ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం నేనే తెచ్చాను అంటూ, జగన్ గొప్పగా చెప్పుకుంటున్న, అన్ని స్కూల్స్ లో కేవలం ఇంగ్లీష్ మీడియం పై, హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది. గతంలో చంద్రబాబు హయంలోనే, ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఉండగా, అప్పట్లో తల్లిదండ్రులకు, విద్యార్ధులకు తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉండేది. ఎవరికి కావలసిన మీడియంలో వారు చదువుకునే వారు. అయితే జగన్ మోహన్ రెడ్డి, తెలుగు మీడియం ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టరు. అయితే దీని పై అందరూ వ్యతిరేకం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాత్రం, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటూ ఎదురు దాడి చేసారు. అలాగే శాసనమండిలో, తెలుగు మీడియం కూడా ఆప్షన్ గా పెడితేనే మేము ఓటు వేస్తాం అని తెలుగుదేశం చెప్పటంతో, ఈ బిల్ పాస్ అవ్వలేదు. ఇది ఇలా నడుస్తూ ఉండగానే, ఈ అంశం పై, హైకోర్ట్ లో కేసు వేసారు, తూర్పుగోదావరి జిల్లా రావిపాడుకు చెందిన సుధీశ్ రాంభొట్ల, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్.
దేని పై విచారణ చేసిన హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలుగు మీడియంపూర్తిగా రద్దు చెయ్యటం, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టటం, విద్యా హక్కు చట్టానికి, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అంటూ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాము తుది తీర్పు ఏమి ఇస్తామో, అదే ఆచరించాలని పేర్కొంది. ఇంగ్లీష్ మీడియం పుస్తాకాలు ప్రింట్ చెయ్యటానికి వీలు లేదని, అలా చేస్తే, అధికారుల నుంచే ఆ సొమ్ము వసూలు చేస్తామని కోర్ట్ పెర్కుంది. అంతే కాదు, ఇంగ్లీష్ మీడియం కు సంబంధించి, శిక్షణా తరగతుల నిర్వహణ, మౌలిక సదుపాయల కల్పన లాంటివి కూడా చెయ్యవద్దని చెప్పింది. మా ఆదేశాలు ధిక్కరిస్తే, అధికారులదే బాధ్యత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల పై ఎందుకు స్టే ఇవ్వకూడదొ చెప్పాలని, హైకోర్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
దీని పై కౌంటర్ వెయ్యాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశిస్తూ, కేసుని జనవరి 27కి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అనూప్ కౌషిక్, కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29(2)(ఎఫ్) ప్రకారం విద్యార్థులకు బోధించే మాధ్యమం మాతృభాషలో ఉండాలని స్పష్టం చేస్తోందని స్పష్టం చేసారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం అన్నీ అధ్యయనం చేసి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుందని, వెంటనే అమలు చెయ్యటం లేదని, వచ్చే ఏడాది నుంచి చేస్తున్నామని, ఏడాది సమయం ఉందని, మాతృభాషలో బోధన వీలైనంత మేరకే ఉండాలని విద్యాహక్కు చట్టంలో ఉందని వాదనలు వినిపించారు.