ఆడపడుచులకు పూర్తిగా ‘పసుపు-కుంకుమ’లు అందాయి. రాష్ట్రంలోని సుమారు కోటి మంది డ్వాక్రా మహిళలకు చెందిన గ్రూపుల ఖాతాల్లో గురువారం డబ్బు జమ అయింది. దీంతో మహిళల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా, తమ ‘పసుపు-కుంకుమలు’ చల్లగా ఉండాలని పెద్దన్నలా ఆలోచించి, ఆదరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల వారంతా తమ అభిమానం చాటుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పథకం కింద ప్రకటించిన రూ. పది వేలలో ఇప్పటికే రూ.2500 ఒక విడత, రూ.3500 మరో విడత డ్వాక్రా మహిళకు అందాయి. మిగతా రూ.4 వేలును, ఆమె గ్రూపు ఖాతాలో గురువారం జమ చేశారు. శుక్ర, శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు కావడంతో పొదుపు గ్రూపు మహిళలు ఎనిమిదో తేదీ నుంచి చెక్కులు బ్యాంకుల్లో వేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ నెల 5న చెల్లే విధంగా పోస్టు డేటెడ్‌ చెక్కులను ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసింది.

game 27032019

దీనిపై ప్రతిపక్షనేతలు చేసిన ఫిర్యాదులను తోసిపుచ్చి... పసుపు-కుంకుమ పథకం ఇప్పటికే ప్రారంభమైనందున కొనసాగించవచ్చని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేయడంతో, ఈ పథకం అమలులోని చివరి అడ్డంకీ తొలగిపోయింది. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 3.94 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో సగానికిపైగా మహిళలే. పురుషుల కంటే సుమారు నాలుగు లక్షల ఓట్లు మహిళలవే ఎక్కువున్నాయి. ఈ మహిళల్లో అత్యధిక శాతం తమ సాధికారతకు బీజం పడింది 1995-96లో చంద్రబాబు హయాంలోనేనని గుర్తుచేసుకుంటున్నారు. డ్వాక్రా గ్రూపుల ఆవిర్భావం జరిగింది అప్పుడే. సాధారణంగా మహిళలు ఎంతో కొంత పొదుపు చేసి.. అత్యవసర సమయాల్లో భర్తకు ఇస్తూ సాయపడుతుంటారు. లేకుంటే పిల్లల ఖర్చులకు ఇస్తుంటారు. అలా వారిలో ఉన్న పొదుపు గుణాన్ని గ్రహించిన చంద్రబాబు.. దాన్ని తారకమంత్రం చేశారు. పొదుపు సంఘాలను ఏర్పాటుచేశారు. ఈసారి ఐదేళ్లలో మరింత ముందుకెళ్లి మహిళలకు ‘పసుపు-కుంకుమ’ను రెండు దఫాలుగా ఇచ్చారు. ఒక్కో దఫా రూ.10వేల చొప్పున మొత్తం రూ.20 వేలు ఇచ్చారు. ఇది మహిళలను ఆర్థికంగా సాధికారం చేసేందుకు ఎంతగానో ఉపకరించింది.

game 27032019

జిల్లాల వారీగా పసుపు-కుంకుమ లబ్ధి... అనంతపురం రూ.681.33 కోట్లు, చిత్తూరు రూ.736.53 కోట్లు, తూర్పుగోదావరి రూ.1038.71 కోట్లు, గుంటూరు రూ.770.08 కోట్లు, విశాఖపట్నం మహానగర పాలక సంస్థ రూ.200.98 కోట్లు, కడప రూ.441.53 కోట్లు, కృష్ణా రూ.672.57 కోట్లు, కర్నూలు రూ.614.39 కోట్లు, నెల్లూరు రూ.448.67 కోట్లు, ప్రకాశం రూ.582.72 కోట్లు, శ్రీకాకుళం రూ.555.15 కోట్లు, విశాఖపట్నం రూ.526.12 కోట్లు, విజయనగరం రూ.492.60 కోట్లు, విజయవాడ నగరపాలక సంస్థ రూ.99.23 కోట్లు, పశ్చిమగోదావరి రూ.740.69 కోట్లు. పొదుపు సంఘాలు.. 8,40, 000.. మొత్తం సభ్యులు.. సుమారు 94 లక్షలమంది...వీరిలో వెనుకబడిన వర్గాల మహిళలు.. 43,49,056.. షెడ్యూల్‌ కులాలకు చెందినవారు.. 17,16,562.. షెడ్యూల్డ్‌ తెగలకు చెందినవారు.. 4,32,063... మైనారిటీ మహిళలు.. 3,42,761

ఎన్నికల ప్రచారం వేళ డబ్బులు వెదజల్లుతూ కొందరు వైకాపా నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైకాపా నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన తరఫున శిరివెళ్లలో ప్రచారం చేస్తున్న కొందరు నేతలు ప్రజలపై డబ్బులు వెదజల్లారు. దీంతో నోట్లు ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక తెదేపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైకాపాకు చెందిన అన్వర్‌ బాషా, సలీం అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

survery 06042019

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వీడియోపై స్థానిక టీడీపీ నేతలు శిరివెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు, మద్యం పంచుతూ వైసీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీకి చెందిన అన్వర్‌ బాషా, సలీంలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రక్రియను వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్‌‌రెడ్డి అపహాస్యం చేస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బ్రిజేంద్ర‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరతామని ఆమె తెలిపారు. ఆళ్లగడ్డ స్థానంలో వైసీపీ తరపున గంగుల బ్రిజేంద్ర ‌రెడ్డి, టీడీపీ తరపున భూమా అఖిలప్రియ పోటీచేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కుట్రలు తారా స్థాయికి చేరుతున్నాయి. మోడీ, కేసీఆర్, జగన్ చేస్తున్న పన్నాగాలు, అడ్డు అదుపూ లేకుండా, సాగుతున్నాయి. ప్రజల అండ లేకపోవటంతో, వ్యవస్థలని అడ్డు పెట్టుకుని అరాచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆడియో కలకలం రేపుతోంది. విజయసాయిరెడ్డికి సంబంధించి తాజాగా ఓ ఆడియో క్లిప్పింగ్ లీకైంది. ఈ ఆడియోతో వైసీపీ కుట్ర బట్టబయలైంది. ఎన్నికల్లో వైసీపీ గెలిచినట్లు, జగన్ సీఎం అయినట్లు కలల కనడం సరికాదని, 2014 లోనూ ఇలాగే ఊహించుకుని తప్పుచేశామని కుండబద్దలు కొట్టారు. మళ్లీ అదే తప్పును చేస్తున్నామని ఆడియోలో పేర్కొన్నారు.

vsreddy 06042019

మోదీ మనకేదో ఒరగబెడతారని, ఆయన సాయంతో అంతా అయిపోతుందని భ్రమపడటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. మనమంతా సెట్ చేసుకొని, సిద్ధమయ్యాక ఇప్పుడొచ్చి మోదీ తాను చూసుకుంటానని అంటున్నారని, ఇన్నాళ్లూ ఆ మాట ఎందుకు చెప్పలేదని ఆడియోలో ప్రశ్నించారు. ఎన్నికల కోసం పూర్తిగా సిద్ధమయ్యాక తాను చూసుకుంటానని మోదీ అంటున్నారని, అయినా ఆయనను నమ్మడానికి వీల్లేదని తెలిపారు. జగన్ ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితే ఎందుకుందని ప్రశ్నించారు. ‘అమర్చిన దానిపైన అమ్మగారి చెయ్యి’ అన్నట్లుగా మోదీ ధోరణి ఉందని ఆడియోలో విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. మోదీ నిబద్ధత ఉన్న నాయకుడేమీ కాదని, అందుకే సాయం చేస్తానని చెప్పినా మనం రిలాక్స్ కాకూడదని విజయసాయి హెచ్చరించారు. రాజకీయంగా చంద్రబాబును జయించడం అంత సులభం కాదని, ఆయన ఎవరికీ లొంగరు అంటూ చెప్పుకొచ్చారు.

vsreddy 06042019

అంతే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల పై కూడా, తనకు, తన పార్టీకి ఉన్న చులకన భావం మరోసారి బయటపెట్టారు. తెలంగాణా ప్రజలు చాలా నయం అని, ఆంధ్రా ప్రజలకు నిబద్ధత లేదంటూ, ఏపి పై విషం చిమ్మారు. తెలంగాణాలో అసలు కులమే లేదు అన్నట్టు చెప్తూ, ఏపి ప్రజలు మాత్రం కుల పిచ్చ ఉన్నోళ్ళు అనే విధంగా మాట్లాడుతూ, మరోసారి ఏపి పై వారి నైజం బయటపెట్టారు. ఏపీ జనానికి కులాలు ముఖ్యం, కులాల కోసం కొట్టుకుచస్తారు. ఇలాంటి కులాలను హ్యాండిల్‌ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు బతుకే అంత, టీడీపీ బతుకున్నదే కులాలపైన అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎవరికీ లొంగడు. జగన్‌కు పోల్ మేనేజ్‌మెంట్ చేతకాదు. చుట్టూ ఉన్నవారి మాటలను జగన్‌ నమ్ముతారు. ఈసారి గెలవకుంటే ఏపీలో వైసీపీ ఖతం అని విజయసాయిరెడ్డి మాట్లాడిన ఆడియో క్లిప్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తానికి ఈ ఆడియో లీక్ తో, విజయసాయి బండారం మరోసారి బయట పడింది.

ఎన్నికల గడువుముంచుకొస్తున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహాలు ఇలా బహుముఖాలుగా సాగుతున్నాయి. ఒక్కొక్క జిల్లాలో పరిస్థితిని బట్టి ఒక్కో రకం వ్యూహంతో ఆ పార్టీ ముందుకు వెళ్తోంది. ఉదాహరణకు.. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో వైసీపీ ఎన్నికల గుర్తున్న అందమైన కార్డులు, దాని పై సీరియల్‌ నెంబర్ల వారీగా ముద్రించారు. వాటిని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ప్రచార ఘట్టం ముగిసిన వెంటనే ఈనెల 10వ తేదీ రాత్రి, 11 ఉదయం వాటిని చూపించిన వారికి, అవి స్కాన్ చేసి, ఓటుకు నోటు అందిస్తామని చెబుతున్నారు. ఆ ఒక్కచోటే కాక, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే.. టీడీపీ అభ్యర్థులు ఏ రోజు ఎక్కడ పర్యటిస్తారో ముందే తెలుసుకుని, అదే రోజు ఆ ప్రాంతానికి చెందిన కొందరిని ముందే తమవద్దకు పిలిపించుకుంటున్నారు. వారికి గ్రామంలోని ఓటర్ల సంఖ్యను బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా డబ్బు ఇచ్చి పంపుతున్నారు. టీడీపీ అభ్యర్థి వచ్చే రోజున గ్రామస్థులందరినీ ఊరికి దూరంగా తీసుకెళ్లి మద్యం, మాంసాహారం పెట్టడమే వారు చేయాల్సిన పని. తద్వారా.. టీడీపీ అభ్యర్థి ప్రచారంలో జనం తక్కువగా కనిపించారనే ప్రచారం చేస్తూ మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు.

ఈ ఎన్నికల్లో వైసీపీకి పనిచేస్తామని, ఓట్లు వేస్తామని ఒట్టేసి చెప్పాలంటూ ఆ పార్టీ నాయకులు పలు వర్గాలపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ముఖ్యంగా మతపరంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ చర్చి పాస్టర్లను కలిసి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. వైసీపీని గెలిపించుకోకపోతే ప్రభువు క్షమించడని భయపెడుతున్నారు. కుటుంబంతో పాటు ఊరిలో క్రైస్తవులందరితోనూ ఓటు వేయించే బాధ్యత తీసుకుంటామని బైబిల్‌పై ప్రమాణం చేయిస్తున్నారు. రాజకీయ సమావేశాలకు మత ప్రార్థనల ముసుగు వేసి తంతు నడిపిస్తున్నారు. చర్చిలు, మసీదులకు స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులు పంచుతున్నారు. చర్చిల్లో ప్రార్థనల అనంతరం విందు ఏర్పాటు చేస్తున్నారు.

విందు తరువాత పాస్టర్లు వైసీపీ నాయకుల సమక్షంలో ఆ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే.. డ్వాక్రా మహిళలను కలిసి జగన్‌ వస్తే మంచి జరుగుతుందని, ఒక అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు. వారితో కూడా ‘మా మీద ఒట్టు వేసి చెప్పండి’ అంటూ, బలవంతంగా చేతిని తీసుకొని తమ నెత్తిపై పెట్టుకొని ప్రమాణం చేయిస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లో కీలక లీడర్లని గుర్తించి వారి ద్వారా ఆయా గ్రూపుల్లో ఉన్న సభ్యులకు బహుమతులు, నగదు ఇవ్వడానికి బేరసారాలకు దిగుతున్నారు. అయితే చాలాచోట్ల డ్వాక్రా సంఘాల మహిళలు వైసీపీ ఆఫర్లను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. అలాగే.. ఓటర్ల సమూహాలతో సంబంధాలున్న ఉపాధి కూలీ ఫీల్డ్‌ ఆఫీసర్లు, మేస్త్రీలపైనా దృష్టి సారిస్తున్నారు. వారికి వారి స్థాయిని బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టజెప్తున్నారు. ఓటర్లకు ఇచ్చే డబ్బులు వేరే. ఆ సొమ్మును పార్టీ కార్యకర్తలే పంచుతారు. వీరు చేయాల్సిందల్లా.. కేవలం మధ్యవర్తులుగా ఉండి, వారి చేత ఖచ్చితంగా వైసీపీకే ఓటు వేసేలా మాట తీసుకోవడం అంతే.

Advertisements

Latest Articles

Most Read