ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికలకు ముందు అనిల్‌చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను ఏపీ సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పునేఠాను ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలో నియమించాలని ఈసీఐ సూచించింది. అప్పట్నుంచి ఆయన వెయిటింగ్‌లోనే ఉన్నారు. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ తాజాగా ఈసీ నిర్ణయం తీసుకోవడంతో సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. అయితే చీఫ్ సెక్రటరీ లాంటి ఉన్నత పదవి చేసిన పునేఠాకు, ఒక కార్పొరేషన్ స్థాయి పోస్టింగ్ ఇవ్వటం చూసి, ఈసీ తీరుని తప్పుబడుతున్నారు.

punetha 14052019

మార్చి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన అనంతరం వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో, రాష్ట్రంలో అధికారులు టార్గెట్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం కోడ్‌ను ఉల్లంఘించారని ఇద్దరు ఎస్పీలతోపాటు, ప్రభుత్వ నిఘావర్గాల అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌చంద్ర పునేఠలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొత్త సీఎస్‌గా రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఏప్రిల్‌ 6వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు.

punetha 14052019

సీఎస్‌ బాధ్యతల నుండి తొలగించిన అనిల్‌చంద్ర పునేఠను ఎన్నికలకు సంబంధం లేని విధులు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం తన ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇంతవరకూ ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో తన సర్వీసును, తన హోదాను కూడా లెక్కచేయకుండా ఐఏఎస్‌ అధికారిగా తన మూడుదశాబ్ధాల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ను పక్కన పెట్టిన తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈనెల 31 పదవీ విరమణ చేసే సమయంలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొనడం చాలా ఇబ్బందిగా మారటంతో, ఆయనకు ఇప్పుడు ప్రాముఖ్యత లేని కార్పొరేషన్ చైర్మెన్ పదవి ఈసీ కట్టబెట్టింది.

సీరియస్‌గా జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన సరదా వ్యాఖ్యలకు అంతా ఒక్కసారిగా నవ్వేశారు. సమావేశం జరుగుతుండగా మధ్యలో కల్పించుకొని మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి.. తితలీ, ఫణి తుపాన్ల గురించి ముందే చెప్పిన ఆర్టీజీఎస్ బాబు.. ఎన్నికల్లో ఓట్ల సునామీ గురించి ముందే చెప్పరా? అని సీఎంను ఉద్దేశించి అన్నారు. దీంతో కేబినెట్ సమావేశంలో మంత్రులంతా ఒక్కసారిగా నవ్వారు. మంత్రి వ్యాఖ్యకు స్పందించిన సీఎం చంద్రబాబు అంతే చమత్కారంగా బదులిచ్చారు. ఓట్ల సునామీ గురించి మీ చెవిలో చెబుతారులే అని సమాధానం ఇచ్చారు.

adinarayana 14052019

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో కేంద్రం అనుమతించిన నాలుగు అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ఫొని తీవ్ర తుపానుతో ఉత్తరాంధ్రలో వాటిల్లిన నష్టం, రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. ఈ భేటీకి ముగ్గురు మంత్రులు మినహా మంత్రులంతా హాజరై పలు సూచనలు చేసినట్టు సమాచారం. తమ శాఖలకు సంబంధించిన అంశాలను ఇందులో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఈ భేటీలో పాల్గొన్నారు. విపత్తు నిర్వహణ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శులు సైతం ఈ భేటీలో పాల్గొని తమ శాఖలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

adinarayana 14052019

ఫొని తుపాను కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తదుపరి అంచనాలపై సర్వే జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతోపాటు పలు పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తాగునీటి ఎద్దడిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని, సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోయాని విపత్తు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ కార్యదర్శులు వివరించారు. ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఐదు విభాగాల్లో తొలిస్థానం, ఆరు విభాగాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉపాధిహామీ, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీఎంకే నేత దొరై మురుగన్ సమావేశమయ్యారు. సుమారు 25 నిముషాలపాటు ఇరువురు చర్చలు జరిపారు. నిన్న సాయంత్రం స్టాలిన్, కేసీఆర్ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు దొరై మురుగన్ వివరించినట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరారు. అయితే తాము కాంగ్రెస్ వైపే ఉంటామని, అవసరమైతే మీరు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ కేసీఆర్‌కు స్టాలిన్ సూచించారని వార్తలొచ్చాయి. కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్టాలిన్ మంగళవారం ఉదయం చెన్నైలో ఒక ప్రకటన చేశారు. దేశంలో మూడో ఫ్రంట్‌కు అవకాశమే లేదని స్పష్టం చేశారు.

dmk 14052019

మరోవైపు గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి జాతీయ స్థాయిలో టీడీపీ, డీఎంకే పోరాడుతున్నాయి. పలు అంశాల్లో డీఎంకేకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్‌తో భేటీ ముగిసిన తెల్లారే దొరై మురుగున్‌ను అమరావతికి స్టాలిన్ పంపారు. కేసీఆర్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు వివరించాలంటూ మురుగన్‌కు చెప్పి పంపారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై తీసుకోవాల్సిన అంశాలపై కూడా చంద్రబాబుతో మాట్లాడాలని డీఎంకే నేతలు నిర్ణయించారు. నిజానికి మూడో కూటమిపై స్టాలిన్‌కు మొదటి నుంచి ఆసక్తి లేదు. ఇందుకు కారణం.. గతంలో థర్డ్ ఫ్రంట్ ప్రయోగం రెండు సార్లు విఫలం కావడమేనన్నది ఆయన అభిప్రాయం.

