రాజమండ్రి, ఆజాద్ చౌక్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. ప్రధాని మోదీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారరు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్‌ రైజ్‌ స్టేట్‌ అని పేరు పెడితే సెటైర్లు వేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరాన్ని కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని చెప్పారు. ‘‘భద్రాచలం మునిగిపోతుందని అంటున్నారు..భద్రాచలం మాదే తిరిగి ఇచ్చేయండి. మైనార్టీలు కోడి కత్తి పార్టీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్టే. ట్రిపుల్‌ తలాక్‌ పేరుతో కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశారు. అన్ని వ్యవస్థలను ప్రధాని మోదీ భ్రష్టు పట్టించారు. ప్రశ్నించినవారిపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి మోదీ సహకరించలేదు.

game 27032019

అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్‌ వెలవెల పోతుందని కేసీఆర్‌ భయం. వైసీపీకి మద్దతు ఇవ్వాలని హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నవారిని కేసీఆర్‌ బెదిరిస్తున్నారు. హైదరాబాద్‌లో మాకు కూడా వ్యాపారాలు ఉన్నాయి..ఏం చేస్తాడో చూస్తా. కేసీఆర్‌ ఆంధ్రా వాళ్లను తిట్టారు..మనకు రోషం లేదా?. జగన్‌ అవినీతి వల్ల ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారు. జగన్‌కు పాలన అనుభవం లేదు.. జగన్‌ ఇచ్చే హామీలు నమ్మశక్యంగా ఉన్నాయా?.’’ అని చంద్రబాబు అన్నారు.

ఏపీ రాజకీయం రాజుకుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీని దెబ్బ తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తోంది వైసీపీ. టీడీపీ ద్వితీయ శ్రేణీ నేతలే టార్గెట్‌గా పీకే టీం రంగంలోకి దిగింది. కోస్తాలోని 25 నియోజకవర్గాల్లో మకాం వేసింది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్న నేతల బలహీనతలను తెలుసుకోవడం వారి అనుచరగణంతో టచ్ లోకి వెళ్లడం.. ఈ టీమ్ లక్ష్యం. నియోజకవర్గంలో వైసీపీ ఎక్కడ బలహీనంగా ఉందో ఆ ప్రాంతాల్లో ప్రత్యర్థి వర్గంలో ఉన్న బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకోవడమే వీరి వ్యూహం. కొందరిని తమ పార్టీలోకి తీసుకుంటుండగా.. మరికొందరిని టీడీపీలోనే ఉంచి సమాచారం తెలుసుకుంటూ డబ్బులు ముట్టజెబుతున్నారు.

game 27032019

ఇక ఇదే స్ట్రాటజీతో, ముఖ్య మంత్రి కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం పై కూడా ఈ బ్యాచ్ కన్ను పడింది. నన్ను గెలిపిస్తే మంగళగిరి ని మరో గచ్చిబౌలి చేస్తాను అని లోకేష్ విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు . ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గం లో ఒక దఫా ప్రచారం పూర్తీ చేసుకుని జిల్లాల పర్యటనకు లోకేష్ వెళ్లారు. ఇంకో పక్క లోకేష్ ని చట్ట సభ లోనికి అడుగుపెట్టనీయకూడదు అని వైకాపా ఎత్తులు వేస్తోంది. దీనిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు చూడని కొత్త వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. వాళ్ళు అందరు పీకే టీం మనుసులు అని నియోజకవర్గంలో అనుకుంటున్నారు .

game 27032019

తెలంగాణ రిజిస్ట్రేషన్ తో మంగళగిరి నియోజకవర్గం లో వైకాపా జెండా తో తిరుగుతున్నా వాహనాలు , ఏ వాహనాల్లో లాప్టాప్ తో యూవతులు వుంటున్నారు. వీరు ఇంటి ఇంటికి తిరుగుతున్నారు, ప్రజల వద్ద నుంచి ఆధార్ , బ్యాంకు అకౌంట్ లు సేకరిస్తున్నారు. చిన్న చిన్న సమావేశాలు పెడుతున్నార. అసలు తెలంగాణ నుంచి ట్రాన్స్ పోర్ట్ పర్మిట్ ఉన్న వాహనం వైకాపా జెండా కట్టుకుని నియోజకవర్గం లో ఎలా తిరుగుతోంది ? ఈ వాహనానికి పర్మిట్ ఎవరు తీసుకున్నారు ? పక్క రాష్ట్రము యువకులు కి ఇక్కడ ఏమి పని ? దీనిని పక్క రాష్ట్రము సాక్షిగా మన రాష్ట్ర అభివృద్ధి ఆడుకోటానికి కుట్ర గానే చూడాలి అని మంగళగిరి లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీని వెనెక పక్క రాష్ట్రములో పెద్దలు హస్తం ఉంది అని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘మీ భవిష్యత్తును నా బాధ్యతగా తీసుకుంటాను. పేదరిక నిర్మూలన, రాష్ట్రాభివృద్ధి కోసం పది సూత్రాలను అమలు చేస్తాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదలకు పింఛను రూ.3 వేలకు పెంపు, ఐదేళ్లలో మూడుసార్లు పసుపు- కుంకుమ, రైతుల కోసం అన్నదాత సుఖీభవ, బీసీలకు రూ.10వేల కోట్లతో ప్రత్యేకంగా బ్యాంకు... ఇలా మొత్తం పది అంశాలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికీ కనీసం రెండు లక్షల వార్షికాదాయం లభించేలా చూస్తామని తెలిపారు. పేదల ఇళ్లలో అమ్మాయి పెళ్లికి రూ.లక్ష సహాయంగా అందిస్తామని ప్రకటించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి రావులపాలెం, కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘జాబు రావాలంటే బాబు రావాలని గత ఎన్నికల్లో నినదించాం. రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. పది లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువతకు తగు న్యాయం చేస్తాం. జాబు రావాలి! అందుకు... మళ్లీ మళ్లీ బాబు రావాలి’ అని చంద్రబాబు నినదించారు. పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు నిరంతర కృషి చేస్తామన్నారు. 40ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లల్లో చేసి చూపించిన ఘనత టీడీపీదేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని... వాటిని కూడా ఉచితంగానే కేటాయిస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 లక్షల గృహ ప్రవేశాలు జరిగాయని... కొత్త చరిత్ర సృష్టించామని చెప్పారు.

గోదావరి నీరు తాగినవారంతా... రాష్ట్ర విభజనతో కృష్ణా జిల్లాకు నీరు లేకుండా పోయిందని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తీసుకువచ్చి సాగు, తాగునీటి సమస్యను తీర్చామన్నారు. ‘గోదావరి నీరు తాగినవారంతా టీడీపీకే ఓటేయాలి’ అని కోరారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తి కాకుండా జగన్‌ అడ్డుపడ్డారని చెప్పారు. పోలవరం పనులను పూర్తి చేసి జూలైలో గ్రావిటీ ద్వారా, డిసెంబర్‌లో పూర్తిస్థాయిలో నీటిని డెల్టాకు తీసుకు వస్తామన్నారు. గోదావరి, పెన్నాలను అనుసంధానిస్తామన్నారు. ధైర్యాన్ని నింపుతోంది... ‘‘తిరుపతిలో నరసమ్మ అనే వృద్ధురాలు టీడీపీ సభకు హాజరై డాన్స్‌ చేసింది. ఎందుకమ్మా ఈ ఉత్సాహం అని అడిగితే... తనకు నలుగురు కొడుకులున్నా పెద్దకొడుకువై ఆదరించావని సభా ముఖంగా చెప్పింది. ఈ ఉత్సాహం నాలో ధైర్యం నింపుతోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రైతులకు రూ.1.50 లక్షల మేర రుణమాఫీ చేశామన్నారు. పదిశాతం వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింప చేస్తామని ప్రకటించారు.

దిశ మార్చే దశ సూత్రాలు: 1. డ్వాక్రా చెల్లెమ్మలకు ఐదేళ్లలో మూడుసార్లు పసుపు కుంకుమ కానుక. 2. పేద యువతుల పెళ్లికి లక్ష రూపాయలు కానుక. 3. వెనుకబడిన వర్గాల (బీసీలు) కోసం రూ. 10వేల కోట్లతో ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు. 4. పట్టణ ప్రాంతాల్లో మరో 20 లక్షల గృహాలు... ఉచితంగానే కేటాయింపు. 5. ఇప్పుడు ఇస్తున్న పింఛను 2 వేల నుంచి 3 వేలకు పెంపు. అర్హులైన వారందరికీ చెల్లింపు. 6. రైతులకు పూర్తిస్థాయిలో సహకారం... ‘అన్నదాత - సుఖీభవ’ ప్రతి ఏటా అమలు. 7. యువతకు నిరుద్యోగ భృతి అందిస్తూనే... నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం! 8. ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా మంచి నీటి సరఫరా. 9. నదుల అనుసంధానంతో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం. 10. ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల కనీస ఆదాయం.

 

‘మీకు నేనున్నా. సారు చాలా బిజీగా ఉన్నారు. మీ అవసరాలు, ఏమిటో చెప్పండి. ఐ విల్‌ ట్రై మై బెస్ట్‌’.... కుప్పం తెలుగు తమ్ముళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇచ్చిన భరోసా ఇది. ఎన్నికల రణ క్షేత్రంలో చంద్రబాబు, జిల్లాల వారీగా ప్రచారం చేసుకుపోతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ మారిపోతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ప్రచార వ్యూహాలు రచించి ప్రత్యర్థులకంటే వేగంగా దూసుకుపోవాల్సిన అవసరం ఆయనకుంది. దీంతో ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమోనన్న అనుమానం ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వేధిస్తూనే ఉంది. అందుకనే.. కుప్పం నియోజకవర్గంలోని సమన్వయ కమిటీ సభ్యులతో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమె అమరావతి నుంచి టెలికాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. సుమారు 15 నిమిషాల సేపు సాగిన కాన్ఫరెన్సులో ఆమె, చంద్రబాబునాయుడు బిజీగా ఉన్నందువల్లే తాను మాట్లాడుతున్నానని చెప్పారు.

game 27032019

సమన్వయ కమిటీ సభ్యులందరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలని కోరారు. విభేదాలు పక్కన పెట్టి చంద్రబాబుకు అత్యధిక మెజారిటీ సాధించాలన్నారు. ‘మనం అమలు చేస్తున్న పథకాలు ఇంకా కొంచెం గ్రామాల్లోకి వెళ్లాలన్నది నా ఉద్దేశమం’టూ సున్నితంగా హెచ్చరించారు. ఇంతలో టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రెస్కో ఛైర్మన్‌ పీఎస్‌.మునిరత్నం లైన్‌లోకి వచ్చారు. పార్టీలో అందరినీ సమన్వయ పరుచుకుని వెళ్తున్నామన్నారు. చంద్రబాబు అమలుచేస్తున్న పథకాల పట్ల మహిళలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని, వారిలో మంచి స్పందన కనిపిస్తున్నదని చెప్పారు. కంగుంది పక్క గ్రామంలో ఒక మహిళ, వైసీపీ ర్యాలీకి వెళ్లారన్న కారణంతో తన భర్త, కుమారుని ఇంట్లోకి రానివ్వలేదని, ఇది దృష్టాంతమని పేర్కొన్నారు. భువనేశ్వరి మాట్లాడుతూ ‘నేను సారును అడిగాను. మీరు కుప్పాన్ని పట్టించుకోవడం లేదు.

game 27032019

అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరాశ పడతారేమోనని చెప్పాను’ అన్నారు. అయితే కుప్పాన్ని గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదని, అక్కడ తానున్నా, లేకున్నా పార్టీ తమ్ముళ్లు బాగా పనిచేస్తారని చంద్రబాబు నమ్మకంగా తనతో చెప్పారని భువనేశ్వరి తెలిపారు. ‘బాగా పనిచేయండి. అందరూ కలిసి సారును అధిక మెజారిటీతో గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. కుప్పంతో తనకు అంతగా సంబంధం లేకపోవడం, ఇక్కడకు తరచుగా రాకపోవడం అంత బాగా అనిపించడం లేదన్నారు. ‘ఈసారి ఏవైనా జాతర్లు, ఫంక్షన్లు ఉంటే పిలవండి. తప్పకుండా వొస్తానం’టూ తనను ఆహ్వానించాల్సిందిగా కోరారు. మీరు లో ప్రొఫైల్‌ మెయింటైన్‌ చేస్తారని పిలవడం లేదు మేడం. ఇప్పుడు చెప్తున్నారు గదా. తప్పనిసరిగా ముఖ్యమైన ఫంక్షన్లకు మిమ్మల్ని ఆహ్వానిస్తా’మని పీఎస్‌.మునిరత్నం ఆమెకు తెలిపారు. ‘నేనెప్పుడూ రాజకీయంగా మాట్లాడలేదు. మీరందరూ బాగా పనిచేయాలి. మీకేవైనా కావాల్సి వస్తే నన్ను అడగండి. సారు బిజీ కాబట్టి, మీ బాధలు నేను పట్టించుకుంటాను. వీలైనంత వరకు తీర్చేందుకు ప్రయత్నిస్తాను’ అంటూ భువనేశ్వరి తెలుగు తమ్ముళ్లకు పూర్తి భరోసా ఇచ్చారు. ఆమె తమతో మాట్లాడడం, కుప్పం టీడీపీ వర్గాలకు స్ఫూర్తిగా ఉంటుందని పీఎస్‌.మునిరత్నం ఆమెతో చెప్పారు.

 

Advertisements

Latest Articles

Most Read