కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ అయుదు నెలల్లో, కోర్ట్ ల దగ్గర ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు సెక్యూరిటీ విషయం దగ్గర నుంచి, విద్యుత్ పీపీఏలు, పోలవరం రివర్స్ టెండరింగ్, ఇలా అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. నిన్నటికి నిన్న, రాజధాని అమరావతి విషయంలో, అసలు ఇదేమి వైఖరి, మీ వైఖరి చెప్పండి అంటూ, హైకోర్ట్ మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఈ రోజు హైకోర్ట్ లో, జగన్ ప్రభుత్వానికి డబల్ షాక్ తగిలింది. మొదటిగా ఇసుక విషయంలో, ప్రభుత్వ వైఖరి పై విమర్శలు వస్తున్న వేళ, ప్రభుత్వం అందుబాటులో ఉన్న ఇసుక కోసం వెళ్లి ఇబ్బందులు పడింది. అమరావతి రాజధాని కోసం, ఎల్‌అండ్‌టీ సంస్థ నిల్వ చేసిన, ఇసుక కోసం ప్రభుత్వం ముందుకు వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్లాయిపాలెం వద్ద రాజధాని నిర్మాణాల కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ నిల్వ చేసిన వేల టన్నుల ఇసుకను ప్రభుత్వం తీసుకుంది.

highcourt 25102019 2

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటంతో, వందల కొద్దీ లారీలు వచ్చాయి. అయితే, ప్రభుత్వ నిర్ణయం పై, ఎల్‌అండ్‌టీ సంస్థ తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఇక్కడ ఇసుక డబ్బులు కట్టి తెచ్చుకున్నామని, రాజధాని ఆగిపోవటంతో, ఇసుక ఉందని, డబ్బులు కట్టిన ఇసుకను ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆరోపిస్తూ, హైకోర్ట్ కు వెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇసుక స్వాధీనానికి ప్రభుత్వం జారీచేసిన మెమోలను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెన్స్ లో ఉంచి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే ఇసుక యూనిట్లను లెక్కించాలని కోర్టు తెలిపింది. ఇక మరో కేసులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది.

highcourt 25102019 3

రిజిస్టర్డ్‌ దస్తావేజుల ద్వారా తమకు విక్రయించిన 4,731 ఎకరాల భూమిని ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారమై ఈ నెల 19న ఏపీఐఐసీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరింది. "మూడు రిజిస్టర్డ్‌ విక్రయ దస్తావేజుల ద్వారా 4,731 ఎకరాల భూముల్ని ఏపీఐఐసీ రూ.65.07 కోట్లకు మాకు విక్రయించింది. పదేళ్ల కిందట జరిగిన విక్రయమది. ఆ భూములపై హక్కులు మాకు దఖలు పడ్డాయి. చట్టవిరుద్ధంగా వాటిని ఇప్పుడు రద్దు చేసి ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు" అని హైకోర్ట్ కు తెలిపింది. ఈ పిటీషన్ పై స్పందించిన హైకోర్ట్, తదుపరి విచారణ వరకు యధాతధ స్థితిని కొనసాగించాలని చెప్తూ, తదుపరి విచారణను నవంబర్ 29 వరకు వాయిదా వేసింది.

రమణదీక్షితులు గుర్తున్నారా ? చంద్రబాబు హయంలో, తిరుమల పై ఏదో జరిగిపోతుంది అంటూ ప్రచారం చేసి, చంద్రబాబు తిరుమలని అపవిత్రం చేస్తున్నారు అంటూ, ఒక క్యాంపైన్ నడపటంలో, అలాగే బ్రాహ్మణ సామాజిక్వర్గాన్ని, టిడిపి నుంచి దూరం చెయ్యటంలో, సక్సెస్ అయ్యారు. తిరుమలలో ప్రధాన అర్చకుడిగా ఉంటూనే, ఉన్నట్టు ఉండి ఆయన చెన్నై వెళ్లి, చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. అసలు వెంకన్నకు సేవలు చెయ్యటం లేదని, టైంకి జరగాల్సినవి జరగటం లేదని, నైవేద్యం కూడా సరిగ్గా పెట్టటం లేదు అంటూ, సంచలన ఆరోపణలు చేసారు. అలాగే బుందీ పోటుని మొత్తం తావ్వేసి, అక్కడ బంగారం దొంగలించారని కూడా ఆరోపణలు చేసారు. తరువాత పింక్ డైమెండ్ వివాదం తెలిసిందే. అయితే అప్పట్లో ఈయన్ను ప్రభుత్వంపై, విమర్శలు చేసినందుకు ప్రభుత్వం రిటైర్మెంట్ ఇచ్చేసింది. అయితే ఇది అక్రమం అని, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను కలిసి దీక్షితులు విన్నవించుకున్నారు.

