ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కీ, కౌంటింగ్‌కీ మధ్య 43 రోజుల గ్యాప్‌ ఉండటంతో రాజకీయ నేతలు కోడిగుడ్డుకి ఈకలు పీకుతున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా కూడికలు, తీసివేతలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... వేసవి విడిదికి వెళ్లొచ్చిన సీఎం చంద్రబాబుని పలువురు నేతలు కలుసుకుంటున్నారు. ఇటీవల తన వద్దకి వచ్చిన ముగ్గురు మంత్రులతో చంద్రబాబు సుమారు గంటన్నరసేపు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు చెబుతున్న లెక్కలు విని సదరు మంత్రులు ఆశ్చర్యపోయారు. తన ఎదురుగా కూర్చున్న ఓ మంత్రి పోటీచేసిన నియోజకవర్గంలోని పరిస్థితిని చంద్రబాబు గ్రామాలవారీగా లెక్కలతో సహా వివరించడంతో ఆయన అవాక్కయ్యారు. "నీవు గెలుస్తున్నావు. కానీ కొన్ని గ్రామాల్లో ఇంకా బాగా వర్కవుట్ చేసుకుని ఉండాల్సింది'' అని చంద్రబాబు చెప్పారు. దీంతో ఈ వివరాలన్నీ మీకెలా తెలిశాయని ఆ మంత్రివర్యుడు అమాయకంగా ప్రశ్నించారు. "నా దగ్గర సమాచారమంతా ఉంది..'' అని చంద్రబాబు బదులిచ్చారు. అంతేకాదు- ఆ జిల్లాకు చెందిన మిగతా నియోజకవర్గాల లెక్కలు కూడా సీఎం విశదీకరించారు.

game 27032019

చంద్రబాబును కలిసిన మంత్రుల బృందంలో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆదినారాయణరెడ్డి కూడా ఉన్నారు. ఆయన తమ జిల్లాలో పరిస్థితి గురించి వివరించారు. ఈ సందర్భంగా మరో నేత మాట్లాడుతూ.. "ఈ ఎన్నికల్లో వైసీపీ బాగా డబ్బులు కుమ్మరించింది, ఒక్కో నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయల వరకు నగదు పంపిణీ చేశారు'' అని సీఎంకు చెప్పుకొచ్చారు. డబ్బుల విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వెనుకబడిందని అన్నారు. దీనిపై ఆదినారాయణరెడ్డి కల్పించుకుని "వైసీపీలో మంచి నిర్మాతలే ఉన్నారు, కానీ జగన్ డైరెక్షనే బాలేదు. అందువల్లే ఆ సినిమా ఈ ఎన్నికల్లో ఫట్ అవుతుంది'' అని తేల్చేశారు. "తెలుగుదేశంలో నిర్మాతలు తక్కువే అయినప్పటికీ, డైరెక్టర్ చంద్రబాబు కావడం కలిసొచ్చింది. లోబడ్జెట్ సినిమా అయినా డైరెక్షన్ బాగుండటంతో హిట్ కొట్టబోతుంది'' అని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఆది చేసిన ఈ విశ్లేషణ పట్ల చంద్రబాబు కూడా ఆసక్తి కనబరిచారు.

game 27032019

మిగతా ఇద్దరు మంత్రులు చంద్రబాబుతో సంభాషిస్తూ "మీకు బూత్‌ల వారీగా లెక్కలు ఎలా వచ్చాయి?'' అని మరోసారి కుతూహలంతో అడిగారు. ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ గురించి కూడా ప్రశ్నించారు. తాను అవన్నీ చేయించాననీ, తెలుగుదేశం నూటికి వెయ్యి శాతం మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందనీ, ఇందులో ఎవరికీ సందేహం అక్కర్లేదనీ'' బాబు మరోసారి వారికి స్పష్టంచేశారు. తనవద్ద అన్ని సర్వేల వివరాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఏదిఏమైనా పాలిటిక్స్‌లో "డైరెక్షన్‌'' గురించి ఆదినారాయణ చేసిన విశ్లేషణ తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు ఆసక్తికర చర్చలకి దారితీస్తోంది.

 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పాలన ‘రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువలేదు’ అన్న చందాన తయారైంది. మార్చి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన అనంతరం వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో ఆందోళన చెందిన అధి కార పార్టీకి పోలింగ్‌ పూర్తయినా ఎన్నికల సంఘం కబంధ హస్తాల్లో ఉండిపోయామన్న బాధ స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం కోడ్‌ను ఉల్లంఘించారని ఇద్దరు ఎస్పీలతోపాటు, ప్రభుత్వ నిఘావర్గాల అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌చంద్ర పునేఠలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొత్త సీఎస్‌గా రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

