ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ తనను పదే పదే యాక్టర్ అనడం పట్ల పవన్ ఘాటైన బదులిచ్చారు. ‘జగన్ మోహన్ రెడ్డి నన్ను యాక్టర్ అని సంబోధిస్తున్నారు. ఒప్పుకుంటా.. నేను నటుణ్నే, అది నా వృత్తి. మీరు ఏడాదిన్నర జైల్లో ఉండి వచ్చారు కదా. మిమ్మల్ని ఏమని పిలవాలి మరి?’ అని పవన్ ప్రశ్నించారు. మీరు మహాత్మా గాంధీనా లేదంటే పూల సుబ్బయ్య గారా? అని నిలదీశారు. జగన్ తనను టీడీపీ పార్టనర్ అనడం పట్ల పవన్ మండిపడ్డారు. జగన్ మిమ్మల్ని ఎవరి పార్టర్నర్ అని పిలవాలి? టీఆర్ఎస్ పార్టనర్ అని పిలవాలా? అమిత్ షా పార్టనర్ అని పిలవాలా? మోదీ పార్టనర్ అని పిలవాలా? అని జనసేనాని ప్రశ్నించారు.

pk 2803019

నేను యాక్టర్‌నే కానీ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ తరానికి అండగా ఉండటానికి వచ్చాను. ప్రకాశం జిల్లాకు మాటిస్తున్నా.. ఇక్కడే నేను ఓనమాలు నేర్చుకున్నా. నేలతల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. నేను మీకు అండగా ఉంటానని పవన్ ఉద్వేగంగా మాట్లాడారు. జనం కోసమే తిట్లు పడుతున్నానని పవన్ తెలిపారు. జనసేన తెదేపా భాగస్వామేనంటూ వైకాపా అధినేత జగన్‌ చేసిన వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దొంగపొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని తేల్చి చెప్పారు. తల తెగిపడినా జగన్‌లా మోదీ, అమిత్‌షాల ముందు మోకరిల్లబోమని స్పష్టంచేశారు.

pk 2803019

ప్రకాశం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. యాక్టింగ్‌ వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తనను యాక్టర్‌ అని జగన్‌ పిలిస్తే.. మరి జైలులో ఉండి వచ్చిన ఆయనను ఎలా పిలవాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రకాశం జిల్లాకు వెనుకబడిన నిధులు ఇవ్వని కేంద్రం వద్ద తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనన్నారు. తెరాస, భాజపాలతో పొత్తులపై బహిరంగంగా చెప్పాలని వైకాపాను పవన్‌ డిమాండ్‌ చేశారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు కోచింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాను ఎవరూ చేయని రీతిలో అభివృద్ధిచేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ అధికారులపై వేటు అంతా పథకం ప్రకారమే జరిగిందా? సోమవారం ఫిర్యాదు చేస్తే.. మంగళవారం చర్యలుంటాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డికి శుక్రవారమే ఎలా చెప్పారు? ఏపీలోని కీలక పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్‌ మంగళవారం చర్యలు తీసుకుంటుందని వైసీపీకి ముందే తెలుసా..? అంటే.. వీటన్నింటికీ విజయసాయిరెడ్డి గత శుక్రవారం మీడియాతో మాట్లాడిన వీడియో బలం చేకూరుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ ఏది చెబితే దాన్ని నమ్మి చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నెల 22న (శుక్రవారం) వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుసుకున్నారు.

vsreddy 28032019

డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుతో సహా కొంతమంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. తాము సోమవారం మళ్లీ పూర్తిస్థాయి కమిషన్‌ను కలుసుకుంటామని, మంగళవారం కమిషన్‌ సభ్యులు సమావేశమై తాము కోరిన విధంగా చర్యలు తీసుకుంటారని విజయ్‌సాయిరెడ్డి శుక్రవారమే అశోకారోడ్‌లోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ముందు మాట్లాడుతూ చెప్పారు. ఆయన ముందుగా ప్రకటించినట్లుగానే మంగళవారం ఏపీ అధికారులపై వేటు వేశారు. శుక్రవారం విజయసాయి రెడ్డి ఢిల్లీలో మీడియా ముందు ఏం మాట్లాడారంటే... ‘మేం పలు అంశాలను ఎన్నికల కమిషన్‌ ముందుకు తీసుకొచ్చాం. వాటన్నింటిపైనా చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ మాత్రమే కాకుండా పూర్తిస్థాయి కమిషన్‌కు నివేదించాలని వారు చెప్పారు."