deekshetulu 25102019 2

అప్పట్లో జగన్ కూడా, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, రిటైర్మెంట్ ఎత్తేస్తాం అని, రమణ దీక్షితులకు మళ్ళీ ప్రధాన అర్చకుడు హోదా ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ వచ్చారు. వచ్చి కూడా అయుదు నెలలు అయ్యింది. వారం రోజుల క్రిందట, అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అమలు అవుతుందని చెప్పింది. అయితే, ఇంకేముంది ఈ నిర్ణయం, రమణ దీక్షితులు కోసమే అని అందరూ అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు రమణ దీక్షితులుకు మాత్రం, మళ్ళీ పూర్వ వైభవం రాలేదు. బుధవారం జరిగిన టీటీడీ బోర్డు విషయంలో, ఈ విషయం పై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవటంతో, దీక్షితులుకి, ఇప్పుడే అవకాసం వచ్చేలా లేదు

deekshetulu 25102019 3

టిడిపి బోర్డు నిర్ణయం ప్రకారం, ఇప్పటికిప్పుడు మాజీ అర్చకులని తీసుకుకోవటం లేదని, టీటీడీలో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన అర్చ‌కుల సేవ‌ల‌ను తిరిగి ఏ విధంగా వినియోగించుకోవాల‌నే విష‌యంపై విధి విధానాలు రూపొందించేందుకు ఒక క‌మిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటి వేస్తున్నారు అంటేనే, అది కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళినట్టే లెక్క. ఇలా చేస్తే, న్యాయ పరమైన చిక్కులు వచ్చే అవకాసం ఉందని టిటిడి భావనగా తెలుస్తుంది. అంటే, ఇప్పట్లో రమణ దీక్షితులు ఆశలు తీరేలా లేవు. ఆయన ఈ మధ్య కాలంలో జగన్ ను కలిసి, విన్నవించుకున్నారు అనే వార్తలు వచ్చినా, ఏమి జరగలేదు. దీని పై మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు కూడా ఘాటుగా స్పందించారు. "తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రమణ దీక్షితులు అదే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర అర్చకుల సమస్య పై దృష్టి పెట్టి తన వాగ్దానానికి అనుగుణంగా సత్వర చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ విషయంలో ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవస్థలో కొందరు ముఖ్యమంత్రి కన్నా బలవంతులుగా ప్రవర్తిస్తున్నారా? అదే నిజమైతే వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిపాలనా విధానానికే అది ప్రమాదం అవుతుంది." అంటూ ఐవైఆర్ స్పందించారు.

కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అమరావతి పై అనేక వార్తలు వస్తున్నాయి. ఒక మంత్రి వచ్చి ఇక్కడే రాజాధాని అంటారు. ఇంకో మంత్రి ఇక్కడ కాదు అంటారు. ఇంకో మంత్రి పరిశీలిస్తున్నాం అంటారు. మరో మంత్రి భ్రమరావతి అంటారు. మరో మంత్రి హైమావతి అంటూ ఎగతాళి చేస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, అమరావతి పై ప్రకటనలు చేస్తూ, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు ప్రకటన చెయ్యాల్సిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఇంత గందరగోళం జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇక ఒక 15 రోజులు నుంచి మరో వార్త వినిపిస్తుంది. ఇప్పుడు వెలగపూడిలో ఉన్న సచివాలయం, హైకోర్ట్ తరలిస్తున్నారని, సచివాలయాన్ని మంగళగిరి, హైకోర్ట్ ను రాయలసీమకు తరలిస్తున్నాం అంటూ, లీకులు ఇస్తున్నారు. ఇక మరో పక్క బీజేపీ లాంటి పార్టీతో పాటు, వైసీపీలోని ఒక వర్గం, హైకోర్ట్ రాయలసీమలోనే పెట్టాలని అంటున్నారు. కొంత మంది హైకోర్ట్ మారిపోతుంది అంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు.

court 25102019 2

దీంతో రాష్ట్రంలోని న్యాయవాదులు అంతా ఆందోళన బాట పట్టారు. దసరా పండుగ ముందు నుంచి ఆందోళనలు చేస్తూ, హైకోర్ట్ అమరావతిలోనే ఉంచాలని ఇక్కడి వారు విధులు మానేసి ఆందోళన చేసారు. మరో పక్క హైకోర్ట్ రాయలసీమలో పెట్టాలని అక్కడ న్యాయవాదులు, విధులు మానేసి ఆందోళన చేసారు. మరో పక్క ఉత్తరాంధ్ర న్యాయవాదులు, విధులు మానేసి, హైకోర్ట్ ఇక్కడే పెట్టాలి అంటూ, వారు కూడా ఆందోళన చేసారు. మొత్తానికి, దాదపుగా ఒక 15 నుంచి 20 రోజుల వరకు ఈ ఆందోళనలు కొనసాగాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే, ఇదే అంశం పై, రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, క్లారిటీ ఇచ్చారు.

