రేపు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. మంగళవారం విడుదల కానున్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా వారికి మీ అండ అవసరం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మార్కులు తక్కువ వచ్చాయని వారిని పొరబాటున కూడా నిందించవద్దని, ఇతర పిల్లలతో పోల్చి అవమానకరంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. మార్కులు సరిగా రాని పిల్లలను దూషించడం ద్వారా వాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు పిల్లల తెలివితేటలకు కొలమానాలు కాదని, కిందపడినా రెట్టించిన ఉత్సాహంతో పైకిలేచే కడలి అలలను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

cbn 10th 13052019

మళ్లీ ప్రయత్నం చేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చంటూ పిల్లల్లో ప్రేరణ కలిగించాలని తల్లిదండ్రులకు సూచించారు. మార్కులు సరిగారాని పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ను 14వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తుందని ట్వీట్ చేశారు. ఈ ఫలితాలను విద్యార్థులు rtgs.ap.gov.in వెబ్ సైట్ ద్వారా, లేదా, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్, ఖైజాలా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈసారి ప్రత్యేకంగా టెలివిజన్ తెరలపైనా పదో తరగతి పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చని చంద్రబాబు వివరించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్నవాళ్లు తమ సెట్ టాప్ బాక్స్ ద్వారా విద్యార్థి హాల్ టికెట్ నంబర్ టైపు చేస్తే టీవీ తెరపై పరీక్షల ఫలితాలు ప్రత్యక్షమవుతాయని తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తన ట్వీట్ లో వెల్లడించారు.

ఎన్నిక‌ల నాటి నుండి సీఎం వ‌ర్సెస్ సీఎస్‌గా ఉన్న వ్య‌వ‌హారం ఇప్పుడు కొత్త ట‌ర్న్ తీసుకుంది. ప‌లితాల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌..ఈ ఇద్ద‌రు భేటీ అయ్యారు. సీఎస్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తొలి సారి సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ముఖ్య‌మంత్రి నివాసానికి వ‌చ్చారు. ఇద్ద‌రూ అర‌గంట‌కు పైగా భేటీ అయ్యారు. ఈ స‌మ‌యంలో సీఎస్ తీరు పైన సీఎం క్లాస్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో..సీఎస్ సైతం తాను సీఎంను ధిక్క‌రిస్తున్న‌ట్లుగా సాగుతున్న ప్రచారం పైన వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇక‌, కేబినెట్ స‌మావేశంలో కొన‌సాగుతున్న అనిశ్చితి పైనా ఇద్ద‌రూ చ‌ర్చించారు.

lv 13052019

ఎన్నిక‌ల వేళ‌..సీఎస్‌గా ఉన్న పునీఠాను త‌ప్పించి ఎన్నిక‌ల సంఘం ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను ఏపీ సీఎస్‌గా నియ‌మించింది. ఆ నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు వ్య‌తిరేకించారు. ఇక‌, కొత్త సీఎస్‌గా నియ‌మితులైన ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం గురించి ముఖ్య‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఆయ‌న కోవ‌ర్టు అని..జ‌గ‌న్ కేసుల్లో స‌హ ముద్దాయి అంటూ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ వ్యాఖ్య‌ల మీద ఐఏయ‌స్‌ల సంఘం సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక‌, ఇదే స‌మయంలో సీఎం కు అధికారాలు లేవంటూ ఎల్వీ ఒక ప‌త్రిక ఇంట‌ర్యూలో చేసిన కామంట్లు చంద్ర‌బాబుకు మ‌రింత ఆగ్ర‌హం తెప్పించాయి. దీని పైన ఆయ‌న నేరుగా లేఖ ద్వారా వివ‌ర‌ణ కోరారు. సీఎస్ సైతం త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారంటూ సింపుల్‌గా ఇచ్చిన స‌మాధానం సీఎంకు మ‌రింత ఆగ్ర‌హం తెప్పించాయి.

