గత ఎన్నికల సమాయంలో జగన్ విధానాలు నచ్చక, అవమానాలు భరించలేక, వంగవీటి రాధా, తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవటంతో, రాధా మళ్ళీ పార్టీ మార్పు పై ఆలోచనలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో వారం క్రితం, వంగవీటి రాధ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో, వరుసగా రెండు రోజులు పాటు భేటీ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారని, రంగా జయంతి రోజున పవన్ కళ్యాణ్ సమక్షంలో, జనసేన కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి. రాధా అభిమానులు, అనుచారాలు కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ రోజు రంగా జయంతి సందర్భంగా, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాధా పాల్గున్నారు. అయితే, అందరూ అనుకున్నట్టు జనసేన పార్టీ చేరిక విషయం పై మాత్రం, ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆయన అభిమానులు నిరాస చెందారు.
ఈ రోజు రంగా 72 వ జయంతి సందర్భంగా, విజయవాడలోని బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి పూల మాల వేసి, అక్కడ జరిగిన కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గున్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి, రాధా రంగా మిత్రమండలి సభ్యులు, అభిమానాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా, రాధా మాట్లాడుతూ, వంగవీటి మోహన రంగా అశయాల సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. బడుగు వర్గాల కోసం రంగా పని చేసరాని, రంగా ఏ ఒక్క వర్గానికి చెందినవారు కాదని రాధా చెప్పుకొచ్చారు. అయితే జనసేన పార్టీలో చేరే విషయం పై, ఈ రోజు రాధా ప్రకటన చేస్తారాని, అభిమానులు, అనుచరులు అనుకున్నా, రాధా మాత్రం, ఆ విష్యం పై ఎక్కడా మాట్లాడలేదు. కనీసం, పార్టీ మార్పు పై సంకేతం కూడా ఇవ్వలేదు. దీంతో అసలు రాధా పార్టీ మారతారా, లేకపోతె తెలుగుదేశం పార్టీలోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.