court 25102019 3

రాష్ట్రంలోనే తొలిసారిగా, హైకోర్ట్ లో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి, రాష్టవ్య్రాప్తంగా ఉన్న జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదుల ప్రతినిధులతో, నేలాపాడు హైకోర్టు నుండి జస్టిస్ మహేశ్వరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర హైకోర్టును అమరావతిలోని నేలపాడు నుండి తరలిస్తున్నారన్న అంశం కేవలం ఊహాగానమే అని, రాజకీయ నాయకుల ట్రాప్ లో పడి, న్యాయవాదులు, ఇటువంటి వదంతులపై ఉద్యమాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. అసలు హైకోర్ట్ తరలింపు అంశం రాష్ట్రం చేతిలో ఉండదని, రాష్టప్రతి, కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశం అని అన్నారు. అక్కడ నుంచి హైకోర్ట్ తరలింపు పై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఎవరికి వారు తమకే హైకోర్టు కావాలనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది న్యాయవాదులు, అమరావతిలోనే హైకోర్ట్ ఉండటం సమంజసం అని చెప్పటంతో, ఇదే విషయం కేంద్రప్రభుత్వానికి, రాష్టప్రతికి విన్నవించాలని వారు చీఫ్ జస్టిస్ ను కోరారు.

జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య స్నేహం ఇప్పటిది కాదు. మానుకోండలో రాళ్ళు పెట్టి కొట్టి, జగన్ తెలంగాణాలో పర్యటన చెయ్యకుండా చేసిన కేసీఆర్ కు, జగన్ ఇంతలా దగ్గర కావటానికి కారణం, చంద్రబాబు. అటు కేసిఆర్ కు, ఇటు జగన్ కు, ఉమ్మడి శత్రువు చంద్రబాబు కాబట్టి, చంద్రబాబు ఏపి సియంగా ఉంటే, తెలంగాణా చెప్పిన మాట వినరు కాబట్టి, కేసీఆర్, జగన్ తో స్నేహం చెయ్యటం మొదలు పెట్టి, ఉమ్మడిగా, చంద్రబాబుని ఎదుర్కోవటం మొదలు పెట్టరు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి కోసం, జగన్ కు, కేసీఆర్ చేసిన మేళ్ళు అన్నీ ఇన్నీ కావు. మొత్తానికి చంద్రబాబుని ఓడించారు. జగన్ ఎక్కగానే, మన సచివాలయ భవనాలు లాక్కున్నారు. మరో పక్క, మన గోదావరి నీళ్ళు, తెలంగాణా భూభాగం నుండి తరలించే ప్రణాళిక రచిస్తున్నారు. ఇలా తెలంగాణాకు అన్ని విధాలుగా లాభం చేకూరే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

kcr 25102019 2

ఇప్పటికి అటు జగన్, ఇటు కేసిఆర్, దాదపుగా నాలుగు సార్లు సమావేశం అయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం తారా స్థాయిలో ఉంది. అయితే, ఈ స్నేహం మధ్య ఆర్టీసీ విషయంలో, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒక పక్క తెలంగాణాలో ఆర్టీసి విలీనం చెయ్యం అని కేసీఆర్ అంటుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, జగన్ కమిటీలు వేసారు. అయితే, నిన్న కేసిఆర్ ప్రెస్ మీట్ లో, జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆర్టీసిని ఏ దిక్కుమాలినోదు అయినా ప్రభుత్వంలో విలీనం చేస్తారా అని కేసిఆర్ చేసిన వ్యాఖ్యలతో, వైసీపీ నేతలు, కార్యకర్తలు హార్ట్ అయ్యారు. అంతే కాదు, ప్రెస్ మీట్ లో విలేఖరులు, అక్కడ జగన్ ఆర్టీసిని విలీనం చేస్తున్నారు, ఇక్కడ మీరు చేయటానికి ఏమైంది అని ప్రశ్నించగా, కేసీఆర్ చెప్పిన సమాధానం కూడా గట్టిగా ఉంది.

kcr 25102019 3

కేసిఆర్ మాట్లాడుతూ, అక్కడ మన్ను కూడా ముందుకు వెళ్ళలేదు. విలీనం అన్నారు అంతే. దాని పై కమిటీ వేసారు. అది ఎప్పటికి వచ్చెనో, ఆరు నెలలకో, మూడు నెలలకో. అక్కడ కూడా ఏమి జరగదు. నేను చెప్తున్నానుగా. నాకంటే ఆర్టీసి గురించి తెలిసినోడు ఎవరున్నారు. అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, జగన్ నిర్ణయాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఏదో మభ్యపెట్టటానికి చేసారు అనేలా వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే, కేసీఆర్ అలా ఈ వ్యాఖ్యలు చేసారో లేదో, వెంటనే జగన్, ఆర్టీసి పై మరో నిర్ణయం తీసుకుని, కేసీఆర్ కి ఇన్-డైరెక్ట్ సమాధానమా అనేలా చేసారు. నిన్న కేసీఆర్, ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే, ఏపిలో ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్‌ను నియమిస్తూ జీవో జారీ చేశారు. ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయ శాఖల అధికారులతో గ్రూప్‌ ఉంటుంది. అయితే, ఇది నిజంగా అమలు అవుతుందా, లేదా అనేది వేచి చూడాలి.

Advertisements

Latest Articles

Most Read