ప్రధాని మోదీ వల్లే కియా మోటర్స్ అనంతపురానికి వచ్చిందంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ఆయన.. తన వల్లే కియా మోటార్స్‌ ఏపీకి వచ్చిందని తేల్చి చెప్పారు. మోదీకంటే తనను నమ్మి ఏపీకి వచ్చిందని స్పష్టం చేశారు. కియాను గుజరాత్‌ తీసుకెళ్లాలని మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. తనను నమ్మి.. కియా మోటార్స్‌ ప్రతినిధులు ఏపీకి వచ్చారని.. మోదీని కాదని కుండబద్ధలు కొట్టారు. తనపై నమ్మకంతో ఒక్క మాట అడిగితే.. 50వేల కోట్ల రూపాయల విలువ చేసే 35వేల ఎకరాలను రైతులు ఇచ్చారన్నారు. ప్రధాని అమరావతికి వచ్చి గుప్పెడు మట్టి, నీళ్లు ఇచ్చారని.. ఆ మట్టి, నీళ్లను ముఖాన కొడతామని హెచ్చరించారు. ఏటా ఆరు వేల కోట్ల రూపాయల పన్నులు కడుతున్నామని.. ఎవడబ్బా సొమ్మని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

kia 31032019

ఇదే విషయం పై ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు స్పందించారు. కియా పరిశ్రమ రాష్ట్రానికి రాకపై మోదీకి కితాబివ్వడం జగన్ మరో సెల్ఫ్ గోల్ అని, ఆయన మోదీ భజన భాజపా నేతలనే మించిపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. కియా తన వల్లే వచ్చిందని చెప్పే సాహసం మోదీనే చేయలేదని గుర్తు చేశారు. రోజురోజుకూ జగన్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నాడని మండిపడ్డారు. కార్యకర్తలు, నాయకుల్లో గెలుపుపై ఇంకా పట్టుదల రావాలని కోరారు. ఇకపై ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రోజువారీ కార్యాచరణ సిద్ధం చేసుకొని, పనితీరును విశ్లేషించుకోవాలని దిశానిర్దేశం చేశారు. తుది ఓటర్ల జాబితా విడుదలైనందున అన్ని ఓట్లు తనిఖీ చేసుకోవాలని కోరారు. ఇటీవల ఓట్ల దొంగల ఎత్తులు చిత్తు చేశామని, భవిష్యత్‌లో ఈవీఎం దొంగలను కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందన్నారు.

kia 31032019

ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామని, గత ఎన్నికలకన్నా ఎక్కువ ఓట్లు తెచ్చిన వారికే గుర్తింపు లభిస్తుందని చెప్పారు. వైకాపా మైండ్, సైకో గేమ్‌లను చిత్తు చేయాలన్నారు. ఏపీకి చెందిన రూ.లక్ష కోట్ల ఆస్తులు లాక్కున్న కేసీఆర్‌తో జగన్ దోస్తీ కట్టారని, పోలవరంపై పదేపదే కేసులు వేసే తెరాసకు వైకాపా మద్దతు పలుకుతోందని మండిపడ్డారు. జగన్ ఆస్తులు, బంధువుల ఆస్తుల కోసం కేసీఆర్‌కు రాష్ట్రం తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ‘ఈ ఒక్కసారే ప్లీజ్’ అంటే, క్రూరమృగం చెంతకు ఎవరైనా వెళ్తారా అని ప్రశ్నించారు. తప్పులు చేసేవారికి ఒక్క ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. తండ్రికి అవకాశం ఇస్తేనే ఉమ్మడి రాష్ట్రాన్నే ఏకంగా మింగేశాడని, ఇతనికి మళ్లీ అధికారం ఇస్తే ఇక జనాన్ని బతకనిస్తాడా? అని తూర్పారపట్టారు. తెదేపా మిషన్ 150 ప్లస్ ఏకపక్షం కావాలని, 25 ఎంపీ సీట్లు, 150పైగా అసెంబ్లీ సీట్లు తెదేపా సాధించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ప్రధాని నరేంద్రమోదికి ఏపి సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ. కర్నూలులో మోది వ్యాఖ్యలపై భగ్గుమన్న చంద్రబాబు. టిడిపి ఆవిర్భావంనాడే ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతీశారని మండిపాటు. మా ప్రజల మనోభావాలు గాయపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారు అభూత కల్పనలు, శుద్ధ అబద్దాలతో మీ వ్యాఖ్యలు అత్యంత హేయం, బాధాకరం. మా అభివృద్ధి అస్తమించాలని ఆక్రోశించారు. మీ అహంకార పూర్వక వ్యాఖ్యలకు ప్రతి ఆంధ్రుడూ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. వారందరి పక్షాన నేను మీకు ఇస్తున్న సమాధానం. మీరు చాలా కబుర్లు చెప్తారు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పటంలో మీకు మీరు సాటి. ఆనాడు కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను బతికించింది అన్నారు. ఆ తల్లి లేని బిడ్డ సంరక్షణ నేను తీసుకుంటాను అని నమ్మించారు. పసి బిడ్డ నవ్యాంధ్ర గొంతు నిలువునా కోశారు. ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కై రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారు. దేశాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేశారు రైతులను, యువకులను, వ్యాపారులను, మైనారిటీలను మోసం చేశారు, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన ద్రోహులు మీరు.

modi 31032019

ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా మోసంచేశారు. దత్తపుత్రుడికి(జగన్ కు) సాయం చేయడానికే మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి వంచించారు. రూ.లక్ష కోట్లు దోచుకున్న ఆర్థిక నేరస్తులను శిక్షిస్తామన్నారు. కటకటాల వెనుక ఉంచుతానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోలేదు. రాష్ట్రం ఏర్పడ్డ తోలి నాలుగేళ్ళు డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే ఉంది. కేంద్రం ఇంజన్ డ్రైవర్ అయిన మీరు కేవలం గుజరాత్, ఉత్తర భారతదేశానికే తీసుకెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మొద్దు నిద్రపోయారు. రాష్ట్ర ఇంజన్ డ్రైవర్‌గా నేను ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి స్టేషన్ వైపు నడిపాను. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్‌ అనేది మా రాష్ట్ర అభివృద్దికి సూచిక. ఇక్కడి ప్రజల కష్టపడే తత్త్వం, పట్టుదలకు నిదర్శనంగా పెట్టుకున్నది ఆ పేరు.పునాదుల నుంచి మేము నిర్మింస్తుంటే మీరు అడ్డుగోడలు కట్టారు.కఠోర శ్రమతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు, భాగస్వామ్యాలతో అత్యున్నత ప్రగతిని సాధించాం.సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ స్పూర్తిని కించపరుస్తారా..? మా రాష్ట్రాన్ని హేళన చెయ్యడం భావ్యమా.? అసలు సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ పేరు పలికే నైతిక హక్కు మీకు ఉందా? ఈ 5ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి మీరు ఇచ్చిన సహాయ సహకారాలు ఏంటి? ఒక్కటైనా చెప్పగలరా?

modi 31032019

కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల సహకారం లేకే 9వ షెడ్యూల్ సంస్థలలో ఒక్క సంస్థ విభజనా జరగలేదు. పదో షెడ్యూల్‌లోని 142 సంస్థల విభజన ఇప్పటికీ పరిష్కారం కాలేదు. తెలంగాణ విద్యుత్ బకాయిలు రూ.5,732కోట్లు ఇవ్వలేదు. మధ్యవర్తిగా పరిష్కరించాల్సిన మీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రాజధాని నగరం నిర్మాణానికి రూ.1,500కోట్లు మాత్రమే ఇచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం మా ఎంపిలు 11రోజులు దీక్షచేసినా మీకు చీమ కుట్టినట్లులేదు. ఏపి భవన్ పంపిణీ 4ఏళ్లయినా చేయలేక పోయారు. డిఫర్డ్ టాక్స్ కలెక్షన్లలో తేడాల వల్ల రూ.3,820కోట్లు నష్టపోయాం. రాజధానిని, అత్యున్నత సంస్థలు, ఉత్పాదక కేంద్రాలు, సేవారంగ కేంద్రాలను కోల్పోయాం. కరవులు, తుఫాన్లు మాత్రం వారసత్వంగా వచ్చాయి. కష్టాలలో ఉన్న రాష్ట్రానికి అండగా నిలుస్తారనే ఆనాడు మీతో కలిసి నడిచాం. ఇప్పుడు కేంద్ర అభివృద్దికి రాష్ట్రం సహకరించలేదనడం మూర్ఖత్వం కాదా..?. 5ఏళ్ల క్రితం మీకు ఓటు వేశారు అన్న ఇంగితం మీకుందా..? అదే ఉంటే ఇంత అన్యాయం చేసేవారా..?. ప్రధాన సేవకుడుగా కాదు మీరు ప్రధాన వంచకుడిగా మారారు.

అనంతపురంలో కియా మోటార్స్‌ పరిశ్రమ వచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ వల్లేనని వైకాపా అధినేత జగన్‌ అన్నారు. కియా మోటార్స్‌ తెచ్చింది ఆయనేనని చెప్పారు. ఏపీకి చంద్రబాబు ఒక్క పరిశ్రమ కూడా తేలేదని విమర్శించారు. శనివారం అనంతపురం జిల్లా మడకశిరలో ఎన్నికల ప్రచార సభలో జగన్‌ మాట్లాడారు. ‘ప్రధాని మోదీ కొరియాకు వెళ్లి చర్చించాకే ఇక్కడికి కియా కార్ల పరిశ్రమ వచ్చింది. కియాలో రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కాములు చేసింది. పరిశ్రమ వస్తుందని తెలియడంతో ముందుగానే చుట్టుపక్కల రైతుల భూములను కొందరు ప్రభుత్వ పెద్దలు చవకగా కొట్టేశారు. కియాకు కేటాయించిన స్థలం చదును పేరిట రూ.170 కోట్ల పనిని ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించారు. దానిని మళ్లీ తెదేపా నాయకులు ఉపగుత్తేదారులుగా మారి దోచుకున్నారు. వీళ్ల కమీషన్లు, లంచాల తీరు చూసి కంపెనీలు రాష్ట్రానికి రావడం లేదు’ అని జగన్‌ విమర్శించారు.

jagankia 31032019

అయితే ఇక్కడ ఒకటి ప్రజలు గమనించాలి. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించారు. అంతకు ముందు కూడా వచ్చారు. మోడీ ఎప్పుడు వచ్చినా, రాయలసీమ అభివృద్ధి గురించి చాలా చెప్పారు, విద్యా సంస్థల గురించి చెప్పారు. కానీ,కియా పరిశ్రమ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కియాను తెచ్చింది నేనే అని ఎప్పుడూ చెప్పుకోలేదు. కియా అనంతపురం రావటంలో, కేంద్ర ప్రభుత్వ శ్రమ ఒక్క కొంచెం ఉన్నా, దానికి ఏ సహాయం చేసినా, మోడీ వదిలిపెట్టారు, బీజేపీ ప్రచారం హోరెత్తించేది. రాష్ట్రం మొత్తం చెప్పుకునేవారు. కానీ కియా గురించి చెప్పలేదంటే.. అందులో ఆయన పాత్ర లేనట్లేగా ! పైగా.. కియా పరిశ్రమ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఒక్క సారి కూడా కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్ మెంట్ కనిపించలేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వ్యవహారాలు నడిచాయి.

jagankia 31032019

అయితే.. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం.. భారతీయ జనతా పార్టీ వల్లే కియా వచ్చిందని ప్రచారం చేసుకునేవాళ్లు. నిజంగా కియాను బీజేపీ నేతలే తెచ్చి ఉంటే… ఎంత హడావుడి జరిగి ఉండేదో.. చాలా మందికి తెలుసు. అందుకే.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీ నేతలు కాబట్టి చెప్పుకుంటున్నారని అనుకుందాం.. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా.. కియా పరిశ్రమ క్రెడిట్ ను.. నరేంద్రమోడీకి కట్ట బెట్టడానికే ప్రయత్నించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జగన్‌ ఎన్నికల ప్రచారం చేిసన జగన్… మోడీ వల్లే అనంత జిల్లాకు కియా మోటర్స్‌ వచ్చిందని నిర్మోహకమాటంగా ప్రకటించేశారు. నిజానికి కియా పరిశ్రమ గురించి జగన్ ఎప్పుడూ పాజిటివ్ గా స్పందించలేదు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పనపాకం హరిజన వాడలో తెదేపా కార్యకర్తలపై వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు శనివారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సర్వే పేరుతో రాత్రి పూట ఊరికి వచ్చిన వైకాపాకు చెందిన ఛానల్ ప్రతినిధులను పనపాకం హరిజనవాడ గ్రామస్థులు ప్రశ్నించారు. మీడియాకు మద్దతుగా ఉన్న చెవిరెడ్డి అనుచరులు అడ్డుకున్న వారిపై దౌర్జన్యానికి దిగారు. అడ్డొచ్చిన తెదేపా కార్యకర్తలను కర్రలు, దుంగలతో నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ దాడిలో ముగ్గురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. బాధితులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా.. చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని బాధితులను పరామర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేల పేరుతో వైకాపా రౌడీయిజం మితిమీరిపోతోందని, దీన్ని ఎన్నికల అధికారులు తక్షణమే అడ్డుకోవాలని బాధితులు, తెదేపా నాయకులు కోరారు.

ycp 31032019

ఇక మరో పక్క, పెదపాడు మండలం పాతముప్పర్రులో వైసీపీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ప్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని స్క్వాడ్‌ ఇన్‌ఛార్జి, జిల్లా సైనిక వెల్ఫేర్‌ అధికారి కేవీ సాయి ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెదపాడు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సాఆర్‌ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బాణాసంచా కాల్చుతుండగా, దానిని చిత్రీకరించేందుకు వెళ్లిన ప్లయింగ్‌ స్క్వాడ్‌ వీడియోగ్రాఫర్‌ను అడ్డుకుని అతని వద్ద నుంచి వీడియో కెమెరాను తీసుకోవడంతో పాటుగా అధికారుల విధులకు ఆటం కం కలిగించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రసాదరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్‌ఐ కె.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read