మంత్రి బొత్స సత్యనారాయణకి తెలుగుదేశం పార్టీ నేతలు, 25 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాసారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, డొక్కా మాణిక్యవరప్రసాదరావు , ఈ ప్రశ్నలు సంధించారు. ఇది లేఖ "ఒక సామాజిక వర్గం కోసమని, ముంపు ప్రాంతమని.. ప్రజారాజధానిపై రోజుకొక నింద వేస్తున్నారు. కూర్చున్న కొమ్మనే మీరు నరుకుతున్నారు. 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు, ఉద్యోగాలు కల్పించగల రాజధాని ఆంధ్రులకు అవసరం లేదా.? హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకు ధీటుగా ఆంధ్రులకు రాజధాని లేకుంటే ఇక్కడకు వచ్చి ఎవరు పెట్టుబడులు పెడతారు.? ప్రజా రాజధానికి కుల తత్వం, ప్రాంతీయ తత్వం అంటగట్టి ప్రజల్ని రెచ్చగొట్టడం అంటే మంత్రి స్థాయిని దిగజార్చడం కాదా.? ఈ కింది ప్రశ్నలకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు సూటిగా సమాధానం చెప్పగలరా.? 1. 28.6.2019న ఏపీసీఆర్డీఏపై జగన్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. అందులో రూ.5,674 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రూ. 5,674 కోట్లు మొత్తం ఖర్చయితే పీటర్‌ కమిషన్‌ పేరుతో లీకైన నివేదికలో రూ.30వేల కోట్లు రాజధానిలో దుబారా అయిందని చెప్పడం పచ్చి అబద్దం కాదా? పీటర్‌ వైఎస్‌ మేనత్త కుమారుడనేది వాస్తవం కాదా? అమరావతిపై అపోహలు సృష్టించడానికి పీటర్‌ని నియమించడం వాస్తవం కాదా?

2. చంద్రబాబు ప్రారంభించిన సైబరాబాద్‌ నగర నిర్మాణాన్ని వైఎస్‌ ప్రభుత్వం అడ్డుకోలేదు. నిర్మాణాన్ని కొనసాగించారు. కనుకనే నేడు సైబరాబాద్‌ 13 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. 2018-19లో లక్ష కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు చేసింది. తెలంగాణ బడ్జెట్‌కు ఒక్క హైదరాబాద్‌ నగరమే 60 శాతంపైగా ఆదాయం సమకూరుస్తున్నది. హైదరాబాద్‌ని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారు. దాంతో తెలంగాణలోని అన్ని జిల్లాల అభివృద్ధిలో ఇది కీలకంగా ఉన్నది వాస్తవం కాదా? అమరావతి అభివృద్ధిని నాశనం చేయడమంటే 13 జిల్లాల ఏపీ అభివృద్ధికి గండికొట్టడం కాదా? 3. అమరావతిలో భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.12వేలు ఖర్చు చేసిందని వైసీపీ నాయకులు, మంత్రులు పదేపదే అబద్దాలు చెబుతున్నారు. అసెంబ్లీ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.5,333, హైకోర్టు భవనాలకు చ.అ.కు రూ.3,666, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలకు ఫర్నీచర్‌, సెంట్రల్‌ ఏసీ, 50 ఎకరాల అభివృద్ధి కలిపి చ.అ.కు రూ.7,101, ఎమ్మెల్యే, ఆలిండియా సర్వీస్‌ అధికారుల భవనాలు, ఎన్జీఓ భవనాలకు చ.అ.కు రూ.3,459 ఖర్చు అయింది. ఈ లెక్కలన్నీ బొత్స గారి వద్ద ఉన్నా, చ.అ.కు టీడీపీ ప్రభుత్వం రూ.12వేలు ఖర్చు చేసిందని పదే పదే అబద్దాలు ఎందుకు చెబుతున్నారు? మీ రివర్స్‌ డెవలప్‌మెంట్‌ విధానాల వైఫల్యం కప్పిపెట్టుకోవడానికి కాదా?

