ముఖ్యమంత్రిగా చూడాలనేది తమిళ ప్రజల కోరికని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం చెన్నైకు వచ్చిన ఆయన డీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. అనంతరం డీఎంకే ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అన్నాడీఎంకేకు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని అన్నారు. రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం మనకు వద్దని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. జల్లికట్టును నిషేధించి మోదీ తమిళ సంస్కృతిని అవమానపరిచారని విమర్శించారు. ఐటీ దాడులు టీడీపీ, డీఎంకే, తృణమూల్‌పైనే ఎందుకు జరుగుతున్నాయి? అన్నాడీఎంకే, బీజేపీ నాయకులపై ఎందుకు జరగలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

cbn tamil 16042019

ద్రవిడ సంస్కృతి చాలా విశిష్టమైనది.. వారితో పెట్టుకున్నవారెవరూ గెలిచిన దాఖలాలు లేవని అన్నారు. తమిళుల ఆత్మగౌరవంతో మోదీ ఆడుకోవాలనుకున్నారని, జట్టికట్టు లాంటి విషయాల్లో తమిళులు పోరాటం అభినందనీయమని కొనియాడారు. తమిళ రైతులు ఢిల్లీలో అర్ధనగ్న నిరసనలు తెలిపిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల ముందు సాయం చేస్తామంటూ మభ్యపెడుతున్నారని, బీజేపీకి రైతులే తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. అన్నాడీఎంకే మోదీ చేతిలో కీలు బొమ్మ అయిపోయిందన్నారు. మోదీ చెప్పినట్టల్లా ఆడుతోందని విమర్శించారు. స్టాలిన్‌ తిరుగులేని నాయకుడిగా నిలిచారని, తమిళనాడు ప్రజలు స్టాలిన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. మోదీని ఓడించేందుకు స్టాలిన్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తి.. ఆగ్రహాలే మోదీకి బుద్ధి చెబుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

cbn tamil 16042019

ఏమైనా అంటే మోదీ గుజరాత్‌ మోడల్‌ అంటారని, అసలు గుజరాత్‌ మోడల్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. తమిళనాడులాంటి రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌ సాధించింది ఎంత? అని అన్నారు. మోదీ వైఫల్యాలను రఘురాంరాజన్‌ వంటి వాళ్లు... అర్థమయ్యేలా చెప్పి... పరిష్కారం చూపారని, అందుకే అలాంటివారంటే మోదీకి గిట్టదని చంద్రబాబు అన్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు భవిష్యత్‌లో కలిసి పనిచేస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమే అధికారంలోకి వస్తుందని, స్టాలిన్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తారని అన్నారు. డీఎంకేకు ఓటేసి గెలింపించాలని చంద్రబాబు నాయుడు తమిళనాడులోని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలపై మంగళవారం ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీవీప్యాట్‌లో గుర్తు కనిపించలేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదని అన్నారు. తన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియదని చంద్రబాబు అంటున్నారని, సినిమాలో విలన్‌లా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. ఇవే ఈవీఎంలతో 2014లో చంద్రబాబు గెలవలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓడిపోతే ఈవీఎంలపై నెపం నెడుతారని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచినప్పుడు.. చంద్రబాబు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రజల తీర్పును అవహేళన చేస్తున్నారని జగన్‌ విమర్శించారు.

jagan 16042019

వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని విమర్శించారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లారని, ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కోడెల ఆయన చొక్కాను ఆయనే చించేసుకున్నారని జగన్‌ విమర్శించారు. గురజాలలో ఓట్లు వేయలేదని ముస్లింలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని జగన్‌ ఆరోపించారు. పూతలపట్టులో తమ అభ్యర్థి ఎంఎస్‌ బాబుని కొడితే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఒకే కులానికి చెందిన 40 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని విమర్శించారు. నచ్చినవాళ్లకు చంద్రబాబు పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు. స్ట్రాంగ్‌రూముల్లోని ఈవీఎంలను బయటికి తెచ్చారని, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూములు తెరవాలన్నారు. స్ట్రాంగ్‌రూముల దగ్గర పారామిలటరీ బలగాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసి సీఈవో, సీఈసీ పర్యవేక్షించాలని జగన్‌ అన్నారు.

jagan 16042019

‘నా ఓటు ఎవరికి పడిందో నాకే అర్థంకావటం లేదు’ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తాను ఫ్యాన్ గుర్తుకు నొక్కితే వీవీప్యాట్‌లో తన ఓటు స్పష్టంగా కనిపించిందని జగన్ తెలిపారు. అదే ‘నా ఓటు సైకిల్‌కు పడుంటే ఊరుకునే వాడిని కాదని’ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 80 శాతం పోలింగ్ జరిగిందన్నారు. ఒకవేళ ఓటు తేడా పడుంటే ఓటర్లే ఫిర్యాదు చేసేవారన్నారు. కానీ ఒక్క ఓటర్ కూడా కంప్లెంట్ చేయలేదన్నారు. చంద్రబాబే ఎందుకు ఆరోపిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారంటే... ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికేనని విమర్శించారు. ప్రజల గాలి టీడీపీ వైపు లేదనే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. చాలా మంది ఇందులో బాధితులు కూడా. చాలా చోట్ల మధ్యాన్నం వరకు పోలింగ్ మొదలు కాకపోవటం, తరువాత రోజు ఉదయం 4 గంటలు కూడా ఓటు వెయ్యటం చూసాం. పెద్ద పెద్ద లైన్లలో గంటలు గంటలు నుంచుని ప్రజలు ఓట్లు వేసారు. అయితే ఇలా ఎన్నికలు నిర్వహించటం పై, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజల ఇబ్బంది పై చంద్రబాబు మాత్రమే స్పందించారు. జగన్ మాత్రం లోటస్ పాండ్ నుంచి బయటకు రాలేదు, కేసీఆర్ మాత్రం, చంద్రబాబు తన గుట్టు ఎక్కడ బయట పెడతాడా అని వణుకుతున్నాడు. ఈ పరిస్థితిలో, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా స్పందించారు. అయితే, ఈయన స్పందన చూసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవాక్కవుతున్నారు.

sunilarora 16042019

"ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల వైఫల్యంపై మేం పూర్తిస్థాయి వివరాలు సేకరించి చార్ట్‌ తయారుచేశాం. 11వ తేదీ ఉదయం 10 గంటలకు నాకు ఫోన్‌ వచ్చినప్పుడు 35% ఈవీఎంలు పనిచేయడంలేదని చెప్పారు. 11.30 గంటలకు నివేదిక అడిగితే 45 మాత్రమే పనిచేయలేదని చెప్పారు. ఆ సంఖ్యలో కొంత తేడా ఉండొచ్చు. కానీ తీవ్ర ఆందోళనకర పరిస్థితి మాత్రం లేదు. 45వేల ఈవీఎంల్లో 45 మాత్రమే సరిగా పనిచేయలేదు. ఆ ఎన్నిక కోసం మేం 90వేల ఈవీఎంలు తరలించాం. గత ఏడాది జరిగిన అయిదురాష్ట్రాల ఎన్నికల్లో 1.75 లక్షల ఈవీఎంలు ఉపయోగించినప్పుడు కేవలం ఆరు ఈవీఎంల విషయంలో ప్రసారమాధ్యమాలు విస్తృత ప్రచారం కల్పించాయి. ఆ ఆరు కేసుల్లో బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేశాం’’ అని అరోడా వెల్లడించారు.

sunilarora 16042019

‘రోగ నిర్ధరణకు రక్త పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు రక్త నమూనాలు ఒక చోట తీసుకుంటామా లేదంటే 20 చోట్ల నుంచి సేకరిస్తామా’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 45 ఈవీఎంల్లోనే సమస్య వచ్చినట్లు తెలిపారు. "ఒక వ్యక్తికి రక్త పరీక్షలు చేయాలంటే నమూనాలను ఒకచోట నుంచి తీసుకుంటారా? శరీరంలోని 20 చోట్ల నుంచి తీసుకుంటారా? ఈవీఎంలపై విమర్శలు ఆవేదనకరం’’ అని అరోడా అన్నారు. ‘వీవీప్యాట్‌ల అంశంపై మేం సమర్పించిన ప్రమాణపత్రం ఆధారంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అయిదు వీవీప్యాట్‌లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అప్పటికప్పుడు నిర్ణయించుకొని(ర్యాండం) ఎంపిక చేసి లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఆదేశాలను అమలుచేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఆదేశాలు జారీచేశాం. దీనిపై రాజకీయ పార్టీలు మళ్లీ కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు మీడియాలో చూశాను. ఒకవేళ కోర్టు అడిగితే మా అభిప్రాయాలను మళ్లీ చెబుతాం' అని అన్నారు.

ఈవీఎం... దీని చుట్టూ మళ్లీ పెను వివాదం. ఎన్నికల ప్రక్రియ మొత్తంలో విప్లవాత్మక మార్పులకు దారిచూపిన ఈ యంత్రాలలో కావాల్సిన రీతిలో ఫలితాలను మార్చుకోవచ్చన్న అనుమానాలు పెనుభూతంగా మారాయి. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో చాలావరకు ఈవీఎంలు సరిగా పనిచేయలేదని, వాటిపై నమ్మకం లేదని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. కనీసం 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను కూడా లెక్కించాలని జాతీయ స్థాయిలో ఇతర ప్రతిపక్షాలతో కలిసి డిమాండ్‌ చేస్తోంది. వీటి పనితీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. ప్రస్తుతం ఈవీఎంల పై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు మొరాయించాయని, వాటిని సులభంగా ట్యాంపరింగ్ చేయవచ్చని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు.

evm 16042019

విపక్ష నేతలతో కలిసి జాతీయస్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవీఎంలకు సంబంధించి తెలంగాణలో మరో వివాదం రాజుకుంది. స్ట్రాంగ్ రూమ్స్‌లో ఉండాల్సిన ఈవీఎంలు రోడ్ల పై కనిపించడంపై దుమారం రేగుతోంది. జగిత్యాలలో సోమవారం రాత్రి ఓ ఆటోలో ఈవీఎంలను తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి పూట ఎవరూ చూడకుండా, ఆటోలో ఈవీయంలు తీసుకు పోవటం, పెద్ద దుమారం రేగింది. అయితే అవి పోలింగ్ రోజున వినియోగించిన ఈవీఎలు కాదని ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాయికల్, సారంగపూర్ గ్రామాల్లో ఓటర్ల అవగాహన కోసం వినియోగించిన ఎం2 రకం ఈవీఎంలని స్పష్టంచేశారు.

evm 16042019

ఎన్నికల అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..వాటిని సోమవారం రాత్రి జగిత్యాల అర్బన్ తహశీల్దార్ కార్యాలయం నుంచి మినీ స్టేడియం గోదాంకు తరలించారు. ఐతే గోదాంకు తాళంవేసి ఉండడంతో తిరిగి తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. రెండు రోజుల క్రితం కూడా జగిత్యాలలో ఇదే తరహా వివాదం చెలరేగింది. కారులో ఈవీఎంలను తరలించడంపై రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఎన్నికల అధికారులు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ రెండు ఘటనలను జగిత్యాల కలెక్టర్ శరత్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read