టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ప్రసంగాల్లో మధ్యలో చమత్కారాలు, ఛలోక్తులు విసురుతూ సభికులను బాగా నవ్విస్తున్నారు. తాజాగా రాజమండ్రి రోడ్ షోలో కూడా చంద్రబాబు జనసేనాని పవన్ కల్యాణ్ పై ఓవైపు విసుర్లు, మరోవైపు వ్యంగ్యం కురిపించారు. తాను లక్ష రూపాయలిచ్చి ఆడబిడ్డలను అత్తారింటికి పంపిస్తున్నానని చెప్పే క్రమంలో, పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమా తీశారని గుర్తుచేశారు. తాను అందరినీ అత్తారింటికి పంపిస్తుంటే, పవన్ కల్యాణ్ మాత్రం ఆయన దారి ఆయన వెతుక్కుంటూ వెళుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా, పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు. చంద్రబాబు సైకిల్ చెయిన్ ను కేసీఆర్ తెంపేశారని, ఇక సైకిల్ నడవడంలేదని పవన్ అనడం పట్ల తనదైన శైలిలో స్పందించారు.

viveka 3032019

తన సైకిల్ ను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. "నా సైకిల్ ను తాకితే షాక్ తింటారు, నా సైకిల్ తాకి నిలబడగలరా వీళ్లు? సైకిల్ నుంచి కూడా కరెంట్ తయారవుతుంది. అది మామూలు కరెంట్ కాదు. అంత స్పీడుగా వెళుతుంది నా సైకిల్ బుల్లెట్ మాదిరిగా. ఎవరైనా తాకితే అక్కడితో ఫినిష్! అలాంటి సైకిల్ చెయిన్ ను ఎవన్నా తెంపగలరా? వాళ్లను నేను వదిలిపెడతానా?" అంటూ నవ్వులు విరబూయించారు. జగన్‌ లోటస్‌పాండ్‌లోనే అభ్యర్థుల్ని ఎంపిక చేశాడని, మనల్ని మోసం చేయడానికి జగన్‌ ఏపీకి వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్‌.. ఆంధ్రా వాళ్లు రాక్షసులు, కుక్కలు అన్నారని, కేసీఆర్‌ నోరు పారేసుకుంటే మనం పడాలా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పై కూడా చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. మోదీకి కొడుకులు, కూతుళ్లు లేరు..ఎందుకు మాపై శాపనార్దాలు.. సెటైర్లు వేస్తారని చంద్రబాబు మండిపడ్డారు.

viveka 3032019

యుద్ధం హుందాగా ఉండాలని, దెబ్బ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతా, అవసరమైతే ప్రాణం పోయినా పర్లేదని చంద్రబాబు అన్నారు. హోదా అడిగితే కేసీఆర్‌, జగన్‌తో కలిసి నాపై కక్ష తీర్చుకుంటారా? అని బాబు ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన వెనక్కి తీసుకున్నారని, ఇదేనా ప్రధాన మంత్రి ధర్మం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన గాయాలు ఇంకా మానలేదు.. మోదీ వచ్చి కారం జల్లుతున్నారని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి ప్రధాన మంత్రి దేశానికి అవసరమా? అని చంద్రబాబు అన్నారు.

పుట్లూరు మండలం ఎల్లుట్లలో వైసీపీ కార్యకర్తల బైక్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి కాన్వాయ్‌ ఢీకొట్టింది. గమనించిన జేసీ ప్రభాకర్‌‌రెడ్డి వెంటనే వారి వద్దకు వచ్చి క్షమాపణ చెప్పారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడిపత్రి నుంచి పోటీ చేస్తున్నారు. కుమారుడి తరపున ప్రచారానికి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ రోజు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కొందరు వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు.

prabhakara 30032019 1

ఈ ఘటన జిల్లాలోని పుట్లూరు మండలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎల్లుట్ల గ్రామం వద్దకు రాగానే ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ అటుగా వెళుతున్న వైసీపీ కార్యకర్తల బైక్ ను ఢీకొట్టింది. వెంటనే కారు దిగిన ప్రభాకర్ రెడ్డి వారి దగ్గరకు వేగంగా వెళ్లి పరామర్శించారు. డ్రైవర్ కారణంగా ఈ తప్పు జరిగిందనీ, క్షమించాలని కోరారు. వైసీపీ కార్యకర్తలకు పెద్దగా దెబ్బలేమీ తగలకపోవడంతో వారు బైక్ పై వెళ్లిపోయారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం కోసం ముందుకెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై, కేసీఆర్ వేలు పెడుతూనే ఉన్నారు. ఏపిని తన ఆధీనంలోకి తీసుకువటానికి, పన్నుతున్న పన్నాగాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా నర్సంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ ఎన్నికల్లో గెలుపోటముల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ విజయం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్‌లోకి జగన్ వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ అంటే పడనోళ్లు, బీజేపీ అంటే పడనోళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ, ఏపీలో జగన్, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్‌ ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ktr jagan 30032019

కొద్ది రోజుల క్రితం, కేసీఆర్ కూతురు కవిత మాట్లాడుతూ, ‘రిటర్న్ గిఫ్ట్’ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కంగారొద్దని పేర్కొన్నారు. గిఫ్ట్ విషయంలో కంగారుపడొద్దని ఇవ్వాల్సిన టైంలో సీఎం కేసీఆర్ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారన్నారు. ఇప్పుడు మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యమన్నారు. కేసీఆర్‌ని చంద్రబాబు చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారని.. ఆయన విమర్శలకు కేసీఆర్ త్వరలోనే స్పందిస్తారని కవిత స్పష్టం చేశారు. మాకు ఎవరితోనూ యుద్ధం లేదని తెలంగాణను దెబ్బతీసే వారితోనే మా యుద్ధమని ఎంపీ కవిత చెప్పుకొచ్చారు.

ktr jagan 30032019

అయితే చంద్రబాబు ప్రతి సభలో కేసీఆర్ ఆంధ్రా వారి పై చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారు. ‘‘తప్పుడు ఒప్పందాలు చేసుకుంటున్న వారంతా నాకు రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తారంట! వారు ఇస్తే తిరిగి మనంకూడా ఇవ్వాలికదా... అందుకే రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఒకే మాట, ఒకే తాటిపైకొచ్చి తెలుగుదేశాన్ని గెలిపించి... దానిని వారికి గిఫ్ట్‌గా ఇవ్వాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘విభజన తర్వాత సీమాంధ్రకు దక్కాల్సిన దాదాపు రూ.లక్ష కోట్లు కొట్టేసిన కేసీఆర్‌... మన రాష్ట్రానికి రూ.500 కోట్లు ఇవ్వాలనుకున్నారట! మోదీయే మట్టీ నీళ్లు ఇస్తే నేనేమిచ్చేదని ఎగతాళిగా మాట్లాడతుంటే మీకు రోషం, కోపం రావడంలేదా తమ్ముళ్లూ! సీమాంధ్రులను రాక్షసులన్న కేసీఆర్‌కు బుద్ధి చెబుతారా... లేదా?’’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో... ‘చెబుతాం’ అని జనం ముక్తకంఠంతో సమాధానం చెప్తున్నారు.

వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కు చెందిన కంపెనీకి విద్యుత్ సరఫరాను ఏపీ విద్యుత్ శాఖ నిలిపివేసింది. ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని పొట్టిసుబ్బయ్యపాలెంలో ఉన్న క్రిస్టల్ సీఫుడ్స్ సంస్థ విద్యుత్ కనెక్షన్ కట్ చేసింది. ఈ విషయమై విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. క్రిస్టల్ సీఫుడ్స్ సంస్థ విద్యుత్ శాఖకు రూ.1.30 కోట్ల బకాయి పడిందని తెలిపారు. ఈ బిల్లులు చెల్లించాల్సిందిగా పలుమార్లు నోటీసులు జారీచేశామన్నారు. అయినా కంపెనీ యజమానులు, ప్రతినిధులు స్పందించకపోవడంతో నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ ను కట్ చేశామని పేర్కొన్నారు. ఈ విషయంలో నిబంధనల మేరకు ముందుకు పోతామని వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయమై ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు.

amanchi 30032019 2

చీరాల సమీపంలోని వేటపాలెం మండలంలో క్రిస్టల్‌ సీ ఫుడ్స్‌ అనే సంస్థ ఉంది. దానికి అయిదుగురు డైరెక్టర్లు ఉండగా ఆమంచి కుటుంబంలోని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌తో పాటు ఆమంచి రాజేంద్రప్రసాద్‌ ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. రొయ్యలను ఉత్పత్తి చేసి విదేశాలను ఎగుమతి చేయడం దీని ఉద్దేశం. నాలుగేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నెలకు సుమారుగా రూ.25 లక్షల వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది. బిల్లులను నెలనెలా చెల్లించడం అరుదే. నామమాత్రంగా నెలనెలా నోటీసులు అందిస్తూ కంపెనీ ద్వారా చెల్లింపులు వచ్చినప్పుడు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఇక ఊరుకోలేదు. విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది గురువారం ఈ కంపెనీకి చేరుకుని విద్యుత్తు కనెక్షన్‌ను తొలగించారు.

amanchi 30032019 3

మొత్తం రూ.1.30 కోట్ల వరకు బకాయి పడ్డారని లెక్కల్లో తేలడంతో ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకూ తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కనెక్షన్‌ను తొలగించారు. ఈ విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ‘ప్రతి సంస్థకు విద్యుత్తు బకాయిలు ఉంటాయి, అది సహజమే. రూ. కోట్లలో, లక్షల్లో టర్నోవర్‌ జరుగుతున్నప్పుడు బకాయిలు ఉండడం సహజం. ఇదేమీ పెద్ద విషయం కాదు. గురువారం ఉదయం కనెక్షన్‌ తొలగించారు, సాయంత్రానికి మాట్లాడి మళ్లీ సరఫరా పునరుద్ధరించారు. బకాయిల్లో కొంత నగదు శుక్రవారం చెల్లిస్తాం’ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read