dmk 14052019

అందుకే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్న చంద్రబాబుతో సంబంధాలు కొనసాగించాలని స్టాలిన్ కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే దొరై మురుగన్‌కు అమరావతికి పంపారు. కేసీఆర్‌ ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా యూపీఏతోనే ఉంటానని స్టాలిన్‌ స్పష్టం చేశారని, ఆయననే కాంగ్రెస్‌ కూటమిలోకి ఆహ్వానించారని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. స్టాలిన్‌ను ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి ఆహ్వానించాలన్న కేసీఆర్‌కు నిరాశే మిగిలిందని, ఆయన ప్రతిపాదనను స్టాలిన్‌ తిరస్కరించారని ఎన్డీటీవీ తెలిపింది. తన ‘ఉప ప్రధాని ఆకాంక్ష’పై కేసీఆర్‌ స్టాలిన్‌కు చాలా సంకేతాలు ఇచ్చారని వివరించింది. స్టాలిన్‌ తిరస్కరణతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లుగా ఉందని పీటీఐ వ్యాఖ్యానించింది. జాతీయ పార్టీల సహకారంతో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఇందుకు వామపక్షాలు కూడా మద్దతు పలుకుతాయని కేసీఆర్‌ ప్రతిపాదించారని, అయితే, యూపీఏకే పరిస్థితి సానుకూలంగా ఉందని డీఎంకే నేతలు తెలిపారని వివరించింది.

అమరావతి కేంద్రంగా జరుగుతున్న టీడీపీ ఎన్నికల సమీక్షల్లో ఏం జరుగుతోంది? ఆ పార్టీలో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరాటం తర్వాత ఫలితాలపై కింది స్థాయిలో టీడీపీ నేతల అంచనాలు ఎలా ఉన్నాయి.. వారేం చెబుతున్నారన్నదాని పై అటు ఆ పార్టీ అధిష్ఠానం మొదలుకొని బయటి వారి వరకూ తెలుసుకొ నే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమీక్షలకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు ఏభై మంది నేతలను పిలుస్తున్నారు. ఇందులో మండలస్ధాయి నేతలు మొదలుకొని ఏరియా సమన్వయకర్తల వరకూ ఉన్నారు. ఈ సమీక్షలకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాష్ట్ర స్థాయి నేతను పరిశీలకునిగా నియమిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షతో సంబంధం లేకుండా ఈ పరిశీలకుడు ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి నాయకుడితో విడివిడిగా మాట్లాడి పోలింగ్‌ జరిగిన తీరు, ఫలితం పై అంచనాను అడిగి తెలుసుకొంటున్నారు.

cbn 14052019

పార్టీ రాష్ట్ర కార్యాలయం నేతలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్షేత్ర స్థాయి నేతలు చెప్పిన విషయాలతో పోల్చి చూసుకొంటున్నారు. ఇంచుమించుగా ఇవన్నీ ఒకే విధంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమీక్షలకు హాజరైన పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు బలమైన టానిక్‌ తాగించారు. ఈ ఎన్నికల్లో ఖాయంగా గెలుస్తున్నామని ఆయన వ్యక్తం చేసిన ధీమా టీడీపీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ సమీక్షల కు ఆ జిల్లా నుంచి ఒక మహిళా నేత హాజరయ్యారు. అంతకు ముందు ఆమె పార్టీ విజయావకాశాలపై అంత నమ్మకంతో లేరు. కానీ, ఈ సమీక్ష తర్వాత పార్టీ కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆమెకు గట్టి నమ్మకం కలిగింది.

cbn 14052019

దీనితో ఆమె ఈ సమీక్ష ముగిసిన తర్వాత ఇం టికి వెళ్లకుండా రాజధాని ప్రాంతంలో స్థలం కొనుక్కొంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆరాలు తీయడం ప్రారంభించారు. మళ్లీ టీడీపీ వస్తే రాజధానిలో భూముల ధరలు పెరుగుతాయన్నది ఆమె అంచనా. చంద్రబాబు వ్యక్తం చేస్తున్న ధీమా ప్రత్యర్థి శిబిరంలో కూడా కలవరం పెంచింది. వైసీపీలో టాప్‌ ఐదు స్థానాల్లో ఉన్న ఒక నేత మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి చంద్రబాబులో కనిపిస్తున్న ధీమాకు కారణం ఏమిటని తెలుసుకొనే ప్రయత్నం ప్రారంభించారు. ‘పోలింగ్‌ అయిన మొదట్లో ఆయనలో అంత ధీమా కనిపించలేదు. ఈ మధ్య బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యలో ఏం జరిగింది’ అని ఆయన ఆరా తీస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read