వైఎస్ వివేకది కేవలం ఎదో ఆవేశంలోనో, పధకం ప్రకారం చేసిన హత్య మాత్రమే కాదు, అంతకు మించి అంటూ పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో సంగతులు చెప్తున్నాయి. ఆయన్ను చంపే ముందు అత్యంత క్రూరంగా కొట్టి కొట్టి చంపారు. ‘‘ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతదేహంపై ఏడు చోట్ల పదునైన, లోతైన గాయాలున్నాయి. తలకైన తీవ్ర గాయాలు కనిపించకుండా బ్యాండేజీ వేశారు. వీటన్నింటినీ విశ్లేషించిన తర్వాత అత్యంత క్రూరంగా వివేకానుహింసించి...ప్ర మాదకరమైన ఆయుధంతో ఆయన తలపై దాడి చేసి చంపినట్లు తేలింది. హత్యకు పాల్పడిన దోషులెవరో తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి, ములి వెంకటకృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్‌లకు తెలుసు. హత్య చేసిన వారిని చట్టం నుంచి తప్పించేందుకు వీరు ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే నేర ఘటనాస్థలం నుంచి సాక్ష్యాధారాలను తుడిచేసి..మాయం చేశారు. ఈ హత్యలో మరికొందరు వ్యక్తుల పాత్రపైనా అనుమానాలున్నాయి. ఇంకా చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉంది. సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంది.’’ అని వివేకా హత్యకేసులో పైన పేర్కొన్న నిందితుల అరెస్టుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన రిమాండు రిపోర్టు వెల్లడించింది.

game 27032019

పులివెందుల ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో దీన్ని వేశారు. సాక్ష్యాధారాలు తుడిచేసినందుకు వీరిపై ఐపీసీ సెక్షన్‌ 201ను కూడా జతపరచి..త్వరలో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నామన్నారు. వివేకా హత్యపై జరిపిన దర్యాప్తు ఆధారంగా.. ఆయనను అత్యంత కిరాతకంగా హింసించి, ప్రమాదకరమైన ఆయుధంతో తలలోపల మెదడుకు దెబ్బతగిలేలా కొట్టి దారుణంగా హత్య చేశారనే నిర్ణయానికి వచ్చినట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి చట్టం చేతుల నుంచి తప్పించుకునేందుకు అవకాశం కల్పించేలా సాక్ష్యాలను మాయం చేసేందుకు పైన పేర్కొన్న ముగ్గురు నిందితులూ ప్రయత్నించారనేందుకు ఆధారాలు లభించినట్టు తెలిపారు. దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి.. వివేకాను చంపిందెవరో ఆ ముగ్గురికీ తెలుసనిపిస్తోందని, అందుకే వారు కావాలనే సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి మరింతమందిని విచారించి మరిన్ని సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని.. నిజాన్ని వెలికితీయాల్సి ఉందని పేర్కొన్నారు.

game 27032019

నిందితులకు బెయిల్‌ ఇస్తే కేసును తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వారు పోలీసు కస్టడీలోనే ఉండాలని స్పష్టంచేశారు. అత్యంత కిరాతకంగా ఈ హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపును బయటపెట్టాల్సి ఉందని.. ఈ మిస్టరీని ఛేదించేందుకు తాము చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేసిన గంగిరెడ్డి, వెకటకృష్ణారెడ్డి, ప్రకాశ్‌లపై ఐపీసీ 201 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. పులివెందుల పోలీసుస్టేషన్‌లో పనిచేసే ఎస్‌ఐలు శివప్రసాద్‌, రఘురామ్‌, పీసీలు 913, 2803, 1409లు బెస్తవారిపల్లె వై.జంక్షన్‌ వద్ద రోడ్డుపై నిలుచుని ఉన్న ఆ ముగ్గురిని గురువారం ఉదయం 10గంటలకు అదుపులోకి తీసుకున్నారని.. విచారణలో వారు నోరు తెరవట్లేదని.. అందుకనే 15 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామని రిమాండు రిపోర్టులో డీఎస్పీ నాగరాజ పేర్కొన్నారు.