lv 13052019

సీఎం స‌మీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని ఎవ‌రూ హాజ‌రు కావ‌ద్దంటూ సీఎస్ అధికారుల‌కు సూచించ‌టం మ‌రింత గ్యాప్ పెరిగింది. ఇక‌, ఈ రోజు స‌డ‌న్‌గా సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు.బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలి సారి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంకు ముఖ్య‌మంత్రి గట్టిగానే క్లాస్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్ వ్య‌వ‌హ‌రించిన తీరు పైన వివ‌ర‌ణ కోరిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జా ప్ర‌భుత్వం ఇంకా ఉండ‌గానే..జ‌వాబు దారీ త‌నం లేకుండా ప‌ని చేస్తే ఎలాగ‌ని ప్ర‌శ్నించిన‌ట్లు చెబుతున్నారు. సీఎస్ కేబినెట్‌కు లోబ‌డి ప‌ని చేయాల్సి ఉంటుంద‌నే విష‌యం గుర్తు చేసారు. ఇక‌, ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం మేర‌కు కేబినెట్ స‌మావేశం నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి కోరుతూ..అజెండాతో స‌హా ఏపీ ప్ర‌భుత్వం నుండి సీఎస్ లేఖ రాసారు. దీనిని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదించారు. అయితే, ఈ నెల 14న కేబినెట్ స‌మావేశానికి ముహూర్తం నిర్ణ‌యించినా..ఇప్ప‌టి దాకా ఎన్నిక‌ల సంఘం నుండి అధికారికంగా అనుమ‌తి రాలేదు. స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌టంతో...అజెండాగా ఖ‌రారు చేసిన అంశాల పైన ఏర‌కంగా ముందుకు వెళ్లాల‌నే అంశాన్ని చ‌ర్చించారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. త్వరలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అందరి దృష్టి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అని మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎదురు చూసేది కేవలం ఎన్నికల ఫలితాల కోసం మాత్రమే కాదు... పవర్ స్టార్ నుంచి తీయని కబురు వస్తుందని వారు వేయి కళ్లతో వేచిఉన్నారు. ఎన్నికల తర్వాత పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన గతంలోనే కొందరు నిర్మాతలకు సినిమాలు చేస్తానని కమిట్మెంట్స్ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని ఫుల్‌ఫిల్ చేస్తారంటూ ఫిల్మ్ నగర్లో చర్చ సాగుతోంది. ‘గోపాల గోపాల' ఫేం డైరెక్టర్ డాలీతో మరో సినిమా చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే.

game 27032019

నిర్మాత రామ్ తాళ్లూరి ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదు అనేది పవన్ సన్నిహితుల వాదన. గతంలో సినిమా ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమే... కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆ ప్రయత్నం విరమించుకున్నారని స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబు సైతం ఇటీవల ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడంపై క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ బాబుకు మళ్లీ సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన తమ్ముడిని రాజకీయాల్లో అన్ పాపులర్ చేయడానికే ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

game 27032019

స్వయంగా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి... జనసేన పార్టీ శ్రేణులు కానీ, నాగబాబు చెప్పిన విషయాలు కానీ అభిమానుల చెవికెక్కడం లేదు. పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి తిరిగి వస్తారనే ఆశ అలాగే ఉండి పోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తారనే నమ్మకంతో చాలా మందిలో బలంగా నాటుకుపోయింది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తన సినిమా రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఆదివారం గుంటూరు జరిగిన జనసేన రివ్యూ మీటింగులో మాట్లాడుతూ... రాబోయే 25 ఏళ్లలో రాజకీయాల్లో సమూల మార్పులు తేవడమే జనసేన లక్ష్యమని తెలిపారు. తాను రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను అభిమానులు, జనసేన సానుభూతి పరులు నమ్మవద్దని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో లోక్‌సభ‌తోపాటు శాసనసభకు ఎన్నికలు జరగడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. తొలి దశలోనే పోలింగ్ జరగడంతో ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. పోలింగ్‌కు, ఫలితాలకు మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటంతో గెలుపుపై టీడీపీ, వైసీపీలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని సర్వేలు హల్‌చల్ చేస్తున్నాయి. ఏపీ ఎన్నికలపై సెంటర్ ఫర్ సెఫాలజీ సంస్థ నిర్వహించిన సర్వేలో ఓ పార్టీ గెలుస్తుందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రచారంపై స్పందించిన ఆ సంస్థ అధినేత వేణుగోపాల్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న సర్వేలు, టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న విషయాలు తమ సంస్థవి కాదని, కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

game 27032019

తమ సంస్థ నిర్వహించిన సర్వేలంటూ రెండు వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని తన స్నేహితులు చెప్పినట్టు ఆయన వివరించారు. ఈ వీడియోల కారణంగా తమ సంస్థ విశ్వసనీయతకు భంగం కలుగుతోందని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోన్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిందితులను అరెస్ట్ చేయాలని అధికారులకు విజ్ఙ‌ప్తి చేశారు. గత పదిహేనేళ్లుగా తాము ఎన్నికల సమయంలో విశ్లేషణ చేస్తున్నామని, ఇప్పటి వరకు తమ సంస్థపై ఎలాంటి మచ్చలేదని వేణుగోపాల్ రావు అన్నారు. ఎవరో కావాలనే తమ సంస్థ పేరును దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు వెల్లడించారు.

Advertisements

Latest Articles

Most Read