4.హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు నగరాలకు ధీటైన రాజధాని ఆంధ్రులకు లేకపోతే ఏపీలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? ఉద్యోగాలు ఎలా వస్తాయి? 13 జిల్లాల అభివృద్ధికి ఆదాయం ఎలా సమకూరుతుంది? తెలంగాణ బడ్జెట్‌లో ఒక్క హైదరాబాద్‌ నగర ఆదాయమే సింహ భాగం ఉన్నది వాస్తవం కాదా? హైదరాబాద్‌ ఆదాయంతోనే తెలంగాణ జిల్లాలన్నింటి అభివృద్ధి జరుగుతోందనేది వాస్తవం కాదా? 5.శివరామకృష్ణన్‌కు వచ్చిన, సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం అత్యధికులు అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలని కోరింది వాస్తవం కాదా? విజయవాడ-గుంటూరు-అమరావతి ప్రాంతంలో రాజధాని ఉండాలని 2,191 మంది కోరగా, విశాఖకు 507, కర్నూలుకు 360, తిరుపతికి 113, దొనకొండకు 116 అభిప్రాయాలు వచ్చింది వాస్తవం కాదా? రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున ఉన్న అమరావతికన్నా మించినది మరేమున్నది? శాతవాహనులు, వాసిరెడ్డివారు, నాగార్జునా చార్యులకు కేంద్రంగా, రాజధానిగా ఉన్న అమరావతి నేడు జగన్‌ రెడ్డి గారికి ఎందుకు రుచించడంలేదు. కుల తత్వం, ప్రాంతీతత్వం లాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవారికి పాలకులుగా ఉండే అరత ఉన్నదా?

6.అమరావతిలో రాజధానిని జగన్‌ బలపరిచింది వాస్తవం కాదా? రాజధానికి 30 వేల ఎకరాలకు తక్కువ కాకుండా ఉండాలని జగన్‌ మాట్లాడింది అసెంబ్లీ రికార్డుల్లో ఉన్నది వాస్తవం కాదా? నేడు అందుకు విరుద్ధంగా మీరెందుకు మాట్లాడుతున్నారు? 7.ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ బ్యాంకు రాజధానికి అతి తక్కువ వడ్డీపై మంజూరు రూ.5వేల కోట్ల రుణం మీ అసమర్ధత వల్ల రద్దయినది వాస్తవం కాదా? 8.రాజధాని నిర్మాణాలన్నీ నిలుపుదల చేయడం వల్ల, ప్రజా వేదికను కూల్చి రాజధాని ప్రాంత ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడం వల్ల ఒక్క రాజధాని భూముల విలవే లక్ష కోట్లు పడిపోయింది వాస్తవం కాదా? ఈ ప్రభావంతో రాష్ట్రమంతా భూముల విలువ పడిపోయి రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రభుత్వానికి పడిపోయింది నిజం కాదా? హైదరాబాద్‌ భూముల విలువ 30 శాతం పెరిగింది వాస్తవం కాదా? 9.హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ జగన్‌ గారికి, వారి అనుచరులకు భూములున్నందువల్ల రేట్లు పెంచుకునేందుకు అమరావతిని డ్యామేజ్‌ చేస్తున్నారా? లేక దొనకొండలో వారి భూములు అమ్ముకొనేందుకు అమరావతిని దెబ్బతీస్తున్నారా? లేక హైదరాబాద్‌కు ధీటుగా అమరావతి ఉండరాదనే కేసీఆర్‌ కోరిక నెరవేరుస్తున్నారా? 10. అమరావతి ముంపు ప్రాంతమని మీరు చెప్పింది అబద్దం కాదా? అమరావతి ముంపు ప్రాంతం కాదని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, ఇస్రో నిర్ధరించింది నిజం కాదా? 1850, 2009లో పెద్ద వరదలు వచ్చినా ఎలాంటి ముంపు జరగలేదని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు పేరా 76లో చెప్పింది వాస్తవం కాదా?

11. బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో 500 ఎకరాలిచ్చి ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ చేశారనే మీ ఆరోపణ పచ్చి అబద్దంకాదా? బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వలేదని రుజువైంది వాస్తవం కాదా? 12. అమరావతిలో ఫౌండేషన్‌ ఖర్చులు హైదరాబాద్‌, చెన్నై కన్నా తక్కువ అని ఇంజనీరింగ్‌ నిపుణులు ప్రకటించింది నిజం కాదా? అమరావతిలో ఖర్చు ఎక్కువ అన్న మీ ప్రకటన అబద్దం కాదా? అమరావతిలో రాకీ స్టార్టా ఎల్‌ 11 మీ. డెప్త్‌, చ.మీ.కు 150 టన్నుల బేరింగ్‌ కెపాసిటీ ఉన్నది. హైదరాబాద్‌ రాకీ స్టార్టా కారణంగా బ్లాస్టింగ్‌ చేయాలి. బేస్‌ మెంట్‌ 7.1 మీటర్లు, బ్లాస్టింగ్‌ 4.5 మీటర్లు మొత్తం 11.6 మీటర్లు డెప్త్‌, దీనికి తోడు కృష్ణా, గోదావరి నీటి సరఫరా ఖర్చులు, చెన్నైలో బేరింగ్‌ కెపాసిటీ చ.మీ.కు 10 మెట్రిక్‌ టన్నులే. ఫైల్‌ ఫౌండేషన్‌ 30 నుంచి 40 మీటర్ల లోతు నుంచి వేయాలి. రాజధానుల సాయిల్‌ స్ట్రెక్త్‌ కు సంబంధించి మద్రాసు ఐఐటీ నిపుణుల అంచనాలకు విరుద్దంగా మంత్రి బొత్స చేత జగన్‌ రెడ్డి గారు అబద్దాలు చెప్పిస్తున్నది వాస్తవం కాదా?

13. అమరావతి స్వయం ఆధారిత అభివృద్ధి (సెల్ఫ్‌ ఫైనాన్స్‌) ప్రాజెక్ట్‌. అమరావతిలో రైతులకు ఇవ్వగా ప్రభుత్వానికి మిగిలిన భూముల విలువ లక్ష కోట్లు అనేది వాస్తవం కాదా? ఇందులో 50 వేల కోట్లు ఖర్చు చేస్తే హైదరాబాద్‌ కు దీటైన రాజధాని అంధ్రులకు ఏర్పడుతుందనేది నిజం కాదా? రాజధాని నుంచే రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు జమ కావడం నిజం కాదా? రాజధాని అమరావతి. బహుళ ప్రయోజనకారి కాదా.? 14. ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని అంటూ అబద్దాలు చెప్పడమే కాక కుల చిచ్చు పెట్టడం మంత్రి స్థాయిని దిగజార్చడం కాదా? ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉండటం జగన్‌ గారికి ఇష్టంలేదా? రాజధానిలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు 75 శాతం ఉన్న మాట నిజం కాదా? 29 పంచాయతీల్లో 15 పంచాయితీల్లో కాపులు గణనీయంగా ఉన్నారు. రెడ్డి, కమ్మ జనాభా కుడి ఎడమగా ఉన్నది వాస్తవం. తుళ్లూరు, తాడేపల్లిలలో రెడ్లు, కమ్మవారికి భూములు సమానంగా వున్నది నిజం కాదా? ఈ వాస్తవాలు కప్పిపెట్టి ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గంపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం కాదా? విజయవాడ, గుంటూరులలో బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం జనాభా గణనీయంగా ఉన్నారు. అమరావతి కులాల కాస్మాపాలిటిన్‌ ప్రాంతం అనేది నిజం కాదా?

15. రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదు, ఒక శాశ్విత కట్టడం లేదనే మీ పార్టీ విమర్శలు పచ్చి అబద్దాలు కాదా? సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు భవనాలు శాశ్వితం కాదా? ఇటుకలు లేకుండా నిర్మించారా? 16. అమరావతిలో గ్రాఫిక్స్‌ రోడ్లపై తిరుగుతున్నారా? 17. 29 గ్రామాల పేదలకు నిర్మించిన 5వేల గృహాలు గ్రాఫిక్స్‌ యేనా? 18. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలు గ్రాఫిక్స్‌ గానే ఉన్నాయా? 19. హేపీనెస్ట్‌ కు ఎన్‌ఆర్‌ఐల స్పందన కూడా మీకు గ్రాఫిక్స్‌ లా కనిపిస్తోందా? 20. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీలు, ఎక్సెల్‌ ఆర్‌ఐ, ఎయిమ్స్‌ నిర్మాణాలు గ్రాఫిక్సేనా? 21. కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ గ్రాఫిక్సేనా? 22. రైతులు రాజధాని కోసం 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రపంచంలో ప్రత్యేకత కలిగిన అంశంగా హార్వార్డ్‌ విశ్వవిద్యాలయంలో చర్చించలేదా? 23. రాజధానిలో 8వేల కోట్లతో పనులు చేసింది వాస్తవం కాదా? అందులో 1500 కోట్లు కేంద్రం ఇచ్చింది నిజం కాదా? 24. 22.10.2019 నాటికి ప్రధాన మంత్రి అమరావతికి శంకుస్థాపన చేసి 4 ఏళ్లు గడిచింది వాస్తవం కాదా? కొత్త రాజధానులన్నింటికన్నా అమరావతిలో నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎంతో ఎక్కువగా ఉన్నదనేది వాస్తవంకాదా? 25. స్విస్‌ ఛాలెంజ్‌ కేసు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ హైకోర్టు ప్రాంతంలో కనీసం టీ కూడా లభించడంలేదు. జడ్జీల క్వార్టర్లు ఇప్పటిదాకా నిర్మించలేదు. పనుల జాప్యంతో హైకోర్టులో సమస్యలు. పనులు మీరు చేస్తారా? ఆదేశాలు ఇవ్వాలా? అని వ్యాఖ్యానించారు. ఇది జగన్‌ ప్రభుత్వ అసమర్థతకు, ద్రుక్పద లోపానికి నిదర్శనం కాదా?

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అవమానం జరిగింది. హిందూపురం పర్యటనకు వచ్చిన బాలయ్య, తనకు స్కార్ట్ కల్పించాలని పోలీసులకు సమాచారం ఇచ్చినా, పోలీసులు పట్టించుకోని ఘటన, టిడిపి శ్రేణుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. నందమూరి బాలకృష్ణ, హిందూపురం వచ్చిన సందర్భంలో, బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరారు. ఒక వివాహ వేడుకలో పాల్గొనటంతో పాటుగా, నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. బాలయ్య వస్తున్నారని తెలుసుకుని, మార్గమధ్యలో, గలిబిపల్లి గ్రామస్థులు కొడికొండ చెక్ పోస్టు వద్ద, బాలయ్య కారును అడ్డుకున్నారు. లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్డు పూర్తి చెయ్యాలని, బాలయ్య ఎదుట ఆందోళన వ్యక్తం చేసారు. దీని పై స్పందించిన బాలయ్య, అధికారులతో మాట్లాడి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని గ్రామస్తులకు నచ్చ చెప్పారు. ఇంత ఘటన జరిగినా, పోలీసులు ఎవరూ అక్కడకు రాలేదు.

balayya 26102019 2

అయితే, ఈ సంఘటన వైసీపీ నాయకులు వెనుక ఉండి నడిపించారని, స్థానిక టిడిపి నేతలు భావిస్తున్నారు. బాలయ్య పర్యటన మొత్తం, ఇలా సమస్యల పేరుతొ అడ్డుకోవాలని స్కెచ్ వేసినట్టు సమాచారం ఉందని, వైసీపీ ప్రభుత్వం ఉంటూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనులు అవ్వకుండా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ నేపధ్యంలోనే, బాలయ్య తిరిగి బెంగుళూరు వెళ్ళే సమయంలో, సెక్యూరిటీ కావలని అడిగారు. తనకు, ఎస్కార్ట్ కావాలని పోలీసులకు స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి అడిగారు. అయినా పోలీసులు రాలేదు. అరగంట పైన వెయిట్ చేసిన బాలయ్య, చివరికి ఆయన ఒక్క‌రే తన వాహానంలో బెంగళూరు విమానాశ్ర‌యానికి వెళ్ళారు. బాలయ్య శుక్రవారం తన నివాసంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మూడు స్టేషన్లకు సమచారం అందించారు. అయినా ఎవరూ అక్కడికి రాలేదు.