వీవీప్యాట్ ల స్లిప్ లను 50 శాతం లెక్కించాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది. 50 శాతం స్లిప్ లను లెక్కించాల్సిన అవసరం లేదని అఫిడవిట్ లో సీఈసీ పేర్కొంది. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత... అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని నిర్ణయించామని తెలిపింది. అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఈ సంఖ్యను మరింత పెంచుతామని చెప్పింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వీవీప్యాట్ల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించింది.

game 27032019

ఒకవేళ వీటి లెక్కింపును పెంచితే గనుక మొత్తం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి కనీసం ఆరు రోజులు పడుతుందని ఈసీ పేర్కొంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో కనీసం 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా దాదాపు 21 పార్టీల నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడంలో ఉన్న అభ్యంతరాలు తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో నేడు ఈసీ తమ స్పందన తెలియజేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతమున్న విధానం సరైందేనని, రానున్న ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తామని ఈసీ వెల్లడించింది.

game 27032019

ప్రస్తుతం ఒక అసెంబ్లీ స్థానంలో ఒక్క వీవీప్యాట్‌ను మాత్రమే ఎంచుకుని దానిలోని ఓటరు స్లిప్పులను లెక్కిస్తున్నారు. దీనివల్ల ఆ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో కేవలం 0.44 శాతం ఓటరు స్లిప్పులను మాత్రమే లెక్కిస్తున్నారు. ఇన్ని తక్కువ స్లిప్పులు లెక్కిస్తే కచ్చితత్వం తెలియదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలివ్వాలని కోరాయి. అయితే ఎలక్షన్ కమిషన్ వాదన వింతగా ఉందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని పెంచాలని, ఆరు రోజులు కాకపోతే, 60 రోజులు అయినా తీసుకుని, ప్రజల్లో విశ్వాసం పెంచాలని అంటున్నారు.

సీఈసీకి సుప్రీంకోర్టుల ఝలక్ ఇచ్చింది. సీఈసీకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అభ్యర్థుల పెండింగ్ క్రిమినల్ కేసుల ప్రకటనలపై.. సీఈసీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అభ్యర్థుల కేసుల గురించి ప్రకటించకపోవడాన్ని.. సుప్రీంకోర్టు తప్పుబట్టింది. టీవీలు, పత్రికల్లో ప్రచురించాలని గతంలోనే ఈసీని ఆదేశించింది సుప్రీం. వారం రోజుల్లో సీఈసీ నుంచి వివరణ కోరిన సుప్రీంకోర్టు. ఇంతవరకు ఎందుకు తమ ఆదేశాలను అమలు చేయలేదని సీఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇంకా అభ్యర్థుల కేసుల గురించి ప్రకటించకపోవడాన్ని తప్పుబట్టింది. టీవీలు, పత్రికల్లో ప్రచురించాలని గతంలో ఈసీకి సూచించింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.

loksatta 29032019

2014 ఎన్నికల్లో నామినేషన్‌ పత్రాలకు భిన్నంగా 2019 నామినేషన్‌ పత్రాల్లో ఈసీ కొన్ని కీలకమైన మార్పులు తీసుకువచ్చింది. 2014లో అభ్యర్థులు తమ నేర చరిత్రను నామినేషన్‌ వేసే సమయంలో ధ్రువీకరిస్తూ అఫిడవిట్‌ ఇవ్వాల్సిన అసవరం లేదు. ఈసారి ప్రతి అభ్యర్థి తనకు నేర చరిత్ర ఉంటే ఉందని, లేదంటే లేదని పేర్కొంటూ ఒక అఫిడవిట్‌ను నామినేషన్‌తో పాటే రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. పత్రికలు, చానళ్లలో అభ్యర్థితో పాటు ఆయనకు సంబంధించిన పార్టీ ఆ అభ్యర్థికి ఉన్న క్రిమినల్‌ చరిత్ర గురించి ప్రకటనలు ఇవ్వాలి. గత, ప్రస్తుత క్రిమినల్‌ కేసులను స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా తమ నేర చరిత్రను దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా.. దేశపౌరులెవరైనా ఆ అభ్యర్థిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు.