 

vsreddy 28032019

"పూర్తి కమిషన్‌ను మేము అపాయింట్‌మెంట్‌ అడిగాం. సోమవారం నాలుగున్నర గంటలకు మా వైసీపీ ప్రతినిధులు పూర్తిస్థాయి కమిషన్‌ ముందు వినతిపత్రం సమర్పిస్తారు. ఏదైతే మేం నివేదించామో, వాటిపై కమిషన్‌ మాకు తప్పకుండా న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకుంది. ఆ తర్వాత మంగళవారం లేదా.. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తుంది’ అని చెప్పారు. విజయసాయిరెడ్డి చెప్పినట్లే ఈసీ చర్యలు.. సోమవారం వైసీపీ ప్రతినిధులను కలిసిన ఈసీ మంగళవారం ముగ్గురు అధికారులపై వేటు వేసింది. నిజానికి నెలరోజుల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా ఫిబ్రవరి 4న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అరోరాను కలుసుకుని కొంతమంది అధికారులను తప్పించాలని కోరారు. ఒకే అంశంపై ఒక పార్టీకి చెందిన ప్రతినిధులను పలు సార్లు కలుసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ వారి కోరికలకు అనుగుణంగానే చర్యలు తీసుకోవడం న్యాయనిపుణులను ఆశ్చపర్యపరుస్తున్నది.

వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఓసారి టీడీపీపై ఆరోపణలు చేస్తారు? మరోసారి సీబీఐ విచారణ కావాలంటారు? ఇంకోవైపు ఎన్నికలయ్యేవరకు సిట్ నివేదిక బయటపెట్టవద్దని అంటారు? కుటుంబ సభ్యుడి హత్య జరిగితే సత్వర న్యాయం కోరుకుంటారుగానీ.. జగన్ ఎందుకిలా పదే పదే మాట మారుస్తున్నారు? వివేక కుమార్తె రెండ్రోజులకొసారి ప్రెస్ మీట్ పెట్టి కొత్త వాదన ఎందుకు వినిపిస్తున్నారు? ఎస్పీ బదిలీతో ఏంజరగబోతోంది? ఆ రోజు వివేకా చనిపోయిన రోజు ఉదయం గుండెపోటని బాధాతప్త హృదయంతో చెప్పారు. మధ్యాహ్నానికి అనుమానాస్పద మృతి అని అన్నారు. సాయంత్రానికి అసలు విషయం తేలడంతో చంద్రబాబే చేయించారని జగన్ అన్నారు.

jaganamata 28032019

పోలీస్ ఓ కొలిక్కి వచ్చేటప్పటికి వివరాలు బయట పెట్టవద్దని అంటున్నారు. వివేకా హత్య కేసులో వైసీపీ నేతల విధానం ఇంతే. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాల్సిందేనని హైకోర్టుకు వెళ్లిన వారు సిట్ విచారణ నివేదిక బయటపట్టవద్దని అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. బాధితులు ఎవరైనా ఇలాంటి పిటిషన్ ఇంతకుముందు దాఖలు చేసినట్లు లేకపోవడంతో న్యాయవాది వర్గాలు కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అసలు పోలీసులు విచారణలో ఏం తేల్చారో ఇంతవరకు బయటకు రాలేదు. సున్నితమైన విషయం కావడంతో పోలీసులు గుట్టుగా విచారణ జరుపుతున్నారు. అయితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా విచారణ వద్దన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.

ఏపీ ఎన్నికల వేళ.. ఆంధ్రా, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ టార్గెట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం కేసీఆర్‌తో కలిసి నడిస్తే తప్పేంటని జగన్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మాత్రం.. దూకుడుగా కేసీఆర్‌పై విమర్శలు సాగిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రాంత నేతలు ఆయనకు కౌంటర్లు వేస్తున్నారు. తెలంగాణలో ఆస్తులు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను తాను బెదిరిస్తున్నానంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము ఎవరిని బెదిరించడం లేదని బెదిరించాల్సిన అవసరం తమకేముందని చెప్పుకొచ్చారు.

ktr 28032019

ఓ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్ వల్లభనేని వంశీమోహన్ అనే ఎమ్మెల్యే ఎవరో తనకు తెలియదన్నారు. అలాంటిది తాను ఆయన్ను బెదిరించానని ప్రచారం చేసుకుంటున్నారని ఇది దుర్మార్గమన్నారు. కనీసం వంశీకి ఎక్కడ స్థలం ఉందో ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఇక మరో పక్క తలసాని కూడా స్పందించారు. తెలంగాణలో ఆంధ్రోళ్లను కొడుతున్నారంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ఎవరిపై ఎక్కడ దాడులు జరిగాయో పవన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు.

ktr 28032019

పవన్ తన వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిన్నటివరకు హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీశారు. ఏపీ రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టే తిరుగుతున్నాయని తలసాని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ సీఎం కావడం ఖాయమని తలసాని జోస్యం చెప్పారు. వైసీపీకి 125-130 అసెంబ్లీ, 18-23 ఎంపీ సీట్లు వస్తాయని జాతీయ సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. ఏపీలో టీడీపీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read