balayya 26102019 3

బాలక్రిష్ణకు జరిగిన ఈ అవమానం పై టిడిపి నాయకులు, బాలయ్య అభిమానులు అసహనం వ్యక్తం చేసారు. గతంలో బాలకృష్ణ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పెనుకొండ‌ డిఎస్పీతో పాటు సిఐలు అందరు ఉండి ప్రోటోకాల్‌ పాటించేవారు. ప్రస్తుతం ప్రోటోకాల్ పాటించకపోయినా పర్వాలేదు కనీసం విమానాశ్రాయానికి వెళ్ళే సమయంలోనైనా ఎస్కార్ట్ గా రావాడం లేదని తనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేనే కాదు సెల‌బ్రిటీ కూడా అని అన్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఇవ్వక పోయినా కనీసం ఒక సెలబ్రిటీకి ఇచ్చే కనీస గౌరవం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.

ఏదైనా రాష్ట్రంలో అధికార వర్గాలు అన్నిటికీ బాస్ ఛీఫ్ సెక్రటరీ. ముఖ్యమంత్రికి సమానంగా ఉండే స్థాయి ఛీఫ్ సెక్రటరీది. ఒక్క రాజకీయ జోక్యం తప్పితే, ఛీఫ్ సెక్రటరీకి అన్ని అధికారాలు ఉంటాయి. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా, ఏ అధికారికైన, ఐఏఎస్ కైనా, షోకాజ్ నోటీస్ ఇచ్చి, వివరణ కోరే అధికారం ఛీఫ్ సెక్రటరీకి ఉంది. అయితే ఇంతటి అధికారాలు ఉన్న ఛీఫ్ సెక్రటరీ ఉణికినే ప్రశ్నించే ఉత్తర్వులు వచ్చాయి. ఛీఫ్ సెక్రటరీ, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఇలా సిఎస్ స్థాయి అధికారులకు కూడా, షోకాజ్ నోటీస్ ఇచ్చే అధికారాన్ని తనకు దఖలు చేస్తూ, జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరిట గురువారం అర్దారాత్రి విదులైన జీవో చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శితో పాటుగా, సీఎం ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ జారీ చేసిన జీవో, ప్రకారం, అటు సియం, ఇటు నేను, ఇక మధ్యలో ఎవరికీ సంబంధం లేదన్నట్టుగా, చీఫ్‌ సెక్రటరీనే ఛాలెంజ్ చేసే విధంగా, ఉత్తర్వులు వెలువడ్డాయనే అభిప్రాయం కలుగుతుంది.

chief secretary 26102019 2

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన ఈ జీవో 128 పై అధికార వర్గాల్లో, తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్‌ రూల్స్‌కు సవరణలు చేయటం పై, అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ సవరణ, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. బిజినెస్‌ రూల్స్‌ సవరణ చేసే సమయంలో, కేబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపించాలని, గవర్నర్ ఆమోదం తరువాతే చీఫ్‌ సెక్రటరీ మాత్రమే ఈ మేరకు జీవో ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ జీవో మాత్రం చీఫ్‌ సెక్రటరీ వద్దకు వెళ్లిన దాఖలాలు లేవని అంటున్నారు. అదీ కాక, ఇది గవర్నర్ ద్వారా జరగాల్సిన ప్రక్రియ అని కూడా అంటున్నారు. బిజినెస్‌ రూల్స్‌కు, అనుబంధ వ్యాఖ్యాన్ని పెట్టాలంటే, సియం ఆదేశాలు సరిపోతాయని, కాని నియమావళి పూర్తిగా మార్చేస్తే, ముందుగా గవర్నర్ ఆమోదం తప్పనసరి అని చెప్తున్నారు.