game 27032019

దీంతో ఆయన ఏప్రిల్‌ 6వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎస్‌ బాధ్యతల నుండి తొలగించిన అనిల్‌చంద్ర పునేఠను ఎన్నికలకు సంబంధం లేని విధులు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం తన ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇంతవరకూ ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో తన సర్వీసును, తన హోదాను కూడా లెక్కచేయకుండా ఐఏఎస్‌ అధికారిగా తన మూడుదశాబ్ధాల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ను పక్కన పెట్టిన తీవ్ర దుమారాన్ని లేపాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనిల్‌చంద్ర పునేఠ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

game 27032019

”నా 30 ఏళ్ల ఐఏఎస్‌ సర్వీసులో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశాను. ఈనెల 31 పదవీ విరమణ చేసే సమయంలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొనడం చాలా ఇబ్బందిగా ఉంది..” అంటూ అనిల్‌చంద్ర పునేఠ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ”నాకు భవిష్యత్తులో ఎలాంటి ఆశలూ లేవు.. ఏపార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రుల అభిప్రాయాలకు, నిర్ణయాలకు అనుగుణంగానే పరిపాలన ఉంటుంది..” అని పునేఠ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజకీయా ప్రయోజనాలకు అధికారులు బలి కావడం ఏమేరకు సమంజసమని పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు, ఐఏఎస్‌ అధికారులు నిలదీసినట్లు తెలిసింది. మళ్ళీ చంద్రబాబు సియం అవ్వగానే, చీఫ్ సెక్రటరీగా పునేఠను నియమిస్తే, ఆయన గౌరవంగా సర్వీస్ నుంచి పదవీ విరమణ పొందుతారు. అప్పటి వరకు ఆగకుండా, కనీసం ఇప్పుడైనా, ఎన్నికల కమిషన్ ఎదో ఒక పోస్టింగ్ ఇస్తే, ఆయన సర్వీస్ కు గౌరవం ఉంటుందని పలువురు అంటున్నారు...

తిరుపతి వాసుల కల నెరవేరనుంది.. తిరుమల యాత్రికులకు ట్రాఫిక్‌ కడగండ్ల నుంచి ఉపశమనం లభించనుంది.. ఇందుకు ఊతమిచ్చే ‘గరుడ వారధి’ స్మార్ట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు ఆధ్యాత్మిక నగరిలో చకచకా సాగుతున్నాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు నేరుగా బస్టాండు, రైల్వేస్టేషన్‌ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలిపిరికి చేరుకునేలా ఈ వారధి ఉపయోగపడనుంది. తిరుమలకు రోజూ సగటున 70వేల మంది యాత్రికులు తరలివస్తున్నారు. వీరిలో 95%కి పైగా రైళ్లు, బస్సులలో తిరుపతికి చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తున్నారు. ఈ సమయంలో తిరుపతిలో భారీగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. బస్టాండు కూడలి- అలిపిరి నడుమ 5కి.మీ. రోడ్డు అతి రద్దీగా తయారై తిరుపతి వాసులకు, యాత్రికులకు నిత్యం నరకం చూపిస్తోంది. దీన్ని అధిగమించేందుకు స్మార్ట్‌ సిటీ, తితిదే నిధులతో చేపట్టిన గరుడ వారధి నిర్మాణం జోరుగా సాగుతోంది.

game 27032019

స్మార్ట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ మొత్తం పొడవు 6.1కి.మీ. తిరుచానూరు మ్యాంగోమార్కెట్‌ సమీపంలో మొదలయ్యే వంతెన.. లక్ష్మీపురం కూడలి, రామానుజ కూడలి, శ్రీనివాసం, లీలామహల్‌ సెంటర్‌ మీదుగా నందిసర్కిల్‌ వద్ద పూర్తవుతుంది. దీనికోసం రూ.684కోట్ల నిధులు అవసరమని అంచనా. దీనిలో 65% తితిదే, 35% స్మార్ట్‌ సిటీ నిధులు ఉపయోగిస్తారు. స్మార్ట్‌ సిటీ నిధులు వాడాలంటే, కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో 17.5% రాష్ట్ర ప్రభుత్వం, 17.5% స్మార్ట్‌ నిధులు వాడతారు.

