గంజాయి స్మగ్లర్లు ఎత్తుకు పై ఎత్తు వేస్తుంటే పోలీసులు ఒకడుగు ముందుకేసి వారి వ్యూహాలు చిత్తు చేస్తున్నారు. విజయవాడ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇసుక లారీలో ఇసుక కింద ఈ మూటలు పెట్టి తరలిస్తుండగా వెలికి తీశారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారని పక్కాగా అందిన సమాచారం మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు మాటువేశారు. లారీ రాగానే నిలువరించి తనిఖీలు చేయగా ఇసుక కుప్పల కింద గంజాయి మూటలు గుర్తించారు. మొత్తం 1137 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, దీని విలువ 2.27 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. సరుకు స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నర్సీపట్నం ఏజెన్సీలోని సపర్ల గ్రామం నుంచి హైదరాబాద్‌కు గంజాయి భారీగా రవాణా అవుతున్నట్లు స్పష్టమైన సమాచారం రావడంతో విజయవాడ నగర శివారులో శుక్రవారం పట్టుకున్నట్లు తెలిపారు.

విజయవాడ నగరంలోని సాయికిరణ్ జ్యూయలరీ దుకాణంలో భారీ చోరీ జరిగింది. బందరురోడ్డులోని పటమట సమీపంలో ఉన్న ఈ దుకాణంలో శనివారం రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య.. పక్కా ప్రణాళికతో ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డును ఆనుకునే బంగారం దుకాణం ఉంది. ముందువైపు నుంచి లోపలికి వెళ్తే.. సైరన్ మోగే ప్రమాదముందని పసిగట్టిన దొంగలు దుకాణం వెనుకవైపున నిర్మిస్తున్న ఇంటివైపు నుంచి దుకాణం వెనుక గోడకు రంద్రం పెట్టి లోపలికి చొరబడ్డారు. ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించగా మరో వ్యక్తి బయట ఉండి గ్లౌజులు, ఇతర పరికరాలు వారికి అందించినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణం లోపలి కర్ర తలుపును నెట్టేందుకు ప్రయత్నించిప్పటికీ అది బలంగా ఉండటంతో తలుపునకు రంద్రం పెట్టి దుకాణంలోకి ప్రవేశించారు. అక్కడ సీసీ కెమేరా ఉండడాన్ని గుర్తించిన ఓ వ్యక్తి తమ వెంట తీసుకొచ్చిన ఆయుధంతో దాన్ని పగులగొట్టాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో యజమాని ఉదయమే తెరవలేదు. దుకాణం వెనక ఇంటి నిర్మాణం చేస్తున్న వ్యక్తి బంగారం దుకాణం వెనుకవైపు గోడకు రంద్రం ఉండటాన్ని గమనించి యజమానికి సమాచారం చేరవేశారు. షాపు యజమాని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. 500 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లుగా గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా గురించి చేయాల్సింది చేస్తూనే ఉండాలని, మోడీకి ఇప్పుడు మన అవసరం లేదు కదా అని వైఎస్ జగన్ అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘కేంద్రానికి మన అవసరం లేదు కాబట్టి.. మన వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే ఎవరూ పట్టించుకోరు. ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే సమస్య కాదు.. ఆర్థిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి. బీజేపీకి 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే.. ప్రత్యేక హోదాపై సంతకం పెడితేనే మనం మద్దతిచ్చే వాళ్లం. ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టే.. కేంద్రానికి మన బాధ చెప్పుకుంటున్నాం. ప్రధాని మోదీని వదలను.. రోజూ అడుగుతూనే ఉంటాను."

jagan 26052019 2

"మన సహాయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం సాగుతోంది. మన సహాయం వారికి అవసరం లేదు కానీ.. మనల్ని ఆదుకోవాల్సిన అవసరం వారికి ఉంది. రాష్ట్రాన్ని బాగా నడపాలన్న తపన ఉంది కాబట్టే... ఆదుకోవాలని మోదీని కోరా. ప్రత్యేక హోదా విషయం కలిసిన ప్రతి సారి అడుగుతూనే ఉంటా. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాం. ఒకేసారి నిషేధిస్తే ఆదాయం దెబ్బతింటుంది. 2024 నాటికి మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌కే పరిమితం చేస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తాం. నా విశ్వసనీయత చూసే జనం ఓట్లు వేశారు.. ఆ విశ్వసనీయతను నిలబెట్టుకుంటా’’ అని జగన్ తెలిపారు. ఇక బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ వివరాలను జగన్మోహన్ రెడ్డి వివరించారు.