chief secretary 26102019 3

అయితే ఇప్పుడు ఒక ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి, చీఫ్‌ సెక్రటరీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసే అధికారం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా చర్చ జరుగుతుంది. జగన్ ఆదేశించినా, జీవోలు జారీ అవ్వటం లేదని, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, గురువారం కొంత మంది అధికారులతో సమావేశం అయ్యారు. అయితే ఆర్ధిక శాఖ క్లియరెన్స్‌ కోసమే, జీవోలు ఆగిపోయాయని, సమాధానం చెప్పారు అధికారులు. అయితే ఈ సమాధానం పై సంతృప్తి చెందని, ప్రవీణ్ ప్రకాష్, అప్పటికప్పుడు సిబ్బందిని పిలిపించుకుని అర్ధరాత్రి సమయంలో బిజినెస్‌ రూల్స్‌ సవరించేశారు. దీని ప్రకారం, సీఎం లేదా ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు , ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సెక్రటరీలకు వెళ్లే ఫైళ్లను 3 కేటాగిరీలుగా విభజించారు. అయితే టైంకి జీవో జారీ కాకపొతే, సంబంధిత స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సెక్రటరీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి తగు చర్య తీసుకునేలా జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీని (ప్రస్తుతం ప్రవీణ్‌ ప్రకాశ్‌) సీఎం ఆదేశించవచ్చు. బిజినెస్‌ రూల్స్‌కు చేసిన తాజా సవరణలు చీఫ్‌ సెక్రటరీ ఉనికినే ప్రశ్నించేలా ఉన్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రాష్ట్రంలో ఇసుక లేక, దారుణ పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, గత అయుదు నెలలుగా పనులు లేక, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం బ్రతకటానికి కూడా డబ్బులు లేక, అన్న క్యాంటీన్ లు లేక, తిండి లేక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ధీన పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో, భవన నిర్మాణ కార్మికులు, ప్రతి రోజు ఆందోళనలు చేస్తున్నారు. ఇసుకను వదలమని, తక్కువ రేట్ కు ఇవ్వమని, అప్పుడే పనులు మొదలవుతాయని ఆందోళన బాట పట్టారు. అయినా సరే, ప్రభుత్వం, పట్టించుకోవటం లేదు. తెలుగుదేశం పార్టీ ఇసుక పై ఆందోళనలు చేస్తుంది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ముందుగా సెప్టెంబర్ 5 అన్నారు. తరువాత వరదలు వచ్చాయని అన్నారు. వర్దలు వస్తే, రెండు మూడు జిల్లాలకు ఇబ్బంది కాని, రాష్ట్రమంతా ఇసుక కొరత ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వం మాత్రం, ఎటువంటి చర్యలు చేపట్టటం లేదు.

botsa 26102019 2

ఈ నేపధ్యంలో విసుగెత్తి పోయిన ప్రజలు, ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే, గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణలకు చేదు అనుభవం ఎదురైంది. ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు మంత్రులను నిలదీశారు. గుంటూరు పర్యటనలో డ్రైనేజి పనులు పరిశీలనకు మంత్రులు వచ్చారు. దీంతో అక్కడ ప్రజలు, వారిని అడ్డుకున్నారు. మీకు ఓటు వేశాము.. మాకు ఇసుక ఇవ్వండని కార్మికులు నిలదీశారు. మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని కార్మికులు మంత్రులతో అన్నారు. అయితే వారికి వారిస్తూ, త్వరలోనే మీ కష్టాలు తీరిపోతాయని చెప్పిన మంత్రులకు, ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురు అవ్వటంతో, సమాధానం చెప్పలేక, అక్కడ నుంచి జారుకున్నారు.

botsa 26102019 3

మరో పక్క, నిన్న గుంటూరు జిల్లాల్లో ఒకేరోజు ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పొన్నూరు మండలం మునిపల్లెకు చెందిన నాగ బ్రహ్మాజీ తాపీ మేస్త్రిగా ఉన్నారు. అయితే పనులు లేకపోవటంతో, ఆయన చాలా రోజులుగా కాళీగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో అతని భార్య, స్పిన్నింగ్ మిల్ లో ఉద్యోగానికి వెళ్తుంది. అయితే తనకు పనులు లేకపోవటం, భార్య ఉద్యోగానికి వెళ్తూ ఉండటంతో, అది తట్టుకోలేక, తను చనిపోయాడు. మరోప్ పక్క, గుంటూరు నగరంలో కోదండరామయ్యనగర్‌ 1వ లైనుకు చెందిన బేల్దారి మేస్త్రీ పడతాపు వెంకట్రావు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు ఇప్పటిదాకా వరకు రైతుల బలవన్మరణానికి పాల్పడటం చూసిన రాష్ట్రంలో కొత్తగా జగన్‌ సర్కారు అసమర్థ పాలన వల్ల భవన నిర్మాణ కార్మికులు చనిపోయే స్థితి వచ్చిందని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read