game 27032019

గరుడ వారధిని మూడు దశలుగా నిర్మించనున్నారు. తొలిదశలో తిరుచానూరు మ్యాంగో మార్కెట్‌ నుంచి రామానుజ కూడలితో పాటు లీలామహల్‌ నుంచి నందిసర్కిల్‌ వరకు ఉంటుంది. రెండో దశలో శ్రీనివాసం నుంచి లీలామహల్‌ సర్కిల్‌ వరకు, మూడో దశ కీలకం కావడంతో రామానుజ సర్కిల్‌ నుంచి శ్రీనివాసం వరకు ఉంటుంది. బస్టాండు ప్రాంతంలో అండర్‌పాస్‌లు, రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక లైన్లతో పాటు లీలామహల్‌ సర్కిల్‌ వద్ద కడప నుంచి వచ్చే వాహనాల కోసం డబుల్‌ లైను రాబోతోంది. మొత్తం 4 లైన్ల వారధి, రెండేళ్లలో పూర్తిచేయాలనేది లక్ష్యం. గుత్తేదారు ఐదేళ్లపాటు నిర్వహించి, తితిదేకు అప్పగిస్తారు. వారధిని ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేలా నిర్మిస్తారు. దానికి తిరునామాలు, స్వామివారి చిత్రాలతో పాటు.. కిందిభాగంలో శంకు, చక్రాల చిత్రాలు రకరకాల శ్రీవారి నమూనాలతో రూపమిస్తారు. పచ్చదనంతో కూడిన విశాలమైన లాన్లు వచ్చేలా చూస్తారు. ప్రాజెక్టుకు సమాంతరంగా తిరుపతిలోని 27కి.మీ. ప్రాంతాన్ని స్మార్ట్‌ వీధులుగా తీర్చిదిద్దే ప్రక్రియను అనుబంధంగా చేపడతారు.

జుమోటో.. స్విగ్గీస్‌.. రెడ్‌బైట్స్‌.. ఫుడ్‌పాండా.. ఎల్ప్‌.. ఇవన్నీ ఖాళీ కడుపును నింపే ఆన్‌లైన్‌ ఈటింగ్‌ యాప్స్‌. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు నిమిషాల్లో ఎంచుకున్న ఆహారం ఇంటి ముందు వాలిపోతుంది. మెట్రో నగరాల్లో లెక్కలేనన్ని ఆన్‌లైన్‌ ఈటింగ్‌ యాప్‌లు వాడుకలో ఉన్నాయి. విజయవాడ ప్రజానీకం మాత్రం జుమోటో, స్విగ్గీస్‌ను చాలా సింపుల్‌గా ఉపయోగించుకుం టోంది. ఆన్‌లైన్‌ ఈటింగ్‌ యాప్స్‌ ఆహారానికి సులువైన మార్గాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఆ యాప్స్‌ పేర్లు విజయవాడ కాప్స్‌కు ఆయుధాలుగా తయారవుతున్నాయి. కేసుల్లో ఇరుక్కుని చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న నిందితుల కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. స్టేషన్‌కు రమ్మని పోలీసులు పదేపదే ఇళ్లకు వెళ్లినా ముఖం చాటేసుకుని తిరుగుతున్న నిందితులు ఆఫర్‌ వచ్చిందని ఫోన్‌కాల్‌ రాగానే అసలు గుట్టును ఖాకీలకు ఇచ్చేస్తున్నారు.

game 27032019

వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి పోలీసులు ఫోన్లు చేస్తున్నారు. ఫిర్యాదును వివరించి స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. ఇలాంటి వాళ్లలో ఎక్కువమంది పరారవుతున్నారు. ఒక విధమైన భరోసా దక్కితే తప్ప పోలీసుల వద్దకు వెళ్లడం లేదు. రెండు, మూడుసార్లు పోలీసుల నుంచి ఫోన్లు వెళ్లే సరికే వాటిని స్విచ్ఛాఫ్‌ చేసి రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు పోలీసుల నంబర్లను ఫీడ్‌ చేసుకుని సమాధానం ఇవ్వడం మానేస్తున్నారు. నిందితుల ఎత్తుగడలను పసిగట్టిన విజయవాడ పోలీసులు వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. నిందితులు ఉపయోగిస్తున్న ఫోన్‌ నంబర్లను ట్రాక్‌ చేస్తున్నారు. వాళ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో పసిగడుతున్నారు. కొన్ని ప్రైవేటు నంబర్లతో నిందితులకు ఆన్‌లైన్‌ ఈటింగ్‌ ఆఫర్లు ఇస్తున్నారు.

game 27032019

‘మీకు జుమోటో నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ వచ్చింది. ఎక్కడున్నారో చెప్తే పంపిస్తాం.’ అని డెలివరీ బాయ్స్‌లా మాట్లాడుతున్నారు. ఇటీవల కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసుల్లో బెజవాప్స్‌ ఈ సూత్రాన్ని అనుసరించారు. ముగ్గురి విషయంలో ఆ సూత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది. మాట్లాడింది నిజంగా డెలివరీ బాయ్స్‌ అనుకుని తలదాచుకున్న చిరునామాను చెప్పేశారు. అప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో కాపు కాసిన పోలీసులు వారిని ఎత్తుకొచ్చి స్టేషన్లలో కూర్చోబెట్టారు. ఇప్పటి వరకు విజయవాడ నగరవాసుల ఆకలిని తీర్చుతున్న ఈటింగ్‌ యాప్స్‌, ఇప్పుడు నిందితులను పట్టుకోవడానికి ఎర వేసే ఆయుధాలుగానూ ఉపయోగపడు తుండడం విశేషం.

Advertisements

Latest Articles

Most Read