"

cbn 23122019 2

"అమరావతి లో రైతులు ప్రథమ పౌరులుగా ఉంటారని ఆశించా. నాడు చంద్రబాబు గా హామీ ఇవ్వలేదు....ప్రభుత్వం నుంచి సీఎం గా హామీ ఇచ్చాను. ఎకరం భూమి ఇవ్వడానికి ముందుకు రాని పతిస్థితుల్లో....33 వేల ఎకరాలు ఇచ్చారు. ఒక్క ఇల్లు కట్టాలంటే మూడేళ్లు పడుతుంది. రైతులకు న్యాయం జరగాల్సిందే. అమరావతి పై జగన్ ఎందుకు మాట తప్పి మడం తిప్పారు. 30వేల ఎకరాలు కావాలని నాడు అని ఇప్పుడెందుకు 200ఎకరాలు చాలు అంటున్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతి ని చంపేయటం అన్యాయం, దుర్మార్గం. ధైర్యం ఉంటే హైకోర్టు ద్వారా ఇన్సైడ్ ట్రేడింగ్ పై న్యాయ విచారణ జరిపించండి. మేమూ విచారణకు సహకరిస్తాం. తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. రాజకీయాలు ఎన్నికలప్పుడు చేసుకుందాం."

cbn 23122019 3

"నాకు ఇప్పుడు కావాల్సింది అమరావతే. జీఎన్ రావు ఎవరిని అడిగి నివేదిక రూపొందించారు. జీఎన్ రావ్ రిపోర్ట్ కి ఉన్న విశ్వసనీయత ఎంత. ముఖ్యమంత్రి పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాసినట్లుంది. జీఎన్ నివేదిక జగన్ నివేదిక తప్ప మరొకటి కాదు. విశాఖ అభివృద్ధి కి తెలుగుదేశం వ్యతిరేకం కాదు. విశాఖ ను ఆర్ధిక రాజధాని గా ప్రకటించాం. ఐటీ హబ్ గా విశాఖ అభివృద్ధి కి శ్రీకారo చుట్టాం. పర్యాటక కేంద్రంగా విశాఖ పరిసర ప్రాంతాల అభివృద్ధి కి పూనుకున్నాం. సచివాలయం లేదా అసెంబ్లీ అక్కడ పెడితే అది అభివృద్ధి కాదు. అసెంబ్లీ ఓ దగ్గర, సచివాలయం మరో ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. నాపై కోపంతో ప్రజల్ని హింసించడం తగదు" అంటూ చంద్రబాబు అమరావతి రైతులకు ధైర్యం చెప్పారు.

రాష్ట్రంలో మూడు రాజధానుల పై, జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో, రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. అయితే వీరికి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ నాయకులు, వీరికి మద్దతు పలుకుతున్నారు. అలాగే రేపటి నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వీరికి మద్దతుగా వివిధ వర్గాలు, ఆందోళన కార్యక్రమాలు ప్లాన్ చేస్తుంది. అయితే వీరికి, ఇప్పుడు హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి కూడా మద్దతు పలికారు. ఆయాన ఈ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. మందడంలో ఆందోళన చేస్తున్న రైతులు చేస్తున్న దీక్షలో కూర్చుని సంఘీభావం‌ ప్రకటించారు. గతంలో అమరావతి పై అందరూ చర్చించి, అసెంబ్లీలో కూడా ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే అందరూ ఒప్పుకున్నారని, తరువాతే ఇక్కడ శంకుస్థాపన చేసారని అన్నారు. ఈ తరుణంలో అమరావతి పై చర్చలు, కమిటీలు అవసరమే లేదని కమలానంద భారతి అన్నారు.

kamala 22122019 2

అమరావతిని రాజధానిగా ప్రకటించిన రోజు అందరూ ఒప్పుకుని, ఇప్పుడు మార్చుతాం అని చెప్పటం కరెక్ట్ కాదని అన్నారు. ముద్ద ముద్దకూ బిస్మిల్లా చేయరని, అలాగే రాజధానికి అనే దానికి ఒక్కసారే శంకుస్థాపన చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి కోసం చేస్తున్న ఉద్యమాన్ని కొనసాగించాలని, ఈ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, కమలానంద అన్నారు. మీ భద్రత, భవిష్యత్‌, జీవితం అంతా అమరావతితోనే ముడిపడి ఉందని, దాని కోసం మీరు పోరాడి సాధించుకోవాలని అన్నారు. అమరావతి రాజధాని అనేది, 29 గ్రామాల ప్రజల రాజధాని కాదని, 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అని, రాజధాని అభివృద్ధి చెందితే, ఈ అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని కమలానంద భారతి తెలిపారు.

kamala 22122019 3

అమరావతి ఏర్పాటు అనేది దైవ నిర్ణయమని, ఈ ప్రాంతానికి దేవతల ఆశీస్సులున్నాయన్నారు. అమరావతి అనే దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. వచ్చే 5-10 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని జోస్యం చెప్పారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడటంతో మబ్బులు ఎక్కువగా కమ్ముకున్నాయని, మబ్బులు విడిపోయాక మామూలు వాతావరణం వస్తుందని అన్నారు. డిసెంబర్ నెలలో అమరావతికి కొద్దిగా ఇబ్బందులు వస్తాయని, అయితే సంక్రాంతి తరువాత, అమరావతి పై ఏర్పడ్డ వివాదాలు అన్నీ తొలగి పోతాయని ఆయన అన్నారు. 29 గ్రామాల్లోని ప్రతి గ్రామంలో ఉన్న అమ్మవార్లకు పూజలు జరపాలని పిలుపునిచ్చారు. అధైర్యపడి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన రాజధాని రైతులకు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మూడు రాజధానులు అంటూ, జగన్ చేసిన ప్రకటనకు, మద్దతు పలికుతూ కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ నేత చిరంజీవి ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖ ఫేక్ అంటూ, సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ లు పెడుతున్నా, ఇంత వరకు చిరంజీవి నుంచి అధికారిక స్పందన రాలేదు. అయితే, ఇవన్నీ వార్తా చానల్స్ లో, వార్తా పేపర్లలో వచ్చినా, చిరంజీవి స్పందించలేదు అంటే, ఆ లేఖ నిజం అనే భావించాల్సి ఉంటుంది. ఆ లేఖలో జగన్ నిర్ణయం పై చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లో ఉండటం వలనే సమస్య వచ్చిందని, ఇప్పుడు అంతా అమరావతిలో పెడుతున్నారని, అందుకే జగన్ తీసుకున్న నిర్ణయం అద్భుతం అంటూ పొగిడారు. అయితే మరో పక్క తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం, జగన్ మూడు రాజధానులను వ్యతిరేకించారు. ఇలా అన్నయ్య ఒక ప్రకటన, తమ్ముడు ఒక ప్రకటన చెయ్యటంతో, అభిమానుల్లో మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

chiru 22122019 2

అయితే ఇది ఇలా ఉంటే, చిరంజీవి తీసుకున్న నిర్ణయం పై, బీజేపీ ఘాటుగా స్పందించింది.చిరంజీవి లేఖ పై, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రమేష్ మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి జగన్ భజన చేస్తున్నారని, ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు కూడా లేదని, విశాఖలో ఆయనకు ఏదో లాభాపేక్ష ఉందని, దాని కోసమే చిరంజీవి, జగన్ భజన చేస్తున్నారని, ఆయన ఆరోపించారు. జగన్ తీసుకున్న మూడు కళ్ళ సిద్ధాంతం, ప్రజలను మభ్య పెట్టటానికే ఉందని, ఏ ప్రాంతం కూడా ఈ నిర్ణయంతో బాగుపడదని, అలాంటి నిర్ణయాన్ని, చిరంజీవి సమర్ధించటం చూస్తుంటే, దీని వెనుక ఉన్న భాగోతం అర్ధం అవుతుందని అన్నారు.

chiru 22122019 3

అలాగే చిరంజీవి నిర్ణయం పై, తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ట్విట్టర్ లో స్పందించారు. ఆయన డైరెక్ట్ గా పేరు చెప్పకుండా, పరోక్షంగా స్పందించారు. దీనికి సంబంధించి, ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. "అప్పుడేమో ప్రజలకోసమని ప్రజారాజ్యం పెట్టే.దాన్ని మరో పార్టీలో కలిపే.మంత్రి పదవి పొంది విభజన పాపంలో భాగమయ్యే.ఇప్పుడు తమ్ముడు జనం కోసం పోరాడుతుంటే భుజం తట్టక మరో రాగమెత్తుకునే.ఐనా తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయిలే.మళ్లీ దూకేస్తాడేమో." అంటూ సోమిరెడ్డి ట్వీట్ చేసారు. మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి, ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు స్పందించారో, ఎవరికీ అర్ధం కావటం లేదు.

Advertisements

Latest Articles

Most Read