చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ పై పోరాటం చెయ్యటం ఏమో కాని, పాపం రెస్ట్ తీసుకుందాం అనుకున్న వైసీపీ, బీజేపీ లకు మళ్ళీ డ్యూటీ పడింది. వీళ్ళు చేసే అంత చేటు డ్యూటీ ఏమి ఉంటుంది అంటారా ? అదే అండీ ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వటం, గవర్నర్ దగ్గరకు వెళ్లి ఒక వినతి పత్రం ఇవ్వటం. ఈ అయుదు ఏళ్ళలో ఎన్ని సార్లు గవర్నర్ దగ్గరకు వెళ్ళారో లెక్కే లేదు. ముందుగా వైసీపీ వెళ్ళటం, ఆ వెంటనే బీజేపీ వెళ్ళటం, ఇదంతా ఒక పద్దతి ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ వైఖరి పై పోరాటం చేస్తుంటే, వీళ్ళు చంద్రబాబు పై పోరాటం చేస్తున్నారు. ముందు నుంచి ఢిల్లీకి ఎలా బానిసత్వం చేస్తున్నారో, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు.

bjp 16042019

ముందుగా విజసాయి వంతు. పోలింగ్ రోజున ఏపీలో టీడీపీ నేతలు హింసకు పాల్పడ్డారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తొత్తులు ఎస్పీలు ఉన్న చోటే హింసలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం.. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. అటు ఈ-ప్రగతి పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని...ఈ కేసులో సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు జైలుకెళ్తారని చెప్పారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును జైలుకు పంపాలని అన్నారు.

bjp 16042019

ఇక ఇప్పుడు బీజేపీ వంతు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని బీజేపీ నేత విజయ్ బాబు స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. అనంతరం విజయ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకలోని మండ్యలో చంద్రబాబు ప్రసంగం చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవస్థలను తిట్టడం మొదలు పెట్టారని.. ప్రధాని మోదీని కూడా తిడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబుపై దేశ ద్రోహి నేరం కింద కేసు నమోదు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు విజయ్ బాబు మీడియాకు వివరించారు. దొంగ టెక్నీషియన్ హరిప్రసాద్ తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులను టార్గెట్ చేస్తూ, కావాలని వారిని అప్రతిష్ట పాలు చేస్తున్న A2 విజయసాయి రెడ్డి రోజు రోజుకీ పేట్రేగి పోతూ, ఏపి పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నిన్న మరోసారి, ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. దీని పై ఏబీ వెంకటేశ్వరరావు సీరియస్ గా స్పందించారు. ఇన్నాళ్ళు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా, మౌనంగా భరించిన ఏబీ వెంకటేశ్వరరావు, ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తనని అంటూ వచ్చారని, ఇప్పుడు ఏకంగా తన కుటుంబాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే చూస్తూ ఊరుకునే పని లేదని హెచ్చరికలు జారీ చేసారు.

vsreddy 16042019

తనతో పాటు కుటుంబ సభ్యులకు ఎవరితోనూ వ్యాపార సంబంధాలు లేవని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయంలో వైకాపా నేత విజయసాయిరెడ్డి తనపై చేస్తున్న నిరాధార, హేయమైన ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ-ప్రగతి ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, సబ్‌ కాంట్రాక్టులతో ప్రమేయం లేదని చెప్పారు. విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధమని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి పై పరువునష్టం దావా వేయబోతున్నట్లు వెంకటేశ్వరరావు వివరించారు. ఇలాంటి హేయమైన ఆరోపణలు చేసినందుకు, ఇక విజయసాయి రెడ్డికి మూడినట్టే.

vsreddy 16042019

నిన్న ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసిన త‌రువాత మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ విజ‌య సాయి రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కేసుల వ‌ర‌కు వెళ్లాయి. ఆధార్ సంస్థ చేసిన ఫిర్యాదు పై స్పంద‌న‌గా మాట్లాడిన విజ‌య సాయిరెడ్డి ఏపిలో ఇప్ర‌గ‌తి ప్రాజెక్టు పేరుతో ఆధార్ స‌మాచారం మొత్తం సేక‌రించార‌ని.. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు డిజిపి ఠాకూర్ తో పాటుగా ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఏబి వెంక‌టేశ్వ‌ర‌రావు సంబంధీకులు ద‌క్కించుకున్నార‌ని చెప్పుకొచ్చిన విజ‌య సాయిరెడ్డి స‌రైన స‌మ‌యంలో వివ‌రాల‌ను బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్పారు. దీని పై స్పందించిన ఏబి వెంక‌టేశ్వ‌ర రావు త‌మ‌కు ప్ర‌భుత్వం లో ఎటువంటి కాంట్రాక్టులు..ఒప్పందాలు లేవ‌ని స్ప‌ష్టం చేసారు. త‌న పై హేయ‌మైన వ్యాఖ్య‌లు చేసిన విజ‌య సాయిరెడ్డి పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదన్నా పట్టు పట్టరంటే, అది ఎదో ఒక లాజికల్ కంక్లుజన్ వచ్చే దాకా వదిలిపెట్టారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈవీఎంల పోరాటంతో, అటు కేసీఆర్, ఇటు మోడీ వణికిపోతున్నారు. ముందుగా కేసీఆర్ విషయానికి వస్తే, ఆయన మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను మ్యానేజ్ చేసారనే అభిప్రాయం అందరికీ ఉంది. అయితే ఆ విషయం పై పోరాడటానికి అటు కాంగ్రెస్ కాని, మిగతా విపక్షాలు కూడా ధైర్యం చెయ్యలేక పోయాయి. అయితే చంద్రబాబు మాత్రం, ఈ విషయం పై ఫోకస్ పెట్టారు. తెలంగాణాలో జరిగిన అవకతవకల పై దృష్టి పెట్టారు. దీంతో కేసీఆర్, కేటీఆర్ లకు గుబులు మొదలైంది. తమ గుట్టు అంతా ఎక్కడ బయట పడుతుందో అని, కంగారు పడుతున్నారు. అందుకే కేటీఆర్ బుజాలు తడుముకుంటూ దొరికిపోయాడు.

cbn 16042019

ఇక మరో పక్క మోడీ గుట్టు అంతా బయట పడే ప్రమాదం కూడా లేకపోలేదు. మోదటి ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన తీరుతో, ఈవీఎంలతో మోడీ ఎలాంటి ఆటలు ఆడుతున్నారో చంద్రబాబు కనిపెట్టి, ఇప్పుడు అలాంటి పరిస్థితులు మిగతా విడతల్లో జరిగే అవకాసం లేకుండా, మోడీకి చెక్ పెట్టే పని చంద్రబాబు చేస్తున్నారు. మరో పక్క, చంద్రబాబు నాయుడు గ్యాప్ లేకుండా తిరుగుతున్నారు. ఢిల్లీ నుంచీ తమిళనాడు వరకూ ఆయన పర్యటనలు సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలకు 40 రోజుల టైమ్ ఉండటంతో ఇప్పటికే ఢిల్లీ వెళ్లి... సీఈసీకి కంప్లైంట్ ఇవ్వడంతోపాటూ... కాంగ్రెస్ నేతలనూ కలిసిన చంద్రబాబు... ఆ తర్వాత రెండో దశ ఎన్నికలు జరగబోతున్న కర్ణాటక వెళ్లి... జేడీఎస్ నేతల్ని కలిశారు. మాండ్యాలో జేడీఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

cbn 16042019

తాజాగా ఆయన తమిళనాడు వెళ్లి... డీఎంకే నేతలను కలిశారు. ఇలా చంద్రబాబు... జాతీయ స్థాయిలో తన మార్క్ చెదిరిపోకుండా చూసుకుంటున్నారు. రేపు ఫలితాలు వచ్చాక... ఛాన్స్ దొరికితే... మళ్లీ... జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతూ... కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చని ఆయన ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు కమలనాథులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక భూమిక పోషించే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న పలువురు రాజకీయ పరిశీలకులు మాత్రం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ బాటలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు యోచిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగియగానే, చంద్రబాబు, టార్గెట్ మోడీ అంటూ, మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండా చెయ్యటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ చేసిన నమ్మక ద్రోహానికి, బదులు తీర్చే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా, దేశ వ్యాప్త ప్రచారం చేస్తున్నారు. నిన్న కర్ణాటకలో పర్యటించి, ఈ పర్యటనలు మొదలు పెట్టారు. ఈ రోజు చెన్నై వెళ్లారు. అయితే, చంద్రబాబుని ప్రచారానికి పిలిస్తే, ఇబ్బందులు తప్పవనే సంకేతాలు మోడీ ఇస్తున్నారు. తనని ఎండగడుతున్న చంద్రబాబుని ఒంటరి చెయ్యటానికి, వివిధ పార్టీలను బెదిరిస్తున్నారు. చంద్రబాబు మద్దతు తీసుకుంటే ఊరుకునేది లేదని సంకేతాలు ఇస్తున్నారు.

dmk 16042019

నిన్న చంద్రబాబు జేడీఎస్ తరుపున మండ్యాలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్న సాయంత్రానికి చంద్రబాబు ఇటు రాగానే, అక్కడ జేడీఎస్ టార్గెట్ గా ఐటి దాడులు జరిగాయి. పోలింగ్ సమీపించిన ప్రస్తుత తరుణంలో జేడీఎస్ నాయకులను మాత్రమే టార్గెట్ గా చేసుకుని ఐటీ దాడులు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. మండ్య, హాసన లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోన్న దేవేగౌడ ఇద్దరు మనవళ్లు నిఖిల్ గౌడ, ప్రజ్వల్ రేవణ్ణలను ఓడించడానికి, పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఐటీ దాడులు చేస్తున్నారని, దీని వెనుక బీజేపీ హస్తం ఉందని జేడీఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు వచ్చి వెళ్ళిన వెంటనే ఇలా జరగటం గమనార్హం.

dmk 16042019

అయితే నిన్న జరిగింది నిజమైన దాడులు అనుకున్నా, ఈ రోజు చెన్నై లో అదే జరిగింది. ఈ రోజు డీఎంకే తరుపున చంద్రబాబు ప్రచారం చేసారు. ఆయన అక్కడ నుంచి బయలుదేరగానే, చెన్నైలో డీయంకే టార్గెట్ గా ఐటి దాడులు జరిగాయి. ప్రస్తుతం టీడీపీ, డీఎంకేకు మద్దతిస్తోంది. ఈ రెండు పార్టీలకూ ఉమ్మడి శత్రువుగా బీజేపీ ఉంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ముందు వరకూ ఇలాంటి చాలా దాడులు జరిగాయి. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలోనే... తమిళనాడులో కూడా దాడులు జరగడంతో... రాజకీయ కలకలం రేగింది. తన ప్రచారంలో బీజేపీపై మండిపడిన చంద్రబాబు... స్వతంత్ర సంస్థల్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని కేంద్రంపై విమర్శలు చేశారు.

Advertisements

Latest Articles

Most Read