loksatta 29032019

ఇక మరో పక్క రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పత్రికలు, వార్తా చానళ్లల్లో పెద్దసంఖ్యలో అభ్యర్థుల నేర చరిత్రపై ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల నేర చరిత్ర ప్రకటనలకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నేర చరిత్ర ప్రజల్లో చర్చకు దారితీయనుంది. ఓటెయ్యడానికి ముందే ప్రజలు తమ నేర చరిత్రను తెలుసుకోనుండడంతో.. నేరచరిత గల అభ్యర్థులకు ఎన్నికల ఫలితాలపై ఆందోళన తప్పేలా లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే.. ఆ విషయాన్ని అభ్యర్థితో పాటు, ఆ అభ్యర్థికి చెందిన రాజకీయ పార్టీ బహిర్గతం చేయాల్సిందేనని గత సెప్టెంబర్‌ 25న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఈ ఆదేశాలు పాటించాల్సిందే అని చెప్పటంతో, ఇది మరో సారి హాట్ టాపిక్ అయ్యింది. జగన్ లాగా 31 కేసుల్లో A1 గా ఉన్నవారి పరిస్థితి ఇప్పుడు మరీ ఘోరం. జగన్ లిస్టు అంతా ప్రకటనలో రావాలి అంటే, దాదపుగా 30 నిమషాలు పడుతుంది. మరో ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆగ్రహం చేసిన వేళ, జగన్ పరిస్థితి ఏంటో చూడాలి.

ప్రధాని నరేంద్ర మోదీ సాధారణంగా సొంత డబ్బా కొట్టుకుంటారని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కానీ ఎన్నికల సమయానికి అది ఇంకాస్త శ్రుతిమించుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఉదయం ఏపీ గురించి మోదీ చేసిన ట్వీట్ అలాంటిదేనని వ్యాఖ్యానించారు. ఏపీకి జాతీయ స్థాయిలో 750 అవార్డులు ఎలా వచ్చాయో కేంద్ర మంత్రిత్వ శాఖలను అడిగితే చెబుతారని మోదీకి లోకేశ్ సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన సుపరిపాలన, అభివృద్ధి విధానాలను ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు మోదీకి వివరిస్తారని అన్నారు. ఒకవేళ ఈ విషయాన్ని అధికారులు చెప్పినా మోదీ ప్రజలకు చెప్పకుండా దాచేస్తారన్న విషయం తమకు తెలుసని వ్యాఖ్యానించారు.

game 27032019

ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నరేంద్ర మోదీగారు, మీరు మామూలుగానే సొంతడబ్బా కొట్టుకుంటారు. ఎన్నికల సమయంలో అది ఇంకాస్త శ్రుతిమించుతుందని అందరికీ తెలుసు. ఈరోజు ఉదయం ఏపీ గురించి మీరు చేసిన ట్వీట్ కూడా అలాంటిదే’ అని తెలిపారు. మరో ట్వీట్ లో స్పందిస్తూ..‘ఏపీకి జాతీయ స్థాయిలో 750 అవార్డులు ఎలా ఇచ్చారో మీ మంత్రిత్వ శాఖలను అడిగితే, చంద్రబాబుగారు అందించిన సుపరిపాలన, అనుసరించిన అభివృద్ధి విధానాలు మీకు పూర్తిగా వివరిస్తారు. మీకు తెలిసినా వాటిని ప్రజలకు చెప్పకుండా దాస్తారన్న విషయం మాకు తెలుసులెండి!’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisements

Latest Articles

Most Read