టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 23న వెలువడిన ఫలితాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఓడిపోయానని బాధపడకుండా ఆయన ఇంటింటా తిరుగుతూ క్షమాపణ కోరారు. పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై బులెట్‌పై ఒంటరిగా పర్యటిస్తూ తాను ఏమైనా తప్పు చేస్తే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ఓటు వేసినవాళ్లకు, వేయని వారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. తానేమీ తప్పు చేయలేదని.. అయినా తనను క్షమించాలని వేడుకున్నారు. పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై బులెట్‌పై ఒంటరిగా పర్యటిస్తూ తాను ఏమైనా తప్పు చేస్తే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ఓటు వేసినవాళ్లకు, వేయని వారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. తానేమీ తప్పు చేయలేదని.. అయినా తనను క్షమించాలని వేడుకున్నారు.
news
బెయిల్ పై బయటకు రాగానే, సంచలన వ్యాఖ్యలు చేసిన ‘కోడికత్తి’ శ్రీనివాస్...
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న శ్రీనివాస్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని అతని తరఫు న్యాయవాది సలీమ్ వారం క్రితం విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో సెక్షన్ 55(ఎ) కింద పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి న్యాయనిపుణుల అభిప్రాయం కోర్టు ముందుకు రావడంతో గురువారం వాదనలు జరిగాయి. తన క్లయింట్ మలేరియా, డెంగీ, అజీర్ణంతో బాధపడుతున్నాడని సలీమ్ వాదించారు. గుండె సంబంధిత వ్యాధి సోకే అవకాశం కూడా ఉందన్నారు. ఈ వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పార్ధసారథి రూ.60 వేలు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
బెయిల్ పై బయటకు రాగానే శ్రీను సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎయిర్ పోర్టులో తాను కుక్ గా పనిచేస్తూ ఉండేవాన్ని అని.. ప్రజల సమస్యలపై తాను చాలా రాశానని అవన్నీ జగన్ కు తెలియజేయాలని చూశానని వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి చేసిన శ్రీనివాస్ చెప్పాడు. తాను జగన్ అభిమానిని కాదని తేలిస్తే శిరచ్ఛేదనం చేసుకుంటానని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఆ రోజు తాను జగన్ ను చంపాలని అసలు అనుకోలేదని శ్రీనివాస్ చెప్పారు.. అది పొరపాటున జరిగింది అని అన్నారు. తన ఆలోచనలకు సంబంధించిన విషయాలను జగన్ తో ఆరోజు చెప్పాలని అనుకున్నానని శ్రీనివాస్ చెప్పారు.
ఆరోజు తాను ఫోటో కోసం వెళ్లానని.. కంగారుగా ఏమి చేశానో కూడా తనకు తెలీదు అని శ్రీనివాస్ చెప్పారు. ఆయనకు ఏమి తగిలిందో కూడా తనకు తెలీదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ఆరోజు అక్కడ ఉన్న వాళ్ళు చంపేసేవాళ్ళని.. కానీ జగన్ తనను కొట్టొద్దని చెప్పారని శ్రీనివాస్ చెప్పాడు. తాను వంటవాన్ని అని.. తన దగ్గర ఫోర్క్ లాంటివి ఎన్నో ఉన్నాయని శ్రీనివాస్ చెప్పారు. అది యాక్సిడెంటల్ గా జరిగిందని శ్రీనివాస్ వెల్లడించారు. తన మీద చాలా అవాస్తవాలు సృష్టించారని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ప్రమాదవశాత్తూ జరిగింది తప్ప మరేదీ కాదని శ్రీనివాస్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జగన్ కు సానుభూతి రావడం కోసం తాను ఈ పని చేయలేదని అన్నారు శ్రీనివాస్.
టిడిపి ఓటమికి కారణాలు ఇవే...!
గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లను బీజేపీతో కలిపి టీడీపీ గెలుచుకుంది. వైసీపీకి ఒక్కటీ దక్కలేదు. ఈసారి అలాంటి పరిస్థితి టీడీపీకి ఏకంగా నాలుగు జిల్లాల్లో ఎదురైంది. కర్నూలు, విజయనగరం, నెల్లూరు, కడప జిల్లాల్లో మొత్తం సీట్లను వైసీపీ స్వీప్ చేసింది. పోయినసారి కడప జిల్లాలో ఒక సీటు టీడీపీ గెలుచుకోగలిగింది. ఈసారి అది కూడా రాలేదు. ఇక... చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన మినహా టీడీపీ అభ్యర్థులెవరూ గెలవలేకపోయారు. తెలుగుదేశంలో ఉన్న నిర్లిప్తత కొంపముంచగా, కసిగా పని చేసిన వైసీపీకి గెలుపు దక్కింది. ‘చంద్రబాబును ఇప్పటికే పలుమార్లు సీఎంగా చూశాం. జగన్‌కూ ఒక్కసారి అవకాశం ఇద్దాం’ అనే జనం వైఖరితోపాటు... అనేక స్వీయ తప్పిదాలు తెలుగుదేశాన్ని దెబ్బతీశాయి. అధినేతగా, పాలనా సారథిగా చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఎంత కష్టపడినా, టీడీపీ ఘోర పరాజయం పొందింది.
టీడీపీ ఎమ్మెల్యేల్లో, ప్రజలకి ఉన్న వ్యతిరేకత మరో కారణం. 40 మంది సిట్టింగ్లను మారుస్తా అన్నారే కాని, చంద్రబాబు ఆ పని చెయ్యలేక పోయారు. చంద్రబాబు చేసిన సంక్షేమం, అభివృద్ధి, పడిన కష్టంపై ప్రేమ ఉన్నా... స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి, ఈర్ష్య, అసూయలే ప్రభావం చూపించాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు రెచ్చిపోతుండగా... వారి అనుచరులు మరింత చెలరేగిపోయారు. తొలినాళ్లలో ‘జన్మభూమి కమిటీల’ పేరి సాగిన దందా అంతా ఇంతాకాదు. పసుపు-కుంకుమలాంటి కీలక పథకాలను జనంలోకి బాగానే తీసుకెళ్లినా... ఒక్క విషయంలో మాత్రం తెలుగుదేశం తప్పిదం చేసింది. మహిళలకు వడ్డీలేని రుణాలను గతంలో ప్రభుత్వాలు ఇచ్చేవని, చంద్రబాబు ఆ పథకాన్ని ఎత్తేసి... అందులో కొంత డబ్బును పసుపు-కుంకుమ కింద ఇచ్చారని జగన్ పదే పదే ప్రచారం చేశారు. దీన్ని టీడీపీ తిప్పికొట్టలేకపోయింది. ఇలా అనేక చోట్ల జగన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని, తిప్పి కొట్టటంలో తెలుగుదేశం పూర్తిగా ఫెయిల్ అయ్యింది.
ఇక చివరి నిమిషంలో చేసే పోల్ మేనేజ్‌మెంట్ లో కూడా తెలుగుదేశం వైఫ్యలం పూర్తిగా కనిపించింది. వైసీపీ అద్భుతమైన పోల్‌మేనేజ్‌మెంట్ చేసిందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. టీడీపీకి సంప్రదాయంగా ఆర్థిక సహకారం అందించే వర్గాలన్నింటినీ కేంద్రం కట్టడి చేసింది. అటు పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా డబ్బు వచ్చే మార్గాలు మూసుకుపోయాయి. ఇచ్చే వాళ్లున్నప్పటికీ... తెచ్చే దారి కనిపించకుండా పోయింది. మరో పక్క వైసీపీకి మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇక, టీడీపీ గెలిచి తీరాలన్న కసి ఆ పార్టీ కార్యకర్తలో 2014లో కనిపించినంతగా ఈసారి కనిపించలేదు. అతి విశ్వాసమో, అన్నీ చంద్రబాబు చూసుకుంటాడన్న ధీమానో, అధికారంవల్ల వచ్చిన అలసత్వమో... కారణం ఏదైనా కావొచ్చు! గత ఎన్నికల్లో చావో రేవో అని తెగించి పనిచేసినవారు... ఈసారి తమవరకు తాము ఓటేస్తే చాలు అనుకునే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు ఈసారి చావో రేవో అన్న కసితో పనిచేశారు.
పవన్ కళ్యాణ్ కి, థాంక్స్ చెప్తున్న వైసీపీ కార్యకర్తలు...
తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయంలో జనసేన కూడా తన వంతు పాత్ర పోషించినట్లు స్పష్టమైంది. ఫ్యాన్ హోరుతో టీడీపీ ఓటమిపాలు కాగా మరీ తక్కువ సీట్లు రావడానికి జనసేన కారణమనే వాదన వినిపిస్తోంది. వైసీపీ విజయం సాధించిన 32 చోట్ల.. అది సాధించిన మెజారిటీ కంటే జనసేన గణనీయమైన ఓట్లు సాధించడం గమనార్హం. 2009లో ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని ఇలాగే దెబ్బతీసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 80 స్థానాల్లో రెండో స్థానంలో నిలువగా.. అక్కడ కాంగ్రెస్ సాధించిన మెజారిటీ కంటే పీఆర్పీకి అధిక ఓట్లు రావడం విశేషం. అలాగే ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 5 వేల ఓట్ల లోపు ఓడిపోయిన స్థానాలు 28 వరకు ఉన్నాయి.
ఈ దఫా ఎలమంచిలిలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీకి 4 వేల ఓట్లు అధికంగా రాగా.. జనసేనకు 16,500 ఓట్లు వచ్చాయి. రామచంద్రపురంలో వైసీపీకి 5వేల ఓట్లు మెజారిటీ దక్కగా.. జనసేనకు 17,592 ఓట్లు వచ్చాయి. తణుకులో వైసీపీ 1264 ఓట్లతో గెలిస్తే జనసేనకు అక్కడ 35502 ఓట్లు పడ్డాయి. విజయవాడ వెస్ట్‌లో వైసీపీ 6వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేనకు 22,312 ఓట్లు వచ్చాయి. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ 1587 ఓట్లతో ఓడిపోగా జనసేనకు 4104 ఓట్లు పడ్డాయి. తిరుపతిలో వైసీపీ 708 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచింది. ఇక్కడ జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 12వేలకు పైగా ఓట్లు వచ్చాయి.
తాజా ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీపై ప్రజారాజ్యం తాలూకు నీలినీడలు కనిపించాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాల్లో గెలవడం, అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపివేయడంతో ఓటర్లలో ఇంకా ఆ జ్ఞాపకాలు చెదిరిపోలేదు. ఆ ప్రభావం జనసేనపై కనిపించిందని చెప్పవచ్చు. 2009లో ప్రజారాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 స్థానాలు గెలిచింది. తెలంగాణను మినహాయించి మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ను పరిగణిస్తే 16 స్థానాల్లో ప్రజారాజ్యం గెలిచింది. ప్రస్తుత ఫలితాల్లో జనసేన ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తెలుగుదేశం 35 సీట్లలో ఓడిపోవటానికి ఒక కారణం అయిన పవన్ కళ్యాణ్ కు, వైసీపీ కార్యకర్తలు థాంక్స్ చెప్తున్నారు.