jagan 26052019 3

ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం అమిత్ షా.. దేశంలోనే రెండో శక్తివంతమైన నేత అని.. ప్రధాని మోదీతో తర్వాత ఆయనే అన్నారు. అందుకే మొదట ప్రధానితో భేటీ తర్వాత అమిత్ షాతో సమావేశమయ్యానన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై నెంబర్ టూగా ఉన్న వ్యక్తిని కలిశానని చెప్పారు. ఈ భేటీ ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ విషయంలో మాత్రం, చంద్రబాబుని తీవ్ర ఇబ్బంది పెట్టిన జగన్, ఇప్పుడు తాను కూడా చంద్రబాబు మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నారు. చంద్రబాబు మోడీని కాదని, పోరాటం చేసిందే ఈ ప్రత్యెక హోదా కోసం. అప్పుడు చంద్రబాబుని యుటర్న్ అంటూ ఎగతాళి చేసిన జగన్, ఇప్పుడు నేను అడుగుతూనే ఉంటా, మోడీకి మన అవసరం లేదు కదా, అంటూ రెండో రోజే చేతులు ఎత్తేసారు.

"పోలవరం ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్రరాష్ట్రానికి లేదు. కానీ ఆంధ్రరాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క అవసరం యుద్ధప్రాతిపదికన పోలవరం పూర్తి చేయాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది." ఇది పోలవరం ప్రాజెక్ట్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయస్‌ జగన్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం నిర్మించాల్సిన అవసరం లేదని, కేంద్రం చేస్తాను అంటే కేంద్రానికి ఇచ్చేస్తాం అని, మాకు తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చెయ్యటం కావాలని జగన్ అన్నారు. అయితే జగన్ వ్యాఖ్యల పై మాత్రం, కొంచెం అవగాహన రాహిత్యం కనిపిస్తుంది. ఎందుకంటే, పోలవరం ప్రాజెక్ట్, కేంద్రం లేట్ చేస్తుందనే, నీతి ఆయోగ్ సూచన మేరకు రాష్ట్రానికి ఇచ్చి, వేగంగా పనులు జరిగేలా చేసారు.

jagan 26052019 1 1

దీనికి కారణం కూడా లేకపోలేదు. దేశంలో మొత్తం 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించినా, కేంద్రం అలసత్వంతో వాటి పనులు పూర్తి కాలేదు... అసోంలోని కుల్సి డ్యామ్‌, ఏపీలోని పోలవరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నోవా-దిహింగ్‌ ప్రాజెక్టు, అప్పర్‌ సియాంగ్‌ ప్రాజెక్టు, హిమాచల్‌ప్రదేశ్‌లోని రేణుకాడ్యామ్‌, ఉత్తరాఖండ్‌లోని కిషుయా బహళార్థ సాధక ప్రాజెక్టు, జమ్ము కశ్మీర్‌లోని ఉజ్‌, బుర్సార్‌, మహారాష్ట్రలోని గోసిఖుర్ద్‌, యూపీలోని కెన్‌బెట్వా, సరయు నహర్‌ పరియోజన, పంజాబ్‌లోని షాపూర్‌కండి, రవివ్యాస్‌, పశ్చిమ్‌ బంగలోని తీస్తా, ఉత్తరాఖండ్‌లోని లక్వార్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఉన్నాయి... వీటిలో మన పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్ట్ లు, దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది.

jagan 26052019 1 1

మొత్తం 16 నీటి పారుదల ప్రాజెక్ట్ ల ప్రస్తుత స్తితి చూస్తే, మన రాష్ట్రం నిర్వహిస్తున్న పోలవరం తప్పితే, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిగిలిని అన్నీ ప్రాజెక్ట్ లు అసలు ముందుకు కదలటం లేదు... ఇంకా దారుణం ఏంటి అంటే, 10 ప్రాజెక్ట్ లు కనీసం రిపోర్ట్ దశను కూడా దాటలేదు... మిగిలిన 5 ప్రాజెక్ట్ ల పనులు అసులు జరగటం లేదు... 16 జాతీయ ప్రాజెక్ట్ లలో, మన పోలవరం మాత్రమే, ఈ పరిస్థితిలో ఉంది... దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... అందుకే చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పడినా, తన నెత్తిన వేసుకుని పనులు వేగం పెంచారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం కట్టాల్సిన అవసరం లేదని, అది కేంద్రమే కట్టాలని అంటున్నారు. మరి లెక్కలు చూస్తే, ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా వేగంగా కదలటం లేదు. కొంచెం గ్రహించండి జగన్ గారు. చంద్రబాబు చేసిన పనులు ఇలా మధ్యలో ఆపితే, చంద్రబాబుకి ఏమి కాదు, రాష్ట్రం నష్టపోతుంది.

Advertisements

Latest Articles

Most Read