విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన కంపెనీలు లేవు. ఐటి కంపెనీలు, సరైన ఇన్ఫ్రా లేని మన రాష్ట్రం వచ్చే పరిస్థతి చాలా తక్కువ. అందుకే అప్పట్లో చంద్రబాబు, దేశ విదేశాలు తిరిగి, మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు తెచ్చే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని కంపెనీలు తెచ్చే విషయంలో సక్సస్ అయ్యారు. అందులో భాగంగానే, రాష్ట్రం మొబైల్ ఫోన్ లు తయారు చేసే హబ్ అయ్యింది. అలాగే కియా, హీరో హోండా, అశోక్ ల్యేలాండ్ లాంటి ఆటోమొబైల్ కంపెనీలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారటం, చంద్రబాబు లాంటి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం లేకపోవటంతో, కొన్ని కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. అందులే ముఖ్యంగా, చైనాకు చెందిన హోలీటెక్‌ సంస్థ ఇప్పుడు మనసు మార్చుకుంది.

పోయిన సంవత్సరం ఆగష్టు 5 వ తారీఖున, ఈ కంపెనీ ప్రతినిధులు చంద్రబాబు వద్దకు వచ్చి, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్టు ఒప్పందం కుదుర్చుకుని వెళ్లారు. ఫోన్ల విడిబాగాలు, ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీలో పేరొందిన ఈ సంస్థ.. రూ.1400 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో కర్మాగారం పెట్టటానికి సిద్ధమైంది. ఇతర రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఉన్నా సరే, ఈ కంపెనీని మన రాష్ట్రం తీసుకోవటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేస్తున్నట్టు ఒప్పదం కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడ ప్రభుత్వం మారటంతో, సీన్ మారిపోయింది. ఈ కంపెనీ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి, ఏపి మీద అభిమానం ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు.

ప్రస్తుతం దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలను పతనం చేసే ఆలోచనలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పై అదే కుట్ర చేసి, ఓడించారు. మమతా బెనర్జీ పని పట్టి, ఇప్పటికే ఆమె పై, పై చేయి సాధించారు. గత వారం రోజులగా, తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన విషయం కూడా చూస్తున్నాం. త్వరలోనే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పై రాజకీయ దాడికి బీజేపీ రెడీ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పై కూడా తన ఫోకస్ పెట్టింది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా, ప్రస్తుతానికి జగన్ ని అడ్డు పెట్టుకుని, ఎదిగే ఆలోచనలో ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి, సీనియర్ నాయకులను లాగేస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం పై, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళిన ఆయన, అక్కడ లాబీలకు వెళ్లి జేసీ తాజా రాజకీయాల పై మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు.

బీజేపీలో చేరాలంటూ తనకు కూడా ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. కొందరు బీజేపీ పార్టీ నేతలు తనతో టచ్‌లో ఉన్నారని, కానీ తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పానని, అలాంటప్పుడు పార్టీ ఎలా మారతానని వారిని ప్రశ్నించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తుంటారని, అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. ఇంకా కొందరు నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారనేది వాస్తవమేనని జేసీ దివాకర్ రెడ్డి బాంబు పేల్చారు. ఎన్నికల ఫలితాల వచ్చిన అనంతరం బీజేపీలోని కొంత మంది నేతలు ఎవరూ తనను సంప్రదించలేదని పుకార్లకు జేసీ శుభం కార్డు పలికారు. అయితే బీజేపీకి కొందరు నేతలు టచ్‌లో ఉన్నారన్న వ్యవహారం పై టిడిపి కార్యకర్తలు మాత్రం పోజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడున్న కొంత మంది సీనియర్లు, పార్టీకి భారమని, ఇలా అయినా వారు వదిలిపోతే అంతకంటే సంతోషం ఏముంటుంది అంటున్నారు. మరి ఈ వ్యవహారం పై చంద్రబాబు ఏమంటారో చూడాలి.

ఒకరికి నష్టం వస్తే, మరొకరికి లాభం అంటే, ఇదేనేమో... గత 20 రోజులుగా అమరావతి పరిస్థితి పాతాళానికి పోతుంటే, హైదరాబాద్ లాభపడటం చూస్తున్నాం.. మొన్నటి దాక అమరావతి అంటే హాట్ కేక్.. కాని, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం అమరావతి పై పంథా తెలియకపోవడంతో తీవ్ర సందిగ్ధం నెలకొంది. గతంలో ఇక్కడ అమరావతిలో గజం రూ.25 వేలు పై వరకు వరకు ధర పలికితే అదే స్థలం ధరలు, ఇప్పుడు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పడిపోయింది. ఇంత తగ్గినా, అమరావతి పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించక పోవటంతో, కొనేవారు కనిపించడం లేదు. మొన్నటి దాక ఎకరం రూ.కోటి నుంచి కోటిన్నర వరకు పలకగా, ప్రస్తుతం ఆ రేట్ తగ్గినప్పటికీ అక్కడ కూడా కొనేవారు లేరు. ఇక, రాజధాని పరిధిలోని తుళ్ళూరు, తాడికొండ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లోని రైతుల్లో కూడా ఆందోళన నెలకుంది.

అమరావతిలో అనుకూల పరిస్థితులు ఏర్పడితే, ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చనే భావనలో కొంత మంది ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అమరావతి పై ఏ క్లారిటీ రాకపోవటంతో, ఇక్కడ పెట్టుబడి పెడదాం అనుకున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్‌ వైపు దృష్టి సారించారు. హైదరబాద్ లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అమరావతి ప్రాంత అభివృద్ధితో పాటు ప్రధాన కంపెనీలు, సంస్థలు పెట్టుబడులు పెట్టిన పక్షంలో రియల్‌ వ్యాపారుల్లో కొంత కదలిక వస్తుందని వారంటున్నారు. కాని ప్రభుత్వం ధోరణి చూస్తుంటే ఇప్పుడే ఏమి అమరావతి పై ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. చూద్దాం, ఈ ప్రభుత్వం ఈ విషయం పై, ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. గవర్నర్‌ ప్రసంగానికి తీర్మానాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదోర ప్రవేశపెట్టరు. దీనిని ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు బలపరిచారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యే అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ తరుపున మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం అంటే, ప్రభుత్వ చేసే పాలసీ డాక్యుమెంట్‌ అని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేయస్సును ప్రతిబింబించేలా గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని మేము అందరం భావించామని చెప్పారు. గవర్నర్‌ చేసిన ప్రసంగంలో ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం పై వివరాలు లేవని విమర్శించారు. మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్న అమరావతి అనే ప్రస్తావనే లేదని అన్నారు.

మాటి మాటికి పట్టిసీమ వృథా ప్రాజెక్టు, అది వేస్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు, పట్టిసీమ వృథా ప్రాజెక్టు అయితే మోటార్లు ఆన్‌ చేయడం మానండని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పట్టిసీమ మోటార్లు ఆన్‌ చేయడం మానేస్తే రైతులకు ఎంత ఆగ్రహం వస్తుందో, ఆ రియాక్షన్ ఏంటో మీరే చూస్తారని అచ్చెన్నాయుడు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ఖర్చుపై ఇన్ని చెప్తున్నారని, ఖర్చు పై మాత్రమే కాదని, ఆ ప్రాజెక్ట్ ప్రయోజనాలపై కూడా మాట్లాడాలని నిలదీశారు. పోలవరం పనులను 70 శాతం పూర్తి చేశామని వివరించారు. మిగతా 30 శాతం పనులు త్వరగా పూర్తిచేయాలని తాము వైసీపీని కోరుతున్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిందని, పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. అయితే పట్టిసీమ వేస్ట్ అంటున్నారు కదా, మోటార్లు ఆన్‌ చేయకండి అని అచ్చెన్నాయుడు అడిగిన దానికి, సభలో సమాధానం చెప్పలేక పోయింది వైసీపీ...

Advertisements

Latest Articles

Most Read