ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో ఇప్పుడు హైకోర్ట్ ఎంటర్ అయ్యింది. రాజధాని అంశం ఇప్పుడు హైకోర్ట్ కు చేరింది. ప్రభుత్వం రాజధాని కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఏర్పాటు పై రైతులు హైకోర్ట్ కు వెళ్లారు. జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. జీఎన్ రావు కమిటీకి చట్టబద్దత లేదని వాపోయారు. తాము ఇప్పటికే రాజధాని కోసం భూములు ఇచ్చామని గుర్తు చేసారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చామని, ఇప్పటికే రోడ్లు వేసారని, బిల్డింగ్లు కడుతున్నారని, మా భూముల్లోనే ఇప్పుడు సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ ఉన్నాయని గుర్తు చేసారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో, జీఎన్ రావు కమిటీ అంటూ హడావిడి చేస్తున్నారని, ఇప్పుడు రాజధాని పై వీళ్ళు ఏమి సమీక్ష చేస్తారు అంటూ కోర్ట్ లో పిటీషన్ వేసారు. అంతే కాకుండా, తాజగా రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, మూడు రాజధానులు ఉంటే తప్పు ఏంటి, బహుసా రిపోర్ట్ అలాగే వస్తుంది ఏమో అంటూ, చేసిన వ్యాఖ్యల తో అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు.
అసలు కమిటీనే ఉండ కూడదు అని మేము అంటుంటే, ఇది కోర్ట్ లో ఉంటే, ఇప్పుడు ఆ కమిటీ ఏమి రిపోర్ట్ ఇవ్వకుండానే, జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ, ముందే చెప్పి, కమిటీ రిపోర్ట్ ను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే రైరుట్లు వేసిన పిటీషన్ పై, ఈ రోజు విచారణ సాగింది. హైకోర్ట్ ఈ విషయం పై, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. మరో పక్క రైతులు, జగన్ చేసిన ప్రకటన పై ఆందోళన చేస్తూనే, తమ నిరసనలు కొనసాగిస్తూనే, న్యాయ పోరాటం కూడా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అంతా చట్ట ప్రకారం జరిగిందని, ఆ చట్టానికి, అనుగుణంగానే చెయ్యాలని కోరుతున్నారు.
తాము అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే, తమ రాష్ట్రం కోసం, మా భవిష్యత్తు కోసం రాజధానికి భూములను స్వచ్చందంగా ఇచ్చామని, అప్పుడు ప్రభుత్వం తమ భూములు తీసుకొని పనులు మొదలు పెట్టిందని, ఇప్పుడు వచ్చిన మరో ప్రభుత్వం, రాజధాని మార్పు అంటూ కమిటీ ఏర్పాటు చేయటం ఏంటని, రైతులు కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ప్రశ్నించారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారుస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో, ఇప్పుడు రాజధాని మారిస్తే తాముఎటూ కాకుండా అయిపోతామని, ఇప్పటికే తాము ఇచ్చిన భూములు , వ్యవసాయానికి కూడా పనికి రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేస్తుందో